singur project
-
గరిష్ట స్థాయికి చేరిన సింగూర్ ప్రాజెక్ట్ నీటిమట్టం
-
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
మల్లన్న నుంచే సింగూరుకు గోదారి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధత తొలగింది. కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచే నీటిని గతంలో ప్రతిపాదించిన మాదిరి సింగూరుకు గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో సింగూరుకు తరలించేలా చేపట్టిన పనులను తిరిగి ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో గత కొన్నేళ్లుగా ఆగిన ప్యాకేజీ–17, 18, 19 పనులు తిరిగి ఆరంభమయ్యాయి. విద్యుత్, భూసేకరణ ఖర్చులు ఆదా.. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించే ప్రక్రియను గతంలోనే చేపట్టారు. మల్లన్న సాగర్‌లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా, సింగూరు లెవల్ 530 మీటర్లు ఉంది. గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18 కి.మీల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం మూడేళ్ల కింద నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి దీనికి అనుగుణంగా ప్రణాళికలు వేసింది. అయితే కొండపోచమ్మ ద్వారా నీటిని తరలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్–65ని కూడా దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.5 కోట్లకు పైగా ఉండటంతో భూసేకరణ భారం కానుంది. అదీగాక కొండపోచమ్మ సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపు అనుకున్న మేర సరఫరా చేయడం సాధ్యం కాదు. దీనికి బదులు మల్లన్న సాగర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు తరలిస్తే మేలని ప్రభుత్వం ఇటీవల ఇంజనీర్లతో జరిపిన చర్చల సందర్భంగా తేల్చింది. విద్యుత్ ఖర్చు రూ.67 కోట్లు.. మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే ఉంటుందని, అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవసరం ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం తేల్చి చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే సేకరించిన భూమి అవసరాలపై వెచ్చించిన రూ.500 కోట్లు మేర ఆదా ఉంటుందని తెలిపారు. దీంతో ఏకీభవించిన ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ ద్వారానే సింగూరుకు నీటిని తరలించాలని సూచించారు. దీంతో ఇప్పుడిప్పుడే మూడు ప్యాకేజీల పనులను ఏజెన్సీలు తిరిగి ఆరంభించాయి. -
‘ఆ మంత్రిని జిల్లాల్లో తిరగనివ్వం’
సాక్షి, మెదక్: సింగూర్ నీటిని తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టిన కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మంత్రి హరీష్‌రావు అనాలోచితంగా నీటిని తరలించడం వలనే సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్-ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మున్సిపాలిటీకి నీరు అందడం లేదన్నారు. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నీటి సమస్య తీర్చే విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు హరీష్ రావు ను మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తిరగనిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను గాలికొదిలేసి.. హరీష్ రావు ఇంటి వద్ద భజన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. -
ఎండిన సింగూరు...
సాక్షి, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పారిశ్రామిక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. పుల్కల్, అందోల్ మండలంలోని 35 గ్రామాలకు మాత్రమే ప్రస్తుతం పోచారం సత్యసాయి నీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పెద్దారెడ్డిపేట, బుసరెడ్డిపల్లి శివారుల్లో నిర్మించిన మిషన్ భగీరథ నీటి పంపింగ్ కేంద్రాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లావాసులు మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. అయితే వేసవిలోనే ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోవడంతో గత నెల నుంచి ప్రాజెక్టు లోపలి భాగంలో తాత్కాలిక కాల్వల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో తాగునీటి సరఫరా నిలిపివేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, మెదక్, నారాయణఖేడ్‌తోపాటు అందోల్ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని తరలిస్తున్నారు. మార్చిలో ఉన్న 5.21 టీఎంసీల నీటి మట్టం ఆధారంగా జూలై వరకు తాగు నీటిని సరఫరా చేస్తామని అంచాన వేశారు. కానీ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఎండిపోయింది. మిషన్ భగీరథ స్కీం ద్వారా ప్రతీ రోజు లక్ష మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా రోజుకు 50 వేల మిలియన్ లీటర్ల నీటినే సరఫరా చేశారు. సింగూరులో నీటి కొరత ఫలితంగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. జూలై నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకు సరైన వర్షాలు లేనందున నాలుగు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వర్షాకాలంలోనూ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
‘జగ్గారెడ్డిని జనాలు ఈసడించుకుంటున్నారు’
సాక్షి, సంగారెడ్డి : ప్రజలకు సేవ చేయకుండా అవినీతి, అక్రమాలు చేసిన జగ్గారడ్డిని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం జగ్గారెడ్డి మాయ మాటలు చెబుతున్నాడని మండి పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రజలకు కనీసం అందుబాటులో లేకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు. సింగూరు ప్రాజెక్ట్ గురించి జగ్గారెడ్డి ప్రతిసారి అవాస్తవాలే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులను విమర్శించే హక్కు జగ్గారెడ్డికి లేదని తెలిపారు. తన అవినీతి అక్రమాలపై జగ్గారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభాకర్ ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోవడం మామూలే అన్నారు. గతంలో 2005, 2008, 2015లో సింగూర్ పూర్తిగా ఎండిపోయిందని గుర్తు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థులైన నాయకులను నిలబెడతాం అన్నారు. జగ్గారెడ్డి, హరీశ్ రావు కాలి గోటికి ఉన్న దుమ్ముతో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింత ప్రభాకర్‌లపై విమర్శలు చేస్తే గెలుస్తాను అనుకోవడం జగ్గారెడ్డి ముర్ఖత్వం అన్నారు ప్రభాకర్. -
‘మల్లన్న’ నుంచే సింగూరుకు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సింగూరుకు ఎత్తిపోసే విషయంలో మళ్లీ సందిగ్ధత ఎదురవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనను మార్చి కొండపోచమ్మ సాగర్ నుంచి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయగా మళ్లీ ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి తరలించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు టన్నెల్ పనుల్లో జాప్యం, లిఫ్ట్ అవసరాలు ఉండటంతో దాన్ని పక్కనపెట్టి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం ఆ ప్రతిపాదన వద్దని మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. మళ్లీ మొదటికి... గతంలోనే కాళేశ్వరం స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసాగర్ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్ 530 మీటర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. అయితే మధ్యలోని ప్యాకేజీ–17లోని 18 కి.మీల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసింది. ఈ విధానం ద్వారా మరింత ఆయకట్టుకు నీరందించవచ్చని చెబుతూ దీనికి అనుగుణంగా కొండపోచమ్మ సాగర్ కింద కాల్వల నిర్మాణానికి, సంగారెడ్డి కాలువ వ్యవస్థ రూ. 1,330 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ కాల్వలను విస్తరించి సింగూరుకు నీటిని తరలించాలని నిర్ణయించారు. అయితే ఇటీవల గోదావరి పరీవాహకంలో పర్యటించిన రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో కూడిన బృందం... కాళేశ్వరం జలాలను సింగూరుకు తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి తరలింపుకన్నా మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపే ఉత్తమమని తేల్చింది. తాజా ప్రతిపాదనకు కారణాలివే... సింగూరుకు నీటిని తరలించే 96వ కి.మీ. నుంచి 150.59 కి.మీ వరకు ఉన్న అలైన్మెంట్ సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతం, గీతం యూనివర్సిటీ, కాశీపూర్, కంది గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, మల్కా పూర్లోని పెద్ద చెరువు మీదుగా వెళ్లాల్సి ఉందని, ఎన్‌హెచ్–65ని కూడా దాటాల్సి ఉంటుందని నివేదికలో రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ. కోటికిపైగా ఉందని, దీన్ని చదరపు గజాల కింద విభజించి పరిహారిన్ని లెక్కిస్తే భూసేకరణకే భారీగా నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ భూముల నుంచి కాల్వలను తవ్వే ప్రక్రియపై ఏవైనా కోర్టు కేసులు నమోదైనా, లిటిగేషన్లో ఉన్న వీటి పరిష్కారానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.దీనికితోడు కొండపోచమ్మ సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. అదే జరిగితే సింగూరు జలాలపైనే ఆధారపడిన నిజాం సాగర్‌కు నీటి తరలింపు ఇబ్బందిగా ఉంటుంది. దీని బదులు మల్లన్నసాగర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటునుంచి నిజాంసాగర్‌కు తరలించడమే ఉత్తమం. ఇక మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే అవుతుండగా అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవనుంది.ఇప్పటికే మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు గతంలోనూ ప్యాకేజీ–17, ప్యాకేజీ–18లో పనులు, భూసేకరణ అవసరాలకు రూ. 600 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం అలైన్మెంట్ మారిస్తే ఈ ఖర్చంతా వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ఆర్థిక, నిర్మాణ, నిర్వహణపరంగా మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. -
ఘనపురం పరవళ్లు
పాపన్నపేట(మెదక్): బీళ్లు వారిన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు నుంచి మంగళవారం విడుదల చేసిన 1.6 టీఎంసీల నీరు వరదై పోటెత్తింది. మంజీర బ్యారేజి నుంచి 2 గేట్లు ఎత్తి వదిలిన నీరు 9,800 క్యూసెక్కుల పరిమాణంలో పరుగులు తీస్తోంది. ఎడారిలా మారిన మంజీర గర్భాన్ని తడుపుకుంటూ.. మార్గం మ«ధ్యలో చిన్న చిన్న మడుగులు నింపుకుంటూ.. గురువారం రాత్రికి ఘనపురం ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. దీంతో ఘనపురం ఆనకట్ట కింద.. మంజీర తీరం వెంట వేసిన వరి పంటకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఘనపురం ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాల పంటలు గట్టెక్కినట్లేనని రైతన్నలు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రైతన్నల ఆశలకతీతంగా సింగూరు నుంచి విడిచిన 1.6 టీఎంసీల నీటితో ఘనపురం ప్రాజెక్టు కింద వేసిన పంటలతో పాటు, నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ప్రయోజనం కలగనుంది. సుమారు టీఎంసీ నీరు దిగువన ఉన్న నిజాంసాగర్‌కు చేరనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు కురువలేదు. అయినా ఆశ చావని రైతన్నలు జూన్ నెలలోనే మంజీర మడుగుల్లో నిలవ ఉన్న నీటిని.. బోరుబావుల ఊటలను నమ్ముకొని 18 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. కింది పొలాలను దృష్టిలో ఉంచుకొని.. సింగూరు ఎగువన సైతం వర్షాలు పడక పోవడంతో సింగూరు నిండలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో మిషన్ భగీరథకే 6 టీఎంసీల నీరు అవసరం కానుంది. దీంతో సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 3 వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందదర్‌రెడ్డి అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. సాధారణంగా అయితే ఘనపురం ప్రాజెక్టుకు ప్రస్తుత తరుణంలో 0.4 టీఎంసీలు సరిపోతాయని అంచనా. అయినప్పటికీ ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను, నిజాంసాగర్ ఆయకట్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ 1.6 టీఎంసీల నీటి విడుదల కోసం జీఓ విడుదల చేశారు. విడుదల చేసిన నీరు, రెండు రోజుల పాటు, ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగి పొర్లనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరదలు ఉదృతంగా ఉండే అవకాశం ఉన్నందున నది వైపు ఎవరూ వెళ్లొద్దని ఇరిగేషన్ ఈఈ యేసయ్య సూచించారు. -
రచ్చ
జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి తరలింపుపై అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలకు దిగారు. నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్ హాలీడేపై మొదలైన చర్చ వాగ్వాదానికి దారి తీసింది. డీఈఓ వ్యవహారశైలిని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఫోన్ చేసినా కనీస స్పందన ఉండడం లేదని మండిపడ్డారు. గొర్రెల ఇన్సూరెన్స్ అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పా టిల్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ టి.రవి హాజరయ్యారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నీటి పారుదల శాఖపై జరిగిన చర్చ సందర్భంగా నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్ హాలీడే ఇవ్వడాన్ని నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రశ్నించారు. క్రాప్ హాలీడే తీర్మానాలపై ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలే సంతకాలు చేశారని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో 8వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇస్తున్నారని, నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు తరలించడాన్ని ప్రశ్నించారు. నీళ్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ విమర్శించారు. సింగూరు పరిధిలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని బాబూమోహన్ ప్రకటించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి జిల్లా అవసరాలకు అవసరమైన నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంత రైతులను ఆదుకునేందుకు సింగూరు నీటిని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగూరు నీటి విడుదలకు ఘణపూర్ ప్రాజెక్టు రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో సింగూరుకు నీటిని తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. డీఈఓ తీరుపై సభ్యుల మండిపాటు.. జిన్నారం మండలం బొల్లారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు అందినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిన్నారం ఎంపీపీ కొలన్ రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. తాము ఫోన్ చేసినా డీఈఓ విజయకుమారి స్పందించడం లేదని మండిపడ్డారు. ఎంపీపీ ఫోన్ నంబరు తన వద్ద లేదని డీఈఓ వ్యాఖ్యానించడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో జహీరాబాద్ మండలంలో కొందరు ఉపాధ్యాయుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు డీఈఓ విజయకుమారి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేతపై కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహణపై నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రస్తావించారు. సబ్సిడీ పథకం కింద పంపిణీ చేస్తున్న గొర్రెలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నా.. వందల సంఖ్యలో మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయింలు ఇవ్వడంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, అంజయ్య, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ ప్రశ్నించారు. గొర్రెల రీ సైక్లింగ్, పశు వైద్య సేవలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ జరగాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గొర్రెల పథకం ప్రవేశ పెట్టిన సీఎంను అభినందిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీర్మానం ప్రతిపాదించారు. సబ్సిడీ గొర్రెలు అమ్ముకునే లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ స్పష్టం చేశారు. ► ఆర్సీపురం మండలంలో రెండు అదనపు పీహెచ్‌సీలు మంజూరు చేయాలని ఎంపీపీ యాదగిరి యాదవ్ కోరారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని చేగుంట ఎంపీపీ అల్లి రమ వ్యాఖ్యానించారు. కానుకుంట పీహెచ్సీలో వైద్యులను నియమించాలని జిన్నారం ఎంపీపీ రవీందర్‌రెడ్డి కోరారు. ఇంటి వద్దే ప్రసవాలు జరగడాన్ని పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ లేవనెత్తారు. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వ కృషిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రశంసించారు. దశల వారీగా సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అంగీకరించారు. ► ఈ ఏడాది మార్చి 11న పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ► ట్రాక్టర్లు, వరికోత యంత్రాల పంపిణీలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల సిఫారసులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కోరగా, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ► శివ్వంపేట మండలం నవాబుపేటలో 2 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించాలని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ కోరారు. ► మిషన్ భగీరథ, విద్యుత్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. నిత్యావసరాల పంపిణీలో ఈ పాస్ వి ధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జరిగిన చర్చలో కొండాపూర్ ఎంపీపీ విఠల్, పటాన్చెరు జెడ్పీటీ సీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగూరుకు జలసిరి
పుల్కల్: సింగూరు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. సోమవారం ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి 2,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్ బాలగణేష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా సాంకేతిక కారణాలతో 29 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 28.966 టీఎంసీల నీటి మట్టం ఉంది. 523.600 మీటర్లకుగాను 523.435 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని మంగళవారం నుంచి దిగువకు విడుదల చేస్తామని బాలగణేష్ తెలిపారు. ఏ సమయంలోనైనా దిగువకు నీటిని వదిలే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దండోరా వేయించినట్లు వివరించారు. -
పల్లెకు 'వలస'
- మళ్లీ పల్లెబాట పడుతున్న ‘సింగూరు’ రైతులు - దశాబ్దాల తర్వాత సేద్యానికి నీళ్లు - కాలువలు పూర్తి చేసి 47,500 ఎకరాలకు నీరు విడుదల - ఇన్నాళ్లూ కరువుతో పట్నం వలస వెళ్లిన వందలాది కుటుంబాలు - ప్రాజెక్టుకు నీటి రాకతో తిరిగి వెనక్కి ∙20 ఏళ్ల తర్వాత వ్యవసాయం - పొలం పనుల్లో రైతులు.. కళకళలాడుతున్న పంట పొలాలు సాగు చేద్దామంటే చుక్క నీరు లేక.. చేయడానికి పనేమీ దొరక్క.. బతకాలంటే పట్నం పోక తప్పదనే బాధతో.. పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు వలస వచ్చిన రైతు కుటుంబాలు అవి. కానీ ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి తమ పల్లె బాట పడుతున్నాయి. సింగూరు నీటితో తమ పొలాల్లో బంగారం పండించుకోవచ్చనే ఆశతో వెనుదిరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్, పుల్కల్ మండలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 44 గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాల గాథ ఇది. సింగూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి.. ఆ నీటితో చెరువులు నింపి, పొలాలకు అందిస్తుండడమే దీనికి కారణం. ఇరవై ముప్పై ఏళ్ల కింద సింగూరు ప్రాంతం నుంచి వలస వెళ్లిన వందలాది కుటుంబాలు కూడా తిరిగి స్వగ్రామాలకు వచ్చి.. తమ పొలాలను సాగు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్... – జోగిపేట, పుల్కల్ (ఆందోల్) సాగు చేద్దామంటే నీళ్లు లేక.. బోర్లు వేసే స్థోమత లేక ఉపాధి కోసం పొట్టచేతబట్టుకుని పట్నం బాట పట్టిన ‘సింగూరు’ప్రజలు తిరిగి సొంతూళ్ల బాట పడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని ఆందోల్, పుల్కల్ మండలాలకు చెందిన 759 కుటుంబాలు వ్యవసాయం చేసుకునేందుకు మళ్లీ స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల కింద 1990–91లో కురిసిన భారీ వర్షాలతో ఆందోల్ పెద్ద చెరువులోకి భారీగా నీరు వచ్చి పొంగి పొర్లగా.. ఇప్పటిదాకా మళ్లీ చెరువు నిండిందే లేదు. అలాంటిది ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా ఆందోల్ పెద్ద చెరువుకు మళ్లించడంతో.. నీరు నిండి అలుగు పారింది. ఇలా అలుగుపారి పిల్ల కాలువల ద్వారా వచ్చిన నీటిని సైతం దాదాపు నెల రోజుల పాటు రైతులు పొలాలకు మళ్లించుకున్నారు. మొత్తంగా 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూములు ఇప్పుడు పంటలతో కళకళలాడుతున్నాయి. వైఎస్ హయాంలో.. ఆందోల్ నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి సింగూరు కాలువ పనులకు రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వైఎస్ శంకుస్థాపన కూడా చేసి.. పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సింగూరుపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ కాలువలు పూర్తి చేయించారు. దీంతో గత యాసంగిలోనే రైతులకు నీరందింది. అంతేకాక ప్రత్యేకంగా 90 చెరువులను సింగూరు నీటితో నింపేందుకు అదనంగా కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించగా.. ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాబూమోహన్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో కాలువ పనులు వేగంగా పూర్తయ్యాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఈ రెండు మండలాల్లోంచి కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్లాయి. పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం పంచాయతీ పరిధి నుంచి సుమారు 38 కుటుంబాలు పట్నం వెళ్లాయి. ఇలాంటి వారిలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగి వచ్చాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరికి హైదరాబాద్‌లోనే రేషన్‌కార్డులు, అక్కడి చిరునామాలతోనే ఆధార్‌కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా హైదరాబాద్‌లోని కార్డులను రద్దు చేసి.. తమ స్వగ్రామాల చిరునామాతో ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 20 ఏళ్లుగా బీడు భూములే.. సింగూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నా.. ఆందోల్, పుల్క ల్ మండలాల్లోని వేల ఎకరాలకు నీరందకపోవడంతో అవన్నీ దాదాపు 20 ఏళ్లుగా బీడుగా మారిపోయాయి. ఈ ప్రాంతాలకు వందలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు వలస వెళ్లిపోయాయి. వారంతా సికింద్రాబాద్, పటాన్చెరు, రామచంద్రాపురం, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో అడ్డా కూలీలుగా మారిపోయారు. పనులు దొరకక, కడుపు నిండక అర్ధాకలితోనూ అలమటించారు. ఇప్పుడు పొలాలకు సింగూరు జలాలు వస్తుండడంతో తిరిగి వచ్చారు. ఇది నా అదృష్టం.. ‘‘ఖరీఫ్ సీజన్లో 47,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సింగూరు జలాలను వదిలే అవకాశం నాకు దక్కడాన్ని జీవితంలో మరిచిపోలేను. రైతులకు నీరందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కృషితోనే సింగూరు జలాలు అందుతున్నాయి. ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన వందల కుటుంబాలు వెనక్కి రావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆందోల్, పుల్కల్లలోని ఒక్క చెరువును కూడా ఎండిపోనివ్వం. సింగూరులోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుందని సీఎం అసెంబ్లీలోనే స్వయంగా చెప్పారు కూడా..’’ – పి.బాబూమోహన్, ఆందోల్, ఎమ్మెల్యే వందల కుటుంబాలు వెనక్కి.. సింగూరు జలాలు రావడంతో వివిధ ప్రాం తాలకు వలస వెళ్లిన రైతులంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. ఆందోల్ మండల పరిధిలోని కాలువ పరీవాహక ప్రాంతాలకు చెందిన 438 కుటుంబాలు దాదాపు 25 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వచ్చాయి. ఆందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, రాంసానిపల్లి, అన్నాసాగర్, పోసానిపేట, మాసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 1,338 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇక పుల్కల్ మండలంలో సుమారు 15 గ్రామాలకు చెందిన 321 రైతు కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చి పంటలను సాగు చేసుకుంటున్నాయి. నాడు బీళ్లు.. నేడు పంటలు ఈ ప్రాం తంలో ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు ఇప్పుడు ఎక్కడ చూసినా నారుమళ్లు, వరినాట్లతో కళ కళలాడుతున్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లిన రైతులంతా వెనక్కి వచ్చి వారి భూముల్లో పంటలు వేస్తున్నారు. తమ పొలాల్లో తిరిగి నాట్లు వేసుకోవడం, దున్నుకోవడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. యాసంగి నాటికే కొన్ని కుటుంబాలు పంటలు వేయగా.. ఇప్పుడు సాగు మరింతగా పెరిగింది. రైతులంతా పంటలు సాగు చేసుకుంటుండడంతో ఇక్కడ కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు (529 అడుగులు) ప్రస్తుత నీటి నిల్వ18 టీఎంసీలు (521 అడుగులు) ఎడమ కాలువ ద్వారా సరఫరా 37,500 ఎకరాలకు 90 చెరువుల ద్వారా సరఫరా 10,000 ఎకరాలకు వెనక్కి వచ్చిన కుటుంబాలు 759 నీరు రావడంతో పల్లెకు వచ్చా.. ‘‘ఇప్పటివరకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సంగారెడ్డిలో ఉన్నాం. ఇçప్పుడు సింగూరు నీరు వస్తుండటంతో తిరిగి ఊరికి వచ్చాం. ఇంత కాలం బీడుగా ఉన్న భూమిలో అచ్చుకట్టి పొలం చేశాను. పంటలు పండిస్తూ నలుగురికి పని కల్పించే అవకాశం వచ్చింది. కుటుంబంతో కలసి ఇంటి వద్దే పనిచేసుకోవడం ఆనందంగా ఉంది..’’ – గోపాల్ రాథోడ్, బొమ్మారెడ్డిగూడెం పొలాలన్నీ కళకళలాడుతున్నాయి ‘‘నీటి వసతి లేకపోవడంతో ఏళ్ల తరబడి మా పంటలను బీళ్లుగా ఉంచుకున్నాం. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. ప్రభుత్వం కాలువల పనులు పూర్తిచేసి చెరువులు నింపి సేద్యానికి నీరందిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పొలాల నిండా నాట్లతో, కూలీలతో కళకళలాడుతున్నాయి..’’ – పెంటయ్య, రైతు, పుల్కల్ మూడెకరాల్లో వరి వేస్తున్నాం.. ‘‘సింగూరు నీరు రావడంతో ఉన్న మూడెకరాల్లో వరి పంట వేస్తున్నా. గత రబీ లో నీరు వచ్చినప్పుడు పంట లు వేసిన. ఇప్పుడు కూడా నీరు వస్తోంది. వారం రోజు ల్లో నాట్లు వేస్తాం. ఇప్పటివరకు నీళ్లు లేక వలస పోయాం. ఇప్పుడు మాకే పని కోసం మనుషులు సరిపోవడం లేదు..’’ –అల్గొల స్వప్న, సింగూరు 611 రేషన్‌కార్డులకు దరఖాస్తులు ‘‘ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు ఇప్పుడు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. తమకు పట్నంలో రేషన్, ఆధార్‌కార్డు ఉన్నాయని, వాటిని రద్దు చేసి ఇక్కడ ఇవ్వాలంటూ ఇప్పటివరకు 611 మంది దరఖాస్తు చేసుకున్నారు. కార్డుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం..’’ – తహసీల్దార్ 47,500 ఎకరాలకు నీరిస్తున్నాం ‘‘ఖరీఫ్ సీజన్లో సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆందోల్, పుల్కల్ మండలాలతో పాటు మునిపల్లి, సదాశివపేట తదితర 44 గ్రామాల్లోని 47,500 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం. యాసంగిలో సుమారు 30 వేల ఎకరాల వరకు నీరందించాం. అప్పట్లో 70 చెరువులను నింపగా.. ఈ ఖరీఫ్ సీజన్లో 90 చెరువులను నింపి పది వేల ఎకరాలకు, కాలువల ద్వారా 37,500 ఎకరాలకు నీరందిస్తున్నాం. మరో 30 చెరువులను నింపేందుకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చే యాసంగికి కుడి కాలువ ద్వారా 2,500 ఎకరాలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’’ – బాలగణేశ్, సాగునీటి శాఖ డిప్యూటీ ఈఈ -
వైఎస్ హయాంలోనే సింగూరు కాల్వలకు నిధులు
• సింగూరు జలాల కోసం పోరాడింది కాంగ్రెస్సే • దివంగత నేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే నిధులు • అందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిపేట : దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రూ.89.98 కోట్లను సింగూరు ప్రాజక్టు కాల్వల నిర్మాణానికి మంజూరు చేశారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పి.నారాయణ, పద్మనాభరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దివంగత నేత పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో జోగిపేటలో సింగూరు జలాల దీక్షా శిబిరాన్ని సందర్శించారని, అధికారంలోకి రాగానే ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాల సేద్యానికి కాల్వల ద్వారా నీటిని అందిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేసారన్నారు. సింగూరు నీటిని సేద్యానికి తామే ఇచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రారంభోత్సవాల పార్టీయేనన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ నేతృత్వంలో 2003వ సంవత్సరంలో 102 రోజుల పాటు రిలే దీక్షలను చేపట్టారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేయకుంటే సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనను విభేదించిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్, మాజీ డిప్యూటీ సీఎం తల్లితో ప్రారంభించారని అన్నారు. కాల్వల నిర్మాణం ఎవరి హయాంలో ప్రారంభమైందో ప్రజలకు తెలుసన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మీద అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీయేనని, ఈ విషయాన్ని సీఎం కేసీఆరే అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని, తెచ్చేలా కృషి చేసింది దామోదర్ రాజనర్సింహ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అందోల్ మండల, పట్టణ అధ్యక్షులు బి.శివరాజ్, సత్తయ్య, మాజీ ఎంపీటీసీలు సురేందర్‌గౌడ్, ఏ.చిట్టిబాబు, రాజిరెడ్డి, రారుుని కృష్ణయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు అర్పత్ మొహియొద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు శేరి సంగారెడ్డి, మహేష్‌గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, డి.అశోక్, గణేష్, సర్పంచ్ అశోక్, కౌన్సిలర్లు శరత్‌బాబు, సునీల్‌కుమార్, మైనార్టీ నాయకులు అలీఅబ్బాస్, గోహేర్‌అలీ పాల్గొన్నారు. -
ఎకరం భూమి కోసం.. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు!
