చౌహాన్ కొత్త చరిత్ర
కోపెన్‌హగెన్: వరల్డ్‌కప్ ఆర్చరీలో భారత విలుకాడు రజత్ చౌహాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ 143 పాయింట్లు నెగ్గి రజతంతో మెరిశాడు. మూడో సెట్‌లో 8, 9 పాయింట్లకే పరిమితం కావడంతో కాస్త వెనుకబడ్డాడు. స్థానిక ఆటగాడు స్టీఫెన్ హన్‌సెన్ 147 పాయింట్లతో స్వర్ణం సాధిం చాడు. ప్రపంచకప్ ఆర్చరీలో భారత మహిళల రికర్వ్ టీమ్ (2011) పతకం నెగ్గినా... వ్యక్తిగత విభాగంలో దేశానికి మెడల్ రావడం ఇదే మొదటిసారి. తొలి రెండు సెట్లలో ఇద్దరు క్రీడాకారులు సమంగా పాయింట్లు సాధించడంతో స్కోరు 58-58తో సమమైంది. అయితే మూడోసెట్‌లో భారత కుర్రాడు మూడు పాయింట్లు వెనుకబడటంతో స్కోరు 85-88గా మారింది. నాలుగో సెట్‌లో చౌహన్ 30 పాయింట్లు నెగ్గినా... హన్‌సెన్ చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించాడు.