thungabhadra
-
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు
-
అడుగు ముందుకుపడని ఆర్డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలే అవకాశాలున్నాయి. మూడేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే కానున్నాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అవాంతరాలతో పనులు ముందుకు సాగకపోవడంతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం పనులు చేసేందుకు మరో రెండు మూడు నెలల వ్యవధిఉన్నా, ఏపీ నుంచి స్పందన లేకపోగా, ఆయకట్టు స్థిరీకరణకై చేపట్టిన తుమ్మిళ్లకు అడ్డుపుల్లలు వేస్తోంది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడున్నరేళ్లుగా అడ్డుపడుతూ ఉన్నారు. దీంతో ఆర్డీఎస్ కింద సాగు ముందుకు సాగడం లేదు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్‌వర్క్స్ అంచనాను రూ.3కోట్ల నుంచి రూ.13కోట్లకు పెంచగా, దానికి ప్రభుత్వం ఆమోదం సైతం తెలిపింది. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమచేసి, అక్కడి ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూనే, పనులుచేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా అవి జరగడం లేదు. ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో చర్చిదా మని భావించినా ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు సమావేశానికి రాలేదు. అనంతరం ఆర్డీఎస్‌పై సమావేశం అవుదామని లేఖ రాసినా స్పందించ లేదు. దీంతో ఆధునీకరణ పనులు అడుగు ముందుకు కదల్లేదు. తుమ్మిళ్లకు అడ్డుపుల్ల... ఇక వినియోగించని తుంగభద్ర జలాల్లో వాటా మేరకు వాడుకునేలా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతోంది. 15.90 టీఎంసీల కేటాయింపులో 5 టీఎంసీలకు మించి వినియోగం లేనందున తుమ్మిళ్ల చేపట్టి 5.44 టీఎంసీల నీటిని సుంకేశుల రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి తీసుకుని ఆర్డీఎస్ కాల్వల్లో పోయాలని ప్రణాళిక వేసింది. అయితే దీనిపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తుమ్మిళ్లను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలని, నిర్మాణ పనులు కొనసాగకుండా చూడాలని బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. -
తుంగభద్ర..తడారింది!
గతేడాది 30వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీళ్లు 9 ఏళ్లుగా రెండో పంటకు క్రాప్‌హాలిడే ఆధునికీకరణ పేరిట ఏళ్ల తరబడి నష్టపోతున్న రైతులు lజూరాల: వర్షాకాలంలో తళతళ మెరుస్తూ.. గలగల పరుగులు తీసే తుంగభద్ర ప్రస్తుతం నీళ్లు లేక తడారిపోయింది. చినుక లేక.. ఎగువనుంచి నీళ్లు రాక ఒట్టిపోయి రాళ్లూరప్పలతో బోసిపోయి కనిపిస్తోంది. వరుణుడు కరుణించక పోతాడా.. నీళ్లు రాకపోతాయా? అని కోటి ఆశలతో పంటలు సాగుచేసిన ఆయకట్టు రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ఇక భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశా లేదు.. పంటలు పండుతాయన్నా అవకాశమూ కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఏటేటా నష్టపోతున్న ఆర్డీఎస్ రైతులకు ఈ ఏడాదీ రెండు పంటలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 52.75 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న అడపాదడపా వర్షాలతో కేవలం 8786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. అదేస్థాయిలో ప్రాజెక్టులోని ఎల్ఎల్సీ (లో లెవల్ కెనాల్), హెచ్ఎల్సీ (హై లెవల్ కెనాల్)ల పరిధిలోని ఆయకట్టుకు (8786 క్యూసెక్కుల) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అనుకోని విధంగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటమో, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడమో జరిగితే మినహా పక్షం రోజుల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితులు కనిపించడం లేదు. మొదటినుంచీ నష్టమే.. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మొదటినుంచీ కష్టాలే వెంటాడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 1951 ప్రాంతంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో 87,500 ఎకరాలకు సాగునీరందేది. తర్వాతి కాలంలో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో సిల్టు ఏర్పడటం, కర్ణాటక పరిధిలో ఆయకట్టుకు మించి సాగునీటిని విడుదల చేసుకునేలా తూములు పగలగొట్టడంతో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి నీటిని విడుదల చేసుకోవడం తగ్గిపోయింది. గత 30 ఏళ్లుగా ఆర్డీఎస్ ఆయకట్టులో కేవలం 30వేల ఎకరాలకు మించి ఖరీఫ్‌లో సాగునీరు అందడం లేదు. రబీ సీజన్లోనూ అదే పరిస్థితి ఉంది. 2002లో కర్నూలు, పాలమూరు జిల్లా రైతుల మధ్య స్లూయిస్ రంధ్రాల విషయంలో ఘర్షణ జరిగింది. 2004లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారమిచ్చేలా ’ 92 కోట్లతో ఆధునికీకరణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 2007లో ఆ««దlునికీకరణ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఆర్డీఎస్లో రబీ సీజన్‌కు నీటి విడుదల చేయడం లేదు. పనుల పేరిట ఏటా రెండవ పంట కోల్పోతున్న రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కూడా నీళ్లందని పరిస్థితి ఏర్పడింది. నీళ్లు రావడం కష్టమే! తుంగభద్ర ప్రాజెక్టులో ఇప్పటి వరకు సగం వరకు కూడా నీళ్లు చేరలేదు. భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశలూ కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఏటా నష్టపోతున్న ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ సాగునీరందని పరిస్థితి ఉంది. ఆర్డీఎస్ రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో ఇప్పటికే ఏటేటా నష్టపోతున్న ఆర్డీఎస్ రైతులు ఈ సారి తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ -
ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణకు ‘తుళ్లూరు’
లోటు పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకానికి(ఆర్డీఎస్) ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మహబూబ్‌నగర్ జిల్లా అయిజా మండలం తుళ్లూరు వద్ద సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోసేలా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మొత్తంగా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఆర్డీఎస్ పరిధిలోని 74 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా దీన్ని తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావట్లేదు. దీంతో ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న ఏపీలోని కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డుతగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావట్లేదు. దీంతో కేవలం 30 వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా నీరందుతోంది. సిద్ధమైన ప్రతిపాదనలు ఆర్డీఎస్ కింద ఉన్న కేటాయింపులను సమర్థంగా వాడుకునేందుకు అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే మేలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదా ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారు చేశారు. తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను తుమ్మిళ్ల వద్ద నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో మూడు చిన్న పాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ తుది ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీనికి రూ.830 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ ప్రణాళికపై సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు వచ్చినట్లు తెలిసింది. మూడు రిజర్వాయర్లు కాకుండా కేవలం ఒక రిర్వాయర్ ద్వారానే నీటిని తరలించేలా ప్రత్యామ్నాయం అధ్యయనం చేయాలని, వీలుంటే కొత్తగా మరో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం.