Tata companies
-
టాటా కన్స్యూమర్ నుంచి మిల్లెట్ మ్యుస్లీ
హైదరాబాద్: టాటా కన్స్యూమర్ నుంచి మిల్లెట్ మ్యుస్లీ ప్రోడక్ట్స్ (టీసీపీ) తమ సోల్‌ఫుల్ బ్రాండ్ కింద మిల్లెట్ మ్యుస్లీ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. నేషనల్ న్యూట్రిసెరల్ కన్వెన్షన్ 4.0 కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్లు 25 శాతం ఉంటాయని సంస్థ తెలిపింది. ఇలాంటి మరిన్ని ఉత్పత్తులను రూపొందించేందుకు ఐఐఎంఆర్తో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. టాటా సోల్ఫోల్ ఈ సదస్సు సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పోషక్ అనాజ్ అవార్డ్– 2022ను అందుకుంది. చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌లో టాటా కాఫీ విలీనం!
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా టాటా కాఫీ (టీసీఎల్) వ్యాపార కార్యకలాపాలాన్నింటినీ విలీనం చేసుకుంటున్నట్లు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తెలిపింది. టీసీఎల్‌కు చెందిన ప్లాంటేషన్ వ్యాపారాన్ని టీసీపీఎల్ బెవరేజెస్ అండ్ ఫుడ్స్ (టీబీఎఫ్ఎల్) కింద విడగొట్టనుండగా.. మిగతా వ్యాపారాలు (బ్రాండెడ్ కాఫీ మొదలైనవి) టీసీపీఎల్లో విలీనమవుతాయని పేర్కొంది. ముందుగా విభజన, ఆ తర్వాత విలీనం ఉంటాయని సంస్థ వివరించింది. విలీనానికి సంబంధించిన స్కీము కింద ప్రతి 55 టీసీఎల్ షేర్లకు గాను 14 టీసీపీఎల్ షేర్లు లభిస్తాయి. విభజన, విలీన ప్రతిపాదనలకు రెండు సంస్థల బోర్డులు మంగళవారం ఆమోదముద్ర వేశాయి. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి టీసీఎల్‌లో టీసీపీఎల్‌కు 57.48 శాతం వాటాలు ఉండగా.. విలీన డీల్ పూర్తయితే 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. మరోవైపు, షేర్ల మార్పిడి ద్వారా తమ బ్రిటన్ అనుబంధ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ యూకే లిమిటెడ్‌లో మైనారిటి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు టీసీపీఎల్ తెలిపింది. ఈ ప్రతిపాదనలతో వాటాదారులకు మరింత విలువ చేకూర్చగలమని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా చెప్పారు. టాటా గ్లోబల్ బెవరేజెస్‌లో టాటా కెమికల్స్‌కు సంబంధించిన కన్జూమర్ ఉత్పత్తుల వ్యాపారం విలీనంతో టీసీపీఎల్ ఏర్పడింది. టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, టాటా గ్లూకో ప్లస్ మొదలైన బ్రాండ్లు సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కంపెనీకి దేశ విదేశీ మార్కెట్లలో దాదాపు రూ. 11,600 కోట్లపైగా వార్షిక టర్నోవరు ఉంది. -
మిస్త్రీ సంచలన నిర్ణయం
ముంబై: టాటా -మిస్త్రీ బోర్డ్ వార్ లో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూపుకు చెందిన లిస్టెడ్ కంపెనీలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే తన పోరాటాన్ని మరింత పెద్ద వేదికకు మార్చుతున్నట్టు ప్రకటించారు. గత అయిదు దశాబ్దాలుగా తమ కుటుంబం టాటా గ్రూపునకు ఎనలేని సేవలు అందించిందని మిస్త్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీలను దారిలో పెట్టేందుకు ప్రయత్నం చేశాననీ, కానీ రతన్ టాటా నన్ను అడ్డుకున్నారని మిస్త్రీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్ట విరుద్ధంగా తనకు తొలగించారని, గత ఎనిమిదివారులు టాటా గ్రూపు సమాధానం కోసం ఎదురుచూశానని పేర్కొన్నారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి టాటా గ్రూపురక్షణ కోసం న్యాయపోరాటానికి పూనుకున్నట్టు తన లేఖలో తెలిపారు. టాటా గ్రూపులో ఇటీవలి పరిణామాలు తనను బాగా బాధించాయని పేర్కొన్న మిస్త్రీ ఇకముందు పోరాటానికి మరింత పదునుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. టాటా గ్రూపునకు అన్ని జనరల్ మీటింగ్ లనుంచి తనను తాను తొలగించుకుంటున్నట్టు ప్రకటించారు. టాటా సన్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్ , టాటా పవర్, ఇండియన్ హోటల్స్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.