ten sports
-
సోనీ చేతికి టెన్‌స్పోర్ట్స్
స్పోర్ట్స్ నెట్వర్క్ విక్రయానికి జీ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం * డీల్ విలువ రూ.2,579 కోట్లు... న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజ్(జీల్) తన స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్.. టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్)కు విక్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు జీల్ బుధవారం వెల్లడించింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 38.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.2,579 కోట్లు)గా పేర్కొంది. ఎస్పీఎల్తో ఈ మేరకు తమ సబ్సిడరీలతో పాటు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు తెలిపింది. జీల్‌కు చెందిన స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ ప్రస్తుత సబ్సిడరీ తాజ్ టీవీ లిమిటెడ్-మారిషస్ నేతృత్వంలో ఉంది. టెన్ బ్రాండ్ టీవీ చానల్స్ ప్రసార, పంపిణీ కార్యకలాపాలన్నీ ఈ సంస్థే చూస్తోంది. అయితే, భారత్‌లో దీనికి సంబంధించిన డౌన్‌లింకింగ్, పంపిణీ, మార్కెటింగ్, యాడ్లు ఇతరత్రా అంశాలన్నీ ఎక్స్‌క్లూజివ్ ఏజెంట్ అయిన తాజ్ టెలివిజన్(ఇండియా) చేపడుతోంది. కాగా, టెన్ స్పోర్ట్స్ నెట్వర్క్ కొనుగోలుతో క్రికెట్, ఫుట్‌బాల్, ఫైట్ స్పోర్ట్స్ విభాగాల్లో తమ వీక్షకులకు మరింత కంటెంట్ అందుబాటులోకి వస్తుందని; దేశీ, విదేశీ స్పోర్టింగ్ ప్రాపర్టీకి అదనపు బలం చేకూరుతుందని ఎస్పీఎన్ ఇండియా సీఈఓ ఎన్పీ సింగ్ పేర్కొన్నారు. జీల్ 2015-16 కన్సాలిడేటెడ్ ఆదాయంలో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ వాటా రూ.631 కోట్లుగా నమోదైంది. అయితే, ఈ విభాగం రూ.37.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. టెన్ స్పోర్ట్స్‌ను జీల్ దుబాయ్ పారిశ్రామికవేత్త అబ్దుల్ రహమాన్ బుఖాతిర్కు చెందిన తాజ్ గ్రూప్ నుంచి 2006లో కొనుగోలు చేసింది. ఈ నెట్‌వర్క్‌లో టెన్-1, 1హెచ్డీ, 2, 3, గోల్ఫ్ హెచ్డీ, క్రికెట్, స్పోర్ట్స్ ఉన్నాయి. భారత్ ఉపఖండం, మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, మధ్య ప్రాచ్యం, కరేబియన్ తదితర దేశాల్లో ఈ చానెల్స్ ప్రసారం అవుతున్నాయి. కాగా, వివిధ నియంత్రణ సంస్థల ఆమోదానికిలోబడి ఒప్పందం పూర్తవుతుందని జీల్ వెల్లడించింది. -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్
జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ పిక్చర్స్ సొంతంచేసుకుంది. రూ.2600 కోట్లకు స్పోర్ట్ బ్రాండ్కాస్టింగ్ బిజినెస్‌లను సోనీ పిక్చర్స్‌కు విక్రయించేందుకు టెలివిజన్ దిగ్గజం సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదించింది. సోనీతో కుదుర్చుకున్న ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుంది. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి టెన్ స్పోర్ట్స్‌ను సుభాష చంద్ర కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీన్ని సోనీ పిక్చర్స్‌కు విక్రయించారు. మరో నాలుగు, ఐదు నెలల్లో ఈ డీల్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ డీల్‌తో 21వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారత్‌లో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని వెల్లడవుతోంది. గత కొంతకాలంగా టెన్ స్పోర్ట్స్‌ను విక్రయించాలని జీ ఎంటర్టైన్మెంట్ పావులు కదిపిందని, నష్టాల్లో కొనసాగుతున్న స్పోర్ట్స్ వ్యాపారాలను వదిలించుకోవడానికి ప్రయత్నించిందని జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. సోనీ, స్టార్ రెండు భారత్‌లో తిరుగులేని ఛానల్స్ అని, ఈ డీల్ సోనీకి ఎంతో సహకరించనుందని డఫ్, ఫిల్స్స్ వాల్యుయేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా తెలిపారు. ఈ డీల్ అటు జీ ఎంటర్టైన్మెంట్కి, ఇటు సోనీకి లబ్ది చేకూరుస్తుందని స్పోర్ట్స్ బ్రాండ్కాస్టింగ్కు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ సోనీ కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జిస్తోంది. -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్?
ముంబై: సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో జీ టీవికి చెందిన టెన్ స్పోర్ట్స్ ను సొంతం చేసుకోనుంది. టెలివిజన్ మొఘల్ సుభాస్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెఇఈల్)కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దాదాపు రూ.2000కోట్ల రూపాయలకుసోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా దీన్ని కొనుగోలు చేయనున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి దీన్ని సుభాష చంద్ర కొనుగోలు చేశారు. రెండు నెలలక్రితం ప్రారంభమైన చర్చలు, రెండు వారాల క్రితం మరింత వేగమయ్యాయని దీంతో ఇది ఒక కొలిక్కి వచ్చాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మరో రెండు మూడువారాల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై సోనీ ప్రతినిధిని సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. ఇది పాలసీకి సంబంధించిన అంశమంటూ ఊహాగానాలపై వివరించాడానికి వ్యతిరేకించారు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిహిర్ మోడీ. కాగా మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 21 వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారతదేశంలో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
పాక్‌తో సిరీస్‌పై అనుమానాలు
న్యూఢిల్లీ : భారత్‌తో యూఏఈలో డిసెంబరులో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరోమారు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్ ప్రసార హక్కుల విషయంలో బీసీసీఐ భిన్నాభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ ప్రసారహక్కులు టెన్‌స్పోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఇటీవల ఐసీసీకి పోటీగా రెబల్ లీగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన ఎసెల్ గ్రూప్‌కు చెందిన సంస్థే ఈ టెన్ స్పోర్ట్స్. దీంతో పీసీబీ-టెన్ స్పోర్ట్స్ ఒప్పందాన్ని ఈ సిరీస్ విషయంలో భారత బోర్డు ఒప్పుకునే ప్రసక్తే లేదు.