rowdyism
-
ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.పట్టించుకుంటే ఒట్టునియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్‌గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
పాత కేసులు తవ్వి తీస్తున్నారు.. ఏపీలో పచ్చ పైశాచికం..
-
రెచ్చిపోతున్న టీడీపీ గుండాలు.. మొద్దు నిద్రలో బాబు సర్కారు
-
కలెక్టర్ అయితే గొప్పా.. మార్కాపురం సబ్ కలెక్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
-
అర్ధరాత్రి రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు
-
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
-
టీడీపీ రౌడీయిజంపై.. వైఎస్సార్సీపీ లీగల్ యాక్షన్
-
మోడీ వచ్చారు ఏం చెప్పారు ?.. టీడీపీ రౌడీయిజం ఆగుతుందా ?
-
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు
-
చింతమనేని గూండాగిరి
-
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
అర్ధరాత్రి టీడీపీ విధ్వంసం..
-
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
రెచ్చిపోయిన పచ్చమూక
టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది. కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు. బడా నాయకుల డైరక్షన్లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్‌కుమార్ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు. డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపైకి దూసుకొచ్చారు. పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్‌కుమార్ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ పచ్చబ్యాచ్ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా, ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య విరుద్ధం వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. -
లోకేష్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ?
-
రెచ్చిపోయిన సీఎం రమేష్...ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్లో బెదిరించిన ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు. ఆర్అండ్బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. -
Kalyandurg: టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం చెలాయించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ- వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. -
MRO పై టీడీపీ నేత రౌడీయిజం
-
దాదాగిరికి తెర లేపిన వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి
-
బీటెక్ రవి తగాదాలు సృష్టిస్తున్నాడు : శ్రీధర్ రెడ్డి
-
జనసేన నేత గుండాయిజం భూకబ్జాలు, దాదాగిరి..
-
చంద్రబాబు సమక్షంలోనే పచ్చమూకల దాడులు
-
కుప్పం సాక్షిగా బాబు రౌడీ రాజకీయం