Tamil Nadu Tour
-
ట్రెండింగ్ : గో బ్యాక్ మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ : మదురైలో ఏయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం తమిళనాడు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్లో నిరసన సెగ తగిలింది. గోబ్యాక్ మోదీ హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. మోదీ తమిళనాడు పర్యటనను రెండు లక్షలకు పైగా ట్విటర్ ఖాతాదారులు తిరస్కరిస్తుండగా.. ఆయనకు వెల్కం చెబుత్ను వారి సంఖ్య కేవలం 30 వేల మందే ఉండడం గమనార్హం. ఇంకా కొంతమంది ఏకంగా ద్రవిడ ఉద్యమ నిర్మాత, హేతువాది పెరియార్ రామస్వామి మోదీని బయటకు నెట్టేసే కార్టూన్‌ను కూడా జతచేస్తున్నారు. తమిళనాడుపై గజ తుపాన్ విరుచుకుపడగా కేంద్రం సాయమందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకనే ప్రధాని పర్యటనపట్ల నిరసన తెలుపుతున్నామని చెప్తున్నారు. ఇదిలాఉండగా..గత నవంబర్‌లో గజ తుపాను ధాటికి తమిళనాడు విలవిల్లాడింది. దాదాపు 59 మంది మృత్యువాత పడగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది. ఇక మధురైలో ఏయిమ్స్ ఏర్పాటు చేస్తుండడం పట్ల వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధురై థాంక్స్ మోదీ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. టీఎన్ వెల్కం మోదీ మోదీ హ్యాష్ ట్యాగ్‌తో తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. ఏయిమ్స్‌తో పాటు మధురై రాజాజీ మెడికల్ ఆస్పత్రి, తంజావూరు మెడికల్ ఆస్పత్రి, తిరునర్వేలి మెడికల్ ఆస్పత్రిల్లో సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కేరళకు వెళ్లనున్నారు. మోదీకి రాకకు వ్యతిరేకంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్‌టాగ్‌కు తమ పార్టీకి ఏ సంబంధం లేదని డీఎంకే ఐటీ సెల్ చీఫ్ పి.త్యాగరాజన్ స్పష్టం చేశారు. బీజేపీ ఐటీ సెల్ మాదిరిగా తాము చేయబోమని అన్నారు. కాగా, మోదీ గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ గతంలో కూడా ఓసారి ట్రెండ్ అయింది. గతేడాది ఏప్రిల్‌లో డిఫెన్స్ ఎక్స్పో సందర్శించడానికి మోదీ తమిళనాడుకు వెళ్లిన సందర్బంలో ఇది జరిగింది. When we were affected by Gaja cyclone, no words from you, so now for you #GoBackModi — bastin (@bastinmaradona) January 27, 2019 Since you have not kept your promises on ... Please #GoBackModi — Pon adhavan (@PonAdhavan) January 27, 2019 Not about to understand the psychology of those who trend #GoBackModi while that person is coming to improve medical facilities in the state.#TNWelcomesModi#TNThanksModi #MaduraiWelcomesModi #MaduraiThanksModi https://t.co/R8vRFGk70e — தேள் 🇮🇳 (@Tweets_CS) January 27, 2019 -
హ హ్హ హ్హా.. మా స్టైలే వేరు!
