దీపావళికి యూఎన్ ప్రత్యేక కానుక
న్యూయార్క్ : దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి రెండు స్టాంపులను విడుదల చేసింది. ‘హ్యాపీ దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగుల పండుగ సందర్భంగా యూన్ స్టాంప్స్’ అంటూ ట్వీట్ చేసింది. శుభాకాంక్షలతో పాటు హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడిన లైటింగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, దీపాలతో కూడిన స్టాంపు షీటు ఫొటోను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది.1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపులను అంతర్జాతీయ ఎయిర్‌మేల్ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు.
Happy Diwali!
During the festival of lights, which is celebrated in India & by followers of many faiths across the world, clay lamps are lit to signify the victory of good over evil. Find Diwali @UNStamps here: https://t.co/jetZGjk2Ar pic.twitter.com/qT6LTXkkAf
— United Nations (@UN) November 7, 2018
కాగా యూఎన్ ట్వీట్‌పై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. ‘ మేమెంతో ప్రత్యేకంగా భావించే, చెడుపై మంచి విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ సందర్భంగా స్టాంప్స్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.