shaheen bagh market
-
‘షాహీన్ బాగ్’ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవడం మేలని పిటిషనర్లకు సూచించింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ అధికారులు షాహీన్ బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్లతో చేరుకున్నారు. పెద్ద ఎత్తున్న చేరుకున్న స్థానికులు అధికారుల్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు బుల్డోజర్కు అడ్డుగా వెళ్లడంతో.. అధికారులు కూల్చివేతలకు పాల్పడకుండానే వెనుదిగారని సమాచారం. ఇక ఈ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ సీపీఎం, సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. అయితే.. పిటిషన్‌ను బాధితులు కాకుండా.. ఒక రాజకీయ పార్టీ వేయడమేంటని? సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని తీవ్రంగా మందలించింది. ఆపై పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. గతంలో జహంగీర్‌పురి కూల్చివేతల ఘటన సమయంలోనూ ఇదే తరహాలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కూల్చివేతపై స్టే విధించిన సంగతి తెలిసిందే. షాహీన్ బాగ్.. సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనలకు వేదికగా నిలిచింది. అయితే.. కరోనా టైంలో ఆ వేదికను ఖాళీ చేయించారు పోలీసులు. చదవండి: షాహీన్ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత -
ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసన అంటే కుదరదు
న్యూఢిల్లీ: నిరసనలు తెలిపే హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చెయ్యడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రజా జీవితానికి భంగం కలిగేలా ఒకే ప్రాంతంలో రోజుల తరబడి నిరసనలు తెలపడం సరికాదని పేర్కొంది. గత ఏడాది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ ఆందోళనల సమయంలో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ, దానిని సమీక్షించాలంటూ షహీన్‌బాగ్ వాసి కనీజ్ ఫాతిమాతో పాటు మరి కొందరు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. ఏదైనా అంశంపై అప్పటికప్పుడు నిరసన ప్రదర్శనలు జరపడం ప్రజాస్వామిక హక్కు అని, అయితే ఎక్కువ రోజులు బహిరంగ ప్రదేశాలను ఆక్రమిస్తూ ఇతరుల హక్కులకి భంగం వాటిల్లేలా నిరసనలు చేయడం కుదరదని చెప్పింది. ‘‘ప్రభుత్వ విధానాలపై నిరసనలు చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంగా వచ్చిన హక్కు. పౌరులకు హక్కులే కాదు ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా కూడా వ్యవహరించాలి. అప్పటికప్పుడు ఎవరైనా నిరసన తెలపవచ్చు. కానీ ఎక్కువ రోజులు ఇతరుల హక్కుల్ని భంగపరుస్తూ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించకూడదు’’అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపైనే రెండు నెలలకు పైగా రైతులు నిరసనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మళ్లీ ఇలాంటి తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఓపెన్ కోర్టుని నియమించాలన్న అభ్యర్థనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. -
నిరసనలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కుపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజారవాణకు ఇబ్బందులు కలగజేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది. నెలల తరబడి రోడ్లపై ధర్నాలు, దీక్షలు చేయడం ప్రజలు హక్కులకు హరించడమేనని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షహిన్‌బాగ్ ఆందోళకారులు టెంట్లు వేసుకుని నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని వ్యతిరేక ఆందోళనకారులకు ఆదేశించింది. నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ దానిపేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేసింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది పౌరహక్కుల ఉద్యమకారులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎస్కే కౌల్, అనురుద్ బోస్, కృష్ణ మురళీలతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పును వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. నిరసన తెలిపే హక్కు అనేది ఎల్లప్పూడు, ఎక్కడైనా ఉంటుందని అనుకోవడం సరైనది కాదని స్పష్టం చేసింది. -
మోదీ కూడా నా కుమారుడే.. భయమెందుకు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ దాదీ టైమ్ జాబితాలో స్థానం పొందారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీని తన కొడుకుగా భావిస్తానని.. ఆయన ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లి కలుస్తానని తెలిపారు. షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు. (చదవండి: మోదీ, షాహిన్‌బాగ్ దాదీ) ఈ క్రమంలో ఓ ఆంగ్ల వెబ్సైట్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ‘ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనని కలవడానికి వెళతారా అని ప్రశ్నిస్తే.. ఎందుకు వెళ్లను. తప్పక వెళ్తాను. ఇందులో భయపడటానికి ఏం ఉంది. తను నా కుమారుడిలాంటి వాడు. నేను తనకు జన్మనివ్వకపోవచ్చు. మరో సోదరి ఆ పని చేసింది. అయినా తను నా బిడ్డలాంటి వాడే’ అన్నారు. అంతేకాక ఈ జాబితాలో మోదీ పేరు కూడా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని.. ఆయనను అభినందిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం తమ మొదటి పోరాట కరోనా మహమ్మారి మీద అని స్పష్టం చేశారు దాదీ. ఇక మార్చి 24 నుంచి షాహీన్ బాగ్ నిరసన స్థలం క్లియర్ చేయబడింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. -
మోదీ, షాహిన్‌బాగ్ దాదీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీసహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ టైమ్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అత్యంత ప్రభావితం చూపించిన 100 మందిలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ అమెరికన్, డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ టైమ్స్ జాబితాకెక్కారు. రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అణగారిన వర్గాల గొంతుక షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు’అని టైమ్ మ్యాగజైన్ ప్రొఫైల్‌లో షాహిన్‌బాగ్ దాదీ గురించి జర్నలిస్టు రాణా అయూబ్ రాసుకొచ్చారు. ఆయుష్మాన్ భవ ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు. కన్న కలలు నిజం కావడం చాలా కొద్ది మంది చూస్తారని, అందులో ఆయుష్మాన్ ఒకరని అన్నారు. ఆయనలో ప్రతిభ, కష్టపడే తత్వంతో పాటుగా సహనం, పట్టుదల, నిర్బయంగా ముందుకు దూసుకుపోయేతత్వాన్ని దీపిక ప్రశంసించారు. -
లాక్డౌన్ : షాహీన్ బాగ్ ఆందోళనకు తెర
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా 101 రోజులుకు పైగా సాగుతున్న ఆందోళనకు తెరపడింది. కోవిడ్ -19(కరోనా వైరస్) వ్యాప్తి, ఆందోళన, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో షాహీన్ బాగ్ ఏరియాలో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు తొలగించారు. పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగిస్తున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఆగ్నేయ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్పి మీనా చెప్పారు. మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని ఆదేశించారు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని కూడా హెచ్చరించారు.మరోవైపు ఐదుగురు మహిళా నిరసనకారులు మాత్రమే నిరసనలో పాల్గొంటూ తమ ఆందోళన కొనసాగిస్తారని, షిప్టుల వారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీఏఏ ఆందోళన నిర్వాహకులు వెల్లడించారు. వృద్ధ మహిళలను లేదా జర్వంతో బాధపడుతున్నవారిని ఆందోళనలో పాల్గొనడానికి అనుమతించమని నిర్వాహకులలో ఒకరైన అబిద్ షేక్ ప్రకటించారు. అలాగే నిరసనకారులను వెంటనే తొలగించాలని కోరుతూ చేసిన పిటిషన్ విచారణను కరోనా వైరస కారణంగా సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో, మంగళవారం (మార్చి 24) షాహీన్ బాగ్ ప్రాంతం నుంచి సీఏఏ నిరసనకారులను పోలీసులు తొలగించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సెక్షన్ 144 ను విధించడంతో ఒకే స్థలంలో ఐదుగురికి పైగా గుమిగూడడం నిషేధం. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఏఏ వ్యతిరేక నిరసన 2019 డిసెంబర్ 15 న ప్రారంభమై గత 101 రోజులుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కొనసాగుతున్నఈ ఆందోళనలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిదిమంది మృత్యువాతపడ్డారు. -
కుదుటపడుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్ నగర్–తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్ పురోహిత్ చెప్పారు. -
షహీన్‌బాగ్‌లో నిషేధాజ్ఞలు..
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన షహీన్‌బాగ్‌లో 144వ సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను తరలించామని ఢిల్లీ జాయింట్ కమిషనర్ డీసీ శ్రీవాస్తవ వెల్లడించారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో మరోసారి ఎలాంటి ఉద్రిక్తతలు తల్తెతకుండా శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో షహీన్‌బాగ్‌లో ఈ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 1000 మంది జవాన్లతో పాటు 12 కంపెనీ పారామిలటరీ బలగాలను షహీన్‌బాగ్‌కు రప్పించారు. ఈ ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదని, వారి నిరసనలను విరమించాలని, ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. చదవండి : సామరస్యం మిగిలే ఉంది! -
‘నిరసన’ ప్రాథమిక హక్కే.. కానీ!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఆందోళనకారులకు సూచించింది. సీఏఏకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసనల కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతోందంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా పైవిధంగా స్పందించింది. భావ ప్రకటన ప్రజాస్వామ్యంలో అవసరమే కానీ, దానికీ హద్దులుండాలంది. మరో ప్రదేశానికి నిరసన ప్రాంతాన్ని మార్చేలా ఒప్పించాలని న్యాయవాది సంజయ్ హెగ్డేని ఆదేశించింది. సందీప్ పాండే అరెస్ట్ లక్నో: సామాజిక కార్యకర సందీప్ పాండేను సోమవారం లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని తలపెట్టిన పాండే.. కరపత్రాలను పంచుతుండగా అదుపులోకి తీసుకున్నారు. సతీసహగమనం హత్యే ‘ప్రార్థనాస్థలాల్లో దానం చేయడం మతపరమైన ఆచారమే కావచ్చు. అటువంటి ప్రదేశాల్లో విరాళంగా ఇచ్చిన ఆ డబ్బుని టెర్రరిజానికి ఉపయోగిస్తే మాత్రం చట్టం అంగీకరించదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆత్మత్యాగం, సతీసహగమనం వంటివి హత్యల కిందికే వస్తాయని, వాటిని విశ్వాసాల పేరుతో కొనసాగినవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రార్థనాలయాల్లో మత స్వేచ్ఛ, లింగ వివక్షపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. -
షహిన్‌బాగ్ : సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుందని, అయితే రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. షహిన్‌బాగ్ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అమిత్ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. షహిన్‌బాగ్ ఆందోళనల పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలిగకుండా నిరసన తెలిపిందుకు మరో ప్రాంతాన్ని ఎంచుకోండి’ అని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే నిరసనకారులతో మట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హేగ్డే, సాధన రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసింది. షహిన్‌బాగ్‌ను ఖాళీ చేసే విధంగా వారితో సంప్రదింపులు జరపాలని న్యాయస్థానం కోరింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరో 5వేల షహిన్‌బాగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయంటూ.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. వాటితో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని కానీ పౌరుకుల అసౌకర్యం కలగకుండా నిరసన తెలుపుకోవాలని అభిప్రాయపడింది. -
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్‌బాగ్ ర్యాలీ
-
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్‌బాగ్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్‌కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్‌బాగ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుకే ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ర్యాలీ మొదలుకానుంది. ర్యాలీపై తమకు సమాచారం లేదని హోంశాఖ తెలిపింది. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శనివారం షహీన్‌బాగ్ నిరసనకారులు కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, బిర్యానీ కోసమే నిరసనలు.. షహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న వారు డబ్బు, బిర్యానీల కోసమే రోజూ వేదిక వద్ద కూర్చుంటున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్‌ఘోష్ ఆరోపించారు. ‘నిరక్షరాస్యులు, సామాన్యులు, పేదలు, అజ్ఞానులు అక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. నేతలిచ్చే డబ్బు, బిర్యానీల కోసమే నిరసనలు చేస్తున్నారు. పైగా వీరికి పంపే డబ్బంతా విదేశాల నుంచే వస్తోంది. కాంగ్రెస్ నేత చిదంబరం, సీపీఐ నేత బృందా కారత్లాంటి వారి ప్రసంగాలు వినే శ్రోతలు వారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. దీనికి వేలాది మంది హాజరు కాగా అందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఉర్దూ కవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ రచించిన ‘హమ్ దేఖేంగే’ (మేం చూస్తాం) అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ముంబైతో పాటు నవీ ముంబై, థానేల నుంచి తరలివచ్చారు. -
మోదీకి వాలంటైన్స్ డే ఆహ్వానం
న్యూఢిల్లీ: వాలంటైన్స్‌డే సందర్భంగా ప్రధాని మోదీకి అనూహ్య ఆహ్వానం అందింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ప్రధానిని ఆహ్వానించారు. ‘ప్రేమికుల దినం నాడు కలిసి వేడుక చేసుకుందాం రండి’ అంటూ షహీన్‌బాగ్ ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. ‘ప్రధాని మోదీ, షహీన్‌బాగ్‌కు రండి. మాతో మాట్లాడి, బహుమతి పట్టుకెళ్లండి’ అని ఉన్న పోస్టర్లు, ప్రేమ గీతం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. ‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మంత్రులెవరైనా సరే, ఇక్కడికి వచ్చి, మేం సిద్ధంగా ఉంచిన బహుమతి తీసుకెళ్లొచ్చు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం కాదని వారు మమ్మల్ని ఒప్పించగలిగితే వెంటనే నిరసనలను ఆపేస్తాం’ అని షహీన్‌బాగ్ ఆందోళనల్లో పాల్గొంటున్న సయ్యద్ తసీర్ తెలిపారు. -
శిశువు ఆందోళనల్లో పాల్గొందా?
న్యూఢిల్లీ: ‘నాలుగు నెలల శిశువు తనంతట తానే ఆందోళనల్లో పాల్గొందా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న నిరసనల్లో చిన్నారి మృతి చెందడంపై కోర్టు పైవిధంగా స్పందించింది. షహీన్‌బాగ్ నిరసనల్లో 4 నెలల చిన్నారి చనిపోవడంపై జాతీయ సాహస అవార్డు గ్రహీత, ముంబైకి చెందిన జెన్ గుణ్‌రతన్ సదవర్తే(10) అనే బాలిక రాసిన లేఖను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ‘నిరసనల్లో పాలుపంచుకున్న చిన్నారులను స్కూళ్లలో తోటి వారు ఉగ్రవాదులు, విప్లవకారులు, పాకిస్తానీ అనే పేర్లతో పిలుస్తున్నారు. దీంతో వారు ఏడ్చుకుంటూ ఇళ్లకు వస్తున్నారు’అంటూ షారూక్ ఆలం, నందితా రావ్ అనే మహిళా న్యాయవాదులు పేర్కొన్నారు. నిరసన తెలపడం చిన్నారుల హక్కు అని ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో కూడా ఉందని, దీనిని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించడం తగదని వారు వాదించారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ‘ప్రమాదకరమైన ఆ సమర్థనను ఆపండి. అలాంటి వాదనలు చేయకండి. మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చకండి’అని పేర్కొంది. ‘నాలుగు నెలల చిన్నారి ఆందోళనల్లో పాల్గొనేందుకు సొంతంగా వెళతాడా?. మాతృత్వంపై మాకు అత్యున్నత గౌరవం ఉంది. చిన్నారుల క్షేమం గురించి ఆలోచిస్తాం. ఇలాంటి వాదనలతో అపరాధభావం మరింతగా పెంచకండి. నిరసనల్లో పాల్గొని చిన్నారులకు మరిన్ని ఇబ్బందులు కలిగించరాదని తల్లులు గ్రహించాలి’అని ధర్మాసనం పేర్కొంది. షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న తల్లితోపాటుగా ఉన్న నాలుగు నెలల చిన్నారి జనవరి 30వ తేదీ రాత్రి నిద్రలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. మరో పరిణామం.. షహీన్‌బాగ్‌లోని ప్రభుత్వ రహదారిపై చేపట్టిన నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ట్రాఫిక్ సజావుగా సాగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు’అని పేర్కొంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి కాళిందికుంజ్–షహీన్‌బాగ్ రహదారిపై కొనసాగుతున్న నిరసనలపై స్పందించాలని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
షహీన్‌బాగ్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని ఎలా దిగ్భందిస్తారని షహీన్‌బాగ్ నిరసనలను ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్దానం ప్రశ్నించింది. షహీన్‌బాగ్ నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా నిరసనల్లో పాల్గొంటూ చలిని తాళలేక నాలుగు నెలల చిన్నారి మృత్యువాతన పడటంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అసలు ఆ ప్రాంతానికి చిన్నారి ఎలా చేరుకుందని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవడంపై కొందరు న్యాయవాదులు వ్యతిరేకించడం పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఇక షహీన్‌బాగ్‌పై తక్షణమే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేసి ఇతరులకు అసౌకర్యం కలిగించరాదని సుప్రీంకోరు స్పష్టం చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత యాభై రోజులుగా షహీన్‌బాగ్ కేంద్రంగా పెద్దసంఖ్యలో మహిళలు, చిన్నారులు నిరవధిక ధర్నాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ‘షాహీన్ బాగ్.. సుసైడ్ బాంబర్ల శిక్షణ కేంద్రం’ -
ముగిసిన ‘ఢిల్లీ’ ప్రచారం
న్యూఢిల్లీ: వాడివేడిగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు 11వ తేదీన వెలువడుతాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా మారిన షహీన్బాఘ్ అంశాన్ని బీజేపీ, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రచారాంశాలుగా చేపట్టాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా∙సహా పార్టీలోని మహామహులను బీజేపీ ప్రచారరంగంలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం అంతా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగానే సాగింది. బీజేపీ, ఆప్‌ల స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం సాగలేదు. మనోజ్ తివారీ డ్యాన్స్ నాకిష్టం బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీని తాను ఎగతాళి చేశానన్న వార్తలను ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఖండించారు. తనకు నిజంగానే తివారీ పాటలన్నా, డాన్స్‌లన్నా ఇష్టమన్నారు. తివారీ భోజ్‌పురి నటుడన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా తాను మనోజ్ తివారీ పాటలను, డ్యాన్స్‌లను చూడాలని ప్రజలను కోరుతానని కేజ్రీవాల్ గురువారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తివారీని ఎగతాళి చేసి పూర్వాంచల్ వాసులను తాను అవమానించానన్న విమర్శలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన పూర్వాంచల్ వాసులు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 67 సీట్లను ఆప్ గెలుచుకుంది. మూడింటిలో బీజేపీ విజయం సాధించింది. -
‘షాహీన్ బాగ్.. సుసైడ్ బాంబర్ల శిక్షణ కేంద్రం’
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో సుపైడ్ బాంబర్లను(ఆత్మాహుతి దళాలు) తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘షాహిన్‌బాగ్‌లో జరిగేది కేవలం ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు శిక్షణ పొందుతున్నారు. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’’ అని గురువారం ట్విటర్లో తెలిపారు. షాహీన్‌బాగ్ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. (‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ముస్లింలు తీవ్ర ఆందళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు దీనిని కీలక ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారం కోసం బీజేపీ షాహీన్బాగ్పై మురికి రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్, ఆప్ మద్దతుతోనే ఆందోళనకారులు రహదారులను అడ్డగించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తాము అధికారంలోకి వచ్చాక శిబిరాన్ని తొలగిస్తామని బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. చదవండి : షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో! यह शाहीन बाग़ अब सिर्फ आंदोलन नही रह गया है ..यहाँ सूइसाइड बॉम्बर का जत्था बनाया जा रहा है। देश की राजधानी में देश के खिलाफ साजिश हो रही है। pic.twitter.com/NoD98Zfwpx — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 6, 2020 -
‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో పాలకపక్ష ఆప్, బీజేపీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోపాటు ఆప్ పార్టీ ముఖ్య నేతలు వీధి వీధిన ప్రచారం చేస్తుండగా, బీజేపీ తరఫున అమిత్ షా, మోదీలతోపాటు ‘దేశ ద్రోహులను కాల్చేయండి’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిరిగి ప్రచారానికి వచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారంతా దేశద్రోహులని వారిని కాల్చేయండంటూ అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చిన అనంతరం మూడు చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. ‘మా పిల్లలను ఎవరో తప్పుదోవ పట్టించడంతో గందరగోళంలో కాల్పులు జరిపారు’ అని మరో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సమర్థించారు. ఇంత బహిరంగంగా హింసాకాండను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులను బీజేపీ అధిష్టానం కనీసం మందలించక పోవడం ఏమిటని ఎన్నికల ప్రచారంలో ఆప్ నాయకులు నిలదీస్తున్నారు. ‘పౌరసత్వం నిరూపణకు డాక్యుమెంట్లు అడిగితే వారిని కొట్టండి’ అనే అభ్యంతరకర వ్యాక్యం కర్ణాటక ముస్లిం పాఠశాలలో వేసిన ఓ నాటకంలో ఉన్నందుకు తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ఇంటరాగేట్ చేయడంతోపాటు, దేశ ద్రోహం కేసు కింద ఓ టీచర్‌ను, ఓ పేరెంట్ను అరెస్ట్ చే యడాన్ని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నోరు విప్పితే దేశద్రోహం కేసు పెడతారా? అదే ఆందోళనకారులను కాల్చేయండంటూ పిలుపునిస్తే ఎలాంటి చర్య తీసుకోరా?’ ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!) -
షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో ధర్నా చేస్తున్న ఆడవాళ్లంతా డబ్బులు తీసుకుంటున్నారు. 500, 700 రూపాయలు తీసుకొని షిప్టుల పద్ధతిలో ధర్నాకు కూర్చుంటారు...అవును బాయ్’ అని ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటుండగా, ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై (అదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామా) ’ అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించిన ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవియా జనవరి 15వ తేదీన ట్వీట్ చేశారు. అంతా కాంగ్రెస్ డ్రామా అంటూ ఆయన కూడా నొక్కి చెప్పారు. (షహీన్ బాగ్ శిశువు మృతి) ఆ వీడియోలో ఉన్న వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే ‘టైమ్స్ నౌ’ టీవీ ఆ వీడియోను ప్రసారం చేసింది. ‘ఇది స్టింగ్ ఆపరేషన్ లా ఉంది. షహీన్ బాగ్‌లో డబ్బులు తీసుకొని ధర్నా చేస్తున్న ఆడవాళ్ల గురించి అక్కడ మాట్లాడుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తులను రహస్యంగా చిత్రీకరించినట్లుంది. వాస్తవం ఏదో మనకు స్పష్టంగా తెలియదు. బీజేపీ చేతికి ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు. బీజేపీయే స్వయంగా ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిందా? ఎవరైనా చేసి బీజేపీ చేతికి ఇచ్చారా? తెలియదు’ అంటూ జర్నలిస్ట్ మెఘా ప్రసాద్ వ్యాఖ్యానంతో ఆ వీడియోను ‘టైమ్స్ నౌ’ పూర్తిగా ప్రసారం చేసింది. ‘ప్రొటెస్ట్ఆన్హైర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ‘రిపబ్లిక్ టీవీ’ చర్చా కార్యక్రమాన్ని చేపట్టగా, ‘డబ్బులకు ఆందోళన చేస్తున్నారా?’ అంటూ ‘ఇండియా టుడే’ టీవీ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే హర్ష్ సాంఘ్వీ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రీతీ గాంధీ, మాజీ శివసేన సభ్యులు రమేశ్ సోలంకి, బీజేపీ ఢిల్లీ ఐటీ సెల్ హెడ్ పునీత్ అగర్వాల్, సినీ నిర్మాత అశోక్ పండిట్లు తమ తమ వ్యాఖ్యానలతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నకిలీ వీడియోలను, వార్తలను ఎప్పటికప్పుడు కనిపెట్టే ‘ఆల్ట్ న్యూస్, లాండ్రీన్యూస్’లు వీడియోను ఫ్రేమ్, ఫ్రేమ్ తనిఖీ చేయగా, ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వెనకాల ఓ షాపు అద్దం మీద స్పష్టంగా ‘9312484044’ అనే నెంబర్ కనిపించింది. ఆల్ట్ న్యూస్, లాండ్రీ న్యూస్‌కు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఆ నెంబర్ పట్టుకొని గూగుల్ సర్చ్ ద్వారా వెళ్లగా ‘కుస్మీ టెలికమ్ సెంటర్’ అనే మొబైల్ షాప్ కనిపించింది. ఆ ఫోన్ నెంబర్ ఆ షాపుదే. వీడియోలో కనిపించే గోడ, దాని మీద పోస్టర్లు కూడా అచ్చం అలాగే షాపు రెక్క మీద ఉన్నాయి. షహీన్ బాగ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో పూల్ ప్రహ్లాద్‌పూర్‌లో ఆ షాపు ఉంది. తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో 134 నెంబర్ షాపది. అశ్వని కుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆ షాపు యజమాని. ఆయనకు 70 ఏళ్ల తండ్రి కూడా ఉన్నారు. 8–10 చదరపు గజాల వెడల్పుతో ఉన్న ఆ షాపులో సిగరెట్లు, గుడ్లు, డేటా ప్లాన్స్, చిప్స్ అమ్ముతున్నారు. ఆ షాపుకు ఎయిర్టెల్, వొడాఫోన్ అడ్వర్టయిజ్ బోర్డులు కూడా ఉన్నాయి. (ఇర్ఫాన్ పఠాన్‌పై ఫేక్ వీడియో!) ఆ షాపులో సిగరెట్లు కొనుక్కున్న ఇద్దరు రిపోర్టర్లు అశ్వని కుమార్‌తో పిచ్చాపాటిగా రాజకీయాలు మాట్లాడుతు వచ్చారు. ఆ షాపు గోడలకు మోదీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు ఉన్నాయి. బీజేపీలో పనిచేస్తారా? అని ప్రశ్నించగా, తనను తాను సిన్సియర్ కార్యకర్తనని చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో తన షాపు ముందు తీసిందే అని మాటల సందర్భంలో అంగీకరించారు. అయితే తాను తీయలేదని, ఎవరో తీశారని చెప్పారు. ‘మీ వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తోంది’ అని అశ్వని కుమార్ తండ్రిని ప్రశ్నించగా బీజేపీ ఏమీ చేయడం లేదు, ఆప్ ఏమీ చేయడం లేదని చెప్పారు. ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై’ అని వీడియోలో ఉన్న గొంతను పోలినట్టే ఆయన స్వరం ఉంది. (సీఏఏకు వ్యతిరేకం.. ఇది మరో షాహీన్ బాగ్) మరోసారి వీడియో ఫ్రేమ్‌లను ఆ ఇరువురు రిపోర్టర్లు పరిశీలించగా, షాపు బయటి నుంచి కాకుండా షాపు లోపలి నుంచే తీసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లు సిగరెట్ తాగుతున్నప్పుడే అశ్వని కుమార్ తన సెల్ ఫోన్‌తో వారిని వీడియోతీసి ‘నా అనుమతి లేకుండా సిగరెట్లు తాగుతున్నారు’ అని కాప్షన్ పెడితే ఎలా ఉంటుందని కూడా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నాయకులు బన్వర్ సింగ్ రాణాను రిపోర్టర్లు పరిచయం చేసుకొని షహీన్ బాగ్ గురించి ‘స్టింగ్ ఆపరేషన్’ ఎవరు చేశారని ప్రశ్నించగా, తమ పోరగాడేనని, సమీపంలో మొబైల్ షాపు నడుపుతున్నారని చెప్పారు. పరిచయం చేయమని అడగ్గా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికలయ్యాక వస్తే పరిచయం చేస్తానని చెప్పారు. (ఆ ‘వీడియో’ చైనా మార్కెట్‌ది కాదు!) -
షాహీన్ బాగ్, జలియన్‌వాలా బాగ్గా మారుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద సుదీర్ఘ ఆందోళన కొనసాగుతుండగా, ఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పాశవికంగా అణిచివేయనుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 8 తరువాత (ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు), షాహీన్ బాగ్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగన్వివదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలియన్‌బాగ్ మారణకాండను గుర్తు చేసుకున్న ఒవైసీ, షాహీన్ బాగ్‌ను కూడా జలియలావాలా బాగ్గా మార్చేఅవకాశం లేకపోలేదన్నారు. ఆందోళనపై కాల్పులు జరపమన్న బీజేపీ మంత్రి సంకేతాల నేపథ్యంలో, అక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను కాల్చి చంపవచ్చు అనే సందేహాన్ని ఒవైసీ వెలిబుచ్చి వుందంటూ వివాదాన్నిమరింత రాజేశారు. అంతేకాదు ఉద్రిక్తత రేపుతున్న బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై స్పందిస్తూ 2024 వరకు ఎన్ఆర్సీ అమలు ఉండదనే విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. ఎన్పీఆర్ కోసం 3900 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి ఈ విధంగా భావిస్తున్నానని ఒవైసీ తెలిపారు. జర్మనీ నియంత హిట్లర్ రెండుసార్లు జనాభా గణనను నిర్వహించిన అనంతరం లక్షలాదిమంది యూదులను గ్యాస్ చాంబర్లో వేసి హతమార్చాడు.. మనదేశంలో అలా జరగకూడదని తాను కోరుకుంటున్నానంటూ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజులుగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద బుధవారం మరోసారి కలకలం రేగింది. తుపాకీతో అనుమానస్పద వ్యక్తులు హల్చల్ చేసిన ఘటనను మర్చిపోక ముందే తాజాగా బురఖా ధరించిన మహిళ అనుమానాస్పదంగా సంచరించడం ఆందోళన రేపింది. ఆమెను గమనించిన ఆందోళనకారులు, పోలీసులకు అప్పగించారు. పొలిటికల్ ఎనలిస్టు, యూట్యూబర్‌గా చెప్పుకున్న ఆమెను గుంజాకపూర్గా గుర్తించారు పోలీసులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది, సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు @gunjakapoor naam hai hamara Naam to suna hoga🤦 Free ki biryani khane burka pahen k shaheen baugh me pakdi gayi🤦🤦🤦@arshaan_zaman @ihansraj @IndiasMuslims @iamseeratraza @NehasinghJnu @tamashbeen_ @IamOnir pic.twitter.com/IPfZ18Ro8u — silent_word_💯FB (@silenteyes601) February 5, 2020 -
షహీన్‌బాగ్ శిశువు మృతి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసన తెలుపుతున్న నాలుగు నెలల శిశువు మృతిచెందాడు. బాలుడు నిరసన తెలపడం ఏంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. షహీన్‌బాగ్ వద్ద నిరసనలో పాల్గొనడానికి మహ్మద్ జహాన్ అనే బాలుడిని అతని తల్లి ప్రతిరోజూ తనతోపాటు అక్కడికి తీసుకెళ్లేది. అక్కడ ఉన్న నిరసనకారులంతా కూడా జహాన్‌ను ముద్దుచేసేవారు. అలాగే బాలుడి బుగ్గ మీద త్రివర్ణ పతాకాన్ని రంగులతో వేసేది. కానీ, ఆ పాలబుగ్గల చిన్నారి ఇక నుంచి కనబడడు. చలితీవ్రత పెరగడంతో, తట్టుకోలేక ఆ చిన్నారి కన్నుమూశాడు. అయినప్పటికీ జహాన్ తల్లి ఆ నిరసనల్లో పాల్గొనడానికి నిశ్చయించుకోవడం గమనార్హం. ‘నేను నా పిల్లల భవిష్యత్తు కోసం అందులో పాల్గొంటాను’ అని తెలిపింది. జహాన్ తల్లిదండ్రులు మహ్మద్ ఆరిఫ్, నజియా బట్లా హౌజ్ ప్రాంతంలో ప్లాస్టిక్ షీట్లు, వస్త్రాలతో చేసిన ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. వారికి మరో ఇద్దరు ఐదేళ్ల కుమార్తె, ఒక సంవత్సరం కొడుకు ఉన్నారు. ‘జహాన్ జనవరి 30వ తేదీనే మృతిచెందాడు. షహీన్‌బాగ్ ప్రాంతం నుంచి ఆరోజు రాత్రి 1 గంటకు ఇంటికొచ్చి జహాన్‌ను నిద్రపుచ్చి నేను కూడా నిద్రపోయాను. ఉదయం లేవగానే తాను కదలకపోవడాన్ని గమనించాను. తను నిద్రలోనే చనిపోయాడు’ అని నజియా వెల్లడించింది. -
కేజ్రీవాల్ ఉగ్రవాదే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం వెల్లడించారు. గతంలో కేజ్రీవాల్ తనకు తానుగా అరాచకవాదినని ప్రకటించుకున్నారని, నా దృష్టిలో అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ గురీందర్ సింగ్ నివాసమైన మోగాలో కేజ్రీవాల్ బస చేశారని గుర్తుచేశారు. అది ఉగ్రవాది నివాసమని తెలిసీ కేజ్రీవాల్ బసచేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారన్నారు. షహీన్‌బాగ్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరాచకవాదులకు మద్దతిచ్చిన నువ్వు నిజంగా ఉగ్రవాదివే అంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
దేశ సామరస్యతపై కుట్ర
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు. షహీన్బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్‌లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు. బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు. ఢిల్లీ వాసులు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్‌పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. -
షహీన్‌బాగ్‌తో ఎవరికి చెక్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీలోని యమునా నది ఒడ్డున షహీన్‌బాగ్ ప్రాంతం గత నెలరోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. వణికించే చలిని లెక్కచేయకుండా ముస్లిం వర్గానికి చెందిన వారు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంతో బీజేపీ షహీన్‌బాగ్‌ను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. సీఏఏ వ్యతిరేకుల్ని పదునైన మాటలతో ఎండగడుతోంది. దేశభక్తి వర్సస్ టుక్డే టుక్డే గ్యాంగ్ ఎన్నికలుగా వీటిని అభివర్ణిస్తూ ఎవరివైపు ఉంటారని ప్రశ్నిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పటివరకు షహీన్‌బాగ్‌కు ఎందుకు రాలేదంటూ ఆప్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలైన పర్వేష్ వర్మను మూడు రోజులు, అనురాగ్ ఠాకూర్‌ని నాలుగు రోజుల పాటు ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించినా కమలదళం తాను చేపట్టిన వ్యూహం ప్రకారమే ముందుకి అడుగులు వేస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తున్న ఆప్ సీఏఏ అంశంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందూ ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న ఆందోళనలో ఉన్న కేజ్రీవాల్ దీనిపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. షహీన్‌బాగ్ వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపే ధైర్యం చేయలేదు. అయిదేళ్లలో తాను చేసిన పనులనే ప్రస్తావిస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచితంగా నీళ్లు, స్కూలు ఫీజుల నియంత్రణ, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వంటివే ప్రస్తావిస్తున్నారు. సుపరిపాలన అన్న సొంత ఎజెండాతోనే ముందుకు వెళుతున్నారు. పరువు కాపాడుకునే వ్యూహంలో కాంగ్రెస్ ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆప్ రాజకీయాల్లోకి వచ్చాక రాజధానిలో ఇంచుమించుగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఒక వర్గంలో నెలకొన్న సీఏఏ వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఢిల్లీలో 8 నుంచి 10 స్థానాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంది. కనీసం ఆ స్థానాలనైనా దక్కించుకొని పరువు కాపాడుకునే పనిలో ఉంది. షహీన్‌బాగ్ నిరసనకారుల్ని టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కేంద్రానివే దేశాన్ని విభజించే టుక్డే టుక్డే రాజకీయాలంటూ ప్రచారం ప్రారంభించింది. బీజేపీ అస్త్రం పని చేస్తుందా ? షహీన్‌బాగ్ బీజేపీ ట్రంప్ కార్డా లేదంటే, అసహనంతో కూడుకున్న అస్త్రమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షహీన్‌బాగ్ ఆందోళనలపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్లే బీజేపీ జాతీయ భావాన్ని రగల్చడంలో ఎంతో కొంత పైచేయి సాధించిందని ఎన్నికల విశ్లేషకుడు ప్రదీప్ భండారీ అభిప్రాయంగా ఉంది. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎగువ మధ్యతరగతిలో సీఏఏపై పెద్దగా వ్యతిరేకత లేదు. మరోవైపు షహీన్‌బాగ్ నిరసనలతో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువై సామాన్యులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీపై అధికార వ్యతిరేకత కూడా లేదు. అమిత్‌షా చాణక్య నీతిని కేజ్రీవాల్ ఎంతవరకు సమర్థవంతంగా తిప్పికొట్టగలరో అన్న దానిపైనే బీజేపీ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుందని సీఎస్డీఎస్ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 8న మీరు ఈవీఎంల బటన్ ఎంత ఆగ్రహంతో ప్రెస్ చేయాలంటే దాని ప్రకంపనలు షహీన్‌బాగ్‌ను వణికించాలి. – కేంద్ర హోం మంత్రి అమిత్ షా షహీన్‌బాగ్‌లో నిరసనకారులు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు. మీ చెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేయొచ్చు. చివరికి మిమ్మల్ని చంపేయొచ్చు కూడా. –బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ టుక్డే టుక్డే గ్యాంగ్‌కి షహీన్‌బాగ్ కేంద్రంగా మారింది. –కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశద్రోహుల్ని కాల్చి చంపండి. –కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ -
షహీన్‌బాగ్‌లో జెండా ఎగురవేసిన బామ్మలు
న్యూఢిల్లీ: గత నెల రోజులుగా జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లపై నిరసనలు తెలుపుతున్న బామ్మలు సహా 1,000 మంది ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుతూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీలు కూడా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. బామ్మల్లో శర్వారి (75), బిల్కిస్ (82), ఆస్మా ఖాటూన్ (90)లు ఉన్నారు. తమ గోడును పట్టించుకోని ప్రధాని తమకెందుకని ప్రశ్నించారు.