జన్మభూమి మీద మమకారం చంపుకోవడం కష్టం. దాని విలువ ఎంత అన్నది పక్కన పెడితే.. సొంతూరిలో కొద్దిమాత్రం భూమి ఉన్నా సరే దాన్ని కాపాడుకోవాలని చూస్తుంటారు. సరిగ్గా ఇలాంటి అభిమానమే ఓ ఎన్నారైని ఆస్ట్రేలియా నుంచి రప్పించింది. ఆ దేశంలో ఐటీ మేనేజర్‌గా మంచి పొజిషన్లో ఉన్న రోహితస్వ దాస్ అనే వ్యక్తి.. సింగూరులోని తన ఎకరం భూమి కోసం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాడు. తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు ఆ ఎకరం భూమే కారణమని అతడు గర్వంగా చెబుతున్నాడు. బెల్మాంట్ సివిక్ సెంటర్ ప్రాతంలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న దాస్‌కు సింగూరు ప్రాంతంలో సరిగ్గా ఎకరం భూమి (మూడు భిగాలు) ఉంది. తన పూర్వీకుల పొలాన్ని చూసుకుని అతడు ఆనందబాష్పాలు కార్చాడు. ఈ భూమిలో తమ కుటుంబం ప్రత్యేక రకానికి చెందిన వంకాయలు పండించేదని గుర్తుచేసుకున్నాడు. ''నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను. మాది రైతు కుటుంబం. ఈ భూమిలో మేం వంకాయలు, బంగాళాదుంపలు పండించి, వాటిని అమ్మి జీవించేవాళ్లం. వాటితో వచ్చిన డబ్బులతోనే నేను బారానగర్‌లోని ఇండియన్ స్టాటస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఎం.స్టాట్ చేశాను. తర్వాత, బరోడాలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాను. అలా వెళ్లినంత మాత్రాన సింగూరుతో నా బంధం ఏమాత్రం తెగిపోలేపదు. ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడికొచ్చి పొలం చూసుకుంటూ ఉంటాను. మా బంధువుల్లో కొందరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు'' అని దాస్ చెప్పారు. సింగూరు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను దాస్ ఆస్ట్రేలియన్ పత్రికలలో చదివాడు. ఈ అంశానికి ఆస్ట్రేలియన్ మీడియాలో చాలా విస్తృతంగా కవరేజి వచ్చిందని, తర్వాత తన బంధువులు ఫోన్ చేసి.. భూమి తిరిగి తీసుకోడానికి సింగూరు రమ్మని పిలిచారని తెలిపారు. వ్యవసాయం అనేది తన రక్తంలోనే ఉందని.. దాంతో ఏమాత్రం ఆతృత ఆపుకోలేక వెంటనే పరుగున వచ్చేశానని అన్నారు. మొదట్లో తాను కూడా ఇక్కడ కార్ల పరిశ్రమ పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నానని, కానీ తన ఇంటి ముందే పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ కాల్చేసరికి పేదలను వేధిస్తున్న తీరు చూసి పరిశ్రమ వద్దనుకున్నానని చెప్పారు. బలవంతంగా భూమి లాక్కోకుండా.. రైతులను సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. ఆస్ట్రేలియా నుంచి దాస్‌తో పాటు అమెరికా నుంచి విద్యుత్ ఘోష్, దుర్గాశంకర్ బోస్ అనే ఇద్దరు కూడా సింగూరు ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న తమ భూమల కోసం వచ్చారు. -
సింగూరు ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
మెదక్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో.. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 29..99 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 29.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 8,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి కోసం 2,300 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. -
సింగూరుకు స్వల్పంగా పెరిగిన వరద
సింగూరు ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం వరద నీరు స్వల్పంగా పెరిగింది. ఇన్‌ఫ్లో 79 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 95 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 523.3 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. 9 గేట్ల నుంచి నీటిని బయటికి వదులుతున్నారు. -
సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
-
సింగూరుకు పోటెత్తుతున్న వరద..
సందర్శకులకు ప్రవేశం నిషేధం మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పొటెత్తుతోంది. వరద ఉధృతి దృష్ట్యా ప్రాజెక్టుకు సందర్శకులకు ప్రవేశం నిషేధిస్తున్నట్లు జల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రకటించారు. మూడు రోజుల పాటు సందర్శకులను అనుమతించమని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,717.93 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,716.45 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 84 వేల క్యూసెక్కులు ఉంది. -
సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 67,250 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు నుంచి 117 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ద్యం 30 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటిమట్టం 521.8 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 523.6 మీట్లరు. -
తడిసి ముద్దయిన ఇందూరు
సుభాష్‌నగర్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇందూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 20.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే అత్యధికంగా బాన్సువాడ మండలంలో 8.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పిట్లం, నందిపేట్, వర్ని మండలాల్లో 4–6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా నేటి వరకు ఐదు మండలాల్లో అత్యధికం, 21 మండలాల్లో సాధారణం, 10 మండలాల్లో లోటు వర్షం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి 8.0, లింగంపేట్ 11.0, ఎల్లారెడ్డి 25.0, నాగిరెడ్డిపేట్ 13.8, గాంధారి 12.4, మద్నూరు 5.8, డిచ్పల్లి 9.6, నిజాంసాగర్ 26.0, భిక్కనూర్ 8.2, ఎడపల్లి 16.4, భీమ్‌గల్ 7.2, ధర్పల్లి 0.0, మాక్లూర్ 15.8, బోధన్ 16.6, కమ్మర్పల్లి 23.4, కామారెడ్డి 12.2, సదాశివనగర్ 4.6, నిజామాబాద్ 8.0, బీర్కూర్ 17.4, బిచ్కుంద 17.4, వేల్పూర్ 24.4, కోటగిరి 11.4, జక్రాన్‌పల్లి 12.4, దోమకొండ 15.2, మాచారెడ్డి 8.2, నందిపేట్ 40.0, రెంజల్ 25.4, ఆర్మూర్ 28.0, మోర్తాడ్ 26.6, సిరికొండ 1.0, నవీపేట్ 25.6, బాల్కొండ 29.2. జుక్కల్ 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కూలిన ఇళ్లు, నీట మునిగిన పంటలు.. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో అక్కడక్కడ ఇళ్లు కూలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆరుతడి పంటలు ప్రస్తుతం కోత దశలో ఉండగా, వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – పిట్లం మండలంలోని బండాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల బొగ్గుల కుంట తండాలో ఓ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. – వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సౌగ గంగాధర్ ఇల్లు నేలమట్టమైంది. – గాంధారి మండలం మాతు సంగెంలో బాలమణికి చెందిన ఇంటి గోడ కూలిపోయింది. – బిచ్కుంద మండలంలో పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. పెసర, మినుమ, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉండడంతో వర్షానికి గింజలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల చేలలోకి నీరు నిలిచి ఉండడంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. – పిట్లం మండల శివారులో కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరింది. ప్రాజెక్టులకు జలకళ నిజాంసాగర్: మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలకు కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 1,120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఒక గేటు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్ మండలాల్లో కురిసిన వర్షాలతో నల్లవాగు మత్తడికి వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1500 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మత్తడి పైనుంచి పొంగుపొర్లుతోంది. నాందేడ్– సంగారెడ్డి జాతీయ ర హదారి పక్కనే ఈ మత్తడి ఉండటంతో అలుగుపై నుంచి పొర్లుతున్న వరద నీటిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వరద నీరు దిగువన ఉన్న మంజీరలో ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సింగూర్’లోకి 6,850 క్యూసెక్కులు.. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి 6,850 క్యూసెక్కుల మేర వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 516.650 మీటర్లు, 6.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు నీటిమట్టం అడుగంటింది. జల దిగ్బంధంలో దేవాడ వంతెన బిచ్కుంద: కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ వాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. కర్ణాటకలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం, కౌలాస్‌నాలా పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను గురువారం పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న దేవాడ వంతెన నీట మునిగింది. వంతెన పైనుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు పారడంతో బాన్సువాడ–బిచ్కుంద మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వాగుకు ఆనుకొని ఉన్న పంట చేలలు నీట మునిగాయి. సుమారు ఐదు వందల ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిట్లం మీదుగా బాన్సువాడ వెళ్తున్నారు. -
చిగురిస్తున్న ఆశలు
సింగూర్‌లో పెరిగిన నీటి మట్టం 3టీఎంసీలకు చేరిన వరదనీరు రైతుల్లో ఆనందం పుల్కల్:పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్ ప్రాజెక్ట్‌లోకి గతవారం రోజులుగా వరదనీరు వచ్చి చేరుతోది. దీంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. 30టీఎంసీల సామర్ధ్యం గల ప్రాజెక్టులో వర్షాలు కురియని కారణంగా గత రెండేళ్లుగా నీటిమట్టం అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవలేదు. దీంతో ఇటీవల వరుసగా కురుస్తున్న చిరుజల్లులతోపాటు ఎగువ ప్రాంతమైన జహీరాబాద్, బీదర్‌లో భారీవర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. గత పదిరోజుల్లోనే ఏకంగా మూడు టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ప్రతిరోజు 3500 క్యూసెక్కుల నీరు ఎగువనుండి వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్‌ప్రాజెక్ట్ గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా సింగూర్ ప్రాంత రైతులకు సాగునీరందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగానే ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరందించేందుకు గాను అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దాదాపు 85శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా గత ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పథకం పనులు ఇటీవలే పూర్తిచేశారు. గత వారంలో భారీనీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు డ్రై ట్రయల్‌రన్ నిర్వహించి పరీక్షించారు. దీంతో సింగూర్ ప్రాజెక్ట్ నిండినట్లయితే ఈ ఖరీఫ్ నుంచే అందోల్, పుల్కల్, మునిపల్లి మండలాల పరిధిలోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైన కాల్వలను తవ్వారు. ప్రభుత్వం ఆశించిన మాదిరిగానే వర్షాలు భారీగా కురియడంతో పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. రానున్న రెండు నెలల్లో ఇదే స్థాయిలో వర్షాలు కురిసినట్లయితే ప్రాజెక్ట్ సామర్థ్యం 30 టీఎంసీలకు గాను కనీసం 25టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 31జేజిపి22: సింగూర్ ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం -
సింగూరు సిన్నబోయింది..
