water shortage
-
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లెత్తాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, సాగునీటి ప్రాజెక్టుల గేట్లు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నగరాలు, పట్టణాల్లో మంచినీటి కొరత మొదలైనా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ము లేదని కాంగ్రెస్ లేఖ ఇస్తే తానే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పిస్తానని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆరుగురే నేతలు మిగులుతారని, కేసీఆర్ కుటుంబలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితలే ఉంటారని ఎద్దే వా చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు, రుణమాఫీ, సాగునీటి కొరత, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఈ దీక్ష తలపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలన్న ఆలోచన లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలనే ఆలోచన బీజేపీకి లేదని బండి స్పష్టం చేశారు. కేసీఆర్‌కి 2 బీహెచ్‌కే (బేటా ఔర్ బాప్, హరీశ్, కవిత) పరి స్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని బండి విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్.. రూ.600కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పంటనష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పంటలకూ రూ.500 బోనస్ ప్రకటించాలని కోరారు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? గతేడాది చొప్పదండి నియోజకవర్గంలోని రామగుడులో పంట నష్టపోతే రైతులను పరామర్శించిన కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ కరీంనగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. మేం బరాబర్ శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతాం.. కాంగ్రెస్‌కు దమ్ముంటే బాబర్ ఫొటోతో ప్రచారం చేసుకోవాలని బండి సవాల్ విసిరారు. -
170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 30 జిల్లాల్లో క్షీణత నమోదు.. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లకు ఒక విషయమై బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో నీటి సంక్షోభం తారాస్థాయిలో ఉంది. గుక్కెడు మంచినీళ్ల కోసం అక్కడి ప్రజలు ట్యాంకర్లు, ప్రభుత్వ నల్లాల ఎదుట బారులు తీరుతున్నారు. కొందరు షాపుల్లో దొరికే వాటర్ బాటిళ్లను కొనుక్కొని తాగడానికి.. వంటకు వాడుతున్నారు. ముఖ్యంగా వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న ఆ దేశ రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా కరువు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో ప్రతి ఏడాదీ ఈ సీజన్లో నీటి కొరత సర్వసాధారణం. 2019లో అయితే అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈసారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు కీలక సూచన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడారు. ‘జింబాబ్వేలో నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారేలో ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించాం. తక్కువ సమయంలో స్నానాలు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాటలు వంటివి అన్ని రద్దు చేశాం.’అని తెలిపాడు. టీమిండియాకు విదేశీ పర్యటనలలో ఇలా నీటి కొరత ఎదురువడం ఇది తొలిసారి కాదు. గతంలో 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని ఒక భారత క్రికెటర్ పేర్కొన్నాడు. 📍Harare , Mabelreighn Water pic.twitter.com/S3gr87I3uI — Alexander Gusha ❁ (@ZEZURUROCKSTAR) August 15, 2022 1/ Harare West in particular & other parts of Harare have had no running water for the past 3 weeks. This is a clear violation of section 77 of the constitution of Zimbabwe which enshrines the right to safe, clean & potable water. Water is life, the unavailability of it,... — Linda Tsungirirai Masarira (@lilomatic) August 15, 2022 చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లే! -
భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం
ఎడారులు వేరు, ఎడారీకరణ జరగడం వేరు. మానవ తప్పిదాల వల్ల భూములు ఎడారీకరణకు గురవడం ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద సమస్య. తగని వ్యవసాయ పద్ధతులు, కాలుష్యం, అడవుల నరికివేత, యుద్ధాలు లాంటివెన్నో దీనికి కారణం. ఎడారీకరణ భూమిని నిస్సారం చేస్తుంది. దీనివల్ల ఆహార అభద్రత, నీటి కొరత లాంటి విపరిణామాలు తలెత్తుతాయి. తద్వారా వలసలు, పేదరికం పెరుగుతాయి. అందుకే నిరుపయోగమైన భూములను తిరిగి సస్యశ్యామలంగా మార్చాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. దీనికి సౌర, పవన శక్తులు సహకారం అందించగలవని శాస్త్రవేత్తలు ఆశ పెడుతున్నారు. రానున్న దశాబ్దకాలంలో చైనా విస్తీర్ణానికి సమానమైన భూమిని సారవంతం చేయాలని ప్రపంచం సంకల్పించుకోవడం శుభసూచకం. ప్రతి సంవత్సరం జూన్ 17ను ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు పోరాట దినోత్సవం’గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1994లో ప్రకటించింది. దీని ముఖ్యోద్దేశం నిరుపయోగంలో ఉన్న భూమిని సస్యశ్యామలమైన భూమిగా మార్చడం. ఆ భూమిని పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. దీనివల్ల నూతన ఉద్యోగ కల్పన జరుగు తుంది. ఆహార భద్రత పెరుగుతుంది. అంతేగాక జీవన వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చర్యల వలన భూమిపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయి. తద్వారా భవిష్యత్ తరాలవారికి భూమి మరింత నివాస యోగ్యం అవుతుంది. సముద్రాలు, మహాసముద్రాలు, మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగిలిన భూమిపై వ్యవసాయం, రహదారులు, పరిశ్రమలు, గృహనిర్మాణాల కోసం మానవులు నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ నూతన ఆవిష్కరణల వల్ల అవసరమైన మేరకు తప్ప మిగతా వాటివల్ల సహజ పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అటవీ నిర్మూలన, తగని, నిలకడలేని వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని సందర్భాలలో మానవ తప్పిదాలైనా యుద్ధాల వలన కూడా సారవంతమైన భూమి ఎడారిగా మారు తోంది. పర్యావరణ వ్యవస్థలు విపరీతంగా దోపిడీకి గురవటం, అతిగా మైనింగ్ కార్యకలాపాలు, కలుషిత నీటిపారుదల వలన కూడా భూమి ఎడారి అవుతుంది. తద్వారా ఆ ప్రాంతం అసహజ ఎడారీ కరణ అవుతుంది. ఈ ఎడారీకరణలో భూమి పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోతుంది. దాని ఫలితంగా ఆ ప్రాంతమంతటా తీవ్ర కరువు ఏర్పడుతుంది. ఈ కరువు, కాటకాలతో మానవాళి జీవనం అస్తవ్యస్త మవుతుంది. ఈ అసహజ ఎడారీకరణ అనేది ప్రకృతి రీత్యా ఏర్పడిన సహజ ఎడారులను సూచించదు. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదాల వలన జరుగుతుంది. అనేక దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదాలలో ఇది మైఖ్యమైనది. ఇది భూమి స్థితిని, సాంద్రతను క్రమంగా క్షీణింపజేసే ప్రక్రియ. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని గ్రామీణ పేదలలో చాలా ఎక్కువ భాగం ఈ భూములపైనే నివసిస్తు న్నారు. దీని అర్థం వారు నీటి కొరత, కరువులు, అధిక ఉష్ణోగ్రత, పేదరికం, ఆహార అభద్రత, సంఘర్షణల బారిన మరింతగా పడను న్నారనే! ఎడారీకరణ వలన మరో పెనుముప్పు, నీటి కొరత. 2025 నాటికి 180 కోట్ల మంది సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కో వాల్సిన ప్రమాదం ఉంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు. మనం ప్రతిరోజూ చూసే వార్తా నివేదికలను బట్టి, గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణ విధానాలు మారుతున్నాయని సులభంగా గుర్తించవచ్చు. తరచుగా వర్షాలు కురిసే ప్రదేశాలలో కూడా కరువు అనేది ఒక సాధారణ విషయం అవుతోంది. కొద్దిపాటి చినుకులు కూడా అరుదుగా పడే దేశాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తు న్నాయి. వాతావరణ మార్పు అనేది నెమ్మదిగా మన ప్రపంచంపై అంటే మానవాళికున్న ఏకైక ఇంటిపై ప్రభావం చూపుతోంది. ప్రతి సంవత్సరం మనం 12 మిలియన్ హెక్టార్ల భూమిని కోల్పోతున్నాం. ప్రపంచ అటవీ విస్తీర్ణం 13 మిలియన్ హెక్టార్లు తగ్గిపోతోంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం– కరువు, ఎడారీకరణ కారణంగా సుమారు 1.9 బిలియన్ హెక్టార్ల భూమి క్షీణీస్తోంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పొడి భూముల్లో దాదాపు మూడు వంతులు ఎడారులయ్యాయి. ప్రపంచంలో వ్యవసాయం కోసం ఉపయోగించే పొడి భూముల్లో కూడా 70 శాతం వివిధ రకాల కారణాలతో నిస్సారమవుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో భూమి ఎడారిగా మారడంతో గత ఐదేళ్లలో 6 కోట్ల మంది ప్రజలు వలసలు వెళ్లారు. వాస్తవానికి 2025 నాటికి ఆఫ్రికాలోని సారవం తమైన భూమిలో మూడింట రెండు వంతులు ఎడారీకరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక భారతదేశంలో మొత్తం భౌగోళిక ప్రాంతం 328.72 మిలియన్ హెక్టార్లలో దాదాపు 97.85 మిలియన్ హెక్టార్ల భూమి క్షీణతకు గురయింది. ఇందులో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, లదాఖ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలున్నాయి. అయితే ఈ ఎడారీకరణకు పరిష్కారం ఉందా? అంటే ఉందనే! దానికి ఉత్తమమైన వ్యవసాయ పద్ధతులు అవలం బించటం, కరువు నిరోధకత కలిగిన వివిధ పంటలు సాగుచేయటమే మార్గం. అలాగే శాస్త్రవేత్తలు ఎడారులలో సమృద్ధిగా కనిపించే రెండు విషయాలను గమనించారు. అవి ఒకటి సూర్యుడు, రెండవది గాలి. సహారా ఎడారిలో భారీ సంఖ్యలో సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లను నిర్మించడం ద్వారా వర్షపాతం, వృక్షసంపద, ఉష్ణోగ్రతలపై అవి ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. విండ్ టర్బైన్ల ద్వారా ఈ ప్రాంతంలో కురిసే వర్షాన్ని రెట్టింపు చేయవచ్చని వారు గుర్తించారు. సహారా ఎడారిలోని తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్ల మేరా సౌర, పవన కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ తక్కువ జనాభా ఉంటుంది. సౌర, పవన క్షేత్రా లకు అనువైన ప్రదేశం కూడా. దాని ప్రకారం, ఈ ఎడారిలో ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం వినియోగించే విద్యుత్ కంటే నాలుగు రెట్ల ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనికి కొన సాగింపుగా సాహెల్ ఎడారి ప్రాంతంలో కూడా ఈ తరహా ప్రయో గాలు జరిగాయి. దీని అనంతరం ఇక్కడ సంవత్సరానికి 20 మిమీ నుండి 500 మిమీ మధ్య వర్షపాతం నమోదు అవుతుందని యూని వర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ (అమెరికా) వారి అధ్యయనం తేల్చింది. ఫలితంగా, వృక్ష సంపద సుమారు 20 శాతం పెరుగు తుందని గుర్తించారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధాన సమస్య. కాబట్టి అన్ని దేశాలూ సమష్టిగా పరిష్కారాలను కనుగొనాలి. సహారా తరహా సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల వ్యవస్థాపన నిజంగా ఎడారీకరణను ఆపగలిగితే అన్ని దేశాలూ ఆ వైపుగా పయనించాలి. అభివృద్ధి చెందు తున్న దేశాలకే ఎడారీకరణ ముప్పు ఎక్కువగా ఉన్నది. కాబట్టి దీన్ని అరికట్టడానికి మనం తక్షణమే వ్యవసాయాన్ని పరిరక్షించాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టాలి, వాయు కాలుష్యాన్ని అదుపులో ఉంచాలి, సహజ ప్రకృతి సంపదను కాపాడుకోవాలి, అడవులను నిర్మూలించ కుండా పరిరక్షించుకోవాలి, రసాయన క్షిపణుల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా యుద్ధాలు జరగకుండా జాగ్రత్త పడాలి. ఒక విధంగా చెప్పాలంటే మన శరీరాన్ని ఏవిధంగా ప్రతిరోజూ పరిరక్షించు కుంటామో అదే విధంగా మనకు ఉన్న ఏకైక నివాసం మన భూమిని కూడా అలాగే కాపాడుకోవాలి. ఇందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. లేదంటే ఏదో ఒకరోజు ఈ మానవాళి మొత్తం శాశ్వత నిద్రలోకి పయనించటం ఖాయం. అందుకే ప్రపంచ దేశాలు రానున్న దశాబ్దంలో బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ పునరుద్ధరించాలన్న ప్రాంతం సుమారు చైనా దేశ విస్తీర్ణానికి సమానం. ఇన్ని హెక్టార్ల భూమిని పునరుద్ధరిస్తే మానవాళికీ, పుడమికీ భారీ ప్రయోజనాలను అందించగలమని ఐక్యరాజ్యసమితి పేర్కొన డం శుభపరిణామం. నూతలపాటి రవికాంత్ వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు మొబైల్: 97044 44108 (నేడు ప్రపంచ ఎడారీకరణ, కరువు పోరాట దినోత్సవం) -
చిప్స్ కంపెనీలకు క‘న్నీటి’ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు చిప్స్ కొరత ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీదార్లను ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు ఈ సమస్య ఇతర పరిశ్రమలకూ పాకింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, యంత్రాలు, సర్వర్స్, బొమ్మలు.. ఇలా ఒక్కటేమిటి. వందలాది విభాగాలపై సెమికండక్టర్స్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలుకొని స్టార్టప్స్ వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతిమంగా కస్టమర్లపైనే భారం పడుతోంది. వస్తువుల ధర పెరగడంతోపాటు వీటిని అందుకోవడం కోసం వినియోగదార్లు వేచి చూడాల్సి వస్తోంది. దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. స్వచ్ఛమైన నీటి కొరతతో.. చిప్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న తైవాన్ వాటా 70 శాతముంది. క్వాల్కామ్ సహా పలు దిగ్గజాలకు చిప్స్‌ను సరఫరా చేస్తున్న తైవాన్ సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) వాటా పరిమాణం పరంగా ఏకంగా 55 శాతం ఉందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, వాన్గార్డ్ ఇంటర్నేషనల్ సెమికండక్టర్ కార్పొరేషన్, పవర్షిప్ సెమికండక్టర్ వంటి కంపెనీలూ ఇక్కడివే. అయితే వర్షాలు లేక 56 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరువు పరిస్థితులు తైవాన్ను చుట్టుముట్టాయి. సెమికండక్టర్స్ ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత స్వచ్ఛమైన మంచి నీటిని వాడతారు. ఇప్పుడీ నీటికి కరువు ఏర్పడడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. రెండు దశాబ్దాల్లో.. చిప్ కొరతతో పలు దేశాల్లో ప్యాసింజర్ కార్ల రంగంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయగా, మరికొన్ని తయారీ తగ్గించాయి. దీంతో ఈ సంస్థల అమ్మకాలూ తక్కువ నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత కొన్నేళ్లు ఉంటుందని ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో ప్యాట్ జెల్సింగర్ తెలిపారు. కొరత కారణంగా వ్యాపార అవకాశాలు మందగిస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ ముడిసరుకు ధర మార్చిలో భారీగా పెరిగింది. ఈ పెరుగుదల గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. ఇళ్లలో వినియోగించే గ్యాడ్జెట్స్ కోసం కస్టమర్లు గతేడాది ఎగబడడంతో కంపెనీలకు చిప్స్ అవసరం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. భారత్‌లో ల్యాప్టాప్స్, ఏసీలకు కొరత ఏర్పడింది. డిమాండ్‌తో పోలిస్తే ల్యాప్టాప్స్ 10 శాతమే సరఫరా అవుతున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అన్ని కంపెనీలకూ సమస్యే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో హార్డ్‌వేర్ అమ్మకాలు తగ్గాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని యాపిల్ ఫైనాన్స్ చీఫ్ లూకా మాయెస్ట్రీ తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నివేదిక ప్రకారం యూఎస్‌లో బోట్ బిల్డింగ్, బ్రూవరీస్, ఫాబ్రిక్ మిల్స్ వంటి సుమారు 170 పరిశ్రమలు ప్రత్యక్షంగా సమస్యను ఎదుర్కొంటున్నాయట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా చిప్ కొరత ప్రభావం ఉంటోందని నివేదిక వెల్లడించింది. చిప్స్, ఇతర ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తుల ధరను 5–12 శాతం పెంచుతున్నట్టు వర్ల్‌పూల్ సీఈవో మార్క్ బిజర్ తెలిపారు. ఏడాది చివరికల్లా పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయెన్సెస్, ఎయిర్ సొల్యూషన్స్ బిజినెస్ యూనిట్ హెడ్ డాన్ క్వాక్ వెల్లడించారు. హోమ్ అప్లయెన్సెస్ తయారీలో 1,000కిపైగా విభిన్న సెమికండక్లర్టను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఇదీ సెమికండక్టర్స్ పరిశ్రమ.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల పరిశ్రమ విలువ సుమారు రూ.32.7 లక్షల కోట్లు ఉంది. ప్రస్తుత సంవత్సరం 1.13 ట్రిలియన్ యూనిట్ల సెమికండక్టర్లు అమ్ముడవుతాయని అంచనా. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ధి అని ఈ రంగంలో ఉన్న రీసెర్చ్ సంస్థ ఐసీ ఇన్సైట్స్ తెలిపింది. 2019తో పోలిస్తే గతేడాది అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతమే. ఇక యూఎస్‌కు చెందిన ఇంటెల్ ప్రీమియం చిప్స్ తయారీలో ఉంది. శామ్సంగ్, ఎస్కే హైనిక్స్, బ్రాడ్‌కామ్, క్వాల్కామ్, మైక్రాన్ వంటి కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. చదవండి: ఆటో, ఐటీ, మెటల్ మెరుపులు: లాభాల ముగింపు -
సాగుకు పూర్తి.. మిగిలింది తాగుకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 కింద యాసంగిలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించారు. ఎస్సారెస్పీలో లభ్యత నీటిని వాడుకుంటూ లోయర్ మానేరు డ్యామ్ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించగా దాని దిగువన ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం జలాలతో పారించారు. ఆయకట్టు చరిత్రలోనే తొలిసారి 120 టీఎంసీలను వినియోగించి 14.50 లక్షల ఎకరాలకు నీరు అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులలో కనీస నీటిమట్టాలను పక్కాగా నిర్వహిస్తూ జూలై వరకు తాగునీటి అవసరాలకు నీటిని పక్కనబెట్టారు. ఒకవేళ సహజ ప్రవాహాల రాక ఆలస్యమైనా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలు మొదలు పెట్టేలా ప్రణాళికలున్నాయి. గరిష్ట ఆయకట్టు.. గరిష్ట వినియోగం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. వాటితోపాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్పా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్ మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్మట్–గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఈ యాసంగిలో 14.50 లక్షల ఎకరాల మేయ ఆయకట్టుకు నీరందించారు. లోయర్‌మానేరు ఎగువన ఎస్సారెస్పీ, అలీసాగర్, గుత్పా, వరద కాల్వల ఆయకట్టు కలిపి 6.50 లక్షల ఎకరాల మేర ఉండగా 5.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించారు. దీనికోసం గరిష్టంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో లభ్యత నీటిలోంచే 65 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇక లోయర్ మానేరు దిగువన సూర్యాపేట వరకు 8.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా తొలిసారి చివరి వరకు నీరందించారు. ఎల్ఎండిలో లభ్యతగా ఉన్న 22 టీఎంసీలను వినియోగించుకోవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలించిన 33 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందింది. 7–8 తడుల ద్వారా ఈ నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఎస్సారెస్పీ కింద 14.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందగా 120 టీఎంసీల మేర గరిష్ట నీటి వినియోగం జరిగింది. ఈ నీటిలోంచే వెయ్యికిపైగా చెరువులు నింపారు. ఇది గతేడాది యాసంగి సీజన్లో చేసిన నీటి వినియోగంకన్నా 35 టీఎంసీల మేర అధికం. -
వేసవిలో తాగునీటి 'కష్టాలకు చెక్'
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.109.81 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటం, భూగర్భ జలమట్టాలు అందుబాటులో ఉండటంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలుచోట్ల నీటిఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 48 వేల గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉండగా.. మండు వేసవిలో 4,926 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల్లోనూ.. వేసవిలో చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ 4 జిల్లాలతోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్న భావనతో ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. నీటిఎద్దడి ఉండే ప్రాంతాల్లో సరఫరా చేసే నిమిత్తం వివిధ జిల్లాల్లో రైతులకు చెందిన 418 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడానికి అంచనాలు రూపొందించారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరగకుండా ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారైన యాప్‌ను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మంచినీటి వనరులను సందర్శించి వాటికి అవసరమైన చిన్నపాటి మరమ్మతులు ఉంటే తక్షణం పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వినియోగించుకోనున్నారు. పశువులకూ నీరు మండు వేసవిలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 732 నివాసిత ప్రాంతాల్లో పశువులకు సైతం నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పశువుల అవసరాలకు నీటిని సరఫరా చేసేలా రూ.7 కోట్లు ఖర్చు కాగలదని అంచనాలను సిద్ధం చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఫుల్ వివిధ గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,501 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులన్నిటినీ పూర్తిస్థాయిలో నింపారు. మరమ్మతుల కారణంగా కేవలం 10 ట్యాంకులలో మాత్రం నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితి ఉంది. అత్యవసరమైతే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను వివిధ మార్గాల ద్వారా నింపేందుకు సన్నద్ధతతో ఉన్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
సముద్రం నీరూ తాగొచ్చు!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో రోజురోజుకు జటిలమవుతున్న తాగునీటి సమస్య, ఏప్రిల్, మేలో అమలు చేస్తున్న నీటికోతను నివారించేందుకు సముద్రపు ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రక్రియ ప్రాజెక్టు నెలకొల్పాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన సలహాదారుల కమిటీని నియమించే ప్రతిపాదనకు సోమవారం స్థాయి సమితిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. నగరానికి సమీపంలో ఉన్న మనోరీ ప్రాంతంలో కీలకమైన ఈ ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. అందుకు అవసరమైన 12 హెక్టార్ల స్థలం ఎంటీడీసీ బీఎంసీకి అందజేయనుంది. సుమారు రూ.1,600 కోట్లతో నిర్మాణం అయ్యే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రతీరోజు 200–400 మిలియన్ లీటర్ల సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి తాగేందుకు వీలుగా మారనుంది.కాగా సంబంధిత ప్రాజెక్టు ప్రతిపాదనను రూపొందించడానికి మెసర్స్ ఐడీఇ వాటర్ టెక్నాలాజీ అనే ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఈ కంపెనీ గత 50 ఏళ్లుగా ప్రపంచ స్ధాయిలో ఇదే రంగంలో ఉందని బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. జనావాసాలు పెరగడంతో.. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ త్రీవ్రత ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో ముంబైకి వచ్చే వలసలు మళ్లీ పెరిగిపోయాయి. గతంలో మాదిరిగా జనాభా పెరిగిపోసాగింది. ఫలితంగా నీటి వినియోగం కూడా పెరిగిపోనుంది. ఇప్పటికే ఉప నగరాలలో, శివార్లలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలవల్ల ముంబై విస్తీర్ణం రోజురోజుకు పెరగసాగింది. ముంబైలో కూడా అనేక బహుళ అంతస్తుల టవర్లు, భవనాలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు 50 ఇళ్లు ఉన్న చోట టవర్లు, ఎతైన భవనాలవల్ల వందల ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఏప్రిల్, మే, జూన్‌లో 10–15 శాతం నీటి కోత విధిస్తున్నారు. మరో ఐదు శాతం అప్రకటిత నీటి కోత అమలులో ఉంటుంది. అందరి దాహార్తి తీర్చడం బీఎంసీకి కష్టతరంగా మారింది. భవిష్యత్తులో పెరిగే వలసల కారణంగా నీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. దీంతో బీఎంసీ మనోరీ ప్రాంతంలో ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పాలని సంకల్పించింది. రోజుకు 200 మిలియన్ లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఆ తరువాత 400 మిలియన్ లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంటుంది. ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పేందుకు సుమారు రూ.1,600 కోట్లు ఖర్చవుతుండవచ్చని అంచనా వేశారు. అలాగే 20 ఏళ్లలో నీటి సరఫరాకు, నిర్వహణ, పరిశీలన పనులకు సుమారు రూ.1,920 కోట్లు ఇలా మొత్తం రూ.3,520 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. -
పది కోట్ల మందికి కరోనా ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో దాదాపు 60 కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయం తెల్సిందే. నీటి కొరత, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రజలు ఎక్కువగా ఇతర వైరస్‌లతోపాటు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. జూన్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 46 శాతం కేసులు ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే నమోదయ్యాయి. తాగేందుకు రక్షిత మంచినీరుతోపాటు, ఇతర నీరు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు, చేతులు సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ల వాడకం అందుబాటులో లేకపోవడం వల్లనే ఆయా రాష్ట్రాల్లో వైరస్ మహమ్మారీ ఎక్కువగా విజృంభించిందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంతాలు కూడా ఉన్నాయి, సామూహిక నీటి సేకరణ, సామూహిక మరుగుదొడ్లు ఉపయోగించే ప్రాంతాల్లో కరోనా లాంటి మహమ్మారిని అరికట్టడం కనాకష్టం. అలాంటి ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం కూడా కష్టమే. ‘నేషనల్ శాంపిల్ సర్వే’ ప్రకారం దేశంలో దేశ గ్రామీణ ప్రాంతాల్లో 48.60 శాతం మందికి మంచినీటి సౌదుపాయం అందుబాటులో లేదు. 