vijay saireddy
-
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను...ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అని అన్నారు.అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2024 ఈ వ్యవహారంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి -
అమెరికా సాయం పొందిన దక్షిణ కొరియా ఏ స్థాయికి చేరింది?
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం అక్కడ చదువుకున్న యువతను నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయేలా చేస్తోంది. మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి యువతీ యువకులు అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు గాని స్వదేశంలో అవకాశాలు లేకకాదు. ఉద్యోగాలు లేక కాదు. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన భారత-పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో ఇప్పుడు అంత కన్నా ఎక్కువ మంది ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారు. 2022లో పాక్ నుంచి చదువుకున్న యువత 8,32,339 మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వెళ్లిపోయారు. 2021తో పోల్చితే పాక్ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది. 2023 మొదటి ఐదు నెలల్లో ఇలా ఇతర దేశాల్లో ఉపాధి కోసం వలసపోయినవారి సంఖ్య 3,15,787కు చేరుకుందని వలసలు, ఇతర దేశాల్లో ఉపాధి బ్యూరో (బీఈఓఈ) వెల్లడించింది. పాక్ అంతర్గత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువకులు విదేశాలకు వలసపోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయి స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. మరో పక్క పాక్ మాదిరిగానే కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అనూహ్య పారిశ్రామిక ప్రగతి సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో మరింత కుంగిపోయింది. అయితే, మహాయుద్ధంలో జపాన్ ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుంది. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడింది. కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించింది. రెండు దేశాలకూ అమెరికా డాలర్లు అందినా ప్రజాస్వామ్యం, ప్రగతి కనపడని పాక్! ఈ క్రమంలో 1990ల నాటికి సైనిక పాలనకు తెరపడి దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడం మొదలైంది. 21 శతాబ్దం ఆరంభ సమయానికి శాంసంగ్, హ్యుందయ్, ఎల్జీ, కియా, పోస్కో వంటి అనేక అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన బ్రాండ్లతో ప్రపంచీకరణలో కీలక పాత్ర పోషించే స్థాయికి దక్షిణ కొరియా చేరుకుంది. పైన వివరించిన పాకిస్తాన్ కూడా తన భౌగోళిక స్థితిగతుల కారణంగా మొదటి నుంచీ పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. అప్పట్లో పూర్వపు సోవియెట్ యూనియన్ ఉనికి కారణంగా దాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ ను అమెరికా తన సైనిక అవసరాలకు వీలుగా మలుచుకుంది. అత్యధిక కాలం సైనిక పాలనలో కునారిల్లిన పాక్ ప్రభుత్వాలకు ఆర్థిక సాయంతోపాటు అత్యంత ఆధునిక ఆయుధాలు కూడా సమకూర్చింది అమెరికా. అయితే, పాక్ పాలకులు అమెరికా సాయాన్ని తమ దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించు కోలేకపోయారు. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య పంథాలో పయనించిన దక్షిణ కొరియా తరహాలో పాకిస్తాన్ ను అక్కడి పాలకులు నడిపించలేకపోవడం పాక్ ప్రజల దురదృష్టం. పాకిస్తాన్ లో మాదిరిగా సైనిక పాలన కొనసాగిన దేశమైనా దక్షిణ కొరియా ఆర్థికరంగంలో వినూత్న విజయాలు సాధించింది. టెక్నాలజీ రంగంలో కొత్తపుంతలు తొక్కింది. ఏభయి సంవత్సరాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశంలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేసింది దక్షిణ కొరియా. అమెరికా ఆర్థిక సాయాన్ని ఉన్నత విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి చక్కగా వాడుకున్నారు దక్షిణ కొరియా పాలకులు. చాలా కాలం సాగిన సైనిక పాలన, ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండడం పాకిస్తానీయులకు శాపాలుగా మారాయి. జనాభాలో, వైశాల్యంలో బాగా చిన్నదైన దాయాది దేశం పాకిస్తాన్ ఇలా ఎదుగూబొదుగూ లేకుండా విఫలరాజ్యంగా మారడం భారతదేశానికి ఏమాత్రం వాంఛనీయ పరిణామం కాదు. తన సైజుకు మించి అతిపెద్ద సైన్యం ఉన్న పొరుగుదేశంలో సుస్థిరతనే ఇండియా ఎప్పుడూ కోరుకుంటుంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
సీఎం జగన్ పాలన.. పెరిగిన ప్రజాదరణ