♦ ప్రాజెక్టు ఎండిపోవడంతో ముంచుకొచ్చిన ముప్పు ♦ తాగడానికి అనువైన నికర జలాలు 0.9 టీఎంసీలే ♦ మెతుకుసీమలోని 511 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ♦ మంజీరలో అందని నీళ్లు.. పరిశ్రమలకూ బందే.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు ఎండిపోవడంతో మెదక్ జిల్లాలోని 500 గ్రామాలు తాగునీటికి తిప్పలు పడుతున్నాయి. దీనికితోడు జంటనగరాలకు తాగునీటిని అందించే మంజీర రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 1.45 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 0.9 టీఎంసీలు మాత్రమే తాగడానికి అనుకూలం. మిగిలినదంతా బురదే. మెదక్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 511 గ్రామాలకు తాగునీటిని అందించే ఇన్‌టెక్ వెల్స్కు దూరంగా నీళ్లు వెళ్లిపోవడంతో ఆయా గ్రామాల వారు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. కొండాపూర్, జహీరాబాద్, రేగోడ్, తూప్రాన్, వర్గల్ మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సంగారెడ్డి, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక మండలాలకు మూడు, నాలుగు రోజులకోసారి నీరు వదులుతున్నారు. ఇందులో కూడా రోజువారీగా సరఫరా చేయాల్సిన సగటు జలాల్లో కేవలం 30 శాతమే వదులుతున్నారు. దీంతో మంచి నీటికోసం జనం అవస్థలు పడుతున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉన్న నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా తోడి హైదరాబాద్‌కు పంపిణీ చేస్తున్నారు. ఇలాగే నిరంతరాయంగా నీటిని తోడేస్తే కేవలం 10 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు నుంచి నీటిని తోడటం తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్టు తెలిసింది. జంటనగరాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించాలని హరీశ్ సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మెట్రో వాటర్ వర్క్సు బోర్డు ఎండీకి ఫోన్ చేసి సింగూరు నుంచి నీళ్లు తోడటం నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వట్టిపోయిన మంజీరా నది గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజుకు 120 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్డే)నీటిని, దుబ్బాక, సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పటాన్చెరు,నియోజక వర్గాల దాహాన్ని తీర్చేందుకు, పరిశ్రమల అవసరాల కోసం మరో 50 ఎంజీడీ నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి నిత్యం విడుదల చేస్తున్నారు. నీటిని సరఫరా చేసే క్రమంలో మరో కనీసం 10 ఎంజీడీల జలం వృథా అవుతుందని అంచనా. ఈ లెక్కన చూస్తే రోజుకు 180ఎంజీడీ నీటిని సింగూరు నుంచి తోడేస్తున్నారు. 30 రోజులకు ఒక టీఎంసీలను తాగు అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం కూడా పూర్తిగా అడుగంటి పోయింది. తాజా లెక్కల ప్రకారం సింగూరు ప్రాజెక్టులో 1.45 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీనిలో 0.05 టీఎంసీ నీళ్లు బురదగా ఉంటాయి. దీంతో నికరంగా కనిపించే ది 0.9 టీఎంసీల నీళ్లు మాత్రమే. అయితే ఈ జలాలు కేవలం 15 నుంచి 20 రోజుల వరకు మాత్రమే సరిపోతాయి. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా రిజర్వాయర్ సైతం డెడ్‌స్టోరేజీ కంటే కిందిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రస్తుతమైతే కేవలం 0.5 టీఎంసీల జలం మాత్రమే ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితి కానరావటంలేదు. బోర్లు అద్దెకు తీసుకోండి : హరీశ్‌రావు నీటి సమస్యను తీర్చేందుకు రైతుల వద్ద నుంచి వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ బోర్లకు పైపులైన్లు బిగించి నేరుగా నీటి ట్యాంకర్లలోకి నీళ్లు ఎక్కించి పంపిణీ చేయాలని సూచించారు. బోర్లు అద్దెకు దొరకని చోట వెంటనే బోర్లు వేయించాలని, అవకాశం ఉన్న చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకర్ల కిరాయి పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని సూచించారు. మరో 6 నెలల్లో వాటర్ గ్రిడ్ జలాలు కొన్ని ప్రాంతాలకు అందుతాయన్నారు. -
కార్తెలు కరుగుతున్నా..వరుణుడి కరుణలేదు..!
- ఎడారిలా మారిన ఘనపురం.. సింగూరు ప్రాజెక్టు ఆందోళనకరం - దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్న రైతులు - 20 వేల ఎకరాల రైతుల్లో ఆందోళన మెదక్: కార్తెలు కరిగిపోతున్నా జిల్లాపై వరుణుడు కరుణ చూపడం లేదు. చుక్కనీరు లేక ఘనపురం ప్రాజెక్టు ఎడారిలా మారింది. ఆయకట్టు పరిధిలోని అన్నదాతలు దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్నారు. 20 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పు చేసి ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతన్న దుస్ధితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు కార్తెలు గడుస్తున్నా...వరుణుడు మాత్రం కరుణించడం లేదు. డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో ఆశించిన వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. జూన్‌లో 2614.4మిల్లిమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, 2035.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో గురువారం నాటికి 1274.0మి.మీ.వర్షపాతం కురియాల్సి ఉండగా 27.8మి.మీవర్షపాతం మాత్రమే నమోదైంది. గత 15రోజులుగా వాతావరణ పరిస్థితి చూస్తే వేసవికాలాన్ని తలపిస్తోంది. రేగోడ్, కొల్చారం, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి, ఆందోల్, పుల్కల్, జిన్నారం, హత్నూర, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో ఈ నెల వర్షమే పడలేదు. ఎడారిలా ఘనపురం మెతుకు సీమకే బతుకునిచ్చి ఘనపురం ప్రాజెక్ట్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. కళకళలాడే ఘనపురం చుక్కనీరులేక ఎడారిని తలపిస్తోంది. ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2టీఎంసీలు కాగా గత ఏడాది జూలై9న ప్రాజెక్ట్ 5అడుగుల నీరు నిల్వ ఉంది. ఈసారి మాత్రం ప్రాజెక్టులో చుక్కనీరులేక బీడు భూమిని తలపిస్తోంది. దీంతో ఆయకట్టు పరిధిలోని 20వేల ఎకరాల్లో ఎక్కడ వరి నార్లు పోయలేదు. జూన్నెలలో పడిన వర్షంతో కొంతమంది రైతులు దుక్కులు దున్నుకున్నారు. చాలా మంది రైతులు అప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. వర్షాలు కురియక పోవడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. బోర్ల కింద వేసిన వరి తుకాలు సైతం ఎండిపోతుండటంతో వాటిని రక్షించుకోవడానికి ట్యాంకర్లు, బిందెలతో నీళ్లు తెచ్చి నానా తంటాలు పడుతున్నారు. సింగూర్‌లో డెడ్ స్టోరేజ్ ఘనపురం ప్రాజెక్ట్‌కు ఆధారమైన సింగూర్ప్రాజెక్ట్లో డెడ్‌స్టోరేజ్ కొనసాగుతుంది. 30 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్‌లో 4.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 0.2 టీఎంసీల నిలువ నీటి సామర్థ్యం గల ఘనపురం ప్రస్తుతం చుక్కనీరు కూడా లేకపోవడంతో ఎడారిని తలపిస్తోంది. డెడ్ స్టోరేజ్‌లో సింగూర్ ఘనపురం ప్రాజెక్టుకు ఆధారమై సింగూర్ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజ్ కొనసాగుతోంది. 30 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో 4.3టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 0.2టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం గల ఘనపురంలో ప్రస్తుతం చుక్కనీరు కూడా లేకపోవడంతో ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు పరిధిలోని 20వేల ఎకరాల్లో పంటలు పండాలంటే కనీసం 2టీఎంసీల నీటిని 0.3టీఎంసీల చొప్పున ఆరు విడతలుగా ఇవ్వాలి. అయితే అటు సింగూర్‌లో ఇటు ఘనపురంలో నీరులేక మరోవైపు వర్షాలు కురియక కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పునర్వసు కార్తె రావడంతో తుకాలు వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అడుగంటిన ఆశలు!
ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం సింగూరు, మంజీర జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ఆనకట్టల్లోనూ అదే దుస్థితి నెలకొంది. ఈసారైనా ఖరీఫ్‌లో సాగు చేసి కష్టాలనుంచి గట్టెక్కుదామనుకున్న రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. ఎగువప్రాంతమైన కర్ణాటక, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే మంజీర నదిలోకి నీళ్లు వచ్చి దిగువన పంటలకు, తాగునీటికి నీళ్లు అందే అవకాశం ఉంది. సాక్షి, సంగారెడ్డి : మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సిన్నబోతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 4.5 టీఎంసీ నీళ్లే ఉన్నాయి. మరో 0.5 టీఎంసీల నీటి మట్టం తగ్గితే ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 4.06, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8.35 టీఎంసీల సాగునీరు కేటాయింపులు ఉన్నాయి. ఖరీఫ్‌లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవటంతో ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు కనిపించటంలేదు. ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటక, ఇక్కడ వర్షాలు కురిస్తేనే సింగూరు ప్రాజెక్టు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మంజీర డ్యామ్‌లో సైతం నీళ్లు లేవు. మంజీర పూర్తిస్థాయి నీటిమట్టం 1,645 మీటర్లు కాగా ప్రస్తుతం 501.37 మీటర్ల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మంజీర సైతం డెడ్‌స్టోరేజీ లెవల్‌కు సమీపంలో ఉంది. సింగూరు, మంజీర ద్వారా జంటనగరాలతోపాటు సంగారెడ్డి, సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్, గజ్వేల్ నియోజవకర్గాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే సింగూరు, మంజీరాల్లో నీళ్లు అడుగంటుతుండటంతో తాగునీటికి ఇబ్బందుల తప్పని పరిస్థితి నెలకొంది. ఘనపురం, నల్లవాగు వెలవెల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన ఘనపురం, నల్లవాగులో నీళ్లు అడుగంటాయి. ఘనపురం ప్రాజెక్టు కింద మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 0.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆనకట్ట డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆనకట్ట కింద సాగు చేయాలని ఎదురుచూస్తున్న రైతులకు దిక్కుతోచటంలేదు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలటం లేదా వర్షాలు కురిసి ఆనకట్టలోకి నీళ్లు వస్తే తప్ప పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు సైతం నీళ్లులేక వెలవెల బోతుంది. నల్లవాడు ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 1493 మీటర్ల కాగా ప్రస్తుతం 75 మీటర్ల మేర నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ లేవల్‌కు చేరుకోవటంతో ప్రస్తుతం ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందని పరిస్తితి ఉంది. ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో 4వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. గత ఖరీఫ్‌లో ప్రాజెక్టులో నీళ్లులేకపోవటంతో రైతులు పంటలు సాగు చేయలేదు. ఈసారైనా ఖరీఫ్‌లో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేయవచ్చని రైతులు ఆశించారు. అయితే ప్రాజెక్టులోకి ఇంకా నీళ్లు వచ్చిచేరలేదు. దీంతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీళ్లు రావాలని వరుణ దేవుణ్ని కోరుకుంటున్నారు. -
జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు రూ.280 కోట్లు
జోగిపేట/పుల్కల్: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.280 కోట్ల వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పుల్కల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగూర్ ప్రాజెక్ట్ లోపల కుడి, ఎడమ వైపులా నిర్మించ తలపెట్టిన ఇన్‌టెక్‌వెల్ (వాటర్ గ్రిడ్ పంపింగ్) నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్‌కుమార్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకున్నారు. ఎడమ వైపు నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి అందోల్, మెదక్, రామాయంపేట, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లోని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తామని, ఇన్‌టెక్ వెల్ నుంచి ప్రాజెక్ట్ లోపలి భాగం వరకు సుమారు కిలోమీటరున్నర పొడవున ఫీడర్ చానల్ కాలువ ద్వారా నీటిని తరలించడం జరుగుతుందని ఎస్ఈ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వేసవి సమీపిస్తున్నందున ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ కుడి వైపున మునిపల్లి, బుసారెడ్డిపల్లి గ్రామాల శివారులోని మంజీర నదిలో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ నుంచి సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇక్కడ భూ సేకరణ సమస్య లేనందున గ్రిడ్ పనులను వేగవంతంగా చేయాలన్నారు. సింగూర్ ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్ బెడ్ల పనులను వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్‌తోపాటు, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో మంజీర నీటి పథకాన్ని విలీనం చేసి, నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బుస్సారెడ్డిపల్లిలో స్థలపరిశీలన మునిపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివారులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్స్ స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని బుదేరా గ్రామ శివారులో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా తదితరులున్నారు. -
పొంచివున్న జలగండం!
సింగూరు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు తప్పదా? మంజీరాలో ఇన్‌టేక్ వెల్‌కు అందని జలాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు అడుగంటి పోతోంది. ప్రస్తుత నీటి మట్టం 517 అడుగుల వద్ద ఉంది. నికర జలాలు 3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వీటిని ఎంత పొదుపుగా వాడుకున్నా మూడు నెలలకు మించి రావు. వేసవి మే నాటికి జలాలు పూర్తిగా అడుగంటిపోతే.. హైదరాబాద్, మెదక్ జిల్లాలు తాగునీటి కోసం అల్లాడిపోనున్నాయి. ఇదీ లెక్క: ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 30 టీఎంసీలు. ఇది పూర్తిగా నిండితే దిగువనున్న నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్‌కు ఖరీఫ్, రబీ పంటల సాగు కోసం 8.3 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలి. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆయకట్టుకు 4 టీఎంసీల నీళ్లు ఇవ్వాలి. 4 టీఎంసీల నీరు సింగూరు నుంచి నేరుగా.. మరో 2 టీఎంసీలు మంజీరా ప్రాజెక్టు నుంచి జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలి. ఏడాదిన కనీసం 2 టీఎంసీల నీళ్లు ఆవిరి రూపంలో పోతుంటాయి. ఇక మిగిలిన 10 టీఎంసీల నీళ్లను డెడ్ స్టోరేజీగా గుర్తిస్తారు. ఈ నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోకూడదు. అడుగంటిన సింగూరు: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి కోసం రోజుకు 120 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీటిని, దుబ్బాక, సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పటాన్చెరు నియోజకవర్గాల ప్రజల దాహాన్ని తీర్చేందుకు, పరిశ్రమల అవసరాల కోసం మరో 50 ఎంజీడీ నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి నిత్యం విడుదల చేస్తున్నారు. నీటిని సరఫరా చేసే క్రమంలో మరో 20 ఎంజీడీల జలం వృథా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రోజుకు 190 ఎంజీడీ నీటిని సింగూరు నుంచి తోడేస్తున్నారు. అంటే 35 రోజులకు ఒక టీఎంసీని తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్నారన్న మాట. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో డెడ్‌స్టోరేజీ నీటి మట్టం కూడా అడుగంటి పోయింది. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పుడు సింగూరు నీటి మట్టం 517 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు పూడికను పరిగణలోకి తీసుకుంటే కేవలం 7.5 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఇదేరోజున 13.489 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో ఉన్నాయి. ఇందులో 0.5 టీఎంసీలను త్వరలో జరగబోయే ఏడుపాయల వనదుర్గ జాతర ఉత్సవాల కోసం ఘణపురం ప్రాజెక్టులోకి వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మరో 0.7 టీఎంసీల నీళ్లు ఆవిరి రూపంలో వెళ్లిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నికరంగా మిగిలేది 6.3 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో మరో మూడు 3 టీఎంసీలలో జలచరాల మనుగడ ఉంటుంది. అడుగున ఉండే ఈ నీరంతా బురద, ఒండ్రు మట్టి, మృత జంతు కళేబరాలతో మిళితమై ఉంటుంది. ఈ జలం తాగటానికి పనికిరాదు. అన్నీపోనూ ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కనీస తాగునీటి అవసరాల కోసం ఉన్న జలం నిల్వలు కేవలం 3 టీఎంసీలు మాత్రమే. ఈ నీళ్లను ఎంత పొదుపుగా వాడుకున్నా మూడు నెలలకు మించి సరిపోవు. ఎండలు మండే నిండు వేసవి మే మాసంలో తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. మంజీరా ఎండిపోతోంది సంగారెడ్డి మండలం కల్పగురు వద్ద నిర్మించిన మంజీరా ప్రాజెక్టులో నీళ్లు పూర్తిగా అడుగంటి పోయాయి. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా.. పూడిక పేరుకుపోవడంతో నిల్వనీటి సామర్థ్యం 1.5 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతమైతే కేవలం 0.3 టీఎంసీల జలం మాత్రమే ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి ప్రజల తాగు నీటి అవసరాల కోసం చక్రియాల్ శివారులో ఇన్‌టేక్ వెల్ కట్టించారు. ఇక్కడి నుంచి నీటిని మూడు నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటి పోయి ఇన్‌టేక్ వెల్‌కు నీళ్లు అందకపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు దాదాపు మీటర్ లోతుతో ఒక పొడవైన కాల్వ తవ్వించి నీళ్లను వెల్‌లోకి పంపిస్తున్నారు. ఇప్పటికైతే గండం గట్టెక్కింది కానీ, రాబోయే రోజుల్లో ఇంకేంత లోతైన కాల్వలు తవ్వాల్సి వస్తుందోనని ఆ శాఖ అధికారులు తలపట్టుకున్నారు. -
సింగూరు జలాలతో సిరులు పండాలి
►రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ►సమైక్య రాష్ట్రంలో కానిది ఇప్పుడు సాధించాం ►డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ►ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీరు విడుదల పుల్కల్: సింగూరు జలాలతో సిరులు పండాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బుధవారం మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘనపురం ఆయకట్టు కింద సుమారు 12 వేల ఎకరాలలో నారుమళ్లు ఉన్నాయని ఆ పంటలను కాపాడుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నీటిని వదలాలంటే గతంలో హెచ్చార్సీకి వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో సాధించుకోనివి ఇప్పుడు అనుకున్నదే తడవుగా సాధించుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతులు కోరుకున్న వెంటనే నీటిని వదులుతున్నామన్నారు. ఘనపురం ఆనకట్టకు సాగునీరు కావాలని మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్‌ను కోరారని, సీఎం వెంటనే నీటిని వదిలేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని పోరాటాలు చేసినా నీరు వదిలేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. రైతులు అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, రమేష్ బస్వరాజ్, స్వామి, రాజ్‌కుమార్, శంకరయ్య, ఇన్చార్జి కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ ఎల్లారెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జగన్నాథం, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
రేపు ఘనపురానికి సింగూరు నీరు
మెదక్: కరువు మేఘాలు కమ్ముకుని కర్షకులు కన్నీరు పెడుతున్న వేళ...సింగూర్ ప్రాజెక్టు నుంచిఘనపురం ఆనకట్టకు 0.20 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని ఇన్చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ బుధవారం సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో కార్తెలు కదలిపోతున్నప్పటికీ వరుణుడు కరుణించలేదు. ఘనపురం ఆనకట్ట కింద సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో కొంతమంది రైతులు తోటివారి బోర్ల సాయంతో వరి తుకాలు వేసుకున్నారు. అప్పటి నుండి చినుకు జాడే లేక పోవడంతో ఎండిపోతున్న వరి తుకాలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు చేసిన అప్పులు మీద పడనున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సింగూరు వద్ద ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించగా, ఘనపురం ఆయకట్టుకు సింగూర్ ప్రాజెక్టు నుంచినీటిని విడుదల చేయాలని డిప్యూటీ స్పీకర్‌తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు కోరారు. దీంతో స్పందించిన హరీష్‌రావు సింగూరు నుంచి ఘనపురం ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా వెంటనే స్పందించడంతో నీటి విడుదల చేయాలని సోమవారం జీఓ వెలువడింది. అయితే మంగళవారం రంజాన్ పండగ ఉండడంతో బుధవారం సింగూర్ నుంచి నీరు విడుదల చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఘనపురం ఆనకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడతల వారీగా వదిలేలా శాశ్వత జీఓ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కుర్సీ వేసుకుంటా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఆంధ్ర ప్రాజెక్టులు చకచకా పూర్తయిపోతున్నాయి. మన సింగూరు.. చిన్న ప్రాజెక్టు. ఇంత చిన్న ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు పూర్తికాలేదు? ఇప్పుడు నేను చెప్తున్నా.. సింగూరు ఇప్పుడైతది. అవసరమైతే సింగూరు కట్ట మీద కుర్సేసుకొని కూర్చుంటా.. ప్రాజెక్టు కట్టిస్తా’అని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. జోగిపేటలో మంగళవారం తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బీబీ పాటిల్, మాజీ మంత్రి కరణం రామచంద్రారావు భార్య, మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవిలకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.గతంలో బాబూమోహన్‌ను గెలిపించడం కోసం జోగిపేటకు వ చ్చానని, ఈ నియోజక వర్గంపై నాకు పూర్తి అవ గాహన ఉందని చెప్పారు. ఆనాడు మీరు బాబుమోహన్‌ను గెలిపిస్తే జోగిపేటను దత్తత తీసుకుంటానని చెప్పి రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. ‘1930లో ఇక్కడ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మొట్ట మొదటి తెలంగాణ సభ ఇక్కడే జరుగుతోంది. జోగిపేటకే ఆ గౌరవం దక్కిందని’ అన్నారు. జోగిపేటను సిద్దిపేటగా మారుస్తానని హామీ ఇచ్చారు. రైతుల ఆకలి చావులకు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమన్నారు. సింగూరు నుంచి అందోల్‌కు 40 వేల ఎకరాలకు నీళ్లు రావాలని ఏనాడో 30 ఏళ్ల క్రితం జీఓ ఇస్తే ఇవాల్టీకి చుక్కనీరు రాని పరిస్థితి ఉందన్నారు. ‘సింగూరు ప్రాజెక్టుకు కాల్వలు తవ్విన పరిస్థితి ఘోరంగా ఉంది. తూములు ఎంత ఎత్తులో ఉన్నాయ్, కాల్వలు ఏ ఎత్తులో తవ్వారు? ఇలాంటి పనులతో సింగూరు నీళ్లను మనం జన్మలో చూస్తమా?’ అని ప్రశ్నించారు. సింగూరు ఎత్తి పోతల ప్రాజెక్టును కూడా మంజూరు చేయించింది కేసీఆరే అని చెప్పారు. సోనియాగాంధీని ఒప్పించి ప్రాజెక్టును పట్టుకొచ్చినట్లు చెప్పారు. ఇక్కడినుంచి మనుషులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కానీ ఆ పని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చే యలేదని కేసీఆర్ ప్రశ్నించారు. సింగూరు నిండిన తర్వాత చాలా నీళ్లు గోదావరి నదిలోకి పోతున్నాయని, అవసరమైతే ఇంజినీరింగ్ నిపుణులతో మాట్లాడి సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం పెంచగలిగే అవకాశం ఉంటే పెంచేందుకు కృషి చేస్తానన్నారు. జోగిపేటలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని అన్నారు. మెదక్ జిల్లాను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ అనే మూడు జిల్లాలుగా విభజన చేస్తామని చెప్పారు. ఈ జిల్లాల పునర్నిర్మాణంలో వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కేసీఆర్ తెలిపారు. మెతుకుసీమలో మంచి భూములు ఉన్నాయని, ఇక్కడి వర్షపాతం సగటున 900 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉంటుందన్నారు. ఇక్కడి రైతులను మంచి పంటలు పండించేలా ప్రోత్సహించి, ఆ పంట విత్తనాలను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను లక్షాధికారులుగా చేస్తామని ఆయన చెప్పారు. మెదక్ జిల్లాలో చిన్న నీటి పారుదల పనుల్లో రూ. కోట్లు అవినీతి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి రాబడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సభలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్, ఎమ్మెల్సీ మహమ్మద్ అలి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సింగూరు జలాలు విడుదల
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల అవసరాల కోసం ఎట్టకేలకు సింగూరు ప్రాజెక్టు నుంచి జలాలు విడుదలయ్యాయి. వాటా ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని వదలాలని ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అనుమతినిచ్చింది. ఈమేరకు సింగూరు జలాశయం టర్బయిన్ గేట్ల ద్వారా 3600 క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక వరదగేటు ద్వారా 9వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతుండటంతో మంజీర వాగులో నీటి ప్రవాహం ఉరకలేస్తోంది. ప్రాజెక్టు దిగువ ఉన్న పరిసర ప్రాంతాలకు రైతులు, పశువుల కాపరులు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. రేపటిలోగా సాగర్‌లోకి సింగూరు జలాలు సింగూరు జలాశయం నుంచి వదులుతున్న నీరు ఆదివారం సాయంత్రం వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశాలున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్ ప్రాజెక్టు మద్య 90 కిలోమీటర్ల దూరం ఉండటంతో మంజీర వాగు ద్వారా జలాలు రానున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మంజీర వాగులో దిబ్బలు, నీటి మడుగులు అధికంగా ఉండటంతో పాటు తుమ్మచెట్లు ఏపుగా పెరగడంతో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలినా నిజాంసాగర్‌లోకి 2.8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరే అవకాశముంది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1396.42 అడుగులతో 7.94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
సింగూరు ఎడమ కాల్వకు నీరు
పుల్కల్/ జోగిపేట, న్యూస్‌లైన్: ‘సింగూరు’ ట్రయల్ రన్‌ను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా మెయిన్ కాల్వలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన ఎడమ కాల్వ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడమ కాల్వకు ఉన్న రెండు గేట్లను ఎత్తారు. అక్కడి నుంచి కాల్వ వెంట సుమారు మూడు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనంతరం ముద్దాయిపేట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాటి 102 రోజుల దీక్ష ఫలితం, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ నేడు నెరవేరిందని అన్నారు. ఎనిమిది చెరువుల్లోకి నీరు ఎడమ కాల్వ ద్వారా వదిలిన 0.15 టీఎంసీల నీరు పుల్కల్ మండలంలో ఐదు చెరువులకు, అందోల్ మండలంలో మూడు చెరువులకు వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీరు చెరువుల్లోకి చేరితే సుమారు 7,550 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. సింగూరు ఎడమ కాల్వ నుంచి వదిలిన నీరు మొదట అందోల్ పెద్ద చెరువులోకి వెళ్లనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, ఆర్డీఓ వనజాదేవి, జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, జగన్మోహన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లప్ప, డీసీసీబీ డెరైక్టర్ రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు దుర్గారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు. -
ఎన్నికల ‘ట్రయల్’
సింగూరు నుంచి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సింగూరు’ మళ్లీ ఎన్నికల ప్రాజెక్టుగానే మిగిలింది. ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ట్రయల్న్ నిర్వహించడం, ట్రయల్న్ నీటిపై ఆధారపడి పంటలు వేసుకోవద్దని సింగూర్ ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ జగన్నాథం ప్రకటించడం రైతులను విస్మయానికి గురిచేసింది. సింగూరు తూ ము నుంచి 0.15 టీఎంసీల ( 768.66 క్యూసెక్యులు) నీరు దిగువకు వదిలేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నీళ్ల ద్వారా ముందు గా అందోల్ పెద్ద చెరువును నింపుతామనీ, ఆ తర్వాత పుల్కల్ మండలంలోని 5 చెరువులు, అందోల్ మండలంలో మరో 2 చెరువులు నింపుతామని అధికారులు చెబుతున్నారు. నిజంగా ఈ నీరంతా నేరుగా పంట పొలాల్లోకి వెళ్తే సుమారు 7.5 వేల ఎ కరాలకు నీరు పారాలి కానీ, ప్రస్తుతం సెంటు భూమికి కూడ నీ రు అందే పరిస్థితి లేదని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అధికారుల్లో ఆందోళన... సింగూరు తూము నుంచి ఆందోల్ చెరువు వరకు 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం కేవలం 22 కిలో మీటర్లు మాత్రమే కాల్వ పూర్తి చేశారు. అది కూడా అసంపూర్తిగానే తవ్వి వదిలేశారు. దీంతో ట్రయల్ రన్ కింద వదిలిన నీరు ఆందోల్ చెరువులకు చేరుతుందో లేదో అని అధికారులు అందోళన చెందుతున్నారు. కుడి ఎడమ కాల్వలు కలిపి 60 కిలో మీటర్లు మెయిన్ కెనాల్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పూర్తి అయింది కేవలం 42 కిలో మీటర్లు మాత్రమే. ఎక్కడ కూడా పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. మెయిన్ కాల్వకు ఏ ఒక్క చోట కూడా పిల్ల కాల్వలు కలపలేదు. ఇవేమీ లేకుండానే ట్రయల్ ర న్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ చేసిన పనులే.... 2005లో వైఎస్సార్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి రూ 89.98 కోట్లు మంజూరు చేస్తూ 139 జీవోను విడుదల చేశారు. ఎత్తిపోతల ద్వారా కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాల్లో 2500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ఆందోల్, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు కలిపి మొత్తం 40 వేల ఎకరాల్లో సాగునీరు అందించాలని సంకల్పించారు. మొదటి విడత కింద రూ. 35 కోట్లు వైఎస్సార్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత మూడేళ్ల వరకు ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి 2013 బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్లు కేటాయించేలా చూశారు. ఎందుకోగాని వాటిని ఖర్చు చేయలేదు. తిరిగి అవే నిధులను 2014 బడ్జెట్లో కేటాయించారు. ఆ నిధులతో వైఎస్సార్ చేసిన పనులకే పైపై మెరుగులు దిద్ది ‘మమ’ అనిపించారు. ప్రస్తుతం ఎడమ కాల్వ వద్ద లిఫ్టు పనులు చేస్తున్నారు. ఈ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇవన్నీ పూర్తైసింగూరు నీళ్లు వైఎస్సార్ కలలుగన్నట్టు సంపూర్ణంగా రైతుల పంట పొలాల్లోకి వెళ్లాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. -
మురిగిన నిధులే తిరిగొచ్చాయి
సాక్షి, సంగారెడ్డి: ఈసారీ అవే విదిలింపులు. పాత కేటాయింపులతోనే సరిపుచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2014-15) జిల్లావాసులను ఉసూరుమనిపించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చిన ఈ బడ్జెట్లో జిల్లాకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులేవి లేకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. 2013-14 బడ్జెట్‌లాగానే ఈ బడ్జెట్లో సింగూర్ ప్రాజెక్టు, సుల్తాన్పూర్ జేఎన్టీయూలకు పాత కేటాయింపులు కేటాయించారు. జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు సింగూర్‌కు రూ.40 కోట్లు, పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లో నిర్వహిస్తున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.121 కోట్ల నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారు. జహీరాబాద్ మండలం చిరాగ్పల్లితో పాటు రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో సమీకృత చెక్‌పోస్టుల నిర్మాణాల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ లేవు. మళ్లీ అదే కథ.. సింగూర్ ప్రాజెక్టుపై కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.58.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సింగూర్ కాల్వల పథకం పనులు 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ పథకం పూర్తి కావాలంటే ఇంకా రూ.26 కోట్ల నిధులు అవసరం. రూ.20.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు 42 శాతం పూర్తయ్యాయి. ఎత్తిపోతల పూర్తికావాలంటే రూ.12 కోట్లు నిధులు అవసరం. దాదాపు రూ.38 కోట్ల నిధులను ఖర్చు చేస్తే ఈ రెండు నిర్మాణాలు పూర్తయి ఆయకట్టుకు నీళ్లు పారనున్నాయి. గతేడాది కింద ఈ పనుల ఏ స్థితిలో ఉన్నాయో ప్రస్తుతం అలానే ఉన్నాయి. పనుల్లో ఏమాత్రం పురోగతి లేకపోవడంతో గతేడాది బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో సింగూర్ ప్రాజెక్టు గత బడ్జెట్లో కేటాయించిన రూ.40 కోట్లనే ఈ ‘సారీ’ విదిలించారు. వచ్చే ఏడాదికాలంలోనైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కేటాయించిన నిధులు వినియోగంలోకి రానున్నాయి. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి కూడా దాదాపు అంతే. గత బడ్జెట్లో కేటాయించిన రూ.121 కోట్ల నిధులను పూర్తిగా వినియోగించుకోకపోవడంతో మళ్లీ వాటినే తిరిగి కేటాయించారు. ప్రాణ‘హిత’మే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో రూ.737.05 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 1051.05 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నాయి. ఒక్క మెదక్ జిల్లాలోనే 5,19,152 ఎకరాల ఆయకట్టుకు నీరు పారనున్నాయి. కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకుంటేనే సమీప భవిష్యత్తులో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
సింగూరు వచ్చేనా..సిరులు పండేనా?
మెదక్, న్యూస్‌లైన్: సింగూరు నీటి కోసం రైతన్నలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తుకాలు వేసి 20 రోజులు కావస్తున్నా ఇంకా నీరువిడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నీరు రాకపోతే ఘనపురం ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. రబీ సీజన్ కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ నీటి పారుదల జిల్లా సలహా సంఘం ప్రతిపాదించి 20 రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంకా జీఓ విడుదల కాలేదు. సింగూరు నుంచి నీరు పొందేందుకు న్యాయమైన హక్కు ఉన్నా.. ఇలా ప్రతియేటా సాగునీటి కోసం ఎదురు చూడాల్సివస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి ఏటా 4 టీఎంసీల సాగు నీరు పొందే హక్కు ఉంది. ప్రాజెక్టు కింద సుమారు 21,065 ఎకరాల సాగు భూమి ఉంది. కానీ మహబూబ్ నహర్,ఫతేనహర్ కెనాళ్ళు శిథిలం కావడంతో చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. మరమ్మతుల కోసం జైకా పథకం కింద రూ. 25 కోట్లు మంజూరైనా పనులు సాగడం లేదు. దీంతో కనీసం 15 వేల ఎకరాలకు సింగూరు నుంచి 2.5 టీఎంసీలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా, ఐఓబీ తీర్మానం మేరకు 10 వేల ఎకరాల సాగు కోసం ఏడు విడతల్లో 1.95 టీఎంసీ నీరు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రతి ఏటా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే జీఓ వెలువడుతోందని రైతులు అంటున్నారు.ఈ సారి వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే నీటి అవకాశం ఉన్నచోట్ల ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి తుకాలు వేసుకున్నారు.మరో 10 రోజుల్లో అవి నాట్లు వేసే దశకు చేరుకుంటాయి.సింగూరు ప్రాజెక్టులో సైతం సుమారు 26.4 టీఎంసీల నీరు ఉంది.అలాగే ఘనపురంలో 6 అడుగుల మేర నీరు నిలవ ఉంది.కనుక కనీసం 10 వేల ఎకరాలైనా సాగు కావాలంటే వెంటనే సింగూరు నీటిని విడుదల చేసేలా జీఓ జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆదిలోనే అడ్డంకులు
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్-సింగూర్ మంచినీటి పథకం ప్రతిపాదనలకు అడ్డంకులెదురవుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు మరిన్ని సవరణలు చేసి తిరిగి సమర్పించాలని ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజినీర్ ఈ ఫైల్‌ను ఎన్సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్రాజెక్ట్ ఎంటర్ప్రీమియర్)కు పంపారు. ప్రస్తుతం ఆ కన్సల్టెన్సీ మార్పులు, చేర్పులు చేపట్టే పనిలో ఉంది. అంచనా వ్యయాన్ని రూ.234 కోట్ల నుంచి రూ.197 కోట్లకు కుదించారు. సవరణలు పూర్తయిన తర్వాత సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరయ్యే అవకాశం. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే పథకం వేగంగా మంజూరయ్యే అవకాశముందని స్థానికులు నగర పంచాయతీకి వరంగా మారునున్న గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రతిపాదనల దశలోనే అడ్డంకులెదురవుతున్నాయి. పట్టణంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు గజ్వేల్‌కు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నుంచి 8.3 ఎల్ఎండీ నీటిని నిత్యం ఇక్కడికి తరలించే పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం అక్కడినుంచి పైప్‌లైన్, ఇతర 53 రకాల పనులను చేపట్టడానికి రూ.234 కోట్లు అవసరమని తొలుత ప్రతిపాదించారు. కానీ ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు మార్పులు చేసి అంచనా వ్యయం ప్రతిపాదనలను రూ.211 కోట్లకు కుదించి ప్రతిపాదనలు అందజేయగా మార్పులు చేయాలని సీఈ ఆదేశించారు. ఈ మేరకు అంచనా వ్యయాన్ని మరింతగా తగ్గించి రూ.197 కోట్లతో ఇటీవల సీఈకి సమర్పించారు. దీనిపై మరోసారి మార్పులు జరగాలని ఆయన తాజాగా ఆదేశించగా ప్రస్తుతం ఈ ఫైల్ ఎన్సీపీఈ వద్దకు చేరింది. ఆ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఈ పథకం కింద చేపట్టబోయే పనులు, అంచనా వ్యయంపై సవరణలు జరిగే అవశాశమున్నది. అది పూర్తయిన తర్వాత ప్రజారోగ్య శాఖ సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశముంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరుపై ఆశలు పెట్టుకునే అవకాశముంటుంది. ఇదంతా వేగంగా జరగాలంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరముంది. ఈ వ్యవహారంపై గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్‌ను వివరణ కోరగా గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ సవరణలు కోరిన మాట వాస్తమేనని ధ్రువీకరించారు. తొందర్లోనే సవరణలు పూర్తిచేసి ప్రతిపాదనలు సమర్పించి నిధులు రాబడతామన్నారు. -
సాగునీటికి యేటా తిప్పలే.
మెదక్, న్యూస్‌లైన్: మెతుకుసీమ రైతన్నల ఆశలసౌధమైన ఘణపురం ప్రాజెక్ట్‌కు రాహుకాలం దాపురిం చింది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు నిధులున్నా.. కాల్వలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీరున్నా పొలాలకు పారడం లేదు. సింగూర్ నీటి వినియోగంలో హక్కు కలిగి ఉన్నా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఫిబ్రవరి నెలలో ప్రాజెక్టులోకి చేరిన గుర్రపు డెక్క ప్రాజెక్టును ముంచేస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘణపురం. పాపన్నపేట-కొల్చారం మండలాల మధ్య మంజీరా నదిపై నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఫతేనహర్, మహబూబ్ నహర్ కాల్వలున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు, కాల్వలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. అప్పట్లో నగరబాటలో భాగంగా మెదక్ పట్టణానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి, ఎడమ కాల్వల మర మ్మతుల కోసం తాత్కాలికంగా రూ.9 కోట్లు మంజూరు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలక్ష్యం వల్ల సుమారు రూ.3 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దీనంగా మారింది. కాల్వల పూర్తిస్థాయి మరమ్మతు కోసం 2011లో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి. వివాదాలతో ఆగిన పనులు కాంట్రాక్టు విషయంలో ఏర్పడిన వివాదం ఘణపురం ప్రాజెక్టు పాలిట గ్రహణంగా మారింది. ఈ పనులు చేయడానికి 2012లో టెండర్ పొందిన ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పొదల తొలగింపు పనులు ప్రారంభించారు. 2014 వరకు ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. అయితే రాజకీయ ప్రాబ ల్యం గల ఓ నాయకుడి బంధువు ఈ కాంట్రాక్టుపై కన్నుపడటంతో, సదరు నాయకుడు పనులను అడ్డుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా ఇసుక బూచిని చూపుతూ పనులు నడవడం లేదని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన కాల్వలనుంచి నీరు పారకపోవడంతో చివరి ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సుమారు 22 వేల ఎకరాల్లో 12 వేల ఎకరాలు మాత్రమే సాగువుతున్నట్లు తెలుస్తోంది. జల వివాదం సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘణపురం ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఈ మేరకు జీఓ ఉన్నప్పటికీ, నీరు విడిచే ప్రతిసారీ ఎంతమేర నీరు వదలాలన్న విషయమై ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తుంది. దీంతో ఘణపురం ఆయకట్టు రైతుల భవిష్యత్తు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో 15.4 టీఎంసీల నీరుండగా, ఘణపురం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది. దీంతో రైతులు తమ పంట పొలాలకు నీరు వదలాలని మూడు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సింగూర్ నీరు అడగబోమని హామీ ఇస్తేనే ఘణపురం నీటిని వదులుతామని అధికారులు షరతు విధించారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘణపురం ప్రాజెక్టుపై దాడిచేసి బలవంతంగా సాగునీరును వదిలారు. కాలుష్యంగా మారిన ప్రాజెక్టు గత ఫిబ్రవరి నెలలో ఏడుపాయల జాతర కోసం సింగూర్ నీరు వదిలిన సమయంలో ఘణపురం ప్రాజెక్టులోకి భారీస్థాయిలో గుర్రపుడెక్క చేరింది. దీంతో ప్రాజెక్టులోని నీరు రోజురోజుకి కలుషితమవుతోందని రైతులు వాపోతున్నారు. తాము చేపలు పట్టలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘణపురం జలకళను చూసి పర్యాటక అందాలను ఆస్వాదిద్దామనుకున్న భక్తులకు నిరాశే మిగులుతోంది. అధికారులు స్పందించి వెంటనే జైకా పనులు ప్రారంభించి, ఘణపురం ప్రాజెక్ట్‌కు రావాల్సిన 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.