తొలి టెస్టుకు మైకేల్ క్లార్క్ సిద్ధం | Michael Clarke in squad for 1st Test, gets 2 days to prove his fitness | Sakshi
Sakshi News home page

తొలి టెస్టుకు మైకేల్ క్లార్క్ సిద్ధం

Published Mon, Nov 24 2014 10:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

తొలి టెస్టుకు  మైకేల్ క్లార్క్ సిద్ధం

తొలి టెస్టుకు మైకేల్ క్లార్క్ సిద్ధం

మెల్‌బోర్న్:టీమిండియాతో జరిగే తొలిటెస్టుకు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సిద్ధమయ్యాడు. సోమవారం విడుదల చేసిన 13 మంది క్రికెటర్ల జాబితాలో క్లార్క్ చోటు దక్కించుకున్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడిన క్లార్క్ వేగంగా కోలుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.  వచ్చేనెల 4న బ్రిస్బేన్‌లో జరిగే తొలి టెస్టులో క్లార్క్ ఆడతాడని ఆసీస్ సెలెక్టర్ రోడ్నీ మార్ష్ తెలిపాడు.

 

గత కొన్ని రోజుల నుంచి ఫిట్ నెస్ కోసం శ్రమించిన క్లార్క్ ఆ పరీక్షలో పాసయ్యాడని తెలిపాడు. తొలి టెస్టుకు ముందు టీమిండియాతో జరిగే వార్మప్ మ్యాచ్ లో కూడా క్లార్క్ పాల్గొనున్నట్లు మార్ష్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement