Ruia hospital
-
అసలు దోషులను తప్పిస్తున్నారు..
-
తిరుపతి రుయా హాస్పిటల్లో సమస్యల తిష్ట
-
అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు బలి
-
ప్రబలిన డయేరియా
-
తిరుపతి రుయా ఆసుపత్రిలో విషాదం
-
రూయా చిన్న పిల్లల ఆసుపత్రి.. భేష్
సాక్షి, తిరుపతి: రూయా చిన్నపిల్లల ఆసుపత్రిని జాతీయ బాలల హక్కుల కమిషన్(NCPCR) సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అక్కడి సేవలు, సిబ్బంది పని తీరుపై అభినందనలు గుప్పించారు. శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్జీ ఆనంద్. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారాయన. ఈ సందర్భంగా.. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం, అక్కడి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని.. సంబంధిత విభాగపు హెచ్‌వోడి డా. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ఆర్సీ లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ఆర్సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్.. ఇద్దరూ వైద్య ఆరోగ్యానికి, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారాయన. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు. తనిఖీ సందర్భంగా ఆయన వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
రుయాలో అడుగడుగునా నిర్లక్ష్యం
ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప రుయా ఆస్పత్రి అధికారుల తీరు మారడంలేదు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు మెరుగైన చికిత్స కరువైంది. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మందలించినా ప్రయోజనం లేదు. తిరుపతి తుడా: రాయలసీమ పెద్దాస్పత్రిగా తిరుపతి రుయా పేరుపొందింది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వైద్య పరికరాల కోసం నాడు–నేడు ద్వారా రూ.450 కోట్లు కేటాయించింది. వైద్యుల పదోన్నతులు, బదిలీలను చేపట్టింది. వైద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ యజమానుల తీరు పై ఓ అ«ధికారిని సస్పెండ్ చేశారు. మరో ఉన్నతాధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఆస్పత్రిలో పర్యటించి లోటుపాట్లపై కన్నెర్ర చేశారు. అత్యవసర విభాగం నిర్వహణ లోపంపై మండిపడ్డారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినా అధికారుల తీరు మారలేదు. రుయా ఆస్పత్రి వర్కింగ్ కమిటీ సభ్యుడు బండ్ల చంద్రశేఖర్ రాయల్ గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో పర్యటించారు. నైట్ డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడంపై ఆరా తీశారు. వార్డుల్లో రోగు లను ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు స్ట్రెక్చర్లపై తీసుకెళ్లడంలోను నిర్లక్ష్యాన్ని గుర్తించారు. సహాయకులే రోగులను మరో వార్డుకు, వైద్య పరీక్షలకు తీసుకెళుతుండడం ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆస్పత్రి పర్యవేక్షణాధికారి నిర్వాకంవల్లే.. ఆస్పత్రి పర్యవేక్షనాధికారి ఎవరి అధికారాలను వారికి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు నెలకొంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులకు డ్యూటీలు కేటాయించడం, వైద్య సిబ్బందితో విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని రుయాలో పాలనను గాడినపెట్టి రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు -
తిరుపతి రుయా అంబులెన్స్ దందాపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా అంబులెన్స్ దందాపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సీఎస్‌ఆర్‌ఎంవో సరస్వతీ దేవిని ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. రుయా సూపరిండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో వైపు అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆర్డీఓ, డీఎంహెచ్‌వో, డీఎస్పీ బృందంతో కమిటీ వేసింది. అంబులెన్స్ అడ్డుకున్న నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా.. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా బయటి అంబులెన్స్‌లను మరో మాఫియా రానివ్వడంలేదు. సిండికేట్‌గా మారి డెడ్‌బాడీ తరలించకుండా మాఫియా అడ్డుకుంది. ఈ ఘటన మొత్తాన్ని ప్రైవేట్ అంబులెన్స్‌కు చెందిన నందకిషోర్ వీడియో తీశాడు. ప్రైవేట్ అంబులెన్స్‌ల ఆగడాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే వీడియో తీశానని తెలిపాడు. తక్కువ ధరకు అంబులెన్స్ సర్వీసు ఇస్తున్నా.. తమను రాన్విడం లేదని మండిపడుతున్నాడు. తమకు 10 అంబులెన్స్‌లు ఉన్నాయి. మా అంబులెన్స్‌లను ఆసుపత్రి లోపలకి రానివ్వడంలేదని ఆయన అన్నారు. మృతదేహాన్ని తరలించాలంటే రూ.20వేలు డిమాండ్ చేస్తున్నారని, వీళ్ల ఆగడాలు తెలియాలనే వీడియో తీశానన్నాడు. ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేదన్నారు. దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని నంద కిషోర్ మండిపడ్డాడు. -
రుయా ఆసుపత్రి ఘటనపై స్పందించిన మంత్రి రజిని
సాక్షి, గుంటూరు: తిరుపతిలోని రూయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? ఆస్పత్రి సిబ్బందే బెదిరింపులకు పాల్పడ్డారా.. అనే కోణంలో విచారణ చేపట్టాలని ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా.. మహాప్రస్థానం అంబులెన్స్‌లు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రీపెయిడ్ ట్యాక్సుల విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాలను వీలైనంత వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. -
తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా..
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్‌గా మారిన అంబులెన్స్ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వార్త కూడా చదవండి: AP: రేపే టెన్త్ పరీక్షలు -
తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని నేవీ అధికారులు పరిశీలించారు. ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందిన నేపథ్యంలో మరో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్ వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు. చదవండి: ‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి YS Jagan: ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం.. -
తిరుపతి రుయా ఘటనపై కలెక్టర్ విచారణ
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయారని కలెక్టర్ తెలిపారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు. సకాలంలో ఆక్సిజన్ అందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. రుయాలో వెయ్యి మందికి చికిత్స జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. తిరుపతి రుయా ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి తిరుపతి రుయా ఘటనపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి 11 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ ను వెంటనే పునరుద్ధరించి వందల మంది ప్రాణాలు కాపాడిన వైద్యులకు, సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి తిరుపతి రుయా ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి రాలేదని.. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి, అందరికి అవసరమైన ఆక్సిజన్ అందలేదని ఆమె వివరించారు. ప్రత్యామ్నాయంగా బల్క్ సిలిండర్లు ఏర్పాటు చేశామని డాక్టర్ భారతి తెలిపారు. చదవండి: ‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి -
తిరుపతి రుయా ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
-
‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/గుంటూరు రూరల్/అమరావతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించి వందలాది మంది ప్రాణాలను నిలబెట్టగలిగారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ బాధితుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతో.. చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ 20 నిమిషాలు ఆలస్యం కావడంతో సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. వచ్చిన ట్యాంకర్‌ను అమర్చే సమయంలో ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులు ఆ ఐదు నిమిషాలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రుయా ఆస్పత్రి అధికారులు, ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ హరినారాయణన్, కమిషనర్ గిరీష, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, మేయర్ శిరీష, జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనక నరసారెడ్డి, ఇతర అధికారులు హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తెచ్చారు. రుయా ఆస్పత్రిలో ప్రభుత్వం 135 ఐసీయూ బెడ్లు, 573 ఆక్సిజన్, 319 సాధారణ బెడ్లను ఏర్పాడు చేసి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోంది. ప్రైవేటు దోపిడీ సమయంలో ప్రభుత్వ వైద్యులు ప్రాణాలకు తెగించి వేలాది మందికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రుయాలో 1,027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధాకరమైన ఘటన.. ఆందోళన చెందొద్దు రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన చాలా బాధాకరం. వెంటనే అధికారులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రాణాలను నిలబెట్టేందుకు 30 మంది వైద్యులు చర్యలు చేపట్టారు. ఐదు నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐసీయూలో ఉన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందారు. చెన్నై నుంచి ఆక్సిజన్ రావడంలో ఆలస్యమే ఈ పరిస్థితికి కారణం. ఆక్సిజన్ ప్లాంట్లలో ప్రెజర్ తగ్గడం వల్ల ఐసీయూలోకి సరఫరా ఆందలేదు. ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీఎంకు నివేదిక ఇస్తాం. ఈ ఘటనకు కారకులు ఎవరైనా ఉన్నట్టు తేలితే చర్యలు తప్పవు. – హరినారాయణన్, కలెక్టర్ ఎలాంటి సాంకేతిక సమస్య లేదు ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. కేవలం ట్యాంకర్ రావడం ఆలస్యమైంది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ గురుమూర్తి, ఎంపీ, తిరుపతి చదవండి: సెకండ్ వేవ్ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి.. చదవండి: రేపు కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్ -
పైసా ఖర్చులేకుండానే కోవిడ్ రోగులకు వైద్యం
-
ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో భూమన కరుణాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
వరండాలోనే స్నానం.. మిద్దెపై నివాసం
సాక్షి, చిత్తూరు: యుద్ధ క్షేత్రంలో వెన్నుచూపని సైనికుడు ఆయన. కుటుంబానికి అయిదు నెలలుగా దూరంగా ఉన్నా మనోధైర్యం ఏమాత్రం సడలకుండా శత్రువుతో పోరాడుతున్నారు. ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్న ఆ యోధుడు ఓ డాక్టర్. ఆయన పోరాటం చేస్తోంది కరోనా అనే కనిపించని శత్రువుపై. ఆ మహమ్మారి తననూ ఇబ్బంది పెట్టినా.. తట్టుకుని నిలబడి మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నారు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఈ.ఆర్.హరికృష్ణ. (కరోనా కాదంటూ రోదించినా... ) దైనందిన జీవితం మారిపోయిందిలా.. ♦ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూనే వరండాలోనే స్నానం ♦ ప్రత్యేకంగా మిద్దెపై ఏర్పాటు చేసుకున్న గదిలో నివాసం ♦ కుటుంబ సభ్యులు దూరంలో పెట్టిన భోజనాన్ని తెచ్చుకుని తినడం ♦ తిన్న తర్వాత గిన్నెలు తోమడం.. ఆ తర్వాత అటు నుంచి అటే ఆస్పత్రికి వెళ్లడం. కుటుంబానికి దూరం.. హరికృష్ణ భార్య మణికర్ణిక కూడా డాక్టర్. గైనకాలజిస్ట్‌గా ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. హరికృష్ణ తల్లిదండ్రులు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. 5 నెలల క్రితం వరకూ కుటుంబంతో ఉల్లాసంగా గడిపిన ఆయన ఇప్పుడు ముందు జాగ్రత్తగా వారందరికీ దూరంగా ఉంటున్నారు. (పిల్లలు మొబైల్ వదలడం లేదు..! ) కరోనా బాధితుడైనా.. ప్రస్తుతం ఈ యుద్ధంలో ఆయన కూడా ఓ బాధితుడిగా మారారు. గతనెలాఖరున ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాను విధులు నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లోనే అడ్మిట్ అయ్యారు. బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఆస్పత్రిలో సదుపాయాలన్నీ ఉండటంతో విధి నిర్వహణలో ఎలాంటి అసౌకర్యమూ లేదు. ఇంటి వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. 5 నెలలుగా పిల్లలతో గడపలేని పరిస్థితి. వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో కొంత భయపడినా దేవుడి దయతో కోలుకున్నాను. డిశ్చార్జి అయిన తర్వాత రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరవుతాను’’. – తిరుపతి తుడా -
రుయా ఘటనలో ముగ్గురు అరెస్ట్!
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రైవేట్ అంబులెన్స్ ఆగడాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కొంతమంది అంబులెన్స్ వాళ్లు వ్యవహరించిన తీరు దారణమని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. రుయా ఆసుపత్రికి ఏ అంబులెన్స్ అయినా రావొచ్చు అని, అడ్డుకునే హక్కు ఎవరికి లేదని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంబెలెన్స్ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ యూనియన్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రుయాలో బయటి అంబులెన్స్‌లకు అనుమతి ఉందన్న పోలీసులు ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) -
కరోనా అలర్ట్: హమ్మయ్య.. అతనికి వైరస్ లేదు
సాక్షి, తిరుపతి: రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తైవాన్‌కు చెందిన కరోనా అనుమానిత వ్యక్తికి వైరస్ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ రమణయ్య తెలిపారు. చెన్ షి షున్(35) రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పుణెకు పంపగా కరోనా నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇవాళ అతన్ని డిశ్చార్జి చేస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్ రమణయ్య పేర్కొన్నారు. కాగా, జలుబు, దగ్గుతో బాధపడుతున్న చెన్ షి షున్ను కోవిడ్-19 అనుమానిత వ్యక్తిగా రుయాలోని ప్రత్యేక వార్డులో చేర్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న అతడు తైవాన్ నుంచి పలు యంత్రాలను అమరరాజ గ్రూప్స్‌కు తీసుకు కొచ్చి వాటిని అమర్చే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి రెండు రోజులుగా జలుబు, దగ్గ తీవ్రతరం అయ్యాయి. వాటిని కోవిడ్ లక్షణాలుగా భావించి రుయాలో చేర్పించారు. చదవండి: కరోనా బ్రేకింగ్: గాంధీలో 8 మంది అనుమానితులు ఆకాశవీధిలో..నో టూర్స్ ఓ మై గాడ్..కోవిడ్ -
‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’
సాక్షి, తిరుపతి: రుయా ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండి పడ్డారు. సోమవారం రుయా ఆస్పత్రిని సందర్శించిన భూమన కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే.. మీరు ఎందుకు సహకరిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబీకుల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. నెల నెలా కోడెల కుటుంబీకుల బినామీలు రూ. 40 లక్షలు దోచుకుంటుంటే.. మీరేందుకు మౌనంగా ఉన్నారని ఆస్పత్రి యాజమాన్యం మీద మండి పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీ తీరు మారదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్‌ను ఎందుకు మూయించలేదని అధికారులను ప్రశ్నించారు. మీ చర్యల వల్ల మాకు కూడా వాటాలు అందుతున్నట్లు జనాల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. సాయంత్రం లోగా అక్రమ ల్యాబ్‌ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
ప్రైవేట్ మోజు..!
రుయా ఆస్పత్రిలో నిత్యం 20కి పైగా శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి.అందులో సర్జరీ విభాగంతో పాటు ఆర్థో విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. ఆస్పత్రిలో ఆర్థో వైద్యులు శస్త్ర చికిత్సలను నిర్వహించేందుకు అందుబాటులో ఉన్నా అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆర్ధో వైద్యులు విధిలేక ఆపరేషన్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఆపరేషన్ ఖరారు చేసిన తారీఖు కాకుండా వేరొక రోజు శస్త్ర చికిత్సలునిర్వహిస్తున్నారు. దీంతో రోగులు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. చిత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన నాగరాజుకు కుడికాలు యాంకిల్ జాయింట్ విరిగిపోయింది. గత నెల 22న రుయా ఆర్థో విభాగంలో సర్జరీ జరగాల్సి ఉంది. అయితే అనస్తీషియా వైద్యులకు సమయం సరిపోకపోవడంతో సర్జరీని వాయిదావేశారు. సర్జరీ అంటూ ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లిన రోగిని మళ్లీ వార్డుకు తీసుకొచ్చారు. ఆపరేషన్‌కు రోగి మానసికంగా సిద్ధమైన సమయంలో వాయిదా వేయడం వల్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తిరుపతి (అలిపిరి): రుయా ఆర్థో విభాగంలో శస్త్ర చికిత్సలు వాయిదాలు పడుతున్నాయి. అనస్తీషియా వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై దృష్టి సారించడంతో రుయాలో రోగులకు శస్త్ర చికిత్సల నిమిత్తం మత్తు మందు ఇవ్వడానికి సమయం సరిపోవడం లేదు. ఫలితంగా రోగిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స నిర్వహించకుండా తిరిగి వార్డుకు పంపుతున్నారు. దీంతో రోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనస్తీషియా వైద్యులు మధ్యాహ్నం 2 గంటలు దాటితో రుయాలో అందుబాటులో లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనస్తీషియా విభాగం పనితీరుపై రుయా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో నిరుపేద రోగుల అవస్థలు వర్ణనా తీతంగా మారాయి. అనస్తీషియన్ల డుమ్మా రుయా ఆస్పత్రి అనస్తీషియా విభాగంలో ప్రొఫెసర్లు ముగ్గురు. అసోసియేట్లు నలుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 12 మంది ఇలా మొత్తం 19 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించాలి. అయితే అనస్తీషియా వైద్యులు మధ్యాహ్నం 2 గంటలు దాటితే విధులకు డుమ్మా కొడుతున్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ రుయా ఆస్పత్రి అనస్తీషియా వైద్యుల్లో ఎక్కువమంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నవారే ఉన్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రులకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తుండడంతో నిరుపేదల ఆస్పత్రి రుయాకు సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రుయా ఆస్పత్రి వైద్యులు అంటే హై క్వాలిఫైడ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనిని ఆసరాగా చేసుకుని సొంత పనుల కోసం నిరుపేదల శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలంటే చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పట్టించుకోని ఉన్నతాధికారులు రుయా ఆస్పత్రి ఆర్థో విభాగంలో సర్జన్లు అందుబాటులో ఉన్నా అనస్తీషియన్లు సమయపాలన పాటించకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం శస్త్ర చికిత్సలు వాయిదా పడుతున్నా ఉన్నతాధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదు. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్థో విభాగంలో సకాలంలో శస్త్ర చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుయా ఆర్థో విభాగంలో అనస్తీషియన్లకు సమయం సరిపోక సర్జరీలు వాయిదా వేస్తున్నారన్న దానిపై అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ జమునను ‘సాక్షి’ వివరణ అడిగే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేరు. వాయిదాల తంతు ఇలా.. ♦ మే 20న సుబ్బమ్మ అనే రోగికి ఆర్థో విభాగంలో శస్త్ర చికిత్స జరగాల్సి ఉంటే అనస్తీషియన్లకు సమయం సరిపోక వాయిదా వేశారు. 23న ఆర్థో వైద్యులు సర్జరీ నిర్వహిం చారు. ♦ మురుగయ్యకు మే 9న సర్జరీ జరగాల్సి ఉంటే వాయిదా వేసి 13వ తేదీన నిర్వహించారు. ♦ ఆదినారాయణకు మే 16న జరగాల్సిన శస్త్ర చికిత్స వాయిదా వేసి 20వ తేదీ నిర్వహించారు. -
గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు
మంచు విష్ణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు ప్రకటించారు. రుయా ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగుపరచడానికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు విష్ణు పేర్కొన్నారు. ఇందకు సంబంధించిన తొలి చెక్‌ను నేడు అందజేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో నిలిచే మంచు విష్ణు దేశ, విదేశాల్లోని ఆర్టిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే.(ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకే ఆర్ట్ ఫౌండేషన్) On the eve of my dad’s birthday, I am pledging 1 Crore in three years to improve the Neo Natal ICU and Medical ICU Pediatric department in Ruia Government Hospital, Tirupati. Also,will build an Emergency and OPD block. And today I am cutting our first Cheque 🙏🏻 — Vishnu Manchu (@iVishnuManchu) March 19, 2019 -
ఎట్టకేలకు మోక్షం!
