‘వాటర్‌గ్రిడ్’పై ఏపీ తకరారు! | Krishna, Godavari, the use of the waters Telangana | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 11 2015 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు కొలిక్కి రాకముందే మరో కొత్త వివాదం మొదలైంది. వాటర్‌గ్రిడ్ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి జరిపిన నీటి కేటాయింపులపై తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, బోర్డుకు తెలపకుండా ఉత్తర్వులిచ్చిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏ లెక్కన ఈ నీటిని కేటాయించిందో తెలపాలని కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు రాసిన లేఖల్లో కోరింది. నదీ జలాల్లో నీటి వాడకంపై కొత్తగా ఏ పథకాలు చేపట్టాలన్నా బోర్డు సమ్మతి ఉండాలన్న షరతును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్రం... జవాబు చెప్పాలంటూ తెలంగాణ సర్కారును వివరణ కోరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement