Water grid plan
-
తీరనున్న దాహార్తి
వాటర్‌గ్రిడ్‌పై నాప్ సర్వే పూర్తి పాలేరు నుంచి నీటి సరఫరాకు చర్యలు గ్రిడ్ నిర్మాణానికి స్థలాల పరిశీలన కొనసాగుతున్న రీ సర్వే 17 మండలాలకు రూ.1700 కోట్లు కేటారుుంపు మహబూబాబాద్ : వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని 17 మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1700 కోట్లు కేటారుుంచింది. ప్రతి మండలంలోనూ గ్రిడ్ నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దాహార్తి తీరుతుందా అని ఆయూ మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ నుంచి కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వస్తే.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా మరిపెడ సమీపంలోని మాదిరిపురం గుట్టపై 170 ఎంఎల్డీ (మిల్లి లీటరు ఫర్ డే) సామర్థ్యం గల ట్యాంకును నిర్మిస్తారు. దీంతో పాటు మూడు జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒక ఓహెచ్‌బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మిస్తారు. గుట్ట కింది భాగంలో ఫిల్టర్‌బెడ్(వాటర్ ట్రీట్మెంట్ నిర్మాణాలు) నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తారు. ఒక జీఎల్‌బీఆర్ నుంచి మరిపెడ మండలానికి, రెండవ జీఎల్‌బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్‌బీఆర్ నుంచి నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరందించేలా మ్యాప్ తయారు చేశారు. ఓహెచ్‌బీఆర్ నుంచి గూడూరు మండలం బొద్దుగొండ వద్ద సంప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొత్తగూడ, దుగ్గొండి, నెక్కొండ, ములుగు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు నీరు సరఫరా చేయనున్నారు. ఆ ట్యాంకుల నుంచి ఇంటర్నల్ పైపులైన్లు నిర్మించి బొడ్లాడ, మొరిపిరాల, ఇతరత్రా గ్రామాలకు కూడా నీరందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ అన్ని మండలాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీరు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి మండలంలో సంప్, ఇతరత్రా నిర్మాణాల కోసం అధికారులు స్థలాల పరిశీలిస్తున్నారు. మానుకోటలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్‌ను గ్రిడ్ కార్యాలయానికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ పనుల కోసం మ్యాప్ సర్వే పూర్తయినట్లేనని అధికారులు చెపుతుండగా.. కాంట్రాక్టర్ మాత్రం రీ సర్వే చేస్తున్నారని, అది పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అన్ని మండలాల్లో స్థలాలను పరిశీలించి అంతర్గతంగా ఇతరత్ర నిర్మాణాలు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు. అరుుతే ఆయా మండలాల్లో గతంలో నిర్మించిన ట్యాంకులు ఉపయోగపడుతాయా లేక కొత్తగా నిర్మించాలా అనేది నీటి సరఫరా ప్రారంభమైతేనే తెలియనుంది. అధికారుల కృషి ఫలించి గ్రిడ్ సక్సె స్ అయితే.. మానుకోట పట్టణ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది. 30 నెలల్లో గ్రిడ్ పూర్తికావాలి.. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన నిర్మాణాలు 30 నెలల్లో పూర్తి కావాలని ఒప్పందం జరిగింది. సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్‌ను గ్రిడ్ కార్యాలయానికి కేటాయించారు. గ్రిడ్‌కు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలకు, పాలకుర్తిలోని 2 మండలాలకు, ములుగులోని ఒక మండలానికి నీరందించేలా మ్యాప్‌తో పాటు సర్వే కూడా పూర్తయింది. డీఈలు గంగాధర్, శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు. - కె.రాములు, ఈఈ -
ఇంటింటికీ నల్లా, ఇంటర్నెట్
♦ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు, బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి ♦ మండలిలో కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ‘ఇంటింటికీ నల్లా... ఇంటింటికీ ఇంటర్నెట్’ను అందిస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు ఆయన బదులిస్తూ వాటర్‌గ్రిడ్ ద్వారా వేసే పైపులైన్ల నుంచి తాగునీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ కేబుల్‌ను పంపుతామన్నారు. 90 శాతం నీటిని గ్రావిటీ ద్వారానే ఇంటింటికీ సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు గరిష్టస్థాయిలో పరిహారం ఇస్తామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పర్యవేక్షిస్తామన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 20 వేల కోట్లు సేకరించామని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో మహిళలే గ్రిడ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రాజెక్టు పరిధిలోకి హైదరాబాద్ నగరం రాదన్నారు. వాటర్‌గ్రిడ్ పథకంలో అవినీతి జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ వారికి అన్నింట్లో స్కాములు కనిపిస్తాయని, కానీ తాము స్కీములతో ముందుకు పోతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని, కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులిచ్చే పద్ధతిని రద్దు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నుంచి 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తామన్నారు. వచ్చే ఏడాదిన్నరలోనే పాలేరు రిజర్వాయర్ నుంచి సమీపంలోని సూర్యాపేట, కూసుమంచి తదితర ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు... వాటర్‌గ్రిడ్‌ను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. వాటర్‌గ్రిడ్‌కు నీరెలా తెస్తారని దుష్ర్పచారం చేస్తున్నారని...పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి 1,200 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయిస్తూ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో 10 శాతం (120 టీఎంసీలు) తాగునీటికి ఉపయోగించుకోవచ్చని... వాటర్‌గ్రిడ్‌కు 40 టీఎంసీలకు మించి అవసరం లేదన్నారు. ఇంత స్పష్టత ఉన్నా వాటర్గిడ్పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరు అడ్డుపడినా ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రతిపక్షాలను రాజకీయంగా మూడు చెరువుల నీరు తాగిస్తామని చురకలంటించారు. సభలోని అందరు అధికార పార్టీ సభ్యులంతా ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. కేటీఆర్ సమాధానం అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
‘వాటర్‌గ్రిడ్’పై ఏపీ తకరారు!
-
‘వాటర్‌గ్రిడ్’పై ఏపీ తకరారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు కొలిక్కి రాకముందే మరో కొత్త వివాదం మొదలైంది. వాటర్‌గ్రిడ్ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి జరిపిన నీటి కేటాయింపులపై తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, బోర్డుకు తెలపకుండా ఉత్తర్వులిచ్చిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏ లెక్కన ఈ నీటిని కేటాయించిందో తెలపాలని కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు రాసిన లేఖల్లో కోరింది. నదీ జలాల్లో నీటి వాడకంపై కొత్తగా ఏ పథకాలు చేపట్టాలన్నా బోర్డు సమ్మతి ఉండాలన్న షరతును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్రం... జవాబు చెప్పాలంటూ తెలంగాణ సర్కారును వివరణ కోరింది. వాటర్‌గ్రిడ్ టెండర్ల ఖరారు దశలో... రాష్ట్ర ప్రజలందరికీ రానున్న మూడేళ్లలో సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించింది. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే హక్కు ఉందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవసరాల మేరకు ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌కు నీటిని కేటాయించింది. ఇందులో భాగంగానే కృష్ణా బేసిన్లో మొత్తంగా 19.59 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులోనూ కృష్ణా జలాల నుంచే మహబూబ్‌నగర్ జిల్లాకు 6.82 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 4.96 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాకు 5 టీఎంసీల మేర కేటాయింపులు జరిపి వీటికి దగ్గర్లోని ప్రాజెక్టుల నుంచి నీరివ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి టెండర్లు ఖరారు చేసే దశలో నీటి వినియోగంపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తింది. వివరణ ఇవ్వండి: కేంద్రం ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ సూచన మేరకు కృష్ణా బోర్డు తెలంగాణ రాష్ట్ర వివరణ కోరింది. దీనిపై బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా గురువారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ట్రిబ్యునల్ జరిపిన 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటారా లేక అదనపు జలాలు వినియోగిస్తారా? అనే అంశంపై ఏపీ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది.