repolling
-
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
సత్తెనపల్లి రీ పోలింగ్.. మంత్రి అంబటి పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి రిగ్గింగ్, దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.కాగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ వారిపై దాడులకు తెగబడ్డారు.ఇక, ఈ ఘటనలపై వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘ఎమ్మెల్సీ’ పోలింగ్ ప్రశాంతం.. జిల్లాల వారీగా ఇలా..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు టీచర్, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. తొమ్మిది స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో ఉ.8 గంటలకు మొదలైన పోలింగ్ సా.4 గంటలకు ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 63.65 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతానికిపైగా, టీచర్ల నియోజకవర్గాల్లో 87.15 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. పోలైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమయం ముగిసినప్పటికీ చాలామంది ఓటర్లు ఇంకా క్యూలైన్లలోనే ఉన్నారు. దీంతో సా.4 గంటలకు క్యూలైన్లో ఉన్నవారినీ కూడా ఓటింగ్‌కు అనుమతించారు. పోలింగ్ ప్రక్రియను పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనా సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. మార్చి 16న ఉ.8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట చర్యలు ఇక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంది. 20 జిల్లాల్లోని 1,535 పోలింగ్ కేంద్రాల్లో 125 కేంద్రాలు అత్యంత సున్నితమైనవి, 498 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 912 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది. తదనుగుణంగా పోలింగ్ సక్రమ నిర్వహణకు తగిన బందోబస్తు ఏర్పాటుచేసింది. మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్ టీమ్‌లను వినియోగించింది. ముందస్తు చర్యల్లో భాగంగా 7,093 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని భావించిన 6,792 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు 1,858 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీచేసింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రూ.75.94లక్షల నగదు, 2,909 లీటర్ల మద్యాన్ని జప్తుచేసింది. జిల్లాల వారీగా ఇలా.. - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి జిల్లాలో 8,165 మంది ఓటర్లకు గానూ 7,215 మంది.. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 1,07,632 మంది ఓటర్లకు గానూ 68,695 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పొదలకూరులో, కలెక్టర్ చక్రధర్‌బాబు దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. - స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు 15 నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,105 ఓట్లకు గాను పోలింగ్ ముగిసేసరికి 1,088 ఓట్లు నమోదయ్యాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ, మంతెన సత్యనారాయణరాజుతో పాటు కొందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. - తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం జిల్లాలోనూ ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మూడు డివిజన్లలో కలిపి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు 91.40 శాతం, పట్టభద్రుల నియోజకవర్గానికి 69.23 శాతం పోలింగ్ నమోదైంది. - అన్నమయ్య జిల్లా పరిధిలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగాయి. అలాగే, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పరిధిలో పట్టభద్రుల స్థానానికి 68.31 శాతం, ఉపాధ్యాయుల స్థానానికి 93.36శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు రాయలసీమ పరిధిలో పట్టభద్రులకు 66.93 శాతం, ఉపాధ్యాయులు 88.77 శాతం వంతున నమోదైంది. - కర్నూలు జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. పట్టభద్రులకు సంబంధించి సా.4గంటలకు 59.37 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం విడుదల కావాల్సి ఉంది. ఇక టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 90.26 శాతం మంది ఓటు వేశారు. - వైఎస్సార్ జిల్లా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 91.31శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, పట్టభద్రుల స్థానానికి 72.01శాతం నమోదైంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతిలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. చిన్నబజారు వీధిలోని 229, సత్యనారాయణపురంలోని 233 పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కలెక్టరేట్ అధికారులు నివేదిక పంపారు. దీంతో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులిచి్చంది. ఈనెల 15న ఉ.8 గంటల నుండి సా.4 గంటల వరకు ఆ రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు రిటరి్నంగ్ అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. -
రీ పోలింగ్ కోరుతా!: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: ఓటుకు నోటు, టోకెన్ల పంపిణీ అంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయని, ఈ దృష్ట్యా, పరిస్థితులను బట్టి రీపోలింగ్ కోరుతామని మక్కల్ నీది మయ్యం నేత కమల్ తెలిపారు. కుమార్తెలు అక్షర, శ్రుతిహాసన్‌లతో కలిసి ఉదయాన్నే మైలాపూర్‌లో ఓటు హక్కును కమల్ వినియోగించుకున్నారు. ఈ ముగ్గురు క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం తాను పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కుమార్తెలతో పాటు కమల్ వెళ్లారు. పలు పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. కోంపట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరు పంపిణీ చేశారో ఆధారాలు సహా తన వద్ద ఉన్నాయని, ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రీపోలింగ్‌కు పట్టుబడుతామని, ఒక్క కోవై దక్షిణంలోనే కాదు, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఈ తంతు సాగినట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. నామల్ తమిళర్ కట్చి నేత సీమాన్ వలసరవాక్కంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంత రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నగదు తాండవం చేసిందని, కట్టడిలో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా? -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేట్ వాహనంలో ఈవీఎంను తరలించడం కలకలం సృష్టించింది. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన ఈవీఎంను ఓ బీజేపీ నాయకుడి వాహనంలో తీసుకు రావడం వివాదాస్పదంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ నాయకుడి వాహనంలో ఈవీఎం తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్‌కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయివేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. చివరకు ఆ వాహనాన్ని బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ భార్యదిగా ధ్రువీకరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు వాహనంపై దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాక ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ విజయం సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతుంది అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం..
-
ఓల్డ్ మలక్‌పేటలో ముగిసిన రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట వార్డు(డివిజన్) జరిగిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కారు జోరే కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు: రీపోలింగ్ కట్టు దిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. తాజాగా ఉదయం 11 గంటలకు వరకు పోలింగ్ శాతం 13.41గా నమోదు అయింది. ఉదయం 9 గంటలకు వరకు: ఓల్డ్ మలక్‌పేట వార్డు( డివిజన్)లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.4 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. భారీ భద్రత నడుమ రీపోలింగ్ ప్రక్రియ సాగుతోంది. వార్డులో మొత్తం ఓట్లు: 54,655 పురుషులు : 27889 మహిళలు: 26763 ఇతరులు 3 పోలింగ్ కేంద్రాలు 69 విధుల్లో ఉండే మైక్రో అబ్జర్వర్లు 12 మంది. వెబ్‌కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలు:23 నేడు సెలవు: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో పోలింగ్ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతమైన ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు వర్తిసుందన్నారు. అన్ని కార్యాలయ అధిపతులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధం ఉదయం 7 గంటలకు ఓల్డ్ మలక్ పేట్లో ప్రారంభమైన రీపోలింగ్ 69 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. పెట్రోలింగ్, పోలీస్ సిబ్బందితో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రేపటి కోసం కూడా భారీ బందోబస్తు ఉందన్నారు. 200 మీటర్ల పరిధిలో ఎవరికి అనుమతి ఉండదని,.కేవలం అనుమతి పత్రం ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్నట్లు తెలిపారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధించినట్లు వెల్లడించారు. ఓటర్లందరు చాలా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఎల్లుండి ఓల్డ్‌మలక్‌పేటలో రీపోలింగ్
-
ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి?
‘మా బతుకులు ఎలాగూ తెల్లారిపోతున్నాయి. ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి? మా పిల్లలు చదువుకుంటున్నారు.. స్వతహాగా ఎదుగుతున్నారు. వారినీ మాలాగే అణగదొక్కేయాలనుకుంటే ఎలా? మాకెలాగూ తప్పలేదు. పెత్తందార్ల అడుగులకు యువత ఎందుకు మడుగులు ఒత్తుతుండాలి? మమ్మల్ని ధైర్యంగా ఉండాలని మా యువకులు చెబుతున్నారు. ప్రభుత్వం రక్షణగా ఉంటే సరేసరి. లేదంటే మమ్మల్ని మేమెలా కాపాడుకోవాలో మేమూ తెలుసుకుంటాం. ఏం మా ఓట్లు మేం వేసుకుంటామని అనడమే తప్పా? అదేమైనా నేరమా? మా హక్కును వినియోగించుకునే అవకాశం కూడా లేదా?’ ‘చూడండయ్యా. మేం రోజుకు కేవలం రూపాయిన్నర కూలికి వాళ్ల పొలాల్లో పనులకు వెళ్లాం. నలభై ఏళ్లుగా మా చెమట ధారపోస్తున్నాం. పిల్లలు చదువుకున్నారు. వారికీ ఆలోచనలు ఉంటాయి. మా ఓట్లు మేం వేసుకుంటామని అడిగితే వాళ్లను కొట్టేస్తారా. వాళ్లు ఉండే ఊరు మాత్రం బాగుండాలి. వాళ్ల వీధులు నున్నగా మారాలి. సిమెంటు రోడ్లు వేసుకోవాలి. మా వీధులు మాత్రం ఇలాగే మట్టి రోడ్లుగానే ఉండిపోవాలా?’ ఇదీ ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన దళితుడు అరవై ఏళ్ల నడిపయ్య ఆవేదన. ఇదీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న దళితుల ఆవేదన. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దశాబ్దాల తరబడి అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటామన్న దళితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో వారంతా ఓటు వేయలేకపోయారు. ఎట్టకేలకు చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో తొలిసారి దళితులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ పెద్దలు దళితులపై బెదిరింపులకు దిగారు. ‘ఏరా.. మేం వద్దని చెప్పినా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు.. ఎన్నికల ఫలితాలు రానివ్వండి.. మీ పని పడతాం’ అంటూ నిరుపేద దళితుల్ని బెదిరిస్తున్నారు. ఈ హూంకరింపులతో దళిత వర్గాల వారు భయకంపితులవుతున్నారు. ఎన్ఆర్ కమ్మపల్లిలో ఇప్పటికే 20 మంది సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. దళితులపై దాడులకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు (ఫైల్) వెంకట రామాపురంతో మొదలై.. తిరుపతికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోని గ్రామం.. వెంకట రామాపురం. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఓ గ్రామమిది. మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్వగ్రామం కూడా ఇదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత సొరకాయలపాలెం (ప్రస్తుతం 662 ఓట్లు) పంచాయతీ నుంచి వెంకట రామాపురం (ప్రస్తుతం 377 ఓట్లు)ను విడదీసి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు సామాజికవర్గం ప్రధానంగా పెత్తనం చెలాయిస్తున్న ఎన్ఆర్ కమ్మపల్లి, రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, గణేశ్వరపురం (కొత్తకండ్రిగ), కమ్మ కండ్రిగ, కొత్త కండ్రిగ, మిట్ట కండ్రిగ తదితర గ్రామాల్లోని దళిత ఓటర్లు, పేద వర్గాలకు చెందిన వారు స్వయంగా ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేయడం మాట దేవుడెరుగు.. కనీసం ఓటు వేయాలనే ఆలోచన చేసినా దాడులు తప్పేవీ కాదు. అరాచకాలు అన్నీఇన్నీ కావు తమ అభీష్టానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆలోచన చేసిన వారికి చుక్కలు చూపించడం రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాల్లోని చంద్రబాబు సామాజికవర్గం నేతలకు చాలా సాదాసీదా విషయం. నడిచే దారులు మూసేయించడం, వాటిపై ముళ్ల కంప (మెష్) వేయించడం, రేషన్ సరుకులు తీసుకోనివ్వకపోవడం, పచారీ కొట్లలో సరుకులు కొనుగోలుకు అనుమతించకపోవడం, ఊరి కట్టుబాటు పేరుతో కట్టడి చేయడం వంటి అరాచక చర్యలతో భయకంపితులను చేస్తారు. ఈ దురాగతాల వల్ల ఆ సామాజికవర్గం వారిని ఎదిరించడానికి ఇతర కులాలు, వర్గాల వారు సాహసించరని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. 2014లో సింగిల్ విండో ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని అన్నందుకు దళిత యువకులతోపాటు మరికొందరిని కోళ్లఫారాల్లో వేసి చితకబాదారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. వారిపై ఆధారపడుతున్నందునే ఈ దాష్టీకాలు గ్రామాల్లోని దళితులు, ఇతర పేదలు రైతుల వద్ద అప్పులు తీసుకుంటుంటారు. వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకూ గ్రామ పెద్దలపైనే ఆధారపడాలి. ఈ కారణంగా చంద్రబాబు సామాజికవర్గం వారిపై పెత్తనం చెలాయిస్తోందని డివిజనల్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘పాతతరం వారు అణిగిమణిగి ఉండేవారు. ఇప్పటి తరం వ్యవసాయ పనులకు వెళ్లటం లేదు. ఏదో ఒక సాంకేతిక నైపుణ్యంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న వారిని యువత అంగీకరించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించడానికి ముందుకొస్తున్నారు. దీన్ని అగ్రవర్ణాల వారు భరించలేకపోతున్నారు’ అని వివరించారు. ఎన్నిసార్లు విన్నవించినా.. తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన పలువురు దళిత యువకులు ‘సాక్షి’కి చెప్పారు. ‘ఏంట్రా.. మీకు ఓట్లు కావాలా’ అని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన చంద్రబాబు సామాజికవర్గం వారు దారికాచి ఐదుగురిని చితకబాదారని వాపోయారు. తక్షణ అవసరాలకు బంగారం కుదువపెట్టి డబ్బు తెచ్చుకుంటే ఆ డబ్బు వైఎస్సార్సీపీ వారి వద్ద నుంచి తీసుకున్నారని కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చూడండి సార్.. మా బాబాయ్ ఆటో ఎలా ధ్వంసం చేశారో. ఆయన రోజుకు రూ. 1,000 సంపాదించుకునేవారు. తెల్లవారుజామున తిరుపతికి వెళ్లి షాపులకు చికెన్ వేసేవారు. ఆటో ధ్వంసం చేయడంతో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు’ అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉండాల్సిందే.. తిరుపతికి అత్యంత సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దౌర్జన్యాలను, కుల వివక్షను మేం కూడా అంగీకరించలేకపోతున్నాం. కొందరు అధికారుల తప్పిదాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. ఓటరు పోలింగ్ కేంద్రం లోపలకు రాగానే వారి వేళ్లపై సిరా పూసి స్లిప్పు ఇస్తారట. ఓటు మాత్రం ఎవరో వేస్తారట. సీసీ కెమెరాల పొజిషన్ కూడా మార్చేస్తారట. ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే పోలింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు. చివరకు ఇవన్నీ మా విభాగానికి చుట్టుకుంటాయి’ అని రామచంద్రాపురం మండలంలో పోలింగ్‌ను పర్యవేక్షించడానికి అమరావతి నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు. అందుకే సంబంధిత పోలింగ్ అధికారులపై మరింత కఠిన చర్యలు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు మొరపెట్టుకున్నా.. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు బ్రాహ్మణ కాలవను సందర్శించినప్పుడు గ్రామస్తులు వారి కాళ్లపై పడి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో తమ వాళ్లు కూడా అక్కడే ఉన్నారని గంగిరెడ్డిపల్లికు చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఏవీ బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. కమిషన్ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు పాతకందుల వారి పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన దళిత యువకుడికి టీడీపీ నాయకులు రూ.2 వేలు జరిమానా విధించారంటేæఅధికార పార్టీ దాష్టీకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. అయ్యో... దండం పెడతాం, మీరు గమ్ముగుండండయ్యా.. అయ్యా... మీకు దండం పెడతాం. మీరంతా గమ్ముగుండండయ్యా... నోళ్లు మూసుకోండి. ఎదురు మాట్లాడి ఎందుకయ్యా వాళ్ల చేతుల్లో పడి చచ్చిపోతారు.. అని ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళలు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆ పొరుగూరోళ్లతో (సాక్షి ప్రతినిధులని వాళ్లకు తెలియదు) మాట్లాడవద్దంటూ వారించారు. ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతున్నా... పోలీసులు అక్కడే వారి సమీపంలో ఉన్నప్పటికీ దళితుల మాటల్లో వణుకు, కళ్లలో దైన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘ఎందుకమ్మా మీరు అలా భయపడుతున్నారని’ అడగ్గా.. ‘ఏందోనయ్యా, మా ఖర్మ ఇంతే. పిల్లోళ్లు ఓట్లు వేస్తామన్నారట. అంతేనయ్యా దోవలో వస్తున్న వారిని పట్టుకుని కొట్టేశారు. మీరైనా, పోలీసోళ్లు అయినా మాకాడ ఎన్నాళ్లు ఉంటారు. పోలీసోళ్లు ఉన్నన్ని రోజులు మా జోలికి రాకపోవచ్చు. ఆ తరువాత ఏమవుతుందో మాకు తెలుసయ్యా. అందుకే ఏం మాట్లాడవద్దని మా వాళ్లను బతిమలాడుకుంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధ మహిళలు. పునరావృతం కాకుండా చూడాలి ఇకనైనా అధికారులు తప్పులు జరగకుండా చూడాలి. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాల గురించి కూడా ఆయనే వెల్లడించాలి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే ఆగడాలు వారికి అలవాటే.. దళితులపై ఆగడాలు చేయడం వారికి అలవాటే. జిల్లాలోని చాలాచోట్ల ఓ సామాజికవర్గం వారికి దళితుల పట్ల చిన్నచూపు ఉంది. ఎందుకంటే దళితులు తమ ఆర్థిక అవసరాలకు ఆ సామాజికవర్గంలోని ధనిక రైతులపై ఆధారపడుతుంటారు. పశువులు మేపుకోవాలన్నా, గడ్డి తెచ్చుకోవాలన్నా, కట్టెలు కొట్టుకోవాలన్నా, పొలాల్లో నడవాలన్నా వారికి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తారు.. బెదిరిస్తారు.. దాడులు చేస్తారు. అయినా సరే నమ్మకం కుదరదు. అందుకని పోలింగ్ కేంద్రం వద్దకు కూడా దళితులను రానివ్వరు. ఈ పరిస్థితులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. – సుబ్రమణ్యం, కేవీపీఎస్, రాష్ట్ర అధ్యక్షులు -
చంద్రగిరిలో రీపోలింగ్ కారకులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కారణమైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లోన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల (ఏపీవో)ను సస్పెండ్ చేస్తూ తక్షణం వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులను గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన తప్పులు, ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నది ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది. ఎన్.ఆర్. కమ్మల్లి(321): చాలా మంది ఓటర్లకు సాయంగా ప్రైవేటు వ్యక్తులు రావడమే కాకుండా ఓటింగ్ కంపార్టమెంట్ వద్ద ఓటు వేసేటప్పుడు కూడా ఉన్నారు. ఇది ఓటు రహస్యం అనే నిబంధనను ఉల్లంఘించడమే. అదే విధంగా నలుగురైదుగురు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఐడీ కార్డులు లేకుండా స్వేచ్ఛగా తిరగడం కనిపించింది. మరికొంత మంది ఓటర్లకు సహాయకులుగా వచ్చిన వారు ఓటరు బదులు వారే ఓట్లు వేశారు. కొన్ని చోట్ల ఓటరు లేకుండానే మరో వ్యక్తి ఓటు వేయడం జరిగింది. దీనిపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రైవేటు వ్యక్తులు, పోలింగ్ ఏజెంట్లు వాగ్వివాదానికి దిగడమే కాకుండా బెదిరింపులకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లను కూడా యధేచ్చగా వినియోగించారు. పుల్లివర్తిపల్లి(104): మధ్యాహ్నం 2.24 నిమిషాలకు రెండు ఓటింగ్ కంపార్టమెంట్ల వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిలబడి ఓటరు బదులు వారే ఓట్లు వేయడం జరిగింది. ఇలా ఓటింగ్ ముగిసే వరకు ఓటర్ల బదులు వారే ఓట్లు వేశారు. కొత్తకండ్రిగ(316): మధ్యాహ్నం 12.25 – 1.25 మధ్య సమయంలో పోలింగ్ కేంద్రంలో వ్యక్తుల మధ్య పరస్పర వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ ఏజెంట్లుగా కనిపిస్తున్న వారు ఓటరుతో పాటు కంపార్టమెంటు వరకు వెళ్లి ఓటరు బదులు వారే ఓటు వేశారు. పోలింగ్ ముగిసే వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది. కమ్మపల్లి(318): అసలు ఓటరు బదులు ఒకే వ్యక్తి ఓట్లు వేయడం జరిగింది. ఉదయం 8.50 నిమిషాల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి రావడం పోలింగ్ కేంద్రంలో ఉన్న వ్యక్తులతో వాడిగావేడిగా వాదనలు జరిగాయి. ఇక మధ్యాహ్నం 2.30 -
చిలుక జోస్యం కోసం ఖజానా లూటీ!
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడే తన గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌కు చెందిన బినామీ కాంట్రాక్టు సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన పనులు అప్పగించిన చంద్రబాబు, పనిలో పనిగా ఖజానా నుంచి రూ.124 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇప్పించేశారు. ఆ సొమ్ముతో పోలింగ్ పూర్తయిన తర్వాత తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో లగడపాటి ఫ్లాష్ సర్వే చేయించి.. ఆ ఫలితాలనే 175 నియోజకవర్గాలకు వర్తింపజేశారు. తరువాత చంద్రబాబు తన పలుకులనే పెంపుడు చిలుకతో శనివారం వల్లింపజేశారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో రీ పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికే చిలుకతో ముందు కూయించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కళ్లెదుట ఓటమి సాక్షాత్కరిస్తున్న వేళ.. ఆదివారం మరో అడుగు ముందుకేసి చిలుకతో అశాస్త్రీయమైన సర్వే లెక్కలను వల్లింపజేసి.. కౌంటింగ్ వరకూ టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు. చివరకు టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని వక్రీకరించి.. కౌంటింగ్ రోజున ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే కుట్రలకు చంద్రబాబు పదును పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కుట్రలకు ప్రభుత్వ ఖజానా నుంచే నిధులను దోచిపెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖజానా నుంచే సర్దుబాటు ఎన్నికల్లో ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి లగడపాటి రాజగోపాల్‌తో సర్వేలు చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సర్దుబాటు చేయడానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకుండానే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్), యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్), హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఉజ్జాయింపు అంచనాల ఆధారంగా రూ.1,182.33 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయేలా చక్రం తిప్పారు. లగడపాటి బినామీకి చెందిన పవర్ మ్యాక్స్–ష్యూ (జేవీ) సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన ఆ పనులు దక్కేలా చేశారు. జాయింట్ వెంచర్(జేవీ)లో ప్రధాన వాటాదారు అయిన పవర్ మ్యాక్స్‌కు సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఎత్తిపోతల పనులు చేసిన అనుభవం లేదు. అందులో భాగస్వామి అయిన ష్యూ సంస్థ కూడా పనులు చేసిన అనుభవంపై ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్స్‌ను షెడ్యూల్‌కు జత చేయలేదు. దీన్నే ఎత్తిచూపుతూ అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చిన కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) మార్చి 1న ఆ టెండర్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్లను సమర్పించడానికి మార్చి 7 వరకూ లగడపాటి బినామీ సంస్థకు గడువు ఇచ్చారు. మార్చి 7న రెండు దఫాలుగా సీవోటీ సమావేశాలు నిర్వహించినా.. ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆ సంస్థ విఫలమైనట్టు సీవోటీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే సదరు సంస్థకు పనులు కట్టబెడుతూ సీవోటీ టెండర్‌ను ఆమోదించింది. ఈ పనులను ఆ సంస్థకు అప్పగిస్తూ ఈనెల 8న కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నట్టుగా ఆగమేఘాలపై పత్రాలు తయారు చేసేలా జలవనరుల శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆ కాంట్రాక్ట్ ఒప్పందం ఆధారంగా అంచనా వ్యయంలో 10 శాతం అంటే రూ.124.08 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద లగడపాటి బినామీ సంస్థకు చెల్లించేలా చక్రం తిప్పారు. ఈ డబ్బుతోనే ఎన్నికల్లో పలు సర్వేలు నిర్వహించిన లగడపాటి.. వాస్తవాలను చంద్రబాబు చెవిలో వేశారు. ఓటమి ఖాయమని తేలడంతో.. పోలింగ్ ముగిసీ ముగియక ముందే ఈవీఎంలపై ఆ నెపాన్ని నెట్టే రీతిలో చంద్రబాబు పల్లవి అందుకున్నారు. కౌంటింగ్ వరకు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోసి.. కౌంటింగ్ రోజున టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే భావనను బలపరిచేలా చేసి.. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి లగడపాటితో ఆదివారం అశాస్త్రీయమైన సర్వే ఫలితాల పేరుతో తన పలుకులను పలికించారు. ఇదే అదునుగా తీసుకున్న లగడపాటి బెట్టింగ్ రాయుళ్లతో కుమ్మక్కై.. అశాస్త్రీయమైన సర్వే ద్వారా చంద్రబాబు పలుకులను వల్లె వేశారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి, తిరుపతి/తిరుపతి మంగళం/సాక్షి, అమరావతి: అక్కడ దళితులు తమ ఓటు హక్కును పాతికేళ్ల తర్వాత వినియోగించుకున్నారు. ఈవీఎంలు అంటే ఏమిటో తెలియని వారు ఆదివారం జరిగిన రీ పోలింగ్‌లో తమకు ఇష్టమొచ్చిన వారికి ఓటు వేసి ఎంతో పరవశించిపోయారు. అనంతరం పోలీసులు వారిని బందోబస్తు మధ్య ఇళ్లకు చేర్చారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి దొరికిపోయారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ బూత్‌లలో ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తి వారి పల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లటంతో సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కాలేపల్లి, కుప్పం బాదూరులో కూడా రీపోలింగ్ నిర్వహించింది. చెవిరెడ్డి పోరాటం ఫలితంగా.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటం కారణంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే దళితులు, గిరిజనులు ఓటు వేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఊరుకు దూరంగా ఉన్న వీరందరినీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు పోలీసులు రక్షణ కల్పించారు. తిరిగి వారు ఇళ్లకు చేరుకునేందుకు కూడా రక్షణగా నిలిచారు. అనంతరం వారంతా ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. ‘మాకు తెలిసి ఓటు వేసింది లేదు. ఎప్పుడు వెళ్లినా.. వేలుపై చుక్కపెట్టి పంపేస్తారు. వారే ఓట్లు గుద్దుకునే వారు. ఓటు ఎలా వెయ్యాలో తెలీదు. ఇన్నేళ్ల తరువాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉంది’ అని ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళా ఓటర్లు చెప్పారు. కాగా, వీరికి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచెయ్యాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అనేకమంది అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చారు. ఆ తరువాత గత నెల 11న ఎన్నికల సమయంలో దళిత, గిరిజనులను పోలింగ్ కేంద్రానికి రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం, రిగ్గింగ్ చేసుకోవటంతో చెవిరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఎన్నికల సంఘం స్పందించి రీపోలింగ్‌కు ఆదేశాలు జారీచేసింది. బెదిరింపులు.. ప్రలోభాలు కాగా, చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో రీపోలింగ్ జరుగుతున్న కమ్మపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మునిచంద్రనాయుడు ఆదివారం ఓ వృద్ధురాలి ఓటు వేసేందుకు యత్నించారు. కలెక్టర్ ఆదేశాలతో గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదే పోలింగ్ కేంద్రం వద్ద మరో టీడీపీ నేత జయచంద్రనాయుడు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే.. రిగ్గింగ్‌కు అవకాశం ఉండదని గ్రహించిన టీడీపీ శ్రేణులు కమ్మపల్లి, వెంకట్రామాపురం దళితుల చేత ప్రమాణాలు చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మెజారిటీ తగ్గితే ఎవ్వరూ తిరగలేరని హెచ్చరించారు. ఏడుచోట్లా భారీ భద్రత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఏడు రీపోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించారు. అదే విధంగా డీఐజీ క్రాంతిరాణా టాట పర్యవేక్షణలో ప్రతి కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. అలాగే, ప్రతీచోటా 250 మంది రిజర్వుడు, ఏపీఎస్పీ, పోలీసులతో భద్రతా ఏర్పాట్లుచేశారు. అభ్యర్థుల కదలికలపై కూడా నిఘా ఉంచారు. మరోవైపు.. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, చంద్రగిరి ఆర్వో మహేష్‌కుమార్ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షించారు. మొత్తంగా రీ పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. 89.29 శాతం పోలింగ్ ఇదిలా ఉంటే.. గత నెలలో జరిగిన పోలింగ్ శాతంతో పోల్చితే ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో పోలింగ్ శాతం తగ్గింది. ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 5,451 మంది ఓటర్లు ఉంటే.. గత నెలలో 4,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన రీ పోలింగ్ సందర్భంగా 4,867 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన 1.13 శాతం ఓటింగ్ తగ్గింది. ఎండ తీవ్రంగా ఉన్నా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. దళితులు ఎంతో సంతోషించారు : పెద్దిరెడ్డి రీపోలింగ్ జరుగుతున్న వెంకట్రామాపురం పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీ పోలింగ్ సందర్భంగా ఎన్.ఆర్ కమ్మపల్లిలో దళితులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవటం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ప్రతి ఎన్నికల్లో వారి ఓట్లను రిగ్గింగ్ చేసేవారన్నారు. భారీ బందోబస్తు మధ్య తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తంచేశారని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో 120–130 స్థానాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను కొట్టిపారేశారు. బెట్టింగ్స్ కోసమే ఆయన సర్వేలని చెప్పారు. దళితులు స్వేచ్ఛగా ఓటు వేశారు : చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు పంచాయితీలో రీపోలింగ్ ద్వారా దళితులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రీపోలింగ్ నిర్వహించిన సరళిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్ళకు వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కుతో వారి కళ్ళల్లో ఆనందం చూశానన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓటువేశారన్నారు. రీపోలింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడంలేదని చెవిరెడ్డి చెప్పారు. ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునేవాళ్లు.. ఎన్నికలు వచ్చాయంటే లైన్లో రావటం.. వేలిపై సిరా వేసుకోవటం వరకే మాకు తెలుసు. వేలిపై సిరా గుర్తు వేసుకోగానే మీ ఓటు వేసేశాం వెళ్లిపోండి అనేవారు. ఓటింగ్ అంటే అంతే అనుకునే వాళ్లం. ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునే వారు. గుర్తులపై ముద్ర వేయటం, నొక్కితే గుర్తుల వద్ద లైటు వెలగటం అనేవి మాకు తెలీదు. రీపోలింగ్ పుణ్యామా అని మా ఓటు మేం వేసుకున్నాం. – దేశమ్మ, ఎన్.ఆర్ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం బతికుండగా నా ఓటు నేను వేస్తాననుకోలేదు ఎన్నికల్లో మా ఓటు మేం వేసుకున్నదే లేదు. ఎవరో మా ఓటు వేసుకునే వారు. అడిగే ధైర్యం కూడా లేదు. నా ఓటు నేను వేసుకోకుండానే చచ్చిపోతాననుకున్నా. కానీ, మా బాధను అర్థం చేసుకున్న మహానుభావుడు రీపోలింగ్ పెట్టించాడు. అధికారులు, పోలీసులు ధైర్యం చెప్పారు. దీంతో స్వేచ్ఛగా నచ్చిన పార్టీకి ఓటు వేసుకున్నాం. – మంగమ్మ, ఎన్.ఆర్ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం రీపోలింగ్ ప్రశాంతం : ద్వివేది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం జరిగిన రీ–పోలింగ్ స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో ఓట్లు వేయని దళితులు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఆదివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా రీ–పోలింగ్‌లో ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంటుందని, కానీ.. ఇక్కడ అలా జరగలేదన్నారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 90.42 శాతం ఓటింగ్ నమోదైతే.. ఆదివారం 1.13 శాతం తగ్గి 89.29 శాతం నమోదయ్యిందన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్ నిర్వహణ సక్రమంగానే జరిగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో రిగ్గింగ్‌కు అవకాశం లేకుండాపోయింది. రీపోలింగ్ జరిగిన 7 పోలింగ్ బూత్‌ల్లో 89.29 శాతం ఓటింగ్ జరిగింది. ఏప్రిల్ 11న జరిగిన ఓటింగ్ కంటే ఈ సారి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఏప్రిల్ 11న ఈ పోలింగ్ బూత్‌లలో 90.42 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23 న వెలువడనున్న సంగతి తెల్సిందే. -
కమ్మపల్లిలో టీడీపీ నేత జయచంద్రనాయుడు దౌర్జన్యం
-
బెట్టింగ్స్ కోసమే ఆయన సర్వేలు
-
నేడే రీపోలింగ్
-
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన రీపోలింగ్
-
చంద్రగిరి రీపోలింగ్: దొంగ ఓటు వేయటానికి వ్యక్తి యత్నం
సాక్షి, చిత్తూరు : ఎన్ఆర్ కమ్మపల్లిలో యుగంధర్ అనే వ్యక్తి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించాడు. ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చంద్రగిరిలో రీపోలింగ్ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ ఓటింగ్ శాతం అమాంతం పెరుగుతోంది. ఐదు గంటల సమయానికి పోలింగ్ బూత్‌ల వారీగా నమోదైన పోలింగ్ శాతం పులివర్తివారిపల్లి: 91.68 శాతం కాలేపల్లి : 94.14 వెంకటరామాపురం: 89.66 కొత్త కండ్రిగ 81.84 కమ్మపల్లి: 71.21 ఎన్ఆర్ కమ్మపల్లి: 87.54 కుప్పం బాదూర్: 89.01 చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు అవకాశముంది. మధ్యాహ్నాం 4 గంటల వరకు 77.13 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు కాలేపల్లి: 77.55 శాతం కమ్మపల్లి: 54.96 పులవర్తివారి పల్లి: 70.81 కుప్పం బాదురు: 67.02 ఎన్ఆర్ కమ్మపల్లి: 72.49 కొత్త కండ్రిగ: 61.86 వెంకటరామాపురం: 86.21 చంద్రగిరిలో పటిష్ట బందోబస్తు మధ్య రీపోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నాం 3 గంటల వరకు 67.55 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు: 1) 321- ఎస్ఆర్ కమ్మపల్లి మొత్తం ఓట్లు: 698 పోల్ అయిన ఓట్లు: 506 పోలింగ్ శాతం: 72.49 2) 104- పులివర్తిపల్లి మొత్తం ఓట్లు: 805 పోల్ అయిన ఓట్లు: 570 పోలింగ్ శాతం: 70.81 3) 316- కొత్త కండ్రిగ మొత్తం ఓట్లు: 991 పోల్ అయిన ఓట్లు: 613 పోలింగ్ శాతం: 61.86 4) 318- కమ్మపల్లి మొత్తం ఓట్లు: 1028 పోల్ అయిన ఓట్లు: 565 పోలింగ్ శాతం: 54.96 5) 313- వెంకట్రామాపురం మొత్తం ఓట్లు: 377 పోల్ అయిన ఓట్లు: 325 పోలింగ్ శాతం: 86.21 6) 310- కాలేపల్లి మొత్తం ఓట్లు: 597 పోల్ అయిన ఓట్లు: 463 పోలింగ్ శాతం: 77.55 1) కుప్పంబాధర్ మొత్తం ఓట్లు: 955 పోల్ అయిన ఓట్లు: 640 పోలింగ్ శాతం: 67.02 చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగిన పోలింగ్‌లో వెంకట రామాపురం ముందంజలో ఉంది. పులివర్తివారిపల్లి: 55.03 కాలేపల్లి: 57.45 వెంకట రామాపురం: 79.58 కొత్తకండ్రిక: 45.61 కమ్మపల్లి: 38.42 ఎన్ఆర్ కమ్మపల్లి: 52.87 కుప్పం బాదర్: 51.40 రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో ఆదివారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు వినోద్ జుక్షి భేటీ అయ్యారు. ద్వివేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రీపోలింగ్ సరళిని వివరించారు. అలాగే ఈ నెల 23న కౌంటింగ్ ఏర్పాట్లుపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల వరకూ 31.92 శాతం పోలింగ్ చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెంకట రామాపురంలో అత్యధికంగా పోలింగ్ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకూ నమోదు అయిన పోలింగ్ శాతం.. ఎన్ ఆర్ కమ్మపల్లి మొత్తం ఓట్లు: 698 ఇప్పటి వరకు పోల్ అయిన ఓట్లు: 239 పోలింగ్ శాతం: 34.24 పుల్లివర్తివారిపల్లి మొత్తం ఓట్ల: 805 పోల్ అయిన ఓట్లు: 266 పోలింగ్ శాతం : 33.04 కొత్త కండ్రిగ మొత్తం ఓట్లు: 991 పోల్ అయిన ఓట్లు: 259 పోలింగ్ శాతం:26.14 కమ్మపల్లి మొత్తం ఓట్లు: 1028 పోల్ అయిన ఓట్లు: 237 పోలింగ్ శాతం: 23.05 వెంకట రామాపురం మొత్తం ఓట్లు: 377 పోల్ అయిన ఓట్లు: 195 పోలింగ్ శాతం: 51.72 కాలేపల్లి మొత్తం ఓట్లు: 597 పోల్ అయిన ఓట్లు:214 పోలింగ్ శాతం: 35.85 కుప్పం బాదూరు మొత్తం ఓట్లు: 955 పోల్ అయిన ఓట్లు: 330 పోలింగ్ శాతం: 34.55 టీడీపీ నేత దౌర్జన్యం.. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతున్న కమ్మపల్లి పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జయచంద్ర నాయుడు ఆదివారం ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ... జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీపోలింగ్ జరుగుతున్న ఏడు ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల ద్వారా అధికారులు సమీక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుంది.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రీ పోలింగ్ జరుగుతున్న వెంకట్రామపురం పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం ఉదయం పరిశీలించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు, మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు. ఇక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బెట్టింగ్స్ కోసమే ఆయన సర్వేలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి... ఈ ఎన్నికల్లో ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నారు.’ అని అన్నారు. కాగా రీ పోలింగ్ సందర్భంగా ఎన్ఆర్ కమ్మపల్లిలో దళితులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎన్నికల్లో తమ ఓట్లను రిగ్గింగ్ చేసేవారని, బందోబస్తు మధ్య తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: బెట్టింగ్స్ కోసమే ఆయన సర్వేలు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్ మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజక వర్గంలోని సి కాలేపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించారు. కాగా సాయంత్రం 6 గంటలకు రీపోలింగ్ ముగియనుంది. పాకాల మండలంలోని పులివర్తిపల్లి, కుప్పంబాదులో, రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతోంది. 7 పోలింగ్ కేంద్రాల్లోని మొత్తం 5451మంది ఓటర్లు తమ ఓటువేయనున్నారు. వీరిలో పురుషులు 2638 మంది, మహిళలు 2813 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తివారిపల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలింగ్ కేంద్రాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఈసీ అక్కడ రీ పోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు కాలేపల్లి, కుప్పం బాదూరు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో కూడా రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీ పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కడ ఎంతమంది..! గ్రామం/పోలింగ్ కేంద్రం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఎన్ఆర్ కమ్మపల్లి 698 336 362 పులివర్తిపల్లి 805 391 414 కొత్తకండ్రిగ 991 482 509 కమ్మపల్లి 1028 490 538 వెంకట్రామపురం 377 179 198 కాలేపల్లి 597 295 302 కుప్పంబాదూరు 955 465 490 సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీడీపీ అభ్యర్థిని అడ్డుకున్న మహిళలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి చేదు అనుభవం ఎదురైంది. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు గ్రామంలో ఓట్లు అభ్యర్థించడానికి వెళ్లిన నానిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. రేపే పోలింగ్ జరుగుతున్నా.. ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికుల నుంచి నాని తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించినా టీడీపీ అభ్యర్థి వాటిని ఖేతారుచేసి ప్రచారాకి వెళ్లారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం కాలురు, కుప్పం బాదురుల కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగనుంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రగిరిలో టీడీపీ ప్రలోభాలు -
చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యాలు
చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే ప్రాంతాల్లో టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతోన్నాయి. దళితులు టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే అపనమ్మకంతో రేపు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున ప్రత్యేక బస్సులను కూడా టీడీపీ నేతలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రేపు ఓటింగ్ ప్రారంభం కాకముందే గ్రామాల నుంచి దళితులను బలవంతంగా తరలించేందుకు టీడీపీ సన్నాహాలు మొదలు పెట్టింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రగిరిలో కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు -
చంద్రగిరిలో కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు
-
చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల రీపోలింగ్
-
ఐదు కాదు ఏడు చోట్ల రీపోలింగ్
సాక్షి, తిరుపతి : చిత్తురు జిల్లా చంద్రగిరిలో నియోజకవర్గ పరిధిలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని జిల్లా ఎన్నికల సంఘం అధికారి ప్రద్యుమ్న తెలిపారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 5 పోలింగ్ కేంద్రాలతో(ఎన్ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం) పాటు కొత్తగా ప్రకటించిన కాలురు, కుప్పం బాదురుల కేంద్రాలలో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ ప్రద్యుమ్న చెప్పారు. చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల నిర్వహించే రీపోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 250 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రీపోలింగ్‌కు కేంద్రాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల రీపోలింగ్ -
తిరుపతి: ఎన్నికల విధుల్లో జాగ్రత్త
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పొరబాట్ల వల్లే రీపోలింగ్‌కు ఆస్కారం ఏర్పడిందని జిల్లా ఎన్నికల అధికారి పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్ అధికారులు, సిబ్బందికి స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రీపోలింగ్‌లో తప్పిదాలకు ఆస్కారం లేకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. తప్పు జరిగితే ఎన్నికల కమిషన్ ఉపేక్షించదన్నారు. ఈవీఎంల సీరియల్ నంబర్లు సరిచూసుకోవడం, మాక్‌పోలింగ్, అనంతరం క్లియర్ చేయడం, భద్రపరిచే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీపోలింగ్ కేంద్రంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. స్థానిక పోలింగ్ కేంద్రంలోని ఓటర్లను మాత్రమే ఏజెంట్లుగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన పీఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఆర్ఓ డాక్టర్ మహేష్‌కుమార్, ఏఆర్ఓ హరికుమార్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ’
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రగిరిలో 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ అంటేనే ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ అని ట్విటర్లో ధ్వజమెత్తారు. 'ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆపార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగ వెర్రులెందుకు? పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా? చంద్రబాబు ఆయన కుల మీడియా పార్టనర్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే నమ్మిన వాళ్లను తడిగుడ్డతో గొంతులు కోయడంలో వాళ్ళ నైపుణ్యం ఏమిటో తెలిసిపోతోంది. గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుంది. బయట పడకపోతే తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా చెరబట్టే వారే' అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.