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎట్టకేలకు ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు స్కానింగ్ భవనం నిర్మాణ పనులు పూర్తయినా అతిథి కోసం రెండు నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా, ఫలితం శూన్యం. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ వస్తుందనే భయంతో సెంటర్ కాంట్రాక్టర్ హడావుడిగా గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో నిరుపేదలకు కొంతైనా ఆర్థికభారం తగ్గినట్లయింది. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రుయా ఆస్పత్రిలో గత 2 వ తేదీన ఎంఆర్ఐ (మేగ్నటిక్ రెసోనన్స్ ఇమేజింగ్) స్కానింగ్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రూ.10 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పుకునే స్కానింగ్ కేంద్రం కాంట్రాక్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతి«థి కోసం నిర్మాణ పనులు ఆలస్యం చేశారు. ఆరు నెలల క్రితం మిషనరీని తెప్పించినా ముఖ్య అతిథి కోసం వాయిదా వేసుకుంటూ వచ్చారు. గత నెల 2న ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు అధికారులు వంతపాడుతూ వచ్చారన్న విమర్శలు వున్నాయి. కోడ్ భయంతో..! ఎన్నికల కోడ్ అమలైతే ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభానికి మరింత ఆలస్యం అవుతుం దన్న భయంతో గురువారం కాంట్రాక్టర్ హడా వుడిగా కేంద్రాన్ని ప్రారంభించారు. రుయా ఉన్నతాధికారులను పిలిచి సేవలకు శ్రీకారం చుట్టారు. అతిథి కోసం ఎదురుచూపులు ఫలిం చకపోవడంతో చడీచప్పుడు కాకుండా ప్రారంభిం చడంపై రుయా ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కనిపించని అభివృద్ధి కమిటీ ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభ సమయంలో రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక్కరూ కనిపించలేదు. రుయా అభివృద్ధి కోసం నిత్యం ఆస్పత్రిలో తిరుగుతూ పర్యవేక్షించే కమిటీ వర్కింగ్ చైర్మన్ చినబాబుకు ఆహ్వానం అందలేదు. కేంద్రం ప్రారంభానికి ఆహ్వానించకపోవడం పట్ల కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రోగులకు ఊరట రుయా ఆస్పత్రిలో ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సిన ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్కానింగ్‌సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేద రోగులకు ఆర్థిక భారం నుంచి వెసులుబాటు లభించినట్లయింది. ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాల్లో ఎంఆర్ఐ సేవలకు రూ.4,500 నుంచి రూ. 5 వేలు వసూలు చేస్తున్నారు. రుయాకు ఆధునిక సేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు కాస్త ఊరట లభించినట్లయింది. రోగులకు మెరుగైన సేవలు రుయా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుపేదలకు మరింత మెరుగైన సేవ చేసే అవకాశం లభించింది. – డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్,రుయా ఆస్పత్రి, తిరుపతి -
‘ఉద్యమిస్తాం.. ఆమరణ దీక్షకు దిగుతాం’
సాక్షి, తిరుపతి: ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని రుయా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం రుయా అధికారులతో జూడాల చర్చలు విఫలమాయ్యాయి. దీంతో అత్యవసర సేవలను సైతం జూడాలు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధర్మపోరాట దీక్షలంటూ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. దుర్వినియోగం చేస్తున్న నిధులలో పదిశాతం జూడాలకు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అయితే జూడాల తీరును రుయా అధికారులు తప్పుపట్టారు. -
రుయా ఆస్పత్రిలో రెండొ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె