Ravali Jagan Kavali Jagan
-
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
జగన్ కోసం జనం మొక్కులు!
-
దుమ్ము రేపుతున్న ‘రావాలి జగన్–కావాలి జగన్’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్–కావాలి జగన్’ అనే ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. ఈ పాటకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ పాటను నెల రోజుల్లోనే 2.21 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని ఇంతమంది చూడటం ఇదే ప్రథమం. ‘ఐ–ప్యాక్’ బృందం రూపొందించిన ఈ పాట విడుదలైన 20 రోజులకే వ్యూస్ సంఖ్య కోటి దాటింది. ఒక్క ఏపీ ప్రజలే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న జగన్ అభిమానులు సైతం ఈ పాట పట్ల ఆకర్షితులవుతున్నారు. యువతీయువకులు ఈ పాటను తమ మొబైల్ ఫోన్లకు రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ నోట చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం ఈ స్థాయిలో ఆదరణ పొందడం రాష్టంలో రాగల మార్పులకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన ప్రచార గీతాన్ని ఇంకా పాతిక లక్షల మంది కూడా చూడలేదు. -
దుమ్మురేపుతున్న ‘రావాలి జగన్ కావాలి జగన్’
సాక్షి, హైదరాబాద్ : ఓ నాయకుడిపై రూపొందించిన పాట యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించడం దేశ రాజకీయాల్లోనే ప్రప్రథమం. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన జననేత వైఎస్ జగన్ మీద రాసిన ఈ పాట.. ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది . ఈ ప్రచార గీతం విడుదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ మున్ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా యూట్యూబ్‌లో రావాలి జగన్ కావాలి జగన్ పాట 2కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ లిఖించబోయే కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఈ పాట. ఈ పాటను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. తెలుగు ప్రజలు ఎక్కడ వున్నా వారి మదిని కదిలిస్తోంది. -
దుమ్ములేపుతున్న ‘రావాలి జగన్.. కావాలి జగన్’
సాక్షి, హైదరాబాద్: స్టార్ హీరోల టీజర్స్, సినిమా ట్రైలర్స్ యూట్యూబ్‌ను షేక్ చేయడం ఈరోజుల్లో కామన్. కానీ వాటికి అతీతంగా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన పొలిటికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం రేపడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి రేర్ రికార్డ్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. వైఎస్ జగన్ అభిమానులకు ఈ పాట తారకమంత్రంగా మారింది. అందుకే ఆ జోష్ యూట్యూబ్ వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. ఆదివారం నాటికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటిన్నరకు దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. మార్చి 8న విడుదలైన ఈ పాట దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చర్రిలొకెక్కింది. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వైఎస్ జగన్ సాంగ్
-
రికార్డు సృష్టిస్తున్న‘రావాలి జగన్ కావాలి జగన్’
అత్యధిక కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నాయకుడెవరు? ఎవరి ప్రచార సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు? యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన ప్రచార వీడియో ఎవరివి? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిది.. ప్రచార ఆర్భాటం లేదు.. రాజకీయ నాటకీయత లేదు.. ఉన్నదంతా జనమే స్వచ్ఛందంగా తమ నాయకుడికి స్వాగతం పలకడం. ఆ నాయకుడు జనమే సర్వస్వం అనుకుంటూ ముందుకు సాగడం. అందుకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వీడియో గీతం రాష్ట్ర ప్రజానీకం మనసులను ఆవిష్కరించింది. అందుకే అంతటి ప్రజాదరణ పొందింది. ప్రజాదరణకు కొలబద్ధలైన అన్ని రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టిస్తున్న నవతరం నాయకుడు ఎవరంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తిరుగులేని ప్రజాదరణతో జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారారు. ఇప్పటికే.. రాజకీయ యవనికపై విప్లవం తీసుకువచ్చిన ఆయన సామాజిక మాధ్యమాల్లోనూ జాతీయ స్థాయి రికార్డులు సృష్టిస్తూ అగ్రభాగంలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ఎన్నికల ప్రచార వీడియో ‘రావాలి జగన్.. కావాలి జగన్’. వైఎస్సార్సీపీ రూపొందించిన ఈ వీడియో ఏకంగా కోటి వీక్షణలతో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, జగన్ వైపు అబ్బురంగా చూస్తోంది. ఒక పార్టీ ప్రచార గీతం.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం.. జాతీయ పార్టీల ప్రచార గీతాలను వెనక్కినెట్టి మరీ రికార్డు స్థాయి వ్యూవర్స్‌ను ఆకర్షించడమే దీనంతటికీ కారణం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రూపొందించిన ప్రచార గీతం ‘సబ్ కో స్వాగత్ తయ్యార్ హై’ వీడియో 47 లక్షల వ్యూస్‌తో ఇంతవరకు అగ్రస్థానంలో కొనసాగింది. ఆ రికార్డులను బద్దలు కొడుతూ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ వీడియోకు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి. ఇంతగా ఆదరణ పొందిన ఆ పాటలో ఏముందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏముంది.. రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుంది. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలున్నాయి. పేదల గుండె మంట ఉంది. తమను ఆదుకోవడానికి జగన్ రావాలి... తమకు జగనే కావాలి అనే జనాభిప్రాయం ఉంది. రాష్ట్ర ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను అక్షరీకరిస్తూ ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ దీనిని రచించారు. యావత్ ప్రజల మనోభీష్టానికి పాట రూపమిచ్చారు. ఇక ‘ఫిదా’ సినిమాతో జానపద బాణీలతో అలరించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మరోసారి జనం మనసులను తడిమే, గుండెను తాకే స్వరాలను సమకూర్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ గాయకుడు మనో.. మనసు లోతుల నుంచి ఉద్విగ్నభరితంగా ఆలపించారు. ఇలా ప్రజా హృదయ స్పందనను ఆవిష్కరిస్తూ రచించి స్వరాలు సమకూర్చిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ గీతాన్ని అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దృశ్యాలతో మేళవించి చక్కని వీడియో గీతంగా విడుదల చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రతిబింబిస్తూ.. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను వివరిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండే జగన్‌లోని మానవీయ కోణాన్ని స్పృశిస్తూ వీడియో గీతం వాస్తవానికి అద్దం పడుతోంది. వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతం ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. దీన్నిబట్టి రాష్ట్ర యువతలో వైఎస్ జగన్‌పై వెల్లువెత్తుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనంగా భావించాలి. కొత్త తరం తమ భవిష్యత్ తీర్చిదిద్దే నాయకుడిగా వైఎస్ జగన్‌ను గుర్తించింది. అందులోనూ రాష్ట్రంలో 2014 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వీడియో గీతంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థి, ఉద్యోగులు, సామాన్యులు.. ఇలా అన్నివర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇచ్చారు. -
‘రావాలి జగన్ కావాలి జగన్’ పాటకు కోటి వ్యూస్
-
‘రావాలి జగన్ కావాలి జగన్’కు జన‘కోటి’ ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డు అంటున్నారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. విడుదలైన అనతికాలంలో ఈ పాట విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్నెట్లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. గురువారం రాత్రికి 70 లక్షలు దాటిన ఈ పాట.. శనివారం సాయంత్రానికి కోటికిపైగా వ్యూస్ సొంతం చేసుకొని.. ఇప్పటికీ దూసుకుపోతోంది. ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులను సైతం ఈ ప్రచార గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
రావాలి జగన్ కావాలి జగన్ ఆల్ టైం రికార్డ్!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో ఆ పాటను విన్న వారి, చూసిన వారి సంఖ్య ఇప్పటివరకు 70 లక్షలు దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చెబుతున్నారు. ఈ పాట విడుదలైన అనతి కాలంలో విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్నెట్లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోందంటే ఈ పాట ప్రజల్లో ఎంత ఆదరణ పొందిందో స్పష్టమవుతోంది. ఈ పాట ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకున్న ఈ గీతాన్ని ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల పాటలు మొదటి స్థానంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట ఉంటే.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల గీతాలు ఉన్నాయి. అలాగే, 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన ‘సబ్కో స్వాగత్ హై తయ్యార్..’ అంటూ విడుదల చేసిన హిందీ ప్రచారగీతం ఇప్పటివరకూ అత్యధిక వీక్షకులను ఆకట్టుకుంది. ఈ గీతాన్ని అప్పట్లో 47 లక్షల మంది తిలకించారు. తాజాగా, బీజేపీ ప్రచార గీతం ‘మైభీ చౌకీదార్ హూ..’ అనే గీతాన్ని 9,44,000 మంది ఇంటర్నెట్లో తిలకించారు. మరోవైపు.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాటను లక్షలాది యువతీయువకులు తమ మొబైల్ రింగ్ టోన్లుగా అమర్చుకోవడం చూస్తే దీనికి ఎంతగా ఆకర్షితులవుతున్నారనేది అంచనా వేయవచ్చు. ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి. -
జగన్ కోసం 72 ఏళ్ల వృద్ధుడు..
సాక్షి, రాజుపాలెం (సత్తెనపల్లి): రావాలి జగన్...కావాలి జగన్ అంటూ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు 850 కి.మీ పాదయాత్రను పూర్తి చేశారు. కొమ్మా సుబ్బారావు నాయుడు మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు. జగన్ సీఎం కావాలని ఆయన ఆరు నెలల క్రితం శ్రీశైలం దేవస్థానానికి, మూడు నెలల క్రితం తిరుపతికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 850 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మళ్లీ నాలుగోసారి ఈనెల 26వ తేదీన కారంపూడి అంకమ్మతల్లి దేవాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నట్టు సుబ్బారావు తెలిపారు. వైఎస్ జగన్ సీఎం కావాలని, అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగానూ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను పాదయాత్ర చేసేందుకు సహకరిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు రాయపాటి పురుషోత్తం, వేపూరి శ్రీనివాసరావు, కొమెరపూడి కళ్లెం వెంకటరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా..
సాక్షి, కడప కార్పొరేషన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా...ఒక్క సారి వైఎస్ జగన్‌కు అవకాశం ఇద్దాం అన్నా.. అంటూ కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ‘రావాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యేకు, ఎంపికీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయితే పింఛన్లు రూ.3వేలకు పెంచుతారని, ఆటో డ్రైవర్లకు, బార్బర్ షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేలు ఉచితంగా ఇస్తారన్నారు. వీధి వ్యాపారస్తులకు ప్రతి ఏటా పావలా వడ్డీకే రూ.10వేలు రుణం ఇవ్వడం జరగుతుందన్నారు. చిన్నపిల్లలను బడికి పంపితే ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తారన్నారు. మన జిల్లావాసి, మన సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎం అయితే మన జిల్లాకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, 32వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అన్సర్ అలీ, నాయకులు రెడ్డి ప్రసాద్, దాసరి శివప్రసాద్, మున్నా, షఫీ, గౌస్, మురళీ, గోపాలక్రిష్ణ, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యం: మల్లాది
-
తాడిపత్రిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తోటపల్లి నీరు తీసుకొస్తాం: బొత్స
సాక్షి, మెరకముడిదాం: మండలానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని తీసుకొస్తామని వైఎస్సార్సీసీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. మండలంలోని ఉత్తరావల్లిలో మంగళవారం నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాల ని కోరారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన త్వరలోనే రానున్నదని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెరకముడిదాం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు.. -
రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
టీడీపీది అరాచక పాలన
ఒంగోలు సిటీ: టీడీపీ అరాచక పాలన చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆరో డివిజన్లో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ఇంటింటికీ ప్రచారం చేశారు. డివిజన్ అధ్యక్షుడు జమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని మాట్లాడుతూ అయిదేళ్లు టీడీపీ అరాచక పాలన చేసిందని వివరించారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు అరాచక పాలన గురించి చర్చించాలన్నారు. ఈ ఎన్నికల్లో గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయకుండా బాబు దుర్మార్గాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల అమలుపై చర్చించాలని అన్నారు. బీసీలను ఎలా దగా చేశారో ప్రతి కుటుంబం ఆలోచించాలని తెలిపారు. మన ఆధార్ డేటాతో సహా వ్యక్తిగత సమాచారాన్ని తమ తాబేదారు కంపెనీలకు అమ్ము కోవడానికి చంద్రబాబు ఎవరని ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. వైఎస్సార్ సీపీకి ఎన్నికల్లో మద్దతు పలకాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇవ్వమన్నారు. రాష్టంతోపాటు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. నేడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఎందుకు అప్పుల పాలవుతున్నామో ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. రోగం వస్తే ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితిపై లోతుగా చర్చించి ఓటు వేయాలన్నారు. పొదుపు మహిళల రుణాలను మాఫీ చేయలేదని వివరించారు. పసుపు–కుంకుమ పేరుతో మూడు వేలు ఇచ్చి సరిపెట్టారన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పొదుపు మహిళ ఆలోచించాలని కోరారు. నేడు పింఛన్ రూ.2 వేలు ఇస్తున్నారంటే జగన్ వల్లే కదా అని గుర్తించాలన్నారు. జగన్ సీఎం అయితే పింఛన్ రూ.3 వేలు ఇస్తారని అన్నారు. బీసీలకు ప్రత్యేకించి జగన్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల్లో యాభైశా తం బీసీలకే నని అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఓటర్లు చెక్ చేసుకోండి ఓటర్లు మీ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకోండన్నారు. 1950 ఎన్నికల సంఘం టోల్‌ప్రీ ద్వారా వివరాలను తెలుసుకోండని అన్నారు. ఓటు లేని వారు ఉంటే ఈ నాలుగు రోజుల్లో ఈసీఐ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుర్రం వెంకయ్య, వెలనాటి మాధవ. యనమల నాగరాజు, కొఠారి రామచంద్రరావు, ఎందేటి రంగారావు, ఎందేటి వెంకట్రావు, పటాపంజుల శ్రీను, కటారి సంజీవ్, పందరబోయిన పున్నారావు, సాయి,పూరిమిట్ల హర్నాద్, పులుగు అక్కిరెడ్డి, ఆంజనేయులు, కుప్పం ప్రసాద్, బట్టు శ్రీను, కావటి రవి, జలీల్, మహిళా నాయకులు మల్లమ్మ, కృష్ణవేణి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి
-
మంచి నాయకుల కోసం ఓ డాక్టర్ సైకిల్ సవారీ..!
సాక్షి, సత్తెనపల్లి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థమైన సేవలు అందించే పాలకులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు సైకిల్ యాత్ర చేయాలని ఓ డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం పాలకులు కల్పించిన భ్రమలతో ప్రజలు ఓట్లు వేస్తే ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపించారన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ సవారీ చేసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ యేరువ నరసింహరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకిల్ సవారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల వద్ద ముగియనుంది. 74 నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రాధాన్యతను వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే యోచనతో ఎన్నికల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రాబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు జగన్ సమక్షంలో యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. -
చంద్రబాబు, లోకేష్ జైలుకు పోవడం ఖాయం : పెద్దిరెడ్డి
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది
సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు. తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది... సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు. 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక... వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కడప జిల్లాలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం