t chiranjeevulu
-
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతివారం తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులపై ఇకపై ప్రతి వారంలో ఒకరోజు రాష్ట్రస్థాయి అధికారుల నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని పాఠశాల విద్య డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. ఈనెల 14నుంచి ఈ తనిఖీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే ఉండి శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పాఠశాల విద్యను పక్కాగా గాడిలో పెట్టడం సాధ్యం అవుతుందని వివరించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలపై చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం విభాగాధిపతులు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, బోధన స్థితి గతులు, మధ్యాహ్నం భోజనం పరిస్థితి, విద్యా కార్యక్రమాల అమలు తదితర అంశాలన్నింటిపై పరిశీలన జరుపుతారన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగాయని తెలిపారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో నల్లగొండ పార్లమెంటరీ నియోవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి స్క్రూటిని అబ్వర్జర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో జిల్లాలో జరిగిన పోలింగ్‌సరళి, పోలింగ్ జరిగిన విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన విషయాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని తెలిపారు. పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని చేయగా వాటిలో కూడా అన్ని సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తన ఛాంబర్లో భునవగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజవర్గాలకు సంబంధించి పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని అబ్జర్వర్లు, పోటీ చేసిన అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో సమీక్ష చేశారు. జిల్లాలో జరిగిన పోలింగ్ సరళి, పోలింగ్ జరిగిన విధానాన్ని జేసీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రోషన్ సుంకారియా, విద్యాసాగర్ ప్రసాద్, సంతోష్‌కుమార్ సారంగీ, దేవిప్రసాద్ పాండా, వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాలకార్మికులను బడిలో చేర్పించాలి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ బడిబయట పిల్లలందరినీ రాబో యే పది రోజుల్లో రెగ్యులర్ పాఠశాల, కేజీబీవీ, ఆర్‌ఎస్‌టీసీలలో చేర్పించాలని కలెక్టర్ టి.చిరంజీవులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో సోమవారం ఎంఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బడిబయట పిల్లల నమో దు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల పనితీరు, ఎస్సెస్సీ ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల అంశాలపై సమీక్ష చేశారు. జిల్లాలో నిర్వహించిన సర్వే ప్రకారం 3342 మంది పిల్లలు బడిబయట ఉన్నారన్నారు. బాలకార్మికులందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. మహిళా సమాఖ్యల ద్వా రా 5, ఎన్జీవోల ద్వారా 2 రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు (ఆర్‌ఎస్‌టీసీ)ను అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రారంభిం చినట్లు తెలిపారు. మంగళవారం జరిగే మన గ్రామం కార్యక్రమంలో అన్ని ఎం పీడీఓ కార్యాలయాల్లో దత్తత అధికారులతో సమావేశం నిర్వహించి బడిబయట పిల్లల దత్తత వివరాలను వచ్చే శుక్రవారం నాటికి సమర్పించాలన్నారు. సీఆర్పీలు, ప్రేరక్‌లు, విద్యాభిమాను లు, యువకుల భాగస్వామ్యంతో గ్రామ సర్పంచ్‌లు కలిసి పనిచేయాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. వారానికి రెండుసా ర్లు గుడ్లు అందించాలని అలా పాటిం చని ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై చర్యలు తీసుకుంటామని, ఏజెన్సీలను రద్దు చేస్తామన్నారు. పాఠశాలల్లో గుణాత్మకత, పాఠశాల వాతావరణం పెంపొందేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాల న్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. మన కోసం మనం కార్యక్రమంలో భా గంగా నిర్వహిస్తున్న అక్షరాస్యత కేంద్రాలను ఎప్పటికప్పుడు ఎంఈఓలు సందర్శించాలన్నారు. సమావేశంలో డీఈఓ జగదీష్ పాల్గొన్నారు.