snehitha
-
ఇద్దరికీ తాళికట్టి.. గొంతునులిమి హత్య
జంగారెడ్డిగూడెం: ఈ నెల 18న స్థానిక బస్టాండ్ వద్ద ఒక మహిళను హత్యచేసిన నేరంపై ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. బేతపూడి హేమలత(29) అనే మహిళను కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్‌కుమార్ పీక నులిమి హత్యచేసినట్లు తెలిపారు. మండలంలోని నిమ్మలగూడేనికి చెందిన హేమలతకు 2012లో చాగల్లులో పనిచేస్తుండగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైనట్లు చెప్పారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారన్నారు. అయితే 2014లో హేమలతకు తెలియకుండా ప్రవీణ్‌కుమార్ కొవ్వూరుకు చెందిన వేరొక మహిళను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హేమలతకు కూడా ఏడాది క్రితం గౌరీపట్నం మేరీ మాత గుడిలో తాళికట్టినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నారు. తరువాత కొన్ని రోజులకు ప్రవీణ్‌కుమార్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు హేమలతకు తెలిసిందన్నారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని హేమలత నివాసం ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేస్తోందన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ అప్పుడప్పుడూ హేమలత వద్దకు వచ్చి వెళుతుండేవాడని, ఏ పనీ లేక, ఆదాయం లేక హేమలతను డబ్బులు అడుగుతుండేవాడన్నారు. దీంతో హేమలత ఎంతో కొంత డబ్బులు ఇస్తుండేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఘటనకు ముందు వారం రోజులుగా ప్రవీణ్‌కుమార్ జంగారెడ్డిగూడెం వచ్చి ఆమె వద్ద ఉంటున్నాడని, ఆమెను డబ్బులు అడగ్గా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. ఈనేపథ్యంలో హేమలతను ప్రవీణ్‌కుమార్ కొట్టి గొంతునులిమి హత్యచేసినట్లు వెల్లడించారు. అయితే ఆమె బాత్రూమ్కు వెళ్లి పడిపోయి మృతిచెందినట్లు అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడన్నారు. నిందితుడిపై హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన బీఎన్ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు, ఏఎస్సై ఎన్వీ సంపత్‌కుమార్, హెచ్‌సీ ఎన్.రాజేంద్ర, పీసీలు కె.కిరణ్, బి.హరిప్రసాద్‌లను డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
చాంపియన్ శ్రీజ రన్నరప్ స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ, సురావజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ మెరిశారు. హరియాణాలోని పంచ్కులాలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీజ యూత్ బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా... పురుషుల సింగిల్స్ విభాగంలో స్నేహిత్ రన్నరప్‌గా నిలిచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల శ్రీజ ఫైనల్లో 13–15, 11–5, 12–10, 11–9, 9–11, 12–10తో సెలీనా దీప్తి (తమిళనాడు)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల స్నేహిత్ 9–11, 8–11, 11–4, 11–7, 6–11, 4–11తో ప్రపంచ జూనియర్ మూడో ర్యాంకర్ మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో స్నేహిత్ మూడో రౌండ్లో ‘ట్రిపుల్ ఒలింపియన్’... 2006 కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ విజేత... ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్ అయిన 36 ఏళ్ల ఆచంట శరత్ కమల్‌పై 12–10, 9–11, 11–3, 11–9, 5–11, 12–14, 11–8తో సంచలన విజయం సాధించాడు. -
అబల చెంతకు సబల
వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసిం చడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి. ఇలాంటి వారి కోసమే నేనున్నా నంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్ అధికారి స్థాయిలో తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించనున్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టు వివరాలను ఆమె వెల్లడించారు. గుంటూరు, తెనాలి: రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’ ప్రారంభించామని ప్రాజెక్టు నోడల్ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సాక్షికి ఆమె వెల్లడించారు. ఇలాంటి వారి కోసమే ‘సబల’ ప్రాజెక్టు ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జిల్లా ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో రెండు నెలలుగా పైలెట్ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం. ‘సబల’ను నెలాఖరుకు అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ముగ్గురం ఆడపిల్లలమే... తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు...పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు. డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ పీజీ, ఎంఫిల్ చేశాను. 2012లో గ్రూప్–1లో సెలక్టయ్యాను. పీహెచ్డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు. నిశ్వబ్దాన్ని వీడితేనే న్యాయం.. వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది. కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా! ‘షీ టీమ్లోమూడేళ్లలో 2 వేల కేసులు గ్రూప్–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్ సైబరాబాద్‌లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్‌లో పని చేశాను. రోడ్లపై డెకాయ్ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది. -
ప్రపంచ జూనియర్ టీటీ టోర్నీకి స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత... ఇటలీలో ఈనెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ప్రపంచ జూనియర్ టీటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యా డు. స్నేహిత్‌తో పాటు మానవ్ ఠక్కర్, మనుశ్ షా, జీత్‌చంద్ర జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు స్నేహిత్ కావడం విశేషం. 17 ఏళ్ల స్నేహిత్ ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ పతకాలను సాధించాడు. -
స్నేహిత్‌కు కాంస్యం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: గ్లోబల్ జూనియర్ అండ్ క్యాడెట్ ఇండియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో తొలి పతకాన్ని అందుకున్నాడు. భారత్-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్నేహిత్ డబుల్స్‌లో జీత్ చంద్రతో కలిసి బరిలోకి దిగాడు. గోవాలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్-బి 0-3తో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భారత్ 3-2తో స్వీడన్‌పై నెగ్గగా; రెండో మ్యాచ్‌లో 1-3తో భారత్-ఏ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో మ్యాచ్‌లో భారత్-బి 2-3తో భారత్-సిపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.