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వినూత్న విధా నాలతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత వి శ్వాసం పెరిగిందని వైఎస్సార్సీపీ అనుబంధ విభా గాల ఇన్చార్జ్, వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విపక్ష టీడీపీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ తిప్పికొట్టాలని పార్టీ అనుబంధ విభాగాలకు సూ చించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యా రు. అతి తక్కువ కాలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రజ ల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవడా నికి పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యు లు, ఇన్‌చార్జ్‌ల కృషే కారణమన్నారు. వైఎస్సార్సీపీ కి బలమైన పునాది కార్యకర్తలేనని, బృంద స్ఫూర్తితో అంతా కలసి పనిచేద్దామని సూచించారు. అనుబంధ సంఘాల పనితీరు, కార్యకర్తలకు సం బంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. అర్హులందరికీ పథకాలు అందేలా.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా.. లేదా? అనే అంశాన్ని క్షేత్ర స్థాయిలో అనుబంధ విభాగాలు పరిశీలించాలని విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీ క్రియాశీలక నేతలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తీసుకుని ప్రజలకు చేరువ కావా లన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదా రులకు పారదర్శకంగా పథకాలు నేరుగా అందడం తో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని, అయితే సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో ప్రజాదరణ మరింత పెరిగింద న్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సీఎం జగన్ తగిన గుర్తింపు ఇచ్చారన్నారు. గ్రామ, మండ ల, జిల్లా స్థాయిల్లో పనిచేసిన వారిని గుర్తించి జాబి తా అందజేస్తే తగిన విధంగా ప్రోత్సహిస్తామ న్నా రు. అనుబంధ సంఘాల అధ్యక్షుల సూచనలు, సల హాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామని తెలి పారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్య వేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సం ఘాల నేతలు మేరుగ నాగార్జున (ఎస్సీ సెల్), జంగా కృష్ణమూర్తి (బీసీ సెల్), గౌతం రెడ్డి (ట్రేడ్ యూనియన్), ఎంవీఎస్ నాగిరెడ్డి (రైతు విభాగం), చల్లా మధుసూదన్‌రెడ్డి (ఐటీ విభాగం), శివభర త్‌రెడ్డి (డాక్టర్స్ విభాగం), అంకంరెడ్డి నారాయణ మూర్తి (గ్రీవెన్స్‌సెల్), మనోహర్‌రెడ్డి (లీగల్‌సెల్), ఎ.హర్షవర్ధన్‌రెడ్డి (ఎన్ఆర్ఐ విభాగం), చిల్లపల్లి మోహన్ రావు(చేనేత విభాగం), కె.సుధాకర్‌రెడ్డి (పోలింగ్‌బూత్ విభాగం), డి.వేమారెడ్డి (పంచాయితీరాజ్ విభాగం) తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
12,149 ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: నాలుగు అంశాలు ప్రధానంగా చర్చించామని, కోర్టు కేసును త్వరగా డిస్పోజ్ చేసేలా కోర్టును కోరనున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామ సమస్యపై హైపవర్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాలొన్నారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 12,149 మంది నివాసం ఉంటున్నారని, వారందరికి రెగ్యులర్ చేయాలనేది ఇక్కడివారి ప్రధాన సమస్య అని తెలిపారు. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులు చెసుకోవచ్చని, ఇంకో ఫ్లోర్‌కి అనుమతి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలు ప్రభుత్వం అనుమతి తీసుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పూరిపాకలో నివసించే వారికి పక్క ఇల్లు కట్టుకునే అవకాశం ఉందని, ఆక్రమణలు జరుగుతున్నాయని.. అందుకే రూ. 20 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నిధులు భక్తులు, దాతల నుంచి సేకరిస్తామని, గిరి ప్రదిక్షణం చేసుకునేలా ఈ వాల్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. కోర్టు సలహా తీసుకుని ఈ సూచనలన్నీ చేపడతామని అన్నారు. సింహాచల దేవాలయ భూములను కాపాడాలన్నదే తమ ధ్యేయమని, అక్కడ ఉంటున్నవారికి న్యాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచ గ్రామాల సమస్యపై భేటీ అయ్యామని, నిర్వాసితులకు న్యాయం జరిగే దిశగా చర్చలు జరిపామని తెలిపారు. దేవాలయ స్థలాలను ఎలా కాపాడాలనే అంశంపై కూడా చర్చించామని పేర్కొన్నారు. -
మిథనాల్ తయారీకి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
-
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, ఢిల్లీ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ.. పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది. -
‘నా లేఖకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు’
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రై. లిమిటెడ్‌కు సంబంధించి రూ.826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ లేఖపై మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు. pic.twitter.com/Tc6o5N7C5J — Vijayasai Reddy V (@VSReddy_MP) August 8, 2021 -
కుదిరితే అమ్మకం, లేదంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరించడం, కుదరని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేయడం నూతన పబ్లిక్ సెక్టర్ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విశాఖ ఉక్కులో వందశాతం వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వాటాల ఉపసంహణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి లేఖలో వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ ఈ అంశంపై తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టంచేసినట్లు తెలిపారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,750 కోట్లను కేంద్రం విడుదల చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇందులో 2016–17 నుంచి 2020–21 వరకు ఐదేళ్లలో రూ.1,050 కోట్లు విడుదలయ్యాయని టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
ఢిల్లీలో రెండో రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
-
ఏపీకి 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లు మంజూరు: కేంద్రం
-
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
-
ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని వైఎస్సార్సీసీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామని, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మొదట్నుంచీ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్ బకాయిలు రావాలన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 12సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాంమని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు. ట్రైబల్ యూనివర్శిటీని నాన్‌ట్రైబల్ ఏరియాలో కేటాయించారని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. -
స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలి : విజయసాయిరెడ్డి
-
రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి
-
‘గంగవరంలో పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తాం’
సాక్షి, విశాఖపట్నం: గంగవరంలో పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇస్తామని, కాలుష్యంతో ఇబ్బంది ఉన్న గంగవరం చుట్టుపక్కల గ్రామాలను మరోచోటికి తరలిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గంగవరం గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగవరం పోర్టులో ఉన్న ఉద్యోగులతో సమానంగా స్థానికులకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగన్మోహన్రెడ్డి వ్యతిరేకమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చి ఉద్యోగం రానివారికి ఉద్యోగాలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైస్సార్సీపీ జెండా ఎగరాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిస్తే నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చదవండి: విజయవాడలో చంద్రబాబుకు చేదు అనుభవం -
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక వసతులను కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్2న విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ( భారానికి, అధికారానికి తేడా వాళ్ళకు తెలియదా?) -
సుజనాకు రాష్ట్రపతి షాక్
-
సుజనా ఆర్థిక నేరాలపై స్పందించిన రాష్ట్రపతి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 26న రాసిన లేఖ పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ స్పందించారు. ఈ లేఖ రాష్ట్రపతి సచివాలయం నుంచి నవంబర్ 6న కేంద్ర హోం శాఖకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ విజయసాయిరెడ్డి రాసిన లేఖను, రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో వచి్చన లేఖను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శికి, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపింది. తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. ఈ మేరకు హోంశాఖ అండర్ సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ విజయసాయిరెడ్డికి ఒక లేఖ పంపారు. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి అంతర్జాతీయ స్కామ్‌స్టర్, మానీలాండరర్, మోసపూరిత కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన వ్యక్తి అని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణలను రాష్ట్రపతికి రాసిన లేఖలో వి.విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. సుజనా చౌదరి మోసాలివీ... ►సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్‌తోపాటు మరో 102 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒకటైన బార్ర్‌టోనిక్స్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ. 8 కంపెనీలు తప్ప మిగిలినవన్నీ షెల్(డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవి. ►ఈ 8 కంపెనీల్లో 50 శాతం వ్యాపారం భారత్‌లోని షెల్ కంపెనీల ద్వారా జరుగుతున్నదే. మరో 20–25 శాతం వ్యాపారం సుజనా గ్రూపు పరోక్షంగా నిర్వహిస్తున్న విదేశీ షెల్ కంపెనీల ద్వారా జరుగుతోంది. ►సుజనా గ్రూపు ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆరి్థక సంస్థలకు రూ.8 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండగా, మార్కెట్లో ఆ గ్రూపు ఆస్తుల విలువ రూ.132 కోట్లు కూడా లేదు. ఫలితంగా ఈ గ్రూపు కంపెనీల షేర్లు కొన్నవారు భారీగా నష్టపోయారు. ►సుజనా గ్రూపునకు చెందిన బిగ్ బ్రదర్స్‌గా పిలిచే రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా) రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి. ►ఈ రెండు కంపెనీలతోపాటు సుజనా గ్రూపు నడుపుతున్న మరో పెద్ద సంస్థ సుజనా మెటల్ ప్రొడక్టŠస్. ఈ సంస్థ 2014 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.38 కోట్ల నష్టాన్ని చూపగా, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్ల నష్టాన్ని చూపింది. సుజనా టవర్స్ మాత్రం రూ.1.8 కోట్ల స్వల్ప నికర లాభం చూపింది. ►2011–2014 ఆరి్థక సంవత్సరాల మధ్య సుజనా టవర్స్ రుణ భారం రూ.565 కోట్ల నుంచి రూ.1,750 కోట్లకు చేరినట్టుగా పుస్తకాల్లో చూపారు. అదే సమయంలో మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1,534 కోట్ల నుంచి రూ.37 కోట్లకు తరిగిపోయింది. సింగపూర్ కేంద్రంగా అవినీతి బాగోతం సుజనా చౌదరికి చెందిన గ్రూపు ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా ‘ఇంట్రాసియా’ పేరుతో అంతర్జాతీయ కంపెనీల గ్రూపును నిర్వహిస్తోంది. ఈ గ్రూపు కింద బిస్ట్రోలియా అసియా, మ్యాగ్నమ్ ఎంటర్‌ప్రైజస్, సన్ ట్రేడింగ్ లిమిటెడ్, మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్, బీజింగ్ గ్రేట్ ఫారŠూచ్యన్ ఇంటర్నేషనల్, రోడియం రీసోర్సస్, పీఏసీ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, ఏపీఐఈఎస్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, స్కైవెల్ గ్రూప్, పోలిలక్స్ ఇంటర్నేషనల్, మాంటన్ రిసోర్సస్ పీటీఈ లిమిటెడ్, ట్రయంప్ అగ్రి పీటీఈ లిమిటెడ్, అగ్రిట్రేడ్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్, దీప్ పోకెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలను కేవలం రికార్డుల్లో చూపిస్తూ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, అనంతరం సుజనా చౌదరికి చెందిన ఇతర కంపెనీలకు నిధులు మళ్లించడమే లక్ష్యంగా వ్యవహారాలు సాగించారు. అందుకోసం సింగపూర్ కేంద్రంగా పక్కా పన్నాగం అమలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు సాగించినట్లు రికార్డుల్లో చూపించాయి. అనంతరం ఆ కంపెనీలన్నీ తమ వ్యాపారాలను బీమా చేయించుకున్నాయి. ఈ బీమాను చూపించి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందాయి. అనంతరం ఆ నిధులను సుజనా చౌదరి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు. అలా అటు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను, ఇటు అంతర్జాతీయ బ్యాంకులను సుజనా చౌదరి మోసగించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డిండ్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. ►సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన నువాన్స్ హోల్డింగ్స్‌తో(హాంకాంగ్) సంబంధం ఉన్న సెలెన్ హోల్డింగ్స్ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు నుంచి 5 మిలియన్ డాలర్లును 2011న జూలైలో రుణంగా తీసుకుంది. ఆ తర్వాత స్టాండర్డ్ బ్యాంక్–మారిషస్ నుంచి 12 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ►బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్చించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ►సుజనా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. -
సమస్యలున్నందునే ఆర్సీఈపీలో చేరలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రూపుదిద్దుకోలేదని, ఈ ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ఆర్సీఈపీ తృతీయ సదస్సులో లేవనెత్తిన పలు అంశాలకు పరిష్కారం చూపనందునే భాగస్వామ్య ఒప్పందంలో భారత్ చేరలేదని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్య సభలో శుక్రవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశీయ రంగాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆర్సీఈపీలో వివిధ అంశాలపై సమతుల్యత సాధించే దిశగా ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. హాల్మార్కింగ్తప్పనిసరి ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే తెలిపారు. రాజ్యసభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 31 నాటికి బీఐఎస్ గుర్తింపుతో 877 హాల్ మార్కింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇలాంటివి ఏపీలో 43, తెలంగాణలో 29 ఉన్నట్టు వివరించారు. దిశ చట్టం తరహాలో దేశవ్యాప్త చట్టం తేవాలి దిశ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరుకు మహిళా లోకం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో తెచ్చి న చట్టం తరహాలో దేశవ్యాప్తంగా అమ లయ్యేలా చట్టం తేవాల్సిన అవసరం ఉందని ప్రధానికి, హోంమంత్రికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. -
నిర్మలా సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును వెంటనే చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు బుధవారం నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనేక పద్దుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంపీలందరూ సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని ఆర్థిక మంత్రికి సమర్పించారు. ‘పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,103 కోట్లు రుణం తీసుకొని ఖర్చు చేసింది. ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే కేంద్రం తిరిగి చెల్లించాలి. అలాగే రూ. 55,548 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలి. ప్రాజెక్ట్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును 15 రోజుల గడువులోగా కేంద్రం చెల్లింపులు జరిపేలా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలి’ అని వైఎస్సార్సీపీ ఎంపీలు తమ విజ్ఞాపనపత్రంలో కోరారు. జీఎస్టీ బకాయిల కింద రూ. 1605 కోట్లు వెంటనే విడుదల చేయాలి జీఎస్టీ నష్టపరిహార బకాయిల కింద రాష్ట్రానికి రావాల్సిన 1605 కోట్ల రూపాయల బకాయిలను ఈ సందర్భంగా ఎంపీలు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. బకాయిల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నందున బకాయిలపై తక్షణమే చర్యలు తీసుకుని రాష్ట్రానికి రావలసిన 1605 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 1050 కోట్లు ఇవ్వండి రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆరేళ్ళపాటు ప్రత్యేక సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ పద్దు కింద ఇప్పటి వరకు 1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. మిగిలిన 1050 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు. కాగా యూపీ, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, ఒడిశాలోని కలహండికి ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశారని.. ఆయా ప్రాంతాల్లోని తలసరి ఆదాయం ప్రాతిపదికన ప్యాకేజీ గ్రాంట్‌ను నిర్ణయించడం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బుందేల్‌ఖండ్, కలహండి ప్రాంతాల్లో తలసరి ఆదాయం 4 వేల రూపాయలుగా లెక్కగట్టి ప్యాకేజీ అందించారని.. అదే ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు తలసరి ఆదాయాన్ని కేవలం 400 రూపాయలుగా లెక్కించడం జరిగిందని తెలిపారు. నిర్హేతుకమైన ఈ ప్రాతిపదికను సరిదిద్దాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించాలి ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో జరిపిన సమావేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. ఈ అంశానికి త్వరిగతిన పరిష్కారం కనుగొని రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావలసిన రూ. 18,969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి’అని ఎంపీలు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. -
‘ఏపీ హైకోర్టులో ఖాళీగా 22 జడ్జీల పోస్టులు’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం 22 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. హైకోర్టులో న్యాయమూర్తుల బదిలీ లేదా పదవులు ఖాళీ కావడానికి ముందుగానే వాటిని భర్తీ చేసే ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే చేపడతారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరు మాసాల కాలవ్యవధిని విధిగా పాటించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. న్యాయమూర్తి పోస్టుల భర్తీ లేదా బదిలీ అనేది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయంతో నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన తెలిపారు. వివిధ రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్రాలు, కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపి అనుమతులు పొందాల్సి ఉండటం వల్ల జడ్జీల నియామకంలో జాప్యం నెలకొంటోందని ఆయన వెల్లడించారు. ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి ఒకవైపు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పదోన్నతులు, పదవీ విరమణ, న్యాయమూర్తుల సంఖ్యాబలం పెంపు వంటి కారణాల వలన హైకోర్టు జడ్జీల పదవులకు ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయని మంత్రి వివరించారు. -
ఏఐజేఎస్‌పై ఏకాభిప్రాయం రాలేదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత జుడిషియల్ సర్వీసెస్(ఏఐజేఎస్) ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏఐజేఎస్ ఏర్పాటు కోసం రాష్ట్రాలు, హైకోర్టులతో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జిల్లా జడ్జీల పోస్టుల నియామకం, జడ్జీలు, అన్ని స్థాయిలలో జుడిషియల్ అధికారుల ఎంపిక ప్రక్రియను సమీక్షించే అంశాన్ని, 2015 ఏప్రిల్‌లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఎజెండాలో చేర్చడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అయితే జిల్లా జడ్జీల ఖాళీల నియామకాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ పరిధిలోనే చేపట్టడానికి తగిన విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఆయా హైకోర్టులకే వదిలేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అలాగే తదుపరి సెక్రెటరీల కమిటీ ఆమోదించే.. అఖిల భారత జుడిషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) ఏర్పాటుకై సమగ్ర ప్రతిపాదన రూపకల్పన కోసం రాష్ట్రాల, హైకోర్టుల అభిప్రాయాలను కోరడం జరిగిందని తెలిపారు. ఏఐజేఎస్ ఏర్పాటుకు సెక్రటరీల కమిటీ ఆమోదించిన ప్రతిపాదనతో సిక్కిం, త్రిపుర హైకోర్టులు ఏకీభవించాయని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, బొంబాయి, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాసు, మణిపూర్, పట్నా, పంజాబ్, హరియాణా, గౌహతి హైకోర్టులు తిరస్కరించాయని చెప్పారు. ఏఐజేఎస్ ద్వారా భర్తీ చేసే ఖాళీలకు సంబంధించి అభ్యర్ధుల వయో పరిమితి, విద్యార్హతలు, శిక్షణ, రిజర్వేషన్ల కోటాకు సంబంధించి అలహాబాద్, ఛత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఒరిస్సా, ఉత్తరాఖండ్ హైకోర్టులు సూచించాయని మంత్రి చెప్పారు. కాగా ఏఐజేఎస్ ఏర్పాటును అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్ రాష్ట్రాలు వ్యతిరేకించగా.. బీహార్, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్, ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మాత్రం దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో మార్పులు చేయాలని సూచించాయని ఆయన తెలిపారు. ఈ విధంగా ఏఐజేఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన దృష్ట్యా ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం తిరిగి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. -
అమరావతికి రూ. 460 కోట్లు విడుదల చేశాం : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటి వరకు రూ. 496 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన అమరావతి కోసం 2017-18 నుంచి ఇప్పటి వరకు కేంద్రం రూ. 496 కోట్లు విడుదల చేయగా ఆ మొత్తంలో 472 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలకు విడుదల చేసిన నిధుల గురించి ఆయన వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం నగరానికి రూ. 299 కోట్లు, తిరుపతికి రూ. 196 కోట్లు, కాకినాడకు రూ. 392 కోట్లు కేంద్రం నుంచి విడుదలైనట్లు మంత్రి తెలిపారు. ఈ మిషన్ కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల అభివృద్ధి కోసం మొత్తం 23,054 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ. 18,614 కోట్లను వివిధ నగరాలకు విడుదల చేసినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీస్ మిషన్‌ను వేగవంతంగా అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల గురించి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ మిషన్‌ను హడావిడిగా అమలు చేయడం తమ లక్ష్యం కాదని అన్నారు. మిషన్ కింద అమలు చేసే వివిధ ప్రాజెక్ట్‌లు నాణ్యతాపరంగా అత్యుత్తమంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీస్ ఎంపిక తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీల ఎంపిక, మానవ వనరుల సమీకరణ, డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ల రూపకల్పన అనంతరమే ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలవడం జరుగుతుందని, ఈ ప్రక్రియలు పూర్తి కావడానికి తగినంత కాల వ్యవధి అవసరమని వివరించారు. గడచిన ఏడాదిగా మిషన్ అమలు వేగాన్న పెంచామని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను ఆయా నగరాలు వినియోగించే వేగం కూడా 9 రెట్లు పెరిగిందని అన్నారు. వివిధ నగరాలు మార్చి 2018 నాటికి కేవలం రూ. 1000 కోట్లు వినియోగిస్తే.. నవంబర్ 15, 2019 నాటికి అది 9497 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. రూ. 177 కోట్లతో తిరుపతి ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణ: భారీ విమానాల రాకపోకలకు అనువుగా ఉండే విధంగా రూ. 177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేను విస్తరించి, పటిష్టపరిచే పనులను చేపట్టినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. రన్‌వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి విమానాశ్రయంలో రూ. 181 కోట్ల రూపాయలతో జూన్ 2011లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ డిసెంబర్ 2015 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు. -
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: అనంతపురం-అమరావతి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఖరారు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. 384 కిలోమీటర్ల పొడవు అలైన్మెంట్తో ఈ రహదారి నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి రాజ్యసభలో సోమవారం అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్ చాలెంజ్ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు చేపట్టవలసిందిగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరవచ్చునని ఆయన తెలిపారు. అయితే అలాంటి ప్రాజెక్ట్‌ల్లో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రవాణా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ‘భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల శాఖల నుంచి చట్టబద్దమైన అనుమతులు తీసుకునే చర్యలను త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం. నిర్మాణ పనులు ఆరంభించడానికి ముందుగా పొందవలసిన చట్టబద్దమైన అనుమతులు, నిధుల లభ్యతను బట్టి ప్రాజెక్ట్ పనులను మొదలుపెడతాం. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను 12 ప్యాకేజీల కింద చేపట్టేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో పేర్కొన్నప్పటికీ.. ఎన్ని ప్యాకేజీల కింద పనులు చేపట్టాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేద’ని గడ్కరీ వివరించారు. పోటీ తట్టుకోలేని పరిశ్రమలే మూతబడుతున్నాయి.. మార్కెట్లో పోటీని తట్టుకోలేక, గిట్టుబాటు కానందునే కొన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎఈ) మూతబడుతున్నాయని చిన్న పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అలాగే ఎంఎస్ఎంఈలకు నాణ్యమైన పనిముట్లు, మానవ వనరులు సమకూర్చేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అంశాలపై సలహాలు ఇచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా 18 టెక్నాలజీ సెంటర్లను నిర్వహిస్తోందని అన్నారు. ‘వీటి ద్వారా ఎంఎస్ఎంఈలకు స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ సహాయాన్ని అందిస్తోంది. క్రెడిట్ లింక్డ్ కాపిటల్ సబ్సిడీ అండ్ టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. ఎంఎస్ఎంఈల సామర్థ్యం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణ సంబంధ విషయాలు, మౌలిక వసతుల మద్దతు, వ్యాపార దక్షత, టెక్నాలజీ వినియోగం, ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాల పని తీరు వంటి అంశాలు ఎంఎస్ఎంఈల సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయ’ని మంత్రి వెల్లడించారు.