న్యూఢిల్లీ : భారత్‌తో యూఏఈలో డిసెంబరులో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరోమారు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్ ప్రసార హక్కుల విషయంలో బీసీసీఐ భిన్నాభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ ప్రసారహక్కులు టెన్‌స్పోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఇటీవల ఐసీసీకి పోటీగా రెబల్ లీగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన ఎసెల్ గ్రూప్‌కు చెందిన సంస్థే ఈ టెన్ స్పోర్ట్స్. దీంతో పీసీబీ-టెన్ స్పోర్ట్స్ ఒప్పందాన్ని ఈ సిరీస్ విషయంలో భారత బోర్డు ఒప్పుకునే ప్రసక్తే లేదు.