ravi bishnoi
-
పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.86 మ్యాచ్‌లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్‌మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది.గంభీర్ ఎఫెక్ట్.. కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.పాపం బిష్ణోయ్బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్‌గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్‌ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్‌ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైన శ్రీలంక
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. శ్రీలంకను 161 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ మూడు, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26), చరిత్ అసలంక (14), రమేశ్ మెండిస్ (12), కుశాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. నిన్న జరిగిన తొలి టీ20లోనూ శ్రీలంక ఈ మ్యాచ్‌లోలాగే చివరి వికెట్లు స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. నిన్నటి మ్యాచ్‌లో ఆ జట్టు చివరి 9 వికెట్లు 30 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
శ్రీలంకతో రెండో టీ20.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరికి రెస్ట్?
శ్రీలంకతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. 24 గంటలు తిరగకముందే మరో మ్యాచ్‌కు భారత్ సిద్దమైంది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. లంక మాత్రం ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.అయితే సెకెండ్ టీ20లో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో గాయపడిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రెండో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిటర్న్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బిష్ణోయ్ ముఖానికి గాయమైంది. రక్తం రావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.ఆ తర్వాత తన బౌలింగ్‌ను బిష్ణోయ్ కంటిన్యూ చేశాడు. కానీ ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు మహ్మద్ సిరాజ్‌ను కూడా ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో పేసర్ ఖాలీల్ ఆహ్మద్ జట్టులో రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ మధుషంక స్ధానంలో ఆల్‌రౌండర్ చమిందు విక్రమసింఘేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు లంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.తుది జట్లు(అంచనా)భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఖాలీల్ ఆహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ స్టైట్‌గా సింగిల్ కోసం చిప్ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్ తన కుడివైపున్కి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామతో పాటు గ్రౌండ్లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲 Flying Bishoni ✈️ Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
మళ్లీ అగ్రపీఠంపై బాబర్.. టాప్ ర్యాంక్‌లు కోల్పోయిన గిల్, భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లకు చేదు ఫలితాలు వచ్చాయి. గత వారం టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్న రవి భిష్ణోయ్.. గత కొంతకాలంగా టాప్ వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ తమ అగ్రస్థానాలను కోల్పోయారు. గిల్ (810), భిష్ణోయ్ ఈ మధ్యకాలంలో (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భిష్ణోయ్.. వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్) ఆయా ఫార్మాట్లలో ఆడకపోవడం వల్ల టాప్ ర్యాంక్‌లు కోల్పోయారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడని కోహ్లి (775) కూడా రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ, మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. వన్డే ఫార్మాట్లో భారత ఆటగాళ్ల గైర్హాజరీలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (824) తిరిగి నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో పేట్రేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ టీ20 నంబర్ వన్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకోగా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ హోదాలో కొనసాగుతున్నాడు. టీ20 టాప్ బౌలర్ విషయానికొస్తే.. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా.. రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భిష్ణోయ్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. వన్డే బౌలర్ల విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, సిరాజ్, జంపా, బుమ్రా టాప్-5లో నిలిచారు. కుల్దీప్ 8, షమీ 11, జడేజా 22 స్థానాల్లో ఉన్నారు. నంబర్ వన్ టెస్ట్ బౌలర్ విషయానికొస్తే.. అశ్విన్ తన టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా..జడేజా 4, షమీ 18, సిరాజ్ 29 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. -
టీమిండియా స్పిన్ సంచలనం.. ఏడాది కాలంలోనే వరల్డ్ నంబర్ వన్‌గా!
ICC T20I Rankings: Ravi Bishnoi Top Spot in Bowling Charts: రవి బిష్ణోయి.. టీమిండియా యువ స్పిన్ సంచలనం.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే పొట్టి ఫార్మాట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సంపాదించాడు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో 2000వ సంవత్సరంలో సెప్టెంబరు 5న జన్మించాడు రవి. క్రికెటర్ కావాలన్న కలతో చిన్ననాటి నుంచే కఠోర శ్రమకోర్చిన అతడు.. లెగ్ బ్రేక్ స్పిన్నర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో తొలుత రాజస్తాన్‌కు ఆడిన రవి బిష్ణోయి.. ఇటీవలే గుజరాత్ జట్టుకు మారాడు. ఇక ఎంతో మంది యువ క్రికెటర్ల మాదిరిగానే రవి బిష్ణోయి కూడా అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ ద్వారా తొలుత వెలుగులోకి వచ్చాడు. సౌతాఫ్రికాలో 2020లో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో మొత్తంగా 17 వికెట్లతో సత్తా చాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2020 సీజన్లో పంజాబ్ కింగ్స్ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక వికెట్ సాధించాడు. ఆ తర్వాత 2022లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మారిన రవి బిష్ణోయి.. ఆ సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయి.. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవి.. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 21 టీ20లు ఆడిన రవి బిష్ణోయి.. 34 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 4/16. ఇక ఆడిన ఏకైక వన్డేలోనూ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు 23 ఏళ్ల రవి. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా.. రవి బిష్ణోయి మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం ఆక్రమించాడు. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 4-1తో గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంతో పాటు.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గానూ అవతరించాడు రవి. నిలకడైనా ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే టాప్ బౌలర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో తన స్థానం దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. తద్వారా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ప్రపంచకప్ ఆశలకు పరోక్షంగా గండికొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌ల రూపంలో గట్టి పోటీ ఎదుర్కొని.. ఈ స్థాయికి చేరుకున్నాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్- టాప్-5 బౌలర్లు వీరే ►రవి బిష్ణోయి(ఇండియా)- 699 రేటింగ్ పాయింట్లు ►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 692 రేటింగ్ పాయింట్లు ►వనిందు హసరంగ(శ్రీలంక)- 679 రేటింగ్ పాయింట్లు ►ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)- 679 రేటింగ్ పాయింట్లు ►మహీశ్ తీక్షణ(శ్రీలంక)- 677 రేటింగ్ పాయింట్లు. చదవండి: నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్ A thrilling finish to an action-packed T20I series 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Cu9BjqojQK — BCCI (@BCCI) December 3, 2023 -
ఏకంగా 56 స్థానాలు మెరుగుపర్చుకున్న రుతురాజ్.. టాప్‌లో భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో మూకుమ్మడిగా రాణించిన భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్.. ఏకంగా 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి భిష్ణోయ్ (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) నంబర్ 1 ర్యాంకు అందుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్ ర్యాంక్‌ను (881 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మార్పులు మినహాయించి తాజా టీ20 ర్యాంకింగ్స్ పెద్దగా మార్పులు జరగలేదు. బ్యాటింగ్‌లో స్కై తర్వాత మహ్మద్ రిజ్వాన్, మార్క్రమ్, బాబార్ ఆజమ్, రిలీ రొస్సో, డేవిడ్ మలాన్, రుతురాజ్, జోస్ బట్లర్, రీజా హెండ్రిక్స్, గ్లెన్ ఫిలిప్స్ వరుసగా టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, భిష్ణోయ్, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, హాజిల్‌వుడ్ టాప్-10 జాబితాలో నిలిచారు. కాగా, ఆసీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
అతడొక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్.. కుంబ్లే, అశ్విన్ కంటే: మురళీధరన్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ 9 వికెట్లు పడగొట్టి.. భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కూడా తొలి ఓవర్లోనే భారత్‌కు బిష్ణోయ్ వికెట్ అందించాడు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత గ్రేట్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లతో బిష్ణోయ్‌ను పోల్చాడు . "భారత్ క్రికెట్లో ప్రతీ తరానికి మంచి స్పిన్నర్లు పుట్టుకొస్తున్నారు. అనిల్ కుంబ్లే నుంచి అశ్విన్ వరకు అత్యుత్తమ స్పిన్నర్లు మనం చూశాం. ఇప్పుడు రవి బిష్ణోయ్ రూపంలో భారత్‌కు మరో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ దొరికాడు. బిష్ణోయ్‌కు అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయి. మిగతా లెగ్ స్పిన్నర్ల కంటే బిష్ణోయ్ చాలా భిన్నం. అతడికి బంతిని వేగంగా వేసే సత్తా ఉంది. బంతిని టర్న్ కూడా చేయగలడు. అదే అక్షర్ కూడా సరైన వేగంతో బౌలింగ్ చేయగలడు, కానీ టర్న్ పెద్దగా ఉండదు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కూడా అక్షర్ మాదరిగానే ఉంటుందని" ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కూడా భారత జట్టులో బిష్ణోయ్‌కు చోటు దక్కింది. చదవండి: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్ -
IND VS IRE 1st T20: వర్షం అంతరాయం.. ఐర్లాండ్‌పై టీమిండియా విజయం
ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు. -
IND VS IRE 1st T20: బుమ్రా రీఎంట్రీ.. తొలి బంతికే ఫోర్.. అదే ఓవర్లో 2 వికెట్లు
Ireland vs India, 1st T20I- Two wickets in the first over for India in a T20I: దాదాపుగా ఏడాది తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చీ రాగానే తనదైన మార్కు చూపించాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో మునుపటి కంటి అధికమైన జోష్‌తో తొలి బంతిని సంధించిన బుమ్రా.. ఆ బంతికి బౌండరీని సమర్పించుకున్నాడు. రెండో బంతిని తొలి బంతి కంటే వేగంగా సంధించిన బుమ్రా ఈసారి సక్సెస్ సాధించి, వికెట్ తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన ఆండ్రూ బల్బిర్నీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా మరో వికెట్ కూడా తీసుకున్నాడు. ఐదో బంతికి టక్కర్.. వికెట్ల వెనుక సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన క్రమంలో బుమ్రా ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొలిసారి తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టగా.. 2022లో ఆఫ్ఘానిస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్, ఇదే ఏడాది వెస్టిండీస్‌పై హార్ధక్ పాండ్యా, తాజాగా బుమ్రా ఈ ఘనత సాధించారు. కాగా, ఈ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టిన అనంతరం డెబ్యూ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్లోనే (5వ ఓవర్) ఓ వికెట్ పడగొట్టాడు. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ప్రసిద్ధ్ టెక్టార్‌కు ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే భారత్‌కు మరో వికెట్ దక్కింది. రవి బిష్ణోయ్.. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 35/5గా ఉంది. మార్క్ అదైర్ (4), కర్టిస్ క్యాంఫర్ (2) క్రీజ్‌లో ఉండగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ తలో 2 వికెట్లు, బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు. What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
Ind vs WI T20s: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం!
IND vs WI T20 series 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లు కరేబియన్ దీవికి పయనమయ్యారు. బౌలర్లు రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్‌లతో పాటు తొలిసారి జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ తదితరులు విమానంలో విండీస్‌కు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అడిడాస్ రూపొందించిన బ్లాక్ కలర్ ట్రెయినింగ్ జెర్సీలు ధరించిన రవి, ఆవేశ్, తిలక్.. విమానంలో చిల్ అవుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నెల రోజుల పర్యటన జూలై 12న మొదటి టెస్టుతో ఈ టూర్ మొదలైంది. ఇక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకోగా.. గురువారం(జూలై 27) నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వైస్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ తదితర ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నారు. తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం! ఇక ఆగష్టు 1న వన్డే సిరీస్ ముగియనుండగా.. 3 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. విండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం డొమినికా మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండో టెస్టు సందర్భంగా యువ పేసర్ ముకేశ్ కుమార్ సైతం ఎంట్రీ ఇచ్చాడు. బలహీన విండీస్‌పై ఇలా వరుసగా టీమిండియా యంగ్ క్రికెటర్ల అరంగేట్రాల నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనూ కొత్త ముఖాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మంచి హిట్టర్‌గా పేరొందిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా క్యాప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఆగష్టు 3- 13 వరకు జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20కి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. సూర్యకుమార్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్. చదవండి: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
అప్పుడు పీయూశ్ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది. ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ ముగ్గురు ఉంటారు.. అయితే ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు. అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
LSG VS RCB: బిష్ణోయ్ ఉచ్చులో చిక్కిన కోహ్లి
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆచితూచి ఆడుతుంది. 11 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (31) ఔట్ కాగా.. డుప్లెసిస్ (32), అనుజ్ రావత్ (6) క్రీజ్‌లో ఉన్నారు. బిష్ణోయ్ ఉచ్చులో చిక్కన కోహ్లి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి రవి బిష్ణోయ్ పన్నిన ఉచ్చులో విరాట్ కోహ్లి (31) చిక్కాడు. కింగ్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వస్తున్నాడని ముందే పసిగట్టిన బిష్ణోయ్ తెలివిగా గూగ్లీని సంధించాడు. కోహ్లి బంతిని కనెక్ట్ చేసుకోలేకపోవడంతో వికెట్ కీపర్ పూరన్ అలర్ట్‌గా ఉండి స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. Virat Kohli departs after scoring 31 runs off 30 balls.Another spinner bags Virat Kohli's wicket!📸: Jio Cinema pic.twitter.com/F2cUEUw55e— CricTracker (@Cricketracker) May 1, 2023 మరోమారు స్పిన్నర్‌కే చిక్కిన కోహ్లి.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబైపై అజేయంగా నిలిచిన కోహ్లి.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్‌లో, లక్నోతో తొలి మ్యాచ్‌లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో, ఢిల్లీతో మ్యాచ్‌లో లలిత్ యాదవ్ బౌలింగ్‌లో, పంజాబ్‌తో మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో, ఇవాల్టి మ్యాచ్‌లో బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ సీజన్లో సీఎస్కే (ఆకాశ్ సింగ్), రాజస్థాన్ (ట్రెంట్ బౌల్ట్), కేకేఆర్ (రెండో మ్యాచ్‌లో రసెల్)తో మ్యాచ్‌ల్లో పేసర్లకు చిక్కాడు. 2015 తర్వాత అత్యల్ప స్ట్రయిక్‌రేట్.. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 31 పరుగులు (103.33) చేసి ఔటైన కోహ్లి.. ఐపీఎల్లో 2015 సీజన్ తర్వాత అత్యల్ప స్ట్రయిక్ రేట్ (కనీసం 30 బంతులు ఎదుర్కొన్న తర్వాత) నమోదు చేశాడు. -
నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ తర్వాత సీఎస్కే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటితే 6 పరుగులు పెనాల్టి విధించాలని ఆయన కోరాడు. Bishnoi was leaving his crease early. Any silly people out there still saying you shouldn't run the non-striker out? — Harsha Bhogle (@bhogleharsha) April 10, 2023 ఎల్ఎస్జే-ఆర్సీబీ మ్యాచ్‌లో హర్షల్-బిష్ణోయ్ మన్కడింగ్ ఉదంతం తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్టోక్స్ ఈరకంగా స్పందించాడు. బిష్ణోయ్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ వదిలి వెళ్లాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి సందర్భంలో కూడా మన్కడింగ్ (నాన్ స్ట్రయికర్ రనౌట్) చేయొద్దని అంటారా అంటూ హర్షా ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌కు బదులిస్తూ స్టోక్స్ పైవిధంగా స్పందించాడు. Thought’s Harsha? Umpires discretion.. 6 penalty runs if obviously trying to gain unfair advantage by leaving crease early? Would stop batters doing it without all the controversy https://t.co/xjK7Bnw0PS — Ben Stokes (@benstokes38) April 10, 2023 కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి తరుణంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రవి బిష్ణోయ్.. బౌలర్ హర్షల్ పటేల్ బంతి వేయకముందే క్రీజ్ దాటి చాలా ముందుకు వెళ్లాడు. ఇది గమనించిన హర్షల్ మన్కడింగ్ చేసి భిష్ణోయ్ను రనౌట్ చేశాడు. అయితే దీన్ని అంపైర్ పరిగణించలేదు. హర్షల్‌కు బౌల్ వేసే ఉద్ధేశం లేకపోవడంతో పాటు క్రీజ్ దాటినందుకు గానూ మన్కడింగ్‌ను అంపైర్ ఒప్పుకోలేదు. Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 నిబంధనల ప్రకారం బౌలర్ బౌలింగ్ చేసే ఉద్దేశం లేకపోయినా, క్రీజ్ దాటి బయటకు వెళ్లినా మన్కడింగ్ చేయడానికి వీలు లేదు. మన్కడింగ్ రూల్ ప్రకారం బౌలర్ బంతి సంధించే ఉద్దేశం కలిగి, క్రీజ్ దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్ చివరి బంతికి మన్కడింగ్ చేయలేకపోవడంతో బిష్ణోయ్ బ్రతికిపోయాడు. ఆతర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో వికెట్ తేడాతో విజయం సాధించింది. -
'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా'
టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తీవ్రమైన పోటీ కారణంగా టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేనప్పటికి ఐపీఎల్ ద్వారా మరోసారి పలకరించనున్నాడు. రూ.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)కు అమ్ముడైన రవి బిష్ణోయ్‌కు ఇది నాలుగో ఐపీఎల్ సీజన్. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. శనివారం(ఏప్రిల్ 1న) ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో మంచి ప్రదర్శనే కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ఐదు ఓటములతో మూడో స్థానంలో నిలిచిన లక్నో.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. రవి బిష్ణోయ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున 13 వికెట్లు తీసి పలు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈసారి కూడా అంతకుమించి ప్రదర్శన నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న రవి బిష్ణోయ్ ఎల్ఎస్జీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీని వివరించాడు. ''2018లో నాకు రాజస్తాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా ఆఫర్ వచ్చింది. అదే సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు. కానీ క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమ ఆ ఏడాది నన్ను బోర్డు పరీక్షలకు దూరం చేసింది. వృత్తి పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నాన్న నన్ను వెనక్కి రమ్మని ఆదేశించారు. అదే సమయంలో రాజస్తాన్ బౌలింగ్ కోచ్ క్యాంప్‌లోనే ఉండమన్నారు. దీంతో ఆ ఏడాది 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లను రాయొద్దని నిర్ణయించుకొని నెట్ బౌలర్‌గా సేవలందించా. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నను ఒప్పించడం తలకు మించిన బారంలా అనిపించింది. మొత్తానికి ఏదోలా నాన్నను ఒప్పించి మరుసటి ఏడాది 12వ తరగతి పరీక్షలను పూర్తి చేశా. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించాను. ఇక పదేళ్ల వయసులోనే క్రికెట్ అకాడమీలో జాయిన అయిన నేను 15 ఏళ్లు వచ్చేసరికి చదువు ఆపేద్దామనిపించింది. కానీ నా తండ్రి సహా కోచ్‌లు చదువుతో పాటు క్రికెట్‌ను కంటిన్యూ చెయ్యాలి.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే రేపు జీవితంలో ఏదో ఒకటి సాధించగలవు. కావాలంటే డిగ్రీ పూర్తయ్యాకా క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించు.. అంతేకాని చదువును నిర్లక్ష్యం చేయొద్దు అంటూ హితబోధ చేశారు.'' అంటూ తెలిపాడు. ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలపై రవి బిష్ణోయ్ పంచుకున్నాడు. ''ఆరోజు ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మా బ్యాటర్లపై అదే పనిగా స్లెడ్జింగ్‌కు దిగారు. తొలుత వాళ్లు లైన్ క్రాస్ చేయడంతోనే మేము గొడవకు దిగాం. వారు ముందు మొదలుపెట్టడంతో మాకు కూడా కోపం వచ్చింది. అయితే అప్పటి సంఘటన తర్వాత ఇంకెప్పుడు ఎవరిని స్లెడ్జ్ చేయొద్దని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. There is only one @bishnoi0056 when it comes to Cricket. Lekin off the field, ek Ravi Bishnoi toh hum sabme hain 🤭 Hai na, #LSGBrigade? 👇#GazabAndaz | #LucknowSuperGiants | #LSGUnfiltered | #LSGTV | #LSG pic.twitter.com/xnvmXi2jHW — Lucknow Super Giants (@LucknowIPL) March 28, 2023 చదవండి: సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్ అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
WC 2023: చహల్ కంటే అతడు బెటర్.. కుల్దీప్ కూడా..: టీమిండియా మాజీ సెలక్టర్
ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్లో ప్రతి బౌలర్ కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి తను దేశవాళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా చహల్ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సునిల్ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్-చా’ స్పిన్ ద్వయంలో కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు. చహల్ ఇప్పటి వరకు ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్ ఖాతాలో ఉన్నాయి. జడ్డూ ఉంటాడు.. బ్యాకప్‌గా అతడే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్ జోషి.. తన ప్రపంచకప్ జట్టులో చహల్‌కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్‌లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్‌గా లేనట్లయితే బ్యాకప్‌గా అక్షర్ పటేల్ ఉండాలి. ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్ సుందర్). ఒకవేళ మరో లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్ కంటే మెరుగ్గా ఫీల్డింగ్ చేయగలడు’’ అని సునిల్ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భిన్న పరిస్థితుల నడుమ ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్‌లో ప్రపంచకప్ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి. కాబట్టి వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కూడా కుల్దీప్ పాత్ర కీలకం కానుందని సునిల్ అంచనా వేశాడు. అదరగొడుతున్న కుల్దీప్ ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది -
పాపం శ్రేయస్ అయ్యర్.. రిజర్వ్ ఆటగాడిగా కూడా పనికి రాడా..?
టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. వరల్డ్‌కప్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితా నుంచి కూడా అతన్ని తప్పించి ఘోరంగా అవమానించింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే ఉండి ముస్తాక్ అలీ ట్రోఫీలో (ముంబై) ఆడాలని ఆజ్ఞాపించింది. బీసీసీఐ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి అవాక్కైన అయ్యర్ చేసేదేమీ లేక ముంబై జట్టుతో చేరిపోయాడు. శ్రేయస్‌తో పాటు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికైన రవి బిష్ణోయ్‌ది కూడా ఇదే పరిస్థితి. బిష్ణోయ్ కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు రాజస్థాన్ జట్టుతో కలవాలని బీసీసీఐ ఆదేశించింది. వరల్డ్‌కప్ జట్టులో ఎవరైన గాయపడితే, తామే కబురు పెడతామని బీసీసీఐ ఈ ఇద్దరికి సర్ధిచెప్పింది. ఇదిలా ఉంటే, శ్రేయస్, బిష్ణోయ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లను బీసీసీఐ తొలుత రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిలో షమీ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో నిన్ననే (అక్టోబర్ 12) ఆస్ట్రేలియాకు బయల్దేరగా.. గాయం నుంచి కోలుకోని చాహర్ ఎన్సీఏకే (నేషనల్ క్రికెట్ అకాడమీ) పరిమితమాయ్యడు. ఇక రెగ్యులర్ జట్టులోని సభ్యుడు బుమ్రా గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్లను బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. వీరిద్దరు కూడా నిన్ననే షమీతో పాటు ఆస్ట్రేలియాకు బయల్దేరారు. ఇదిలా ఉంటే, ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 3 వన్డేలు ఆడిన అయ్యర్.. 191 సగటున 191 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ శ్రేయస్‌ను కనీసం రిజర్వ్ ఆటగాడిగా కూడా పరిగణించకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ వాదన ఇంకోలా ఉంది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా పటిష్టంగా ఉందని, డౌట్‌ఫుల్‌గా ఉండిన దీపక్ హూడా కూడా ఫిట్‌గా మారాడని, అందుకే శ్రేయస్‌ను ఇండియాలోనే ఉండిపోవాలని సూచించామని కవరింగ్ చేసుకుంది. -
Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం: రోహిత్
Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Rohit Sharma Comments On Loss: ‘‘ఇది ప్రతిష్టాత్మక మ్యాచ్. కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్, నవాజ్‌ల జోడీని విడదీయలేకపోయాం. వారిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బకొట్టింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాము మెరుగైన స్కోరు నమోదు చేసినా దానిని కాపాడుకోలేకపోయామంటూ విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరే! ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిజ్వాన్, నవాజ్ జోరుకు బ్రేక్ వేయలేకపోయిన భారత బౌలర్లు టీమిండియా స్టార్ బ్యాటర్ 60 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. ఆదిలోనే కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పట్టుదలగా నిలబడ్డాడు. 51 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 15 పరుగులకే పెవిలియన్ చేరినా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ నవాజ్ 20 బంతుల్లోనే 42 పరుగులు సాధించి పాక్ విజయానికి బాటలు వేశాడు. రవి, భువీ, అర్ష్‌దీప్.. ఇక 18, 19 ఓవర్లలో భారత బౌలర్లు రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ వైడ్ల రూపంలో భారీగా పరుగులు సమర్పించుకోవడం.. కీలక సమయంలో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ వదిలేయడం వంటి పరిణామాల నేపథ్యంలో గెలుపు పాక్‌ను వరించింది. ఐదు వికెట్ల తేడాతో భారత్ దాయాది చేతిలో ఓటమి పాలైంది. మాకంటే పాక్ మెరుగ్గా ఆడింది ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్‌లో తాము చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ‘‘వాళ్ల జట్టులో కూడా క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. సమయం వచ్చినపుడు తమను తాము నిరూపించుకున్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. నిజానికి సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలుసు. అయితే, 180 పరుగులు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మేము మెరుగైన స్కోరే నమోదు చేశాం. అయితే, దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యాం. కోహ్లిపై రోహిత్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో క్రెడిట్ పాకిస్తాన్‌కే దక్కుతుంది. మాకంటే వాళ్లు బాగా ఆడారు’’ అని రోహిత్ అన్నాడు. ఇక జట్టుకు అవసరమైన సమయంలో రాణించాడంటూ హిట్‌మ్యాన్.. విరాట్ కోహ్లిని ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయిన సమయంలో తను బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. చదవండి: Asia Cup 2022: 'కింగ్ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే' Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత! Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్! వైరల్ A brilliant 60 off 44 deliveries from @imVkohli makes him our Top Performer from the first innings. A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/VPEfamGENJ — BCCI (@BCCI) September 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ICC T20 Rankings: పాపం సూర్య.. నెంబర్ 1 కాలేకపోయాడు! అదరగొట్టిన రవి బిష్ణోయి!
ICC Batting And Bowling T20 Rankings: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడికి చేరువగా వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌కు సూర్యకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆడి మంచి స్కోరు నమోదు చేసి ఉంటే సూర్య.. నంబర్ 1గా నిలిచేవాడు. కానీ.. అలా జరుగలేదు. టాప్-5లో.. ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 805 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. బాబర్ ఆజం 818 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్), ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా), డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) నిలిచారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు. రవి బిష్ణోయి అదరగొట్టిన రవి బిష్ణోయి.. టాప్-50లోకి.. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి దుమ్ములేపాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతడు ఏకంగా టాప్-50లోకి చేరుకున్నాడు. 481 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 44వ ర్యాంకు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అద్బుతంగా(6 వికెట్లు) రాణించినప్పటికీ.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 28వ స్థానం నుంచి 35వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ విషయానికొస్తే.. ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నది వీళ్లే! 1.బాబర్ ఆజం(పాకిస్తాన్)- 818 పాయింట్లు 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 805 పాయింట్లు 3.మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు 4.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 792 పాయింట్లు 5.డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)- 731 పాయింట్లు 6. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు 7.పాథుమ్ నిశాంక(శ్రీలంక)-661 పాయింట్లు 8.డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 655 పాయింట్లు 9.నికోలస్ పూరన్(వెస్టిండీస్)-644 పాయింట్లు 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)-638 పాయింట్లు చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
'అతడు టీమిండియాకు స్టార్ బౌలర్ అవుతాడు'
టీమిండియా యవ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే రోజుల్లో బిష్ణోయ్ భారత్‌కు స్టార్ స్సిన్నర్‌గా మారుతాడని రషీద్ ఖాన్ కొనియాడాడు. ఇక ఐపీఎల్-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ 13 వికెట్లు పడగొట్టాడు. "బిష్ణోయ్ మంచి ప్రతిభావంతుడు. అతడితో నేను చాలా సార్లు మాట్లాడాను. అతడు రాబోయే రోజుల్లో టీమిండియాకు స్టార్ బౌలర్ అవుతాడు. బిష్ణోయ్ తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని రషీద్ పేర్కొన్నాడు. ఇక యజువేంద్ర చాహల్ గురించి మాట్లాడూతూ.. "చాహల్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్. భారత్, ఆర్సీబీ తరపున చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన బౌలింగ్‌లో అద్భుతమైన స్కిల్స్‌ను ప్రదర్శిస్తాడని" రషీద్ తెలిపాడు. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఆల్‌రౌండర్ స్కిల్స్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన 18 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా? -
ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు
ఐపీఎల్ 2022లో సీఎస్కేతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు రవి బిష్ణోయి సూపర్ రనౌట్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆండ్రూ టై వేశాడు. ఓవర్ మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ ప్యాడ్స్‌తో పాటు బ్యాట్‌ను తాకుతూ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అదే సమయంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రవి బిష్ణోయి బంతిని వేగంగా అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. గైక్వాడ్ క్రీజులోకి చేరుకోవడానికి ముందే బంతి వికెట్లను గిరాటేసింది. రిస్క్ అని తెలిసినా సింగిల్‌కు ప్రయత్నించిన గైక్వాడ్ అనవసరంగా రనౌట్ అయ్యాడు.దీంతో గైక్వాడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇంకా విచిత్రమేంటంటే ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు అని మనం అనుకునేలోపే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుతురాజ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
Ind Vs Wi 1st T20: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. సూపర్: రోహిత్ శర్మ
Ind Vs Wi 1st T20: టీమిండియా యువ బౌలర్ రవి బిష్ణోయిపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రవి ప్రతిభావంతుడని, అతడి ఆట తీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడని... భవిష్యత్తులో మరింత గొప్పగా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బ్యాటర్లలో రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35), సూర్యకుమార్ యాదవ్(34) రాణించారు. ఇక అరంగేట్ర మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు రవి బిష్ణోయి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... రవి బిష్ణోయిని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘బిష్ణోయి అత్యంత ప్రతిభావంతుడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం. తనలో ఏదో ప్రత్యేకత ఉంది. అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. అద్భుతమైన నైపుణ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను చక్కగా బౌలింగ్ చేయగలడు. తన ప్రదర్శనతో బౌలింగ్ విభాగంలో మాకు మరిన్ని ఆప్షన్లు దొరికేలా చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక తన సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం గురించి ఆలోచిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా రాజస్తాన్‌కు చెందిన బిష్ణోయ్ 42 దేశవాళీ టి20 మ్యాచ్‌లలో 6.63 ఎకానమీతో 49 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జాయింట్స్ జట్టు రవిని 4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND VS WI: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ 💬 💬 "Very happy with his first game for India. He has got a very bright future." #TeamIndia captain @ImRo45 lauds @bishnoi0056 following his superb performance on debut. 👏 👏#INDvWI @Paytm pic.twitter.com/YmxUF2JYrY — BCCI (@BCCI) February 16, 2022 -
Ind Vs Wi 1st T20: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. ఇది అస్సలు ఊహించలేదు!
అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత బౌలర్ రవి బిష్ణోయి. తన గూగ్లీలతో వెస్టిండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన రవి... 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇందులో 17 డాట్‌బాల్స్ ఉండటం మరో విశేషం. మొదటి మ్యాచ్ కాబట్టి కాస్త తడబడిన రవి బిష్ణోయి 6 వైడ్ బాల్స్ వేసినప్పటికీ... ఓవరాల్‌గా సూపర్బ్ అనిపించుకున్నాడు. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరంగేట్రంలోనే ఈ అవార్డు గెలిచి తన పేరిట ఓ రికార్డు నెలకొల్పాడు రవి బిష్ణోయి. అంతర్జాతీయ టీ20 డెబ్యూ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. రవి కంటే ముందు దినేశ్ కార్తిక్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ప్రజ్ఞాన్ ఓజా, అక్షర్ పటేల్, బరీందర్ స్రాన్, నవదీప్ సైనీ, హర్షల్ పటేల్ ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా టి20 క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి నిలిచాడు. కల నిజమైంది.. కానీ ఇది ఊహించలేదు.. అవార్డు గెలిచిన అనంతరం రవి బిష్ణోయి మాట్లాడుతూ... ‘‘టీమిండియాకు ఆడాలన్న నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది. టీ20 క్రికెట్లో వెస్టిండీస్ బలమైన జట్టు. కాబట్టి తొలుత కాస్త కంగారుగా అనిపించింది. అయితే, నా శక్తిమేర జట్టుకు ఉపయోగపడాలని భావించాను. మంచు కారణంగా కాస్త ఇబ్బంది తలెత్తినా... బాగానే బౌలింగ్ చేయగలిగాను. అయితే, మొదటి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు నిజంగా ఇది ఎంతో ప్రత్యేకం’’అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. చదవండి: Ind Vs WI 1st T20: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా From nerve & verve to a dream #TeamIndia debut!👏 👏 In his maiden Chahal TV appearance, @bishnoi0056 shares his emotions with @yuzi_chahal after India's win in the 1⃣st @Paytm #INDvWI T20I. ☺️ 😎 - By @Moulinparikh Watch the full interview 🎥 🔽https://t.co/HTjXQGKlg3 pic.twitter.com/5dMyWXUblu — BCCI (@BCCI) February 17, 2022 -
'తొలి మ్యాచ్ కదా తడబడ్డాడు.. వదిలేయ్ రోహిత్'
వెస్టిండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయి 4 ఓవర్లలో 17 డాట్ బాల్స్ వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఎంట్రీతో అదరగొట్టిన బిష్ణోయ్ క్యాచ్ విషయంలో కాస్త పొరబడడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో పవర్ ప్లేలో యజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో తొలి బంతిని నికోలస్ పూరన్ లాంగ్ఆప్ భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ అని మనం అనుకుంటున్న సమయంలో బిష్ణోయ్ క్యాచ్ అందుకున్నాడు. చదవండి: IND Vs WI: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా కానీ తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో బిష్ణోయ్ బౌండరీ లైన్‌ను తాకేశాడు. దీంతో అంపైర్ సిక్స్‌గా ప్రకటించాడు. తాను చేసిన తప్పుకు నాలుక కరుచుకుంటూ నిరాశతో బంతిని విసిరేశాడు. ఇది చూసిన రోహిత్ శర్మ బిష్ణోయ్ వైపు కాస్త కోపంతో చూశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. '' అతనికి ఇది తొలి మ్యాచ్.. వదిలేయ్ రోహిత్..'' అంటూ కామెంట్ చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. చహల్ చేతుల మీదుగానే రవి బిష్ణోయ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన బౌలింగ్‌లో క్యాచ్ పట్టినప్పటికి పొరపాటున బౌండరీలైన్ తాకడంతో చహల్ వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. చహల్ ఇదేం పట్టించుకోకుండా ఓవర్ పూర్తైన తర్వాత బిష్ణోయ్ వద్దకు వెళ్లి ''మంచి ప్రయత్నం చేశావు..'' అంటూ మెచ్చుకున్నాడు. టి20 క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు.మొదటి మ్యాచ్‌లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకి సిక్స్ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. చదవండి: Ravi Bishnoi: 24 బంతుల్లో 17 డాట్‌బాల్స్.. సూపర్ ఎంట్రీ రవి బిష్ణోయి Congratulations to Ravi Bishnoi who is all set to make his debut for Team India.@Paytm #INDvWI pic.twitter.com/LpuE9QuUkk — BCCI (@BCCI) February 16, 2022 pic.twitter.com/msvTjxmAH3 — Bleh (@rishabh2209420) February 16, 2022