‘హ హ్హ హ్హా.. మా స్టైలే వేరు’ అన్నది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నారా.. కానే కాదు. రజనీకాంత్‌ను రాజకీయ ముగ్గులోకి దించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాటలవి. తమిళ రాష్ట్రాల్లో రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం పుదుచ్చేరికి చేరుకున్న అమిత్‌షా ప్రముఖ తమిళ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ.. ♦ పూర్తిస్థాయి బలగంతో బలోపేతం ♦ తమిళనాడు, పుదుచ్చేరిల కోసం మాస్టర్ ప్లాన్ ♦ అన్నాడీఎంకేది అంతర్గత వ్యవహారం ♦ రజనీకాంత్‌ను రానీయండి చూద్దాం ♦ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంతరంగం సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రశ్న : తమిళనాడులో రాజకీయ కల్లోలం ఏర్పడి ఉండగా దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అధ్యక్షునిగా మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారు? అమిత్‌షా: ఇది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం ఇందులో మేం జోక్యం చేసుకోకూడదు. అయినా, తమిళ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేవలం అండగా నిలుస్తాం. ప్రశ్న : అత్యంత ప్రజాదరణ కలిగిన జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు మీ వద్ద ఏదైనా పథకం ఉందా? అమిత్‌షా: జాతీయ దృక్పథంతో పార్టీ, ప్రభుత్వం దేశాభివృద్ధికి పాటుపడుతోంది. అదే సమయంలో తమిళనాడులో అవినీతిరహిత ప్రభుత్వానికి, నేతకు కేంద్ర సహకారం ఎలాగూ ఉంటుంది. ప్రశ్న: తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలం గా లేదు. మీ పార్టీ నేతలకు మధ్య సమన్వయం లేదు. ఈ పరిస్థితిలో పార్టీ అధ్యక్షుడుగా ఎవరిని నిలబెడితే తమిళనాడులో బీజేపీ బలపడుతుంది? అమిత్‌షా: తమిళనాడులో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపరిచేందుకు పూర్తిస్థాయి కార్యకర్తలను, పర్యవేక్షకులను నియమిస్తున్నాం. పోలింగ్ బూత్ స్థాయిలో 40 నుంచి 50 మందితో బృందాలను ఏర్పాటు చేసి, ప్రజాభిప్రాయం సేకరిస్తాం. పార్టీ, ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళతాం. వీటి ఆధారంగా తమిళనాడు, పుదుచ్చేరికి ఒక ఫార్ములా సిద్ధం చేసుకుంటాం. ప్రధాని వాటికి మార్గదర్శకం చేస్తారు. ఇదే మా పార్టీ స్టైల్. తమిళనాడులో పార్టీ బలో పేతం, అధికారం కోసం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ప్రశ్న : సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నమ్మి తమిళనాడులో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు నిజంగానే ప్రజల్లో అంత పరపతి ఉందా? అమిత్‌షా: రజనీకాంత్కునిజంగానే ప్రజల్లో ఎంతో పరపతి ఉంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. మొదట ఆయన నిర్ణయం తీసుకోనివ్వండి ఆ తర్వాత మాత్రమే మా వ్యూహం ఉంటుంది. రజనీ బీజేపీలో చేరాలనుకుంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పార్టీ నేతతో చర్చించి ఒక నిర్ణయానికొస్తాం. ప్రశ్న : ఢిల్లీలో పోరాటం చేసిన తమిళనాడు రైతులను మోదీ పట్టించుకోలేదనే విమర్శ ఉంది. వ్యవసాయ రుణాల రద్దు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడిచేసి మీరు మంచి పేరు తెచ్చుకుని ఉండవచ్చుకదా ? అమిత్‌షా: రైతుల సమస్యలు రాష్ట్రస్థాయిలోనివి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలి. రైతులు తమ పోరాటాన్ని చెన్నైలో నిర్వహించి ఉంటే బాగుండేది. ప్రశ్న : నీట్ పరీక్ష తమిళనాడు ప్రజల విద్యావకాశాలను దెబ్బతీసింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నీట్ పరీక్షలో కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. ఈ కారణంగా ప్రాంతీయ భాషల రాష్ట్రాలను నీట్ నుంచి మినహాయించేలా నిర్ణయం తీసుకోవచ్చుకదా ? అమిత్‌షా: నీట్ పరీక్ష సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. ఇంగ్లీషు భాషలోనే నీట్ పరీక్షలు నిర్ణయించాలని న్యాయస్థానం సూచించినపుడు కేంద్రం జోక్యం చేసుకుని ప్రాంతీయ భాషా రాష్ట్రాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిందిగా సూచించింది. అంతేకాక రాష్ట్రాలకు ఏడాది కాలం మినహాయింపు ఇచ్చి, ఆ తర్వాతనే నీట్ పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర సిలబస్‌ను తయారుచేసే నిపుణులతో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా సమస్యలు లేని విధంగా నీట్ పరీక్షలు నిర్వహించేలా కృషి చేస్తాం. కోర్టు ఆదేశాలను అమలుచేయడం ప్రభుత్వాల విధి. నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్రాలే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రశ్న : తమిళనాడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కావేరి వాటా జలాల విడుదలపై కర్ణాటక ప్రభుత్వం నాటకాలాడుతోంది. నదుల అనుసంధానంపై బీజేపీ ఇప్పటికే అనేకసార్లు ప్రస్తావించింది. నదుల అనుసంధానాన్ని తమిళనాడు నుంచి ప్రారంభించగలరా? అమిత్‌షా: నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కావేరి అనుసంధానంపై మూడు రాష్ట్రాలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్న : పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్టు అధికార పార్టీ విమర్శిస్తోంది కదా? అమిత్‌షా: పుదుచ్చేరి పాలనలో నేను ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాను. అవినీతిని అణచివేసే అధికారం గవర్నర్లకు ఉంది. పుదుచ్చేరిలో అవినీతి రాజ్యమేలుతున్నందున గవర్నర్ బేడీ ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
'రూటు' మార్చిన పన్నీరు సెల్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రజలకు చేరువయ్యేందుకు యాత్ర చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన తమిళనాడు యాత్రను ప్రారంభించారు. నెల రోజుల పాటు రోడ్డు మార్గం ద్వారా పన్నీరు తమిళనాడులో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ర్యాలీలలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజలతోనూ, పార్టీ కార్యకర్తలను కలుస్తారు. జయలలిత మరణించాక అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శశికళను వ్యతిరేకించిన పన్నీరు వేరు కుంపటి పెట్టుకున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ తన నమ్మినబంటు పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పన్నీరు వ్యతిరేకించినా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శశికళ మేనల్లుడు దినకరన్.. ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయ్యారు. పళని, పన్నీరు వర్గాలు విలీనమయ్యేందుకు చర్చల ప్రతిపాదనకు తెరపైకి తెచ్చాయి. విలీన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు పన్నీరు రూటు మార్చి యాత్రకు బయల్దేరారు. మళ్లీ తమిళనాడు సీఎం కావడమే లక్ష్యంగా పన్నీరు పావులు కదుపుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడంతో పాటు జయలలిత మృతిపై విచారణ చేయించాలన్న డిమాండ్‌ను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది. పార్టీ నుంచి శశికళ వర్గాన్ని దూరం చేసేలా పన్నీరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. -
టెక్స్టైల్ పార్కులో ‘తిరుపూర్’ పెట్టుబడులు
తమిళనాడు పర్యటనలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ టెక్స్టైల్ పార్క్‌లో పది యూనిట్ల ఏర్పాటుకు తిరుపూర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (టీఈఏ) సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తమిళనాడు పర్యటనలో భాగంగా గురువారం తిరుపూర్, పల్లడం గ్రామాల్లో టెక్స్టైల్స్ పరిశ్రమలను సందర్శించారు. వరంగల్‌లో నెలకొల్పనున్న మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని టీఈఏ ప్రతినిధులను ఆహ్వానించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాల ప్యాకేజీ ఇస్తామని, కార్మికులు, ఇన్వెస్టర్లకు హౌజింగ్, విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. అనంతరం పల్లడం చేనేత పార్కును సందర్శించారు. పల్లడం తరహాలో సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి పరస్పర సహాయ సహకారం కోసం కోయంబత్తూరులోని పీఎస్జీ టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.