Swaccha bharat Mission
-
‘స్వచ్ఛ’ సైన్యం!
- మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతానికి సర్కారు నిర్ణయం - పదివేల మంది తాపీ మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారతమిషన్లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తం గా గుర్తించిన పదివేల మంది తాపీ మేస్త్రీలతో ‘స్వచ్ఛ’సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. మరుగుదొడ్డి కోసం గది నిర్మాణంతోపాటు కమోడ్, పైప్లైన్ల అనుసం ధానం, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు వరకు అన్నీ ఒక్కరే పూర్తి చేసేలా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర నిధులతో..: బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు, ఇంటింటా మరు గుదొడ్డి ఉండేలా కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర నిధులతో మన రాష్ట్రంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించి నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో 1.58 లక్షల మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మా ణం ఆశించిన స్థాయిలో లేదు. లక్ష్యంలో కేవలం 40 శాతమే సాధించారు. మరో 9 జిల్లాల్లో 70 శాతం వరకు పూర్తి చేయగా.. మిగతా జిల్లాల్లో 70 శాతానికి పైబడి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ‘స్వచ్ఛ’సైన్యంతో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం కానుంది. మూడు పనులు ఒక్కరే..: మరుగుదొడ్డి ఏర్పాటుకు కావాల్సిన గది నిర్మాణాన్ని మేస్త్రీ చేపట్టాలి, అందులో కమోడ్, పైపులు తదితర పనులు ప్లంబర్ చేస్తే... విద్యుత్ బల్బు, వైరింగ్ పని ఎలక్ట్రీషియన్ది. ఈ మూడు పనులకు ముగ్గురిని పిలిపించటం సమస్యగా మారింది. ఆర్థిక భారమనో, వేళకు వారు రాకపోవడమో.. ఇలా పలు కార ణాలతో ఆ పనులు సరిగా జరగటం లేదు. దీంతో తాపీ మేస్త్రీ ఒక్కరే ఈ మూడు పను లు చేస్తే సమస్య ఉండదని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనుల్లో మేస్త్రీలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం ఈ శిక్షణ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 10 వేల మంది తాపీ మేస్త్రీలకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. వారం పాటు శిక్షణ: ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాలోని మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వారికి పనులు పురమాయిస్తారు. మొత్తంగా ఈ పది వేల మంది రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. -
‘స్వచ్ఛ’ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం
♦ 5వ స్థానం దక్కించుకున్న వైజాగ్ ♦ వరంగల్‌కు 32, విజయవాడకు 23వ స్థానం.. అగ్రస్థానంలో మైసూరు ♦ స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితా విడుదల చేసిన కేంద్రమంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, మౌలిక వసతుల కల్పనలో నగరాల మధ్య పోటీ పెంచడానికి స్వచ్ఛ సర్వేక్షణ్-2016 పేరుతో 73 నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం విడుదల చేశారు. దీనిలో మైసూరు(కర్ణాటక) ప్రథమ స్థానం దక్కించుకోగా.. ఆ తర్వాత వరుస స్థానాల్లో చంఢీగఢ్, తిరుచిరాపల్లి(తమిళనాడు), న్యూఢిల్లీ నిలిచాయి. తెలుగురాష్ట్రాల్లోని విశాఖపట్నం 5వ, హైదరాబాద్ 19, విజయవాడ 23, వరంగల్ 32వ స్థానం దక్కించుకున్నాయి. స్వతంత్ర పరిశీలన ర్యాంకింగ్‌లలో విశాఖ మొదటి స్థానంలో నిలిచి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రెండు అవార్డులను దక్కించుకుంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్య వహిస్తున్న వారణాసికి స్వచ్ఛ నగరాల్లో 65వ స్థానం దక్కడం గమనార్హం. 2014 ఫలితాలతో పోలిస్తే హైదరాబాద్, విశాఖపట్నం గణనీయమైన ప్రగతి సాధించాయి. పరిశుభ్రత విషయంలో నగరాల ప్రయత్నాలను అంచనా వేయడానికి ఈ సర్వేలో నిర్ణయించిన 2,000 మార్కులలో ఘన వ్యర్థాల నిర్వహణకు 60 శాతం, మరుగుదొడ్ల నిర్మాణానికి 30 శాతం, పారిశుధ్య వ్యూహాలు, ప్రవర్తనలో మార్పులకు 5 శాతం చొప్పున కేటాయించారని వెంకయ్యనాయుడు తెలిపారు. 2019 నాటికి పూర్తి స్వచ్ఛ భారత్‌ను సాధించాలన్నది ప్రధాని మోదీ ఆశయమని చెప్పారు.