Show-cause notice
-
బీజేపీలో ముసలం.. పార్టీ ఎమ్మెల్యేకు హైకమాండ్ షోకాజ్‌నోటీసులు
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్‌గా తయారైంది. పార్టీలో అంతర్గత విబేధాల నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా బసనగౌడ, విజయేంద్ర వివాదంపై బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. ఈ మేరకు బసనగౌడ యత్నాల్‌కు షోకాజ్ నోటీసులు అందించింది. పార్టీ సిద్దాంత వ్యతిరేక వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.‘రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా యత్నాల్ ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగించే విషయం. యత్నాల్ వైఖరి రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అన్ని విషయాలపై పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది. పార్టీ నాయకులపై మీరు చేసిన తప్పుడు, ఆరోపణలు పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే. మీ చర్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది’ అని షోకాజ్ నోటీసులో పేర్కొంది. కాగా విజయేంద్రపై బసనగైడ తరుచూ విమర్శలు చేస్తున్నారు. విజయేంద్ర ఆయన వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని,పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమయ్యారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకమాండ్ చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణా నోటీసులపై స్పందించిన యత్నాల్.. పార్టీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. కర్ణాటకలో పార్టీ ప్రస్తుత స్థితిని కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో విజయేంద్ర భేటీ అయిన నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి. రాజకీయ లబ్ధి కోసం యత్నాల్ తనపై, తన తండ్రి బీఎస్ యడియూరప్పపై నిత్యం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విజయేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. -
కంగనా, మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు ఈసీ తెలిపింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల వరకు సుప్రియా శ్రీనాథే, దిలీప్‌ఘోష్ తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని, తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలిచచిన దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు. రాష్ట్ర కుమార్తెగా చెప్పుకుంటున్న మమతా..ముందుగా తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మహిళల గౌరవాన్ని తగ్గిస్తూ.. అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఇరు నేతలకు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. చదవండి: సీఎం పినరయ్ విజయన్ కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు -
టీఎంసీలో కీలక పరిణామం.. కునాల్ ఘోష్‌కు షోకాజ్ నోటీస్
లోక్‌సభ ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామానాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మరో నేత కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోల్‌కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతకు ముందే ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు. కునాల్ ఘోష్ శనివారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎంపీ సుదీప్ బెనర్జీ బ్యాంకు ఖాతాలు, ఆయన తరపున అపోలో, భువనేశ్వర్‌కు జరిగిన చెల్లింపులపై విచారణ జరపాలి. అతను కస్టడీలో ఉన్నప్పుడు, అతనికి పెద్ద మొత్తం చెల్లించారా లేదా అతని తరపున ఆసుపత్రికి చెల్లించారా లేదా అనే దానిపై విచారణ జరగాలని పోస్ట్ చేశారు. -
వివాదాల విష్ణుకుమార్ రాజు.. మాటలు ఎప్పుడు కోటలు దాటాల్సిందేనా?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పారీ్టలోనూ, అటు ఇతర పారీ్టల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు సాక్షాత్తూ సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నాను అనడం, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్లు పేర్కొనడం వంటివి అధిష్టానం సీరియస్ అవడానికి కారణమయ్యాయి. దీంతో ఆయనకు రాష్ట్ర పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఎందుకు మీపై చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇది పారీ్టలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ కుతూహలం వల్లే..? : ఇప్పటికే విష్ణుకుమార్‌రాజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. టీడీపీకి చేరువ కావడం ద్వారా ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న కుతూహలం ఆయనకు ఎప్పట్నుంచో ఉందని బీజేపీలోనే పలువురు చర్చించుకుంటున్నారు. అదే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం తెలిసి కూడా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విష్ణుకుమార్‌రాజు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అధిష్టానానికి రుచించలేదని అంటున్నారు. షోకాజ్ నోటీసు జారీ : ఒకపక్క పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం, మరోపక్క తాజాగా టీవీ ఇంటర్వ్యూలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెరసి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై విష్ణుకుమార్‌రాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటి పరిస్థితులకనుగుణంగా చేసినవి కావని, 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసినవని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని ఇతర పార్టీల నాయకులకంటే సొంత బీజేపీ నాయకులే ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. పార్టీ నేతల్లోనూ అసంతృప్తే.. విష్ణుకుమార్‌రాజు వైఖరిపై బీజేపీలోని కొంతమంది ముఖ్య నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై లోలోన సంతోస్తున్నారు. గతంలో పార్టీని బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో తనకు టీడీపీ, మరికొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నానంటూ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇలా తరచూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విష్ణుకుమార్‌రాజుపై తాజా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ వ్యాఖ్యల నేపథ్యంలోనైనా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. విష్ణుకుమార్‌రాజుపై చర్యలుంటాయా? షోకాజ్తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి. -
తప్పతాగి మహిళా పేషెంట్‌ని చితక్కొటిన డాక్టర్!
చత్తీస్‌గఢ్: మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన కోర్బాలోని చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గెర్వాని గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్థరాత్రి ఆరోగ్యం బాగోకపోవడంతో అంబులెన్స్‌కి కాల్ చేశాడు. ఐతే అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్ తన తల్లిని ఆటోరిక్షాలో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐతే డాక్టర్ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయ్యి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు. ఐతే సదరు డాక్టర్ శ్యామ్‌ని సైలెంట్‌గా ఉండు అంటూ అతని తల్లిని పదే పదే కొడుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌కి షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ మేరకు మెడిక్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ మిశ్రామ్ సదరు డాక్టర్‌కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. महिला पर डॉक्टर ने की थप्पड़ों की बारिश#korba #Chhattisgarh pic.twitter.com/tdehhmz8t0 — Nayabharat News (@NayabharatLive) November 9, 2022 (చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి) -
మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. దీంతో, ఊహించని విధంగా ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెల 22వ తేదీన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. అయితే, తనకు ఆ నోటీసులు అందలేదన్నారు. దీంతో, తాజాగా ఏఐసీసీ మరోసారి నోటీసులు పంపింది. ఇక, నోటీసుల్లో భాగంగా 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డిని కోరింది. ఇక, తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలువదు అంటూ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అంతకుముందు కూడా.. మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరినట్లు లీకైన ఆడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపకుండా బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక, ఈసారి కూడా కోమటిరెడ్డి స్పందించకపోతే.. ఆయనపై సీరియస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
ఆ స్థలాల్లో ఆక్రమణలు తొలగించండి
సాక్షి, అమరావతి: పార్కులు, పబ్లిక్ రోడ్లు, ఇతర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణలు తొలగించేటప్పుడు ఆక్రమణదారులకు షోకాజ్ నోటీసు జారీచేసి వారి వాదన వినాలని అధికారులకు హైకోర్టు స్పష్టంచేసింది. ఆ తర్వాతే వారిని ఖాళీచేయించే విషయంలో ఉత్తర్వులు జారీచేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పార్కులు, రోడ్లు తదితర ప్రజోపయోగ స్థలాల ఆక్రమణలపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పంచాయతీ, పురపాలక, అటవీ, రెవెన్యూ భూములను ఆక్రమించుకున్న వారిని ఆ భూముల నుంచి ఖాళీచేయించాలంటూ బుధవారం ఇచ్చిన ఆదేశాలను ఈ వ్యాజ్యాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది (రెవెన్యూ) పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి స్పందిస్తూ.. నాలాలు, కాలువలు పెద్ద సంఖ్యలో ఆక్రమణలకు గురై ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో మనకు బెంగళూరు, హైదరాబాద్ వంటి పరిస్థితి రాకూడదంటే నాలాలు, కాలువలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమే.. హైదరాబాద్, బెంగళూరు వంటి పరిస్థితి రాకూడదన్న ధర్మాసనం, ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో నాలాలు, కాలువలను కూడా చేరుస్తామని తెలిపింది. వీటి తొలగింపు విషయంలో పంచాయతీ, పురపాలక శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తారిని సుభాష్ చెప్పారు. ఈ వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
'విప్ ధికరణ'పై షిండే, థాక్రే వర్గాల ఢీ.. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా.. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు శాసనసభ సెక్రెటరీ. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. అందులోంచి షిండే వర్గం తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బలపరీక్షలో 164 మంది మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై నాలుగున జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చింది షిండే వర్గం. ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ -
కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ
No Plan To Show Cause Virat Kohli Says Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకున్నానని జరుగుతున్న ప్రచారంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇవాళ స్పందించాడు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశాడు. అసలు కోహ్లికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనే తనకు లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై బీసీసీఐ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, అతన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అడ్డుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై గంగూలీ స్పందించడంతో ప్రచారానికి తెరపడింది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. దీనిపై అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లిని వారించామని బీసీసీఐ.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాతావరణాన్ని హీటెక్కించారు. దీంతో కోహ్లి- బీసీసీఐ మధ్య పెద్ద అగాదం ఏర్పడిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి.. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో ఈ వార్తలు నిజమేనని బహిరంగ చర్చ కూడా సాగింది. ఇదే సమయంలో గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ! -
రూ.50కోట్లు ఇచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు: కౌశిక్‌రెడ్డి
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం’’ అన్నారు కౌశిక్ రెడ్డి. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం కౌశిక్‌రెడ్డికి ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని గురించి గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్ఎస్ తనకే టికెట్ ఇస్తుందని ఫోన్లో కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్ వైరలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం నోటీస్‌లో పేర్కొంది. గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. కాగా, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనకే టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని ఫోన్ల ద్వారా కౌశిక్‌రెడ్డి స్థానిక నాయకుల వద్ద చెప్తున్నట్టు వైరలైన ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. రానున్న ఉపఎన్నికల్లో తానే టీఆర్ఎస్ అభ్యర్థినంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మాదన్నపేట్‌కు చెందిన యువకుడితో కౌశిక్‌రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్ చేశారు?
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్, శానిటైజర్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్సైట్లో దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు శాఖలు యాప్‌ని ఎవరు సృష్టించారో తెలియదనే సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార కమిషన్ యాప్‌ని ఎవరు సృష్టించారనే దానిపై "తప్పించుకునే సమాధానాలు" ఇవ్వడంతో ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అధికారులు సమాచారాన్ని తిరస్కరించడాన్ని అంగీకరించము అని స్పష్టం చేసింది. ‘యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారు.. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ వివరించలేకపోయారు. ఇది సరైన పద్దతి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విభాగాలు నవంబర్ 24న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిది. (చదవండి: ఆరోగ్య సేతుకు మరో ఘనత) ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే విషయం తెలుసుకోవడం కోసం సౌరవ్ దాస్ అనే కార్యకర్త ప్రయత్నం చేశాడు. యాప్ ప్రతిపాదన మూలం, దాని ఆమోదం వివరాలు, పాల్గొన్న కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ విభాగాలు, యాప్‌ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ల కాపీలు వంటి వివరాలను ఆయన అడిగారు. రెండు నెలల పాటు ఇది వివిధ విభగాలలో చక్కర్లు కొట్టింది కానీ సరైన సమాధానం మాత్రం లభించలేదు. దాంతో యాప్ క్రియేషన్ గురించి సమాచారం ఇవ్వడంలో వివిధ మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయని సౌరవ్ దాస్ సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’) నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ "యాప్ సృష్టికి సంబంధించిన మొత్తం ఫైల్ ఎన్ఐసీ వద్ద లేదు" అని తెలిపింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నను జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగానికి బదిలీ చేసింది. అది "కోరిన సమాచారం (మా విభాగానికి) సంబంధించినది కాదు" తెలిపింది. ఈ క్రమంలో ఆర్టీఐ బాడీ.. చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పించుకునే సమాధానం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కమిషన్ తన నోటీసులో కోరింది. -
దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన కార్తీక్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో జెర్సీ వేసుకొని కనిపించాడు. ఈ జట్టు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ది కావడంతో అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అయిన కార్తీక్ సీపీఎల్‌లో పాల్గొనడం వివాదం రేపింది. ఈ ఫొటోలు బీసీసీఐ కంటబడటంతో సీఈఓ రాహుల్ జోహ్రి అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు. -
వాగ్దేవి కళాశాలకు షోకాజ్ నోటీసులు
జనగామ (వరంగల్) : హాస్టల్లో ఉంటున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి ఉమేశ్ మృతి ఘటనపై ఉన్నత విద్యాశాఖ స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కళాశాల, హాస్టళ్లను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో) హైమద్ నేతృత్వంలో సోమవారం పరిశీలించారు. హాస్టల్లో దాడి జరిగి విద్యార్థి మృతి చెందేవరకూ ఇంటర్ బోర్డుకు సమాచారం లేకపోవడంపై సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కళాశాలను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కళాశాల డెరైక్టర్ రమేశ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. యాజమాన్యం నుంచి సమాధానం రాకుంటే కాలేజీని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాగ్దేవితో పాటు జనగామ పట్టణంలో మరో ఐదు ప్రెవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అనుమతి లేకుండా హాస్టళ్లను నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. హాస్టళ్లను మూసి వేయకుంటే కళాశాలల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా, వాగ్దేవి కళాశాలను, హాస్టల్‌ను యూజమాన్యం మూసివేసినట్లు సమాచారం. దీంతో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
బీసీసీఐ, ఐపీఎల్ లకు ఈడీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పెద్దలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్ సందర్భంగా మీడియా హక్కుల ఒప్పందం విషయంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 425 కోట్ల రూపాయల మేర విదేశీ మారకద్రవ్యాల మొత్తానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ షోకాజ్ నోటీసు పంపింది. -
'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు'
న్యూఢిల్లీ: 'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు' అనే భావన మన దేశంలో పనిచేయదని బీజేపీ ఎంపి సాక్షి మహారాజ్ అన్నారు. అందువల్ల హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ మహిళ తప్పనిసరిగా నలుగురు పిల్లలను కనాలని ఆయన పునరుద్ఘాటించారు. మీరట్‌లో ఈ రోజు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి మహారాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇంతకు ముందు ఒకసారి జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సాక్షి మహరాజ్‌కు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ''పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలి'' అని ఆ నోటీస్‌లో పేర్కొంది. ఈ నోటీస్ విషయమై విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీ అంతర్గత వ్యవహారం అని మహారాజ్ అన్నారు. నోటీస్ అందిన తరువాత సమాదానం చెబుతామని చెప్పారు. ''ఈ విషయమై నేను మా పార్టీతో మాట్లాడతాను.మీతో మాట్లాడను'' అని విలేకరులకు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన మళ్లీ మళ్లీ ఆ వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఇల్లెందు ఎమ్మెల్యేకు షోకాజ్
పార్టీ ఫిరాయింపుపై వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన జానారెడ్డి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ ఫిరాయింపుపై షోకాజ్ నోటీస్ జారీ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన కనకయ్యపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ తెలంగాణ శాసనసభ కార్యాలయ కార్యదర్శి నోటీస్‌జారీ చేశారు. పార్టీ మారిన రెండు నెలల తర్వాత ఈ నోటీస్ రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలిచిన కోరం కనకయ్య ఆ తర్వాత కొద్ది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి పట్ల ఆకర్షితుడినయ్యానంటూ టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీనుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. పార్టీలోని సీనియర్ నేతలు ఈ అంశంపై విమర్శలు చేయకపోవడంతో కనకయ్య టీఆర్ఎస్లో చేరడంపై పార్టీనుంచి ఎవరికీ పెద్దగా వ్యక్తిగత అభ్యంతరాలు లేవన్న అభిప్రాయం అప్పట్లో కలిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన పలు జిల్లాల శాసనసభ్యులతోపాటు కనకయ్యకు శాసనసభ కార్యదర్శి నోటీస్ జారీ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడంతో..ఈనోటీసు జారీ చేసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఇల్లెందులోనే ఉన్న కనకయ్య నోటీస్ జారీ కాగానే హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. -
ఆధార్ అనుసంధానం నత్తతో పోటీ
- విద్యాశాఖలో జిల్లాకు చివరి స్థానం - నెల రోజులకు 51 శాతం మాత్రమే - నిర్లక్ష్యం వహించిన 29 మంది ఎంఈఓలు షోకాజ్ నోటీసులు కర్నూలు(విద్య): ఆధార్ అనుసంధానంలో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్య ఫలితంగా రాష్ర్టంలో జిల్లాకు చివరి స్థానం దక్కింది. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ అవసరమని పదేపదే చెబుతున్నా వాటిని అనుసంధానం చేయడంలో తాత్సారం చేయడంతో ఇప్పటి వరకు 51శాతం మాత్రమే పూర్తయింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి విద్యార్థుల పూర్తి సమాచారం ఆన్లైన్లో ఆధార్ నంబర్‌తో నమోదు చేయాలి. ఇందుకోసం విద్యాశాఖ ఈనెల 20వ తేదీలోపు 100 శాతం ఆధార్ సీడింగ్ చేయాలని నిర్ణయించింది. కానీ 51శాతం మాత్రమే పూర్తయింది. దీంతో తక్కువ శాతం సీడింగ్ చేసిన 29 మంది ఎంఈఓలకు శనివారం కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ ఆదేశాల మేరకు ఎస్ఎస్ఏ పీఓ మురళీధర్‌రావు షోకాజ్ నోటీసులిచ్చారు. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5,05,028 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 2,58,569 మంది విద్యార్థుల వివరాలు మాత్రమే ఆన్లైన్లో ఆధార్ సీడింగ్ చేశారు. ఇంకా 2,46,459 మంది వివరాలు అనుసంధానం చేయాల్సి ఉంది. ప్రైవేటు పాఠశాలల ముందంజ ఆధార్ సీడింగ్ అంశంలో ప్రైవేటు పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో 3,99,157 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 2,06,387 మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 22,980 మందికి గాను 9,558 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 82,891 మందికి గాను 42,624 మంది ఆధార్ సీడింగ్ పూర్తి అయింది. మొత్తంగా 51 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగింది. 100 శాతం పూర్తి చేసేందుకు ఎంఈఓలు, సీఆర్పీ, ఎంఎస్ కోఆర్డినేటర్లు రెండు రోజుల్లో మిగిలిన 49 శాతం అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. నెల రోజులకు పైగా 51 శాతం మాత్రమే ఆధార్ సీడింగ్ చేసిన హెచ్ఎం. ఎంఈఓలు రెండు రోజుల్లో ఏ మేరకు చేస్తారో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు కలిగే ప్రయోజనాలకు అర్హత పొందాలంటే విద్యార్థుల వివరాలతో ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి. -
రెస్టారెంట్‌ను ఖాళీ చేయిస్తాం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేవాదాయ శాఖ స్థలం లీజు వ్యవహారంలో అవకతవకలపై ‘షాడో ఎంపీపీ గ‘లీజు’’ శీర్షికన బుధవా రం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారుల్లో చలనం వచ్చింది. నగర నడిబొడ్డున ఉన్న చుండూరి రత్నమ్మ సత్రం స్థలాన్ని సబ్ లీజుకు తీసుకున్న ఏలూరు ఎంపీపీ రెడ్డి అనూరాధ భర్త అప్పలనాయుడు అక్కడ మాంసాహార హోటల్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తేల్చిచెప్పారు. స్థలాన్ని సబ్ లీజుకు ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని, దీనిపై సంబంధిత కార్యనిర్వహణాధికారిని వివరణ కోరుతూ షోకాజ్ నోటీ సులు జారీ చేస్తామని చెప్పారు. ఈ విషయమై సత్రం కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ వివరణ ఇస్తూ.. తాను జూన్ నెలలోనే సత్రం అదనపు బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. స్థలా న్ని సబ్లీజుకు ఇచ్చిన విషయాన్ని తొలుత గమనించలేదన్నారు. ఈ మధ్యనే విషయం తన దృష్టికి రాగా, లీజుదారులకు నోటీసులు సిద్ధం చేశామన్నారు. వారు నగరంలో నివా సం లేకపోవడంతో నోటీసులు అందచేయలేకపోయామన్నారు. ఈ అంశంపై స్టాం డింగ్ కౌన్సిల్ న్యాయవాదులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. లీజుదారుల చిరునామా దొరకని పక్షంలో సబ్ లీజుదారులను నిబంధనల మేరకు ఖాళీ చేయించడానికి పోలీసుల సహా యంతో రెండుమూడు రోజుల్లో స్పష్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
గుమస్తాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోవద్దు: హైకోర్టు
న్యూఢిల్లీ: బిర్లా మందిరం ప్రాంగణంలోని దుకాణాల్లో పనిచేసే గుమస్తాలపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఢిల్లీ హైకోర్టు... న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను శనివారం ఆదేశించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారం రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హక్కులను కాలరాసేందుకు యత్నిస్తున్న ఎన్ఎండీసీపై అపిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని గుమస్తాలకు సూచించింది. పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఎన్ఎండీసీకి సూచిం చింది. నలుగురు గుమస్తాల విజ్ఞప్తిని న్యాయవాది అనుసూర్య సాల్వన్ కోర్టుకు వివరించారు. ఎన్ఎండీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద గుమస్తాలకు షోకాజ్ నోటీసును జారీ చేసిందని, బిర్లా మందిరం పరిసరాలను దుర్వినియోగం చేశారని పేర్కొనట్లు వాదించారు. అదేవిధంగా అక్రమంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. 1939లో భూమి భవనాల శాఖ శ్రీ సంతాన్ ధర్మ సభ లక్ష్మి నారాయణ దేవాలయం ట్రస్టీకి అప్పగించింది. ట్రస్టీ ఆధ్వర ్యంలో నిర్మిస్తున్న బిర్లామందిరంలో భక్తుల సౌకర్యార్థం దుకాణాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో భక్తి పుస్తకాలు, సామగ్రి, సీడీలు విగ్రహాలు, పూలు తదితర పూజా వస్తువులు, ప్రసాదాలు విక్రయించడానికి అనుమతి ఉన్నదన్నారు. అయితే అనధికార నిర్మాణాలకు మాత్రమే ఎన్ఎండీసీ చట్టంలోని సెక్షన్ 250 వర్తిస్తుందని చెప్పారు. గుమస్తాలు దుకాణాలను కొనసాగకుండా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ మేరకు కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.