Victoria
-
సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్‌లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ. అలీస్ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన తర్వాత, మన దేశపు తొలి తరం మహిళా న్యాయవాదులలో ఒకరైన ఈమె అక్క కొర్నేలియా స్వరాబ్జీ ప్రోత్సాహంతో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వైద్యశాస్త్ర పట్టాను 1905లో సాధించారు.భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బహవల్పూర్లోని జనానా హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు. అక్కడే 1906లో బ్రిటిష్ మిషనరీ డాక్టర్ థియొడర్ లైటన్ పెన్నెల్‌ను కలవడం, 1908లో పెళ్లి చేసుకోవడం సంభవించింది. పిమ్మట ఢిల్లీలోని విక్టోరియా హాస్పిటల్ బాధ్యురాలిగా తరలి వచ్చారు. 1914–18 మధ్య కాలంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహాబలేశ్వర్ దగ్గర సైనికుల ఆరో గ్యాన్ని కాపాడిన, పర్యవేక్షించిన తొలి మహిళా వైద్యులలో ఈమె కూడా ఒకరు.అఫ్గానిస్తాన్‌లోని గిరిజన తెగల వారితో జీవనం గడిపిన క్రిస్టియన్ మిషనరీ మిస్టర్ పెన్నెల్, తన తల్లి ఇచ్చిన సొమ్ముతో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న) బన్నులో మిషనరీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో అలీస్ పెన్నెల్ కూడా ఈ ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఎంతో గౌరవ భావంతో వైద్య వృత్తిని కొనసాగించిన అలీస్ తన భర్తతో కలిసి ఉర్దూ, పష్తూన్ భాషలను నేర్చుకొని అక్కడి పఠాన్ల, పష్తూన్ల హృదయాలను చూరగొన్నారు. అంతే కాదు ఆ ప్రాంతాలలో ఈ దంపతులు జానపద నాయకులుపొందే గౌరవాలను పొందగలిగారు. ఈ సేవలకు ఆమె ‘కైజర్–ఇ–హింద్’ బంగారు పతకాన్ని కూడా పొందారు.చదవండి: అంతర్జాతీయ జీవ పరిణామ దినం.. ఎందుకు జరుపుకుంటారంటే?అయితే ఆమె భర్త 44 ఏళ్ల వయసులో చనిపోవడం విషాదం. ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత అలీస్ ఢిల్లీకి తరలివచ్చి సమాజ, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో మునిగి పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాగానే లండన్‌లో స్థిరపడ్డారు. తన 74వ ఏట 1951 మార్చి 7వ తేదీన అలీస్ మాడే సొరాబ్జీ పెన్నెల్ అనారోగ్యంతో కనుమూశారు.– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్ బ్యూటీ
ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్' విజేతగా నిలిచారు. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్‌లలో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు. 2023 మిస్ యూనివర్స్ విన్నర్ 'షెన్నిస్ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు. 'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ బ్యూటీకి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
శతక్కొట్టిన టర్నర్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఖాతాలో 17వ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్ షీల్డ్ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి ఛేదించింది. కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ (39), టీగ్ వైల్లీ (43) వెస్ట్రన్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. Western Australia clinched their 17th #SheffieldShield title with a thumping nine-wicket win over Victoria! Full recap from @ARamseyCricket at the WACA + full highlights 👇https://t.co/uAEk4nL5CL — cricket.com.au (@cricketcomau) March 26, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (128) సెంచరీతో కదం తొక్కాడు. What a way to go back-to-back!! Western Australia are the 2022-23 #SheffieldShield champions! #PlayOfTheDay | @MarshGlobal pic.twitter.com/gdsFuNWgqb — cricket.com.au (@cricketcomau) March 26, 2023 అనంతరం విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్ చేయడంలో భాగం కావడం విశేషం. -
జిడ్డు బ్యాటింగ్‌లో ఈ బ్యాటర్‌ను మించినోడు లేడు.. 400 నిమిషాలు క్రీజ్‌లో ఉండి..!
131 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో అత్యంత జిడ్డు బ్యాటింగ్ ప్రస్తుత సీజన్లో నమోదైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న షీల్డ్ 2022-23 ఫైనల్లో విక్టోరియా ఆటగాడు ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి, 280 బంతులను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా 195 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన చంద్రసింఘే చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడి ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్ ఫైనల్లో కనీసం 250 బంతులను ఎదుర్కొని చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 1997-98 సీజన్ ఫైనల్లో టాస్మానియా ఆటగాడు జేమీ కాక్స్ 267 బంతులు ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరిన్ని రికార్డులు కూడా కొల్లగొట్టాడు. షీల్డ్ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా షీల్డ్ ఫైనల్లో చివరి వరకు క్రీజ్‌లో నిలబడిన ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. 16.43 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన చంద్రసింఘే.. తొలి పరుగు చేసేందుకు ఏకంగా 49 బంతులు తీసుకోవడం కూడా ఓ రికార్డే. కాగా, చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్‌ను కొందరు విమర్శిస్తుంటే, మరికొందరేమో ప్రశంశిస్తున్నారు. చంద్రసింఘే ఓపికగా క్రీజ్‌లో నిలబడిన విధానాన్ని టెస్ట్ క్రికెట్ ప్రేమికులు ఆకాశానికెత్తుతున్నారు. శ్రీలంక బీజాలు కలిగిన చంద్రసింఘే కుమార సంగక్కర, మైక్ హస్సీలను ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే, షీల్డ్ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విక్టోరియా 2 పరుగుల లీగ్‌లో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 195 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది. -
CWG 2026: మన పతకాలకు మళ్లీ ఎసరు!
లండన్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్లోనూ భారత్ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్‌ను పక్కన పెట్టేశారు. సీడబ్ల్యూజీలో భారత్‌కు పతకావకాశాలున్న ఈవెంట్లు లేకపోవడంతో మళ్లీ నిరాశనే మిగిలింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే పోటీల్లో షూటింగ్, ఆర్చరీలను నిర్వహించడం లేదు. దీనిపై గతంలోనే భారత్ తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చింది. ఒకానొక దశలో ‘బాయ్‌కాట్’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తం మీద బర్మింగ్‌హామ్ నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి రెజ్లింగ్‌ను తప్పించడం భారత శిబిరాన్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే. బహుళ వేదికల్లో... 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్లాండ్ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మాత్రం ఆతిథ్య, ముగింపు వేడుకలకు పరిమితమైంది. టి20 క్రికెట్ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్ (1962), బ్రిస్బేన్ (1982), గోల్ట్‌కోస్ట్ (2018)లలో మెగా ఈవెంట్స్ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్ కామన్వెల్త్ గేమ్స్ పోటీలు కూడా జరిగాయి. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..? -
వామ్మో.. ఏంటి ఇదంతా.. సాలీళ్లు ఎంత పనిచేశాయి!
సిడ్నీ: భారీ తుపాను ధాటి నుంచి ఆగ్నేయ ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా సంభవించిన ఆస్తి నష్టం నుంచి తేరుకుని సాధారణ జీవితం గడిపే స్థితికి చేరుకుంటోంది. విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, విక్టోరియా రాష్ట్రంలోని ఈస్ట్ గిప్స్‌ల్యాండ్ ప్రజలను వరదల కంటే కూడా సాలీడుగూళ్లే ఎక్కువగా షాక్‌నకు చేస్తున్నాయట. రోడ్డు పక్కన, చెట్ల మీద, మైదానాల్లో ఎక్కడ చూసినా సాలీడులు అల్లిన గూళ్లే దర్శనమిస్తున్నాయట. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పచ్చిక బయళ్లను కప్పివేసిన భారీ స్ప్రైడర్వెబ్స్ను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకిలా? ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లే సమయంలో లేదంటే పొదిగే వేళ సాలీళ్లు వీలైనంత మేర ఎత్తుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తాయట. ఆ సమయంలో కాళ్లు పైకెత్తి వందల సంఖ్యలో దారాల(గాసమేర్)ను గాల్లోకి విడుస్తాయని, ఈ క్రమంలో వాటంతట అవే త్రికోణాకారంలో పారాచూట్ వంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియను బెలూనింగ్ అంటారు. తమను తాము రక్షించేందుకు పెద్ద సాలీళ్లు దీనిని ఉపయోగిస్తాయట. ఈ విషయం గురించి మ్యూజియం విక్టోరియాలో పనిచేసే ఎంటమాలజిస్ట్ డాక్టర్ కెన్ వాకర్ మాట్లాడుతూ.. ‘‘ఇవి చాలా అందంగా ఉన్నాయి. వేగంగా ప్రయాణించేందుకు, ఇతర జీవుల నుంచి తప్పించుకునేందుకు అవి ఇలా చేస్తాయి. చదవండి: షాకింగ్: హిమనీనదాల్లో రక్తం.. ఇదీ అసలు విషయం! -
వైరల్ వీడియో: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు
-
Viral: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చివరికి ట్విస్ట్ ఏంటంటే?
నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు. సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు -
వైరల్: అరె ఏందిది వికెట్లకు అడ్డుగా నిలబడ్డాడు.. ఏమైందంటే!
సిడ్నీ: మార్ష్ కప్ టోర్నీలో భాగంగా విక్టోరియా ఓపెనర్ సామ్ హార్పర్ ప్రవర్తించిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా మధ్య జరిగిన ఆసీస్ దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డేనియల్ వారల్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో సామ్ పరుగు తీసేందుకు యత్నించాడు. అయితే, అంతలోనే బంతి డేనియల్ చేతికి చిక్కడంతో నేరుగా వికెట్లకు గిరాటేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అవుట్ కావడం ఇష్టంలేని సామ్, వికెట్లకు అడ్డంగా నిలబడి ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడు. దీంతో, డేనియల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రవిస్ హెడ్ సైతం సామ్ తీరుకు షాకయ్యాడు. వెంటనే ఆన్- ఫీల్డ్ ఎంపైర్ల దగ్గరకు వెళ్లి చర్చించాడు. ఆ తర్వాత విషయం థర్డ్ అంపైర్ దగ్గరకు చేరగా, ఐసీసీ నిబంధనల ప్రకారం సామ్‌ను అవుట్‌గా ప్రకటించాడు. క్రీజు బయట ఉన్నందుకు అతడు పెవిలియన్‌కు చేరకతప్పలేదు. కాగా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘డేనియల్ వందకు వంద శాతం కరెక్ట్‌గానే త్రో చేశాడు. ఆ బంతి కచ్చితంగా మిడిల్ లెగ్ స్టంప్‌ను తాకి ఉండేది. నిజానికి సామ్ క్రీజు బయట ఉన్నాడు. స్టంప్స్‌ను తాకకుండా బంతిని అడ్డుకుని నిబంధనలు ఉల్లంఘించాడు. అబ్స్ట్రక్షన్కు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్’’ అని వ్యాఖ్యానించాడు. డేనియల్ అప్పీలు చేసి మంచి పనిచేశాడని ప్రశంసించాడు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా- పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చదవండి: ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! Ummm.... What? 🤨 Sam Harper is out for obstruction after moving into the path of a ball 🤷♂️ #sheffieldshield pic.twitter.com/z5SnoxUjPR — Fox Cricket (@FoxCricket) April 8, 2021 -
ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?
పిట్టది, చెట్టుది అవినాభావ సంబంధం.. పిట్టలు గూళ్లు కట్టుకుని బతకడానికి చెట్లు కావాలి.. గింజలు దూరంగా పడి చెట్లు విస్తరించడానికి పిట్టలు కావాలి.. కానీ ఆ చెట్లు, వాటి గింజలే పిట్టలకు ప్రాణాంతకమైతే..? పిట్టలన్నీ ఇష్టంగా వచ్చి గూళ్లు కట్టుకునే చెట్టే.. వాటి ప్రాణాలు పోవడానికి కారణమైతే..? అవును.. అలాంటి ఓ చెట్టు కథే ఇది. ఆ చెట్టు పేరు పిసోనియా. అన్ని చెట్లలా ఇదీ ఓ సాధారణ చెట్టే అయినా.. పక్షులు చనిపోవడానికి కారణమై ‘బర్డ్ క్యాచర్’ అనే పేరు తెచ్చుకుంది. మరి ఎందుకిలా జరుగుతోంది, కారణం ఏమిటో తెలుసా? మిగతా చెట్లలాగానే ఉన్నా.. ఆఫ్రికా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఈ పిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్ల లాంటివే. అన్నింటిలాగే పూలు పూస్తాయి, గుత్తులుగా గింజలు ఏర్పడుతాయి. ఇవి విషపూరితమో, మరో రకంగానో ప్రమాదం కలిగించేవో కాదు. ఈ చెట్టు గింజలకు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది, దానిపై సన్నని కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. చెట్టుపై వాలిన ఏవైనా పక్షులు, పురుగులకు ఈ గమ్, కొక్కాలు ఉన్న గింజలు అంటుకుని.. తర్వాత ఎప్పుడో దూరంగా రాలిపోతాయి. అలా దూరంగా పడిన గింజలు మొలకెత్తి పిసోనియా చెట్లు పెరుగుతాయి. ఇలా చెట్లు, మొక్కల జాతులు విస్తరించడం ప్రకృతిలో సహజమే. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఆ గింజలతో.. పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్ఫుల్. పిట్టలేవైనా ఈ చెట్టుమీద వాలినప్పుడు ఆ గింజలు వాటి ఈకలకు అతుక్కుంటాయి. గుత్తులు గుత్తులుగా గింజలు ఉంటాయి కాబట్టి.. పిట్టలకు తల దగ్గరి నుంచి తోక దాకా అంటుకుంటాయి. వాటి బరువు వల్ల, ఈకలు అతుక్కుపోవడం వల్ల పక్షులు ఎగరలేకపోతాయి. ఎగిరినా కొంత దూరంలో కిందపడిపోతాయి. గింజలు ఎక్కువగా అతుక్కుంటే పెద్దగా కదల్లేని స్థితిలో పడిపోతాయి. చివరికి ఆహారం లేక చనిపోతాయి. లేకుంటే పాములు, ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి. పిట్టలు, చిన్న చిన్న పక్షులు అయితే.. పిసోనియా గింజల గుత్తులకు అలాగే అంటుకుపోతాయి. అలా వేలాడుతూనే చనిపోతాయి. చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షుల డెడ్‌బాడీలు, అస్థి పంజరాలు వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్ క్యాచర్స్’ అని పిలుస్తుంటారు. ఈ చెట్లంటే.. పక్షులకు ఎంతో ఇష్టం పిసోనియా చెట్ల కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా.. చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టం. ఎక్కడా కూడా పక్షులు గూళ్లు పెట్టని పిసోనియా చెట్టు ఒక్కటి కూడా కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా సముద్ర పక్షులు వలస వచ్చే సమయంలోనే పిసోనియా చెట్లు పూలు పూసి, గింజలు ఏర్పడుతాయి. ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెడతాయి. ఈ పక్షి పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి. సీషెల్స్ దేశంలోని కజిన్ ఐల్యాండ్స్‌లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. పిసోనియా చెట్ల కారణంగా.. వైట్ టెర్న్స్ పక్షుల్లో నాలుగో వంతు, ట్రాపికల్ షీర్‌వాటర్స్ పక్షుల్లో పదో వంతు చనిపోతున్నాయని తేల్చారు. ఏటా లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఇదేం ముంగిస.. ఉన్నట్టుండి చస్తుంది.. మళ్లీ! వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట -
కరోనా: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు వందేళ్ల తర్వాత న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల మధ్య మంగళవారం నుంచి సరిహద్దులను మూసివేయనుంది. ఈ విషయాన్ని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ సోమవారం వెల్లడించారు. విక్టోరియా రాజధాని మెల్బోర్న్లో రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని స్కాట్ మెరిసన్, న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ గ్లాడీస్ బెరెజిక్లియాన్‌తో సంప్రదించిన తర్వాతే సరిహద్దు మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా విక్టోరియాలో సోమవారం ఒక్కరోజే 127 కేసులు నమోదు కాగా.. ఒకరు కోవిడ్‌తో మృతిచెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 105కు చేరింది. (కోవిడ్-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!) ఈ నేపథ్యంలో జూన్ మొదటివారంలో ఒక్క కేసు కూడా నమోదకాని విక్టోరియాలో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టం చేయడం సహా దాదాపు వందేళ్ల తర్వాత తొలిసారి విక్టోరియా- న్యూసౌత్ వేల్స్ సరిహద్దును మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి డేనియల్ మాట్లాడుతూ.. ‘‘ముందు జాగ్రత్త చర్యల్లో ఇదొకటి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. కాగా కరోనా వ్యాపించిన తొలినాళ్లలో ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసినప్పటికీ విక్టోరియా- న్యూసౌత్‌వేల్స్ మాత్రం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే సిడ్నీ- మెల్బోర్న్ మధ్య మార్గాలు మూసుకుపోవడంతో భారీగా ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. కాగా ఇక స్పానిష్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో 1919లో తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.(రష్యాను వెనక్కు నెట్టేసిన భారత్) -
‘బాక్సింగ్ డే’ టెస్టుకు ప్రేక్షకుల్లేకుంటే ఎలా?
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లోనే మేటి జట్లయిన భారత్, ఆస్ట్రేలియాలు తలపడితే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులుండాలని... వాళ్లు లేకపోతే అది గొప్ప సిరీస్ అనిపించుకోదని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించారు. ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టును (డిసెంబర్ 26–30) పూర్తిస్థాయి సామర్థ్యమున్న స్టేడియంలో నిర్వహిస్తేనే మజా ఉంటుందని... ప్రేక్షకులు లేకుండా నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ టెస్టు వేదికను మెల్బోర్న్ నుంచి మార్చే అవకాశాలున్నాయి. మెల్బోర్న్ మైదానం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో బాక్సింగ్ డే టెస్టు వేదిక మార్పు తప్పేలా లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై టేలర్ మాట్లాడుతూ ‘క్రిస్మస్లాంటి సమయంలో ఇతరత్రా కారణాలతో స్టేడియంలో పది లేదా ఇరవై వేల ప్రేక్షకులతో మ్యాచ్ నిర్వహించాల్సి వస్తే అది గొప్ప సిరీస్ కానేకాదు. కరోనా అంతగా లేని పెర్త్, అడిలైడ్ ఓవల్ వేదికల్లో నిర్వహిస్తే చాలా మంది ప్రేక్షకులతో ఆట రంజుగా సాగుతుంది. పెర్త్, అడిలైడ్ మైదానాల్లో 55 వేలకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. అడిలైడ్‌లో అయితే భారతీయులు ఎగబడతారు. ప్రపంచకప్ (2015)లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ కోసం టికెట్లన్నీ 52 నిమిషాల్లోనే అమ్ముడైన సంగతి గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. -
ఇప్పటికీ ఉంది
అమ్మాయి బాగుంది! చూడగానే గుండె క్షణమాగి కొట్టుకుంది. పేరడగాలి. భయం. పేరే అడగలేనప్పుడు ఫోన్ నెంబర్ ఏమడుగుతాం! ఇరవై మూడేళ్ల క్రితం విక్టోరియా అనే అమ్మాయిని చూడగానే డేవిడ్ బెక్‌హామ్‌కి కూడా ఇలాగే భయం వేసింది. అయితే అతడికి పేరు అడిగే అవసరం రాలేదు. విక్టోరియా అప్పటికే విశ్వవిఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, సింగర్. బెక్‌హామ్‌కి ఆమెను ఫోన్ నెంబర్ అడగాలని ఉంది. నెంబర్ తీసుకుని రోజూ మాట్లాడాలని ఉంది. అప్పటికే అతడు కూడా పేరున్న ఫుట్‌బాల్ ప్లేయర్. పైగా ఇంగ్లండ్ జట్టుకు అప్పుడే కెప్టెన్ అయ్యాడు. అయినా విక్టోరియా నెంబర్ అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఏదో పార్టీలో చూశాడు ఆమెను. ధైర్యం కోసం ఇలాంటి అబ్బాయిలు ఆల్కహాల్ సేవిస్తారు. అయితే బెక్హోమ్.. ఆ అమ్మాయి ఆల్కహాల్ సేవించే వరకు ఆగాడు. మరికొంచెం తీసుకునే వరకు ఆగాడు. ఇంకొంచెం తాగనిచ్చాడు. అప్పుడు వెళ్లి ఫోన్ నెంబర్ అడిగాడు! విక్టోరియా నవ్వింది. పెన్ కోసం పక్కకు చూసింది. ‘‘నా దగ్గర ఉంది’’ అని.. తను కూడా ఎక్కడో పక్కనుంచి తీసుకున్న పెన్ని ఆమెకు ఇచ్చాడు. విక్టోరియా దగ్గర కాగితం లేదు. హ్యాండ్‌బ్యాగ్‌లో వెతికి ట్రెయిన్ టిక్కెట్ ఉంటే తీసి, దానిమీద తన ఫోన్ నెంబర్ రాసి బెక్‌హామ్‌కి ఇచ్చింది. ‘‘ఇప్పటికీ ఆ టిక్కెట్ నా దగ్గర ఉంది’’ అని గురువారం జిమ్మీఫాలెన్ లేట్ నైట్ షోలో చెప్పాడు బెకహామ్. మంచి భర్తే. -
చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు
సిడ్నీ : ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. సోమవారం, మంగళవారం ఈ మంటలు అధికమవ్వడంతో మంటల్లో చిక్కుకొని ముగ్గురు మృతిచెందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే బాటెమన్స్ బేలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతులను తండ్రీకొడుకులుగా గుర్తించారు. మూడవ వ్యక్తిని న్యూ సౌత్ వేల్స్ దక్షిణ తీరంలో బుధవారం ఉదయం కాలిపోయిన కారులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇటీవల కాలంలో న్యూసౌత్‌వేల్స్‌లో మంటలకు చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. కాగా ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. మంటల నుంచి తప్పించుకోడానికి దాదాపు నాలుగు వేల మంది పర్యాటకులు స్థానికంగా ఉన్న బీచ్‌లోకి పరుగులు తీశారు. ఈ మంటలు 4 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణానికి వ్యాపించాయి. ఇక వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోజు రోజుకి మంటల తీవ్రత పెరిగిపోతుంది. మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఆకాశమంతా ఎర్రగా మారింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నాయి. మంటలు ఇప్పటికీ చెలరేగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగేలా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం కాస్త వాతావరణం చల్లబడటంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపులోకి తీసుకువస్తున్నారు. కేవలం న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో మాత్రమే 100 చోట్ల మంటలు వ్యాపించాయి. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్ బాంబ్లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్ వేల్స్ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం పేర్కొంది. ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు. -
కామెరాన్.. సూపర్మ్యాన్లా పట్టేశాడు..!
మెల్బోర్న్: మార్ష్ వన్డే కప్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా పరుగు తేడాతో గెలిచింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేయగా, విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్ అరోన్ ఫించ్ 119 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్స్కాంబ్తో కలిసి 147 పరుగులు చేయడంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా. అయితే హ్యాండ్ స్కాంబ్(87) ఔటే విక్టోరియా కొంపముచ్చింది. విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను కేన్ రిచర్డ్సన్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని హ్యాండ్ స్కాంబ్ మిడ్ ఆఫ్- ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ ఆడగా, ఆ ఫీల్డింగ్ పొజిషన్లోనే కాస్త దూరంగా ఉన్న కామెరాన్ వాలెంటే అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరొగొట్టాడు. ఆ సమయంలో బంతి పైకి లేవగా పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్గోనే డైవ్ కొట్టి మరీ ఒక్క చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో హ్యాండ్ స్కాంబ్ షాకయ్యాడు. అసాధ్యం అనుకున్న క్యాచ్‌ను కామెరాన్ సూపర్మ్యాన్లా ఎగిరి పట్టడంతో హ్యాండ్ స్కాంబ్ భారంగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇది మ్యాచ్‌కు కీలక మలుపు. ఫలితంగా చివర వరకూ పోరాటం చేసిన విక్టోరియా పరుగు తేడాతో ఓడి పోవడంతో ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. -
ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె..
ప్రపంచం మొత్తంలో ఉన్న అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు? అని అడిగితే ఎవరూ చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా.. ఏటా జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే ప్రపంచంలోని అందమైన అమ్మాయి అని చెబుతారు. అయితే ప్రపంచ సుందరిని ఎంపిక చేసేందుకు సరికొత్త విధానం ఉంది. అదే గ్రీక్ మ్యాథమ్యాటిక్స్. గ్రీకు ‘లెక్కల’ ప్రకారం సూపర్ మోడల్ బెలా హదీద్ ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తె అని సౌందర్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అందాన్ని లెక్కించడానికి వాడే ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై ’ప్రకారం ఈ భూమ్మీద ఉన్నవారందరిలో ఈ విక్టోరియా సూపర్ మోడలే ప్రపంచ అందగత్తె అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆమె ముఖమే అత్యుత్తమమైనదిగా నిర్ధారణ అయ్యింది. క్లాసిక్ గ్రీక్ కాలిక్యులేషన్‌ను అనుసరించి ‘గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’ ద్వారా అందానికి నిర్వచిస్తారు. ఇందుకోసం ముఖభాగాన్నికొలుస్తారు. దీని ఆధారంగా అందగత్తె ఎవరన్నదీ తేలుస్తారు. ‘గోల్డెన్ రేషియో’ లెక్కల ప్రకారం 23 ఏళ్ల బెలా ముఖాన్ని లెక్కించగా 94.35 శాతం మ్యాచ్ అయ్యింది. ఆమె తర్వాత స్థానాన్ని 92.44 మార్కులతో పాప్ సంచలనం బియాన్స్ కొట్టేసింది. 91.85 మార్కులతో హాలీవుడ్ నటి ఆంబర్ హర్డ్ మూడో స్థానంలో నిలిచారు. పాప్‌స్టార్ బియాన్స్ -
వైరల్ : ఎలుగుల కొట్లాట.. చివరికి ఏమైంది..!
విక్టోరియా : గ్రే కలర్ ఎలుగు బంట్లు భీకరంగా తలపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ‘అరుదైన ఎలుగుల పంచాయితీ చూడండి. మునివేళ్లపై నిల్చుని పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నాయి. గుర్రుగుర్రుమంటూ ఒకదాన్ని మరొకటి నెట్టేసుకుంటూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇక రెండు ఎలుగుల్లో ఏదైనా చస్తే బాగుండు. ఫుడ్డుకు ఢోకా ఉండదు అన్నట్టు నక్కినక్కి చూస్తున్న గుంటనక్కను పరిశీలించండి’అని క్యారీ మెక్ గిల్వ్రే అనే మహిళ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. నిముషానికి పైగా ఉన్న ఈ వీడియో 1.6 మిలియన్ వ్యూస్ సాధించి వైరల్ అయింది. బ్రిటీష్ కొలంబియాలోని ఓ హైవేపై ఈ దృశ్యం వెలుగు చూసింది. వీడియో ఆసక్తిగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి గొడవ సద్దుమణిగిందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. వీడియో ఆసక్తిగా ఉన్నా.. ఎలుగులకు ఏమౌతుందోనని ఆందోళన చెందానని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ గొడవనంతా గమనిస్తున్న నక్కను తొలుత గమనించలేకపోయానని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. -
చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!
విక్టోరియా : ఆస్ట్రేలియాలోని బుల్లి పెంగ్విన్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. 13 సెంటీ మీటర్ల కంటే పెద్దగా పెరగలేని ఈ పెంగ్విన్లకు కికియూ అనే గడ్డి శాపంగా మారుతోంది. గడ్డి శాపంగా మారడమేంటనేగా... 1992లో విక్టోరి యా ప్రాంతంలో విమానం లాండింగ్ సౌకర్యం కోసం కికియూ అనే గడ్డిని తీసుకువచ్చి నాటారు. అయితే ఈ గడ్డి విపరీతంగా పెరిగిపోతూ పెంగ్విన్లు నివాసం ఉండే ప్రాంతాలను కప్పేస్తోంది. అంతేకాకుండా ఈ గడ్డిలో చిక్కుకొని ఎటూ కదల్లేక పెంగ్విన్లు చనిపోతున్నాయట. గతంలో 40 వేల వరకు ఉన్న ఈ పెంగ్విన్ల సంఖ్య ప్రస్తుతం 18 వేలకు చేరుకుంది. అయితే దీనికి స్థానిక అధికారులు ఒక ఉపాయం ఆలోచించారు. పెంగ్విన్లను రక్షించడానికి ఆవులను రంగంలోకి దించారు. గడ్డిని ఆవులు మేసేయడంతో పెంగ్విన్లకు కష్టాలు తప్పుతున్నాయట. -
నా గుండె పగిలింది; ఇతరుల కోసమే..
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని విక్టోరియా తీరప్రాంతంలో గల పోర్ట్ క్యాంప్బెల్లో విషాదం చోటుచేసుకుంది. నీళ్లలో మునిగిపోతున్న ఓ టూరిస్టును కాపాడబోయి తండ్రీకొడుకులిద్దరు మృత్యువాత పడటం పలువురిని కలచివేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు...‘ నిస్వార్థం, ధైర్యసాహసాలకు మారుపేరు సర్ఫ్ లైఫ్‌సేవర్స్. వారికి ఎల్లప్పుడు మనం కృతఙ్ఞులుగా ఉండాలి. వాలంటీర్లు రోస్, ఆండ్రూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వివరాలు.. క్యాంపెబెల్ పట్టణానికి చెందిన రాస్ పావెల్(71), అతడి కుమారుడు ఆండ్రూ(32) వాలంటీర్ లైఫ్‌సేవర్లుగా సేవలు అందించేవారు. ఆదివారం ట్వల్వ్ అపోస్టల్స్ సమీపంలో ఓ సర్ఫర్ నీటిలో మునిగిపోవడాన్ని గమనించారు. వెంటనే అతడిని కాపాడేందుకు బోటులో బయల్దేరారు. అయితే దురదృష్టవశాత్తు వారి బోటు బోల్తా పడటంతో నీళ్లలో పడిపోయారు. రక్షణ బృందాలు అక్కడికి చేరుకునే సమయానికే వారిరువురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన సదరు టూరిస్టును మాత్రం రక్షణ బృందాలు కాపాడగలిగాయి. నా గుండె పగిలింది ఆండ్రూ.. ఈ ఘటనపై స్పందించిన ఆండ్రూ సహచరి అంబర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రపంచంలోనే రెండు అత్యంత అందమైన ఆత్మలను ఈరోజు కోల్పోయాం. తమ కంటే ముందు ఇతరుల క్షేమం గురించే ఆలోచించే, ఇతరుల కోసమే నిస్వార్థంగా సేవచేసే వారు శాశ్వతంగా దూరమయ్యారు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, నా జీవితపు వెలుగు దివ్వె, నా చిన్నారుల తండ్రి ఈరోజు నన్ను విడిచి వెళ్లిపోయాడు. నా గుండె పగిలింది. మిస్ యూ ఆండ్రూ’ అంటూ గర్భవతి అయిన అంబర్ ఫేస్బుక్లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కాగా తమ ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా టూరిస్టును కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన రోస్, ఆండ్రూలు రియల్ హీరోలు అంటూ సర్ఫ్ లైఫ్‌సేవింగ్ విక్టోరియా ప్రెసిడెంట్ పాల్ జేమ్స్ నివాళులర్పించారు. -
అదృష్టం అడ్డం తిరిగితే..
-
దురదృష్టమంటే నీదే నాయనా?
ఏ ఆటలోనైనా అదృష్టమనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా క్రికెట్లో అంపైర్ల తప్పిదాలు, క్యాచ్ వదిలేయడం, రనౌట్ మిస్ చేయడం ఇలాంటివి బ్యాట్స్‌మెన్ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. అలా ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని భారీ స్కోర్లు సాధిస్తారు. అయితే కొన్ని సార్లు దురదృష్టం వెంటాడి బ్యాట్స్‌మన్ ఔటవ్వడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్న సామెత విక్టోరియా బ్యాట్స్‌మన్ విల్ పుకౌస్సీకి వర్తిస్తుంది. మరో 18 పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో విల్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో సౌత్ ఆస్ట్రేలియా పార్ట్ టైమ్ స్పిన్నర్ హెడ్ వేసిన బంతిని షార్ట్ లెగ్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున ఫీల్డర్ కాలికి తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశగా విల్ క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చేస్తోంది. ‘దురదృష్టమంటే నీదే నాయనా?’ అంటూ దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!) -
క్రికెట్ చరిత్రలో ఊహించని రికార్డు
సాక్షి, స్పోర్ట్స్ : ఫార్మాట్ ఏదైనా అత్యంత అరుదైన రికార్డులు మాత్రం క్రికెట్ పుస్తకంలో ఈ మధ్య నమోదవుతున్నాయి. విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ నిక్ గూడెన్ ఊహకందని ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కౌంటీ క్రికెట్ లో భాగంగా యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్, పది బంతుల్లో ఎనిమిది వికెట్లను తీశాడు. ఇందులో ఐదు వరుస బాల్స్ లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం.ఇందులో ఆరుగుర్ని బౌల్డ్ చేయగా, ఒక ఆటగాడ్ని లెగ్ బి ఫోర్ గా పెవిలియన్ కు పంపడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో నమోదైన ఈ రికార్డులో నిక్ గూడెన్ మొత్తం 17 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత డిసెంబర్ నుంచి క్రికెట్ కు దూరమైన ఈ కుడి చేతి బౌలర్ రీఎంట్రీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించటం మరో విశేషం. ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, కానీ ఓ మరపురాని అనుభూతి మాత్రం కలిగిందని మ్యాచ్ అనంతరం 'వీకెండ్ సన్ రైజ్' పత్రికతో గూడెన్ పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్ కు చెందిన ఆటగాడు ఒకరు 40 సిక్సులతో 307 పరుగులు కొట్టి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. -
టీమ్ కున్ ఘన విజయం
ఎ- డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో టీమ్‌కున్ జట్టు ఘనవిజయం సాధించింది. గురువారం విక్టోరియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగుల తేడాతో టీమ్ కున్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ కున్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. విఘ్నేశ్వర్ (82), అనిరుధ్ (80), విహారి (61) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విక్టోరియా జట్టును టీమ్ కున్ బౌలర్లు కె. అనిరుధ్ (6/25), ధీరజ్ (3/29) నియంత్రించారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 24.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. రామకృష్ణ (48) చివరి వరకు పోరాడాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ యంగ్‌మెన్: 224/7 (చారి 67), యూత్ సీసీ: 83 (నిహార్ 4/36, శివ 3/16). కాకతీయ సీసీ: 221 (సారుు 61; రిషద్ 3/36), రిషిరాజ్ సీసీ: 104 (మల్లికార్జున్ 40, రవి 3/14, రాజశేఖర్ 3/15). యూత్ సీసీ: 80 (రవి 5/37), కాకతీయ సీసీ: 83/3 . ఎంపీ స్పోర్టింగ్: 274 (రమాకాంత్ 79), సాక్రడ్ హార్ట్ సీసీ: 84 (సతీశ్ 3/6). గగన్ మహల్: 90 (చైతన్య 3/31, సిద్ధార్థ్ 3/23), మారేడుపల్లి బ్లూస్: 91/1 (స్వామి 53 నాటౌట్). సదరన్ స్టార్: 246 (యశ్వంత్ 69; కల్యాణ్ రావు 4/63, శైలేందర్ 4/11), సెయింట్ మేరీ సీసీ: 229 (శ్రీకర్ 72, చక్రవర్తి 5/52). ఎస్‌యూసీసీ: 234 (నితీశ్ 48, చంద్రశేఖర్ 4/57, నిఖిల్ 3/49), ఆజాద్సీసీ: 168 (స్వరూప్ 4/34). పీఎన్వై సీసీ: 193 (శ్రీకాంత్ 34, రాకేశ్ 4/37), విజయానగర్: 54( నర్సింహా 4/23, ఫహీముద్దీన్ 3/6). టీమ్‌కున్: 239 (వి. సహస్ర 67; సుశాంత్ 4/65), స్టార్లెట్స్: 128 (కార్తీశ్ 3/26). వాకర్స్ టౌన్ : 217/8 (సందీప్ 62, వంశీ 45; గంగాధర్ 3/20), ఎల్‌ఎన్‌సీసీ: 218/5 (ఓబుల్ రెడ్డి 88, ప్రతాప్ 63 నాటౌట్). సౌతెండ్ రేమండ్‌స: 160 (హాజీ 51, అఫాన్ 50నాటౌట్; సారన్ కశ్యప్ 5/13, నైరుత్ రెడ్డి 5/20), అమీర్ పేట్ సీసీ: 117 (అరుణ్‌కుమార్5/19).