Rajat Chauhan
-
Archery World Cup 2022: భారత్ గురి అదిరింది
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం. అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం. -
చౌహాన్ కొత్త చరిత్ర
కోపెన్హగెన్: వరల్డ్‌కప్ ఆర్చరీలో భారత విలుకాడు రజత్ చౌహాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ 143 పాయింట్లు నెగ్గి రజతంతో మెరిశాడు. మూడో సెట్లో 8, 9 పాయింట్లకే పరిమితం కావడంతో కాస్త వెనుకబడ్డాడు. స్థానిక ఆటగాడు స్టీఫెన్ హన్సెన్ 147 పాయింట్లతో స్వర్ణం సాధిం చాడు. ప్రపంచకప్ ఆర్చరీలో భారత మహిళల రికర్వ్ టీమ్ (2011) పతకం నెగ్గినా... వ్యక్తిగత విభాగంలో దేశానికి మెడల్ రావడం ఇదే మొదటిసారి. తొలి రెండు సెట్లలో ఇద్దరు క్రీడాకారులు సమంగా పాయింట్లు సాధించడంతో స్కోరు 58-58తో సమమైంది. అయితే మూడోసెట్లో భారత కుర్రాడు మూడు పాయింట్లు వెనుకబడటంతో స్కోరు 85-88గా మారింది. నాలుగో సెట్లో చౌహన్ 30 పాయింట్లు నెగ్గినా... హన్సెన్ చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించాడు. -
రజత్‌కు రజతం ఖాయం
చాంపియాకు ఒలింపిక్ బెర్త్ వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజత్ చౌహాన్ భారత్‌కు కనీసం రజత పతకాన్ని ఖాయం చేశాడు. అలాగే వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మంగల్ సింగ్ చాంపియా ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. గురువారం జరిగిన కాంపౌండ్ విభాగం సెమీఫైనల్లో రజత్ 143-138 తేడాతో కామిలో కార్డోనా (కొలంబియా)ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో మంగల్ సింగ్ 6-2తో ఆరో సీడ్ ఆంటోనియో ఫెర్నాండెజ్ (స్పెయిన్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే క్వార్టర్స్‌లో తను ఎలియాస్ మలవే (వెనెజులా) చేతిలో 4-6తో ఓడి పతకంపై ఆశలు వదులుకున్నాడు. మరోవైపు మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం కోసం జరిగే ప్లేఆఫ్‌లో లక్ష్మీరాణి మజీ.. కొరియాకు చెందిన మిసున్ చోయితో తలపడుతుంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ఫైనల్లో లక్ష్మీరాణి 8-9 స్వల్ప తేడాతో ఐదో సీడ్ అలెజాండ్రా వాలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి పరాజయం పాలైంది.