Virtual Network Operators
-
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
వర్చువల్ ఐడీని కూడా ఆధార్గానే పరిగణించవచ్చు
న్యూఢిల్లీ: వర్చువల్ ఐడీ, యూఐడీ టోకెన్లు కూడా ఆధార్ నంబరుకు సమానమైన ప్రత్యామ్నాయాలేనని, ధృవీకరణకు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రైవసీని పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ రెండంచెల వ్యవస్థను టెలికం సంస్థలు వంటి ఆథెంటికేషన్ ఏజెన్సీల కోసం ప్రవేశపెట్టినట్లు వివరించింది. మొబైల్ ఫోన్ కనెక్షన్లు వంటివి తీసుకునేటప్పుడు గుర్తింపు ధృవీకరణ కోసం 12 అంకెల బయోమెట్రిక్ ఐడీని ఇవ్వాల్సిన పని లేకుండా వర్చువల్ ఐడీ సదుపాయాన్ని యూఐడీఏఐ జూలై 1న అందుబాటులోకి తెచ్చింది. 16 అంకెల ఈ తాత్కాలిక ఐడీని యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఆధార్ డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాల నేపథ్యంలో యూఐడీఏఐ ఈ వర్చువల్ ఐడీ, యూఐడీ టోకెన్లను ప్రవేశపెట్టింది. గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించేలా తగు మార్పులు చేసుకోవాలని టెల్కోలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సాధారణ బీమా సంస్థలు మొదలైన స్థానిక ఆథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలకు సూచించింది. దానికి సంబంధించే తాజా వివరణనిచ్చింది. -
వర్చువల్ ఐడీలతో ఇక మొబైల్ కనెక్షన్
న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ నంబర్‌కు బదులు ఆధార్‌కు సంబంధించిన వర్చువల్ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది. ఓ వ్యక్తి ఆధార్ నంబర్‌కు 16 అంకెల ర్యాండమ్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్‌కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
ఆధార్ వర్చువల్ ఐడీకి గడువు పెంపు
న్యూఢిల్లీ: ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ తాజాగా వర్చువల్ ఐడీలకు గడువు పొడిగించింది. వర్చువల్ ఐడీ వ్యవస్థ అమలుకు సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు, టెలికం కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు జూలై 1 వరకు సమయమిచ్చింది. ఆధార్ నెంబర్ భద్రతపై పలు సందేహాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అందుకే యూఐడీఏఐ జనవరిలో వర్చువల్ ఐడీ సిస్టమ్ అనే ఆలోచనను ఆవిష్కరించింది. దీనికి సంబంధించి ఏప్రిల్‌లో బీటా వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. వర్చువల్ ఐడీ సిస్టమ్ విధానంలో అథంటికేషన్, వెరిఫికేషన్ సమయంలో ఆధార్ నెంబర్ తెలియజేయాల్సిన అవసరం లేదు. దీనికి బదులు వర్చువల్ ఐడీ ఇస్తే సరిపోతుంది. కాగా అన్ని ఏజెన్సీలు వారి యూజర్ల అథంటికేషన్ కోసం 2018 జూన్ 1 నుంచి వర్చువల్ ఐడీలను అంగీకరించాలని యూఐడీఏఐ గతంలోనే ఆదేశించింది. అయితే కొత్త వ్యవస్థ అమలుకు తమకు మరికొంత సమయం కావాలని ఏజెన్సీలు కోరడంతో యూఐడీఏఐ తన గడువును తాజాగా మరో నెలపాటు పొడిగించింది. ‘మేం సిద్ధంగా ఉన్నాం. అయితే ఏజెన్సీలు వర్చువల్ ఐడీ సిస్టమ్‌కు మారడానికి మరికొంత సమయం కోరుతున్నాయి. అందుకే వాటికి మరో నెల సమయమిచ్చాం’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. మనం ఇ–ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకుంటే.. దానిలో వర్చువల్ ఐడీ కూడా వస్తుందని వర్చువల్ ఐడీ వ్యవస్థతో సంబంధమున్న ఒక అధికారి తెలిపారు. కాగా వర్చువల్ ఐడీలో 16 సంఖ్యలుంటాయి. ఒక వ్యక్తి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఐడీలను జనరేట్ చేసుకోవచ్చు. కొత్త ఐడీ క్రియేట్ అయిన ప్రతిసారి పాత ఐడీ ఆటోమేటిక్‌గా రద్దువుతుంది. బ్యాంకులకు ఊరట.. మరోవైపు యూఐడీఏఐ రోజుకు కనీసం ఇన్ని ఆధార్ ఎన్రోల్మెంట్లు/అప్డేషన్లు చేయాలంటూ బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లు 2018 జూలై 1 నుంచి రోజుకు 8 ఆధార్ ఎన్రోల్మెంట్లు చేయాలని పేర్కొంది. కాగా ఇదివరకు బ్యాంక్ బ్రాంచ్‌లు రోజుకు 16 ఆధార్ ఎన్రోల్మెంట్లను చేయాల్సి ఉండేది. -
ట్రాయ్ ప్రతిపాదనల మేరకే వీఎన్ఓ గైడ్ లైన్లు
న్యూఢిల్లీ : వర్చువల్ నెట్ వర్క్ ఆపరేటర్లకు(వీఎన్ఓ) కేంద్ర ప్రభుత్వం లైసెన్సు గైడ్ లైన్లను విడుదల చేసింది. ట్రాయ్ ప్రతిపాదనల మేరకు ఈ గైడ్ లైన్లను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. యునిఫైడ్ లైసెన్సులను వీఎన్ఓ( యూఎల్ వీఎన్ఓ)లకు జారీచేస్తున్నట్టు టెలికాం డిపార్ట్ మెంట్ తెలిపింది. వీఎన్ఓ లను విస్తరించుకునే టెలికాం సర్వీసు ప్రొవైడర్లగా టెలికాం గుర్తించింది. మొబైల్ ల్యాండ్ లైన్, ఇంటర్నెట్ వంటి టెలికాం సర్వీసులు అందించవచ్చని ఈ గైడ్ లైన్లలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, ఎయిర్ టెల్ వంటి కంపెనీలే పూర్తిస్థాయి టెలికాం ఆపరేటర్లుగా కొనసాగుతాయని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు దగ్గరున్న వినియోగింపబడని మౌలిక సదుపాయాలను వీఎన్ఓలు వాడుకోవచ్చని వెల్లడించింది. వేరే ఎన్ఎస్ఓ నెట్ వర్క్ లతో అనుసంధానించుకుని ఈక్విప్ మెంట్లను ఇన్ స్టాల్ చేసుకునే సౌకర్యాన్ని మాత్రం వీఎన్ఓలకు అనుమతించమని టెలికాం తేల్చి చెప్పేసింది. వీఎన్ఓ లు కచ్చితంగా తమ సర్వీసులు అందించే సొంత ప్లాట్ ఫామ్ లు కలిగి ఉండాలని, బిల్లింగ్, వాల్యు యాడడ్ సర్వీసుల వంటి కస్టమర్ సర్వీసులను సొంతంగా అందించాలని పేర్కొంది. వీఎన్ఓల ఎంట్రీ ఫీజు కింద గరిష్టంగా రూ.7.5 కోట్ల నిర్ణయించినట్టు గైడ్ లైన్లలో టెలికాం పేర్కొంది.