సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత... ఇటలీలో ఈనెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ప్రపంచ జూనియర్ టీటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యా డు.
స్నేహిత్‌తో పాటు మానవ్ ఠక్కర్, మనుశ్ షా, జీత్‌చంద్ర జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు స్నేహిత్ కావడం విశేషం. 17 ఏళ్ల స్నేహిత్ ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ పతకాలను సాధించాడు.
ప్రపంచ జూనియర్ టీటీ టోర్నీకి స్నేహిత్
Published Tue, Nov 21 2017 12:31 AM | Last Updated on Tue, Nov 21 2017 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment