salaryies
-
ఈ– కుబేర్ ద్వారా వేతనాలు
జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. తాండూరు, పరిగి, మోమిన్‌పేట్, కొడంగల్‌లో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,343 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు 3,933 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరందరి వేతనాలు సబ్ ట్రెజరీ డీటీఓకు అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్లే సరికి మూడు నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నెల నుంచి ఇక జాప్యం జరగకుండా ఒకటో తేదీనే జీతాలు ఖాతాల్లో చేరనున్నాయి. వికారాబాద్ అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఇకనుంచి వేతనాల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో ఇప్పటికీ 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమకావడం లేదు. దీనికి సంబంధించిన బిల్లులు చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనో, ట్రెజరీలో జరుగుతున్న ఆలస్యం కారణంగానో.. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారం వేతనాలు చేతికందుతున్నాయి. కానీ ఆగస్టు నెల వేతనం నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో క్రెడిట్ కానున్నాయి. అది కూడా 1వ తేదీ రోజునే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రవేశపెట్టిన నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ– కుబేర్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఆగస్టు 1నుంచి దీన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీతాల చెల్లింపులో జాప్యానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్రెజరీలో జరిగే చెల్లింపులన్నీ ఈ– కుబేర్ ద్వారానే కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉద్యోగుల నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించారు. నేరుగా బ్యాంక్ ఖాతాలోకే... ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి నెల జీతాలు బిల్లులు తయారు చేసి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి అందజేస్తారు. ఇక్కడ అధికారులు వీటిని పరిశీలించి బిల్లులను సంబంధిత లింక్ బ్యాంకులకు పంపిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగుల వేతనాలు ఖాతాల్లో జమవుతాయి. అయితే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. దీంతో ప్రతి నెల నాలుగు, ఐదు తేదీల్లో వేతనాలు అందుతున్నాయి. ఈ జాప్యానికి స్వస్తి చెప్పేందుకు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు వీలుగా ఆర్బీఐ ట్రెజరీ కార్యాలయాల్లో ఈ – కుబేర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో... జిల్లా ట్రెజరీ అధికారి పేరుతో ఆర్బీఐ ఒక ప్రభుత్వ ఖాతాను తెరుస్తారు. దీని ద్వారా అన్ని రకాల చెల్లింపులు చేసే విధంగా అధికారాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగలకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా జీతాలు తీసుకునే రోజువారీ కార్మికులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, హోంగార్డులు, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్ నిధులు, ఉపకార వేతనాలు, వివిధ ప్రభుత్వ పథకాలకు నేరుగా బిల్లులు చెల్లించనున్నారు. నేడు ఈ– కుబేర్ ద్వారానే జీతాలు... నేడు (ఆగస్టు) 1వ తేదీన అందాల్సిన జీతాలు ఇదే పద్ధతిన ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విధానాన్ని పూర్తిగా పరిశీలించేందుకు ఇటీవల ఉద్యోగుల ఖాతాల్లో 1 రూపాయి జమచేసి చూశారు. ఆ ఒక్క రూపాయి ఉద్యోగుల ఖాతాలో జమకాలేదంటే ఆ ఉద్యోగి వివరాలు ఈ– కుబేర్ వెబ్సైట్లో పొందపర్చలేదని అర్థం. వివరాలు ఇవ్వని ఆయా శాఖల ఉద్యోగుల వివరాలను సబ్ ట్రెజరీ అధికారులు పూర్తి స్థాయిలో తెప్పించుకున్నారు. -
ఆర్థిక స్తంభన
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లాలో ఆర్థిక స్తంభన ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. జీతాలు లేకపోయినా సరే ఏదో విధంగా బతుకుతాం... అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా అన్ని వర్గాల ప్రజలు సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు అండగా నిలుస్తున్నారు. రాజకీయ సహకారం లోపించినా సమైక్య ఉద్యమం నెల రోజులు విజయవంతంగా జరిగిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. పభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం ద్వారా ఆర్థికంగా బలహీనపరిస్తే విభజన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని భావించిన ఉద్యోగ, ప్రజాసంఘాలు ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. ఒక్క కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 82 కోట్లు గండి పడింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉన్నారు. వీరిలో పోలీసులు, మరికొంతమంది విధులు నిర్వహిస్తున్నా దాదాపు 45 వేల మంది సమ్మెలో ఉన్నారు. జిల్లా ట్రెజరీ పూర్తిగా బంద్ కావడం వల్ల ఆగస్టు నెల జీతాలు ఎవ్వరికీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే 30 వేల మంది పెన్షనర్లు కూడా పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, జ్యుడీషియల్‌కు జీతాలు ఇవ్వాలని ట్రెజరీ డీడీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు జేఏసీ నేతలు ఎవ్వరికీ ఇవ్వరాదని తెస్తుండటంతో ట్రెజరీ డీడీకి ఎటూ పాలు పోని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపు వంద కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరగని బస్సులు.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో 970 బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ఆగస్టు నెల మొత్తం మీద ఆర్టీసీ దాదాపు రూ.30 కోట్లు నష్టం వాటిల్లింది. పభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైంది. ఆగస్టు నెలలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.17.50 కోట్లు రావాల్సి ఉంది. విభజన నిర్ణయం ప్రకటించిన రోజు నుంచి అటెండర్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్ల వరకు ఆందోళనలు నిర్వహిస్తుండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్య పన్నుల శాఖ నుంచి వ్యాట్, అమ్మకపు పన్ను తదితర వాటి ద్వారా ఆగస్టు నెలలో రూ.27 కోట్లు రావాల్సి ఉంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆన్లైన్ ద్వారా వ్యాట్ చెల్లిస్తుండటం వల్ల 50 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ తదితర రూపాల్లో ఆదాయం రూ.12 కోట్లు రావాల్సి ఉన్నా సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల ఆదాయం భారీగా పడిపోయింది. అలాగే గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి లీజులు రాయల్టీలు, జరిమానాలు తదితర వాటి ద్వారా జిల్లా నుంచి ఈ నెలలో రూ.5 కోట్లు రావాల్సి ఉన్నా కోటి రూపాయలు కూడా రాలేదు. రూ.4 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడింది. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వానికి నాల, వన్‌టైమ్ కన్వర్షన్ తదితర రూపాల్లో ఆదాయం వస్తుంది. రెవెన్యూతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు రూ.7 కోట్ల మేర గండి పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిలిచిన ప్రజాపంపిణీ... సమైక్య ఉద్యమం కారణంగా సెప్టెంబర్ నెల ప్రజాపంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. 10.5 లక్షల కుటుంబాలు సెప్టెంబర్ నెల సరుకులు పొందలేకపోతున్నారు. సరుకులు అందకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉంటే కడుపు నిండినట్లేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది.