Sheffield game
-
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద సిక్స్.. వీడియో వైరల్
సిడ్నీ: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద సిక్స్ నమోదైంది. షెఫీల్డ్ షీల్డ్ 2021-22 టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్ హిల్టన్ కార్ట్‌రైట్ 122 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాగా అతను కొట్టిన మూడు సిక్స్ల్లో ఒకటి గ్రౌండ్ అవతల చాలా దూరంలో పడింది. ఇన్నింగ్స్ 114వ ఓవర్ నాలుగో బంతిని స్ట్రెయిట్ సిక్స్‌గా బాదాడు. ఫీల్డర్‌కు క్యాచ్ తీసుకునే అవకాశం లేకుండా మైదానం అవతల రోడ్డుపై పడింది. కనీసం బంతి ఎక్కడ పడిందో అని చూద్దామని అనుకున్నా కెమెరా కంటికి చిక్కలేదు. ఇంతలో ఒకతను వచ్చి బంతిని మైదానంలోకి విసిరాడు. కాగా కార్ట్‌రైట్ కొట్టిన సిక్స్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనే అతిపెద్ద సిక్స్‌గా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం ఇక కార్ట్‌రైట్ 2017లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుమ్యాచ్ ద్వారా ఆసీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే ఒక టెస్టుకు మాత్రమే పరిమితమైన అతను మూడు వన్డేలు ఆడాడు. కార్ట్‌రైట్ తన చివరి వన్డేను టీమిండియాపై ఆడగా.. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ తీయడం విశేషం. ఓవరాల్‌గా ఆసీస్ తరపున టెస్టు, వన్డేలు కలిపి నాలుగు మ్యాచ్‌లాడి 57 పరుగులు చేశాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన కార్ట్‌రైట్ 55 బీబీఎల్ మ్యాచ్‌ల్లో 924 పరుగులు సాధించాడు. చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు.. 'That's one of the biggest strikes we've ever seen here' 😲😲 Hilton Cartwright seeing them well at Karen Rolton Oval! #SheffieldShield pic.twitter.com/el78ndMBof — cricket.com.au (@cricketcomau) September 25, 2021 -
తొలి టెస్టుకు మైకేల్ క్లార్క్ సిద్ధం
మెల్బోర్న్:టీమిండియాతో జరిగే తొలిటెస్టుకు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సిద్ధమయ్యాడు. సోమవారం విడుదల చేసిన 13 మంది క్రికెటర్ల జాబితాలో క్లార్క్ చోటు దక్కించుకున్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడిన క్లార్క్ వేగంగా కోలుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. వచ్చేనెల 4న బ్రిస్బేన్‌లో జరిగే తొలి టెస్టులో క్లార్క్ ఆడతాడని ఆసీస్ సెలెక్టర్ రోడ్నీ మార్ష్ తెలిపాడు. గత కొన్ని రోజుల నుంచి ఫిట్ నెస్ కోసం శ్రమించిన క్లార్క్ ఆ పరీక్షలో పాసయ్యాడని తెలిపాడు. తొలి టెస్టుకు ముందు టీమిండియాతో జరిగే వార్మప్ మ్యాచ్ లో కూడా క్లార్క్ పాల్గొనున్నట్లు మార్ష్ తెలిపాడు. -
రెండు వారాల ముందే...
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ప్రకటన రేపు మెల్బోర్న్: సాధారణంగా సొంతగడ్డపై జరిగే టెస్టు మ్యాచ్‌లకు ఏ జట్టయినా రెండు, మూడు రోజుల ముందు జట్టును ఎంపిక చేస్తుంది. అయితే మార్కెటింగ్ కారణాలతో భారత్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ముందే ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 4నుంచి బ్రిస్బేన్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం సెలక్టర్లు శనివారం జట్టును ప్రకటించనున్నారు. అయితే ఇది తమ నిర్ణయం కాదని, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమపై ఒత్తిడి తెచ్చిందని సెలక్టర్లలో ఒకడైన మార్క్‌వా వెల్లడించాడు. ‘తొలి టెస్టు కోసం శనివారం టీమ్‌ను ఎంపిక చేయనున్నాం. వాస్తవానికి మంగళవారంనుంచి ప్రారంభమయ్యే రెండో దశ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ల అనంతరం జట్టును ప్రకటించాలని భావించాం. అయితే మార్కెటింగ్ ప్రయోజనాల కోసం జట్టును ముందుగా ఎంపిక చేయమని సీఏ ఆదేశించింది’ అని వా చెప్పాడు. క్లార్క్‌పై మళ్లీ సందేహం! తొలి టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన మరుసటి రోజే అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై రోజుకో మాట వినిపిస్తోంది. మంగళవారంనుంచి జరిగే షెఫీల్డ్ గేమ్‌నుంచి క్లార్క్ తప్పుకోవడంతో అతను మొదటి టెస్టు ఆడేది అనుమానంగా మారింది. క్లార్క్ ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ గట్టిగా కోరుకుంటున్నా...అతను ఎప్పుడు తిరిగి ఆడగలడనేదానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఆగస్టునుంచి మూడు సార్లు క్లార్క్ తొడ కండరానికి గాయమైంది. ఈ గాయం అంత తొందరగా తగ్గదని ఆసీస్ జట్టు ఫిజియో అలెక్స్ కాంటూరిస్ అన్నారు. ‘క్లార్క్ బ్యాటింగ్ చేయలేకపోవడంతో పాటు కనీసం పరుగెత్తలేకపోతున్నాడు కూడా’ అని ఆయన చెప్పారు. గతంలో జరిగిన విధంగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పడితే మెల్బోర్న్లో జరిగే మూడో టెస్టుకు గానీ క్లార్క్ మ్యాచ్ ఫిట్నెస్తో సిద్ధం కాలేడు.