remand report
-
తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు
-
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
-
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు
-
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ టీం ట్యాప్ చేసింది: రాధాకిషన్
-
రిమాండ్ రిపోర్ట్..బోండా ఉమా బ్యాచ్ స్కెచ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
కవిత రిమాండ్ పొడిగింపు?
-
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
ట్యాపింగ్ ఫైల్స్..రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
సాక్షీ టీవీ చేతిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్
-
సాక్షిటీవీ చేతిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్
-
శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
చంద్రబాబు వాదన సరైంది కాదు: సీఐడీ
-
చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
-
Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్లో కీలకాంశాలు
స్కిల్‌స్కామ్ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే.. 👉: 30.1.2015న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు. 👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు… 👉: డిజైన్‌టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్‌ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 👉: ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది… 👉: చంద్రబాబు తన పరపతితో విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 👉: చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 👉: ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 👉: చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. చంద్రబాబు వాదనలపై… 👉: కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 👉: రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం. 👉: ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 👉: అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 👉: ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 👉: చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే. కుంభకోణం బయటకు ఎలా వచ్చింది? తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్ టెక్ సిస్టమ్స్ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు రూట్ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 👉: చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి -
రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..
-
Live: రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు..
-
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని మెమో దాఖలు చేసిన సీఐడీ
-
స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది. ‘‘స్కిల్ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం జరిగింది. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ.371 కోట్ల అడ్వాన్సులు చెల్లింపు. ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్ కంపెనీలకు తరలించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ప్రభుత్వం నిధులు షెల్ కంపెనీలకు మళ్లించారు. కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉంది మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో చంద్రబాబే సూత్రధారి అని తేలింది.’’ అని సీఐడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. ‘‘స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వివరాలను అచ్చెన్నాయుడికి సమర్పించారు. ప్రాజెక్ట్‌లో లోటు పాట్లు తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేశారు. స్కిల్ ప్రాజెక్టులో సిమెన్స్ కంపెనీ రూ.3281 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని బాబు, అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయి స్కిల్ స్కాంకు సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. స్కిల్ స్కాంలో ఈడీ విచారణ కీలక దశలో ఉంది. కేసులో మనోజ్ వాసుదేవ్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చాం. మా నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారు. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నారని మా అనుమానం’’ అని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్! -
మంజుల హత్య కేసు.. రిజ్వానా బేగం వల్లే దారుణం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు. కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది. అనంతరం, పెట్రోల్‌తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు. ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క -
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
సాక్షి చేతిలో చికోటి రిమాండ్ రిపోర్ట్