30 శాతం మంది మంచినీటి కోసం ప్రభుత్వ నీటి వనరులపై మూకుమ్మడిగా ఆధారపడి బతుకుతున్నారు. ‘కమ్యూనిటీ మంచినీటి వనరులు, కమ్యూనిటి మరగుదొడ్లపై ప్రజలు ఎక్కువగా ఆధారపడడం వల్లనే కరోనా లాంటి వైరస్లు వేగంగా విస్తరిస్తున్నాయి’ అని ‘వాటర్ ఏడ్ ఇండియా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీకే మాధవన్ తెలిపారు. దేశంలో ఎంత మంది మంచీనిటికి, మరుగుదొడ్లకు కమ్యూనిటీపై ఆధారపడి బతుకుతున్నారో, వారిలో ఎంత మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందో అన్న అంశాలను విశ్లేషించి దేశంలో దాదాపు పదికోట్ల మంది ప్రజలు అలా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సమర్థవంతంగా వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఉపరితల, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ సిన్హా సూచిం చారు. బుధవారం జలసౌధలో నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణలో ‘ఐసోటోప్’ల వినియోగంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ నీరు భూమి మీద దొరికే విలువైన వనరన్నారు. రాబోయే కాలంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉండబోతున్నదని, పారిశ్రామికీకరణతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివారణా చర్యలు సూచించడానికి బార్క్ దేశవ్యాప్తంగా ‘ఐసోటోప్’టెక్నాలజీని వినియోగి స్తోందన్నారు. దీని ద్వారా భూగర్భ జలాల రీచార్జి మూలాలను అన్వేషించవచ్చునని, నీటి ఊటలను, ఉపరితల, భూగర్భ జలాల మధ్య అంతర్గత మార్గాలను తెలుసుకోవచ్చని వివరించారు. వాటి కాలుష్య కారకాలను గుర్తించడంతోపాటుగా కాలువలు, సొరంగాలు, జలాశయాలు, డ్యాములు సంభవించే సీపేజ్ను తెలుసుకోవచ్చునని, జలాశయాల్లోకి, చెరువుల్లోకి వచ్చే పూడిక మట్టి పరిమాణాన్ని అంచనా వేయొచ్చునని స్పష్టం చేశారు. గతంలో తెలం గాణలోని నల్లగొండ జిల్లాలో కూడా ధన్ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు పూడిక మట్టి తీసిన,తీయని చెరువుల్లో, భూగర్భ జలాల రీచార్జి స్థితిని తులనాత్మకంగా అధ్యయనం చేశామని గుర్తు చేశారు. పూడిక మట్టి తీసిన చోట భూగర్భ జలాల మట్టం బాగా పెరిగినట్టు తేలిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరితే ఉచితంగానే పరిశోధనలు నిర్వహించి నివారణా చర్యలు సూచిస్తామని అన్నారు. కొత్త సాంకేతిక పద్దతిపై తమకు అవగాహన కల్పించిన సిన్హాను ప్రభుత్వ సలహాదారు ఎస్కే జోషి అభినందించారు. -
ఆ ఒంటెల కథ
అది 1606 సంవత్సరం. డచ్ అన్వేషకుడు విలియమ్ జాన్స్జూన్ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని కనుగొన్న యూరోపియన్‌గా చరిత్రకెక్కాడు. అప్పట్లో ఆ దేశంలో ఆయనకి ఒక్క ఒంటె కూడా కనిపించలేదు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం 2020 సంవత్సరం. ఒంటెలతో విసిగి వేసారిపోయిన ఆస్ట్రేలియా వాటిని సామూహికంగా కాల్చి చంపే ఆపరేషన్ చేపట్టింది. అయిదు రోజుల్లోనే 10వేలకు పైగా మూగజీవాలను హెలికాప్టర్ నుంచే కాల్చి చంపేసింది. అసలు ఆ ఒంటెలు ఎలా వచ్చాయి ? ఎందుకు వచ్చాయి ? మెల్బోర్న్: కార్చిచ్చులతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాలో ఒంటెల హనన కాండ ప్రపంచ దేశాల గుండెల్ని పిండేస్తున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియా తమకు ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయంటూ హెలికాప్టర్ల నుంచి గురి చూసి కాల్చి చంపేస్తోంది. వివిధ దేశాలకు చెందిన జంతు ప్రేమికులు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న పనిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ఆ దేశం వినిపించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ఒంటె అక్కడి స్థానిక జంతువు కాదు. అదీ వలస జంతువే. భారత్ సహా ఎన్నో దేశాల నుంచి ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. అప్పట్లో బ్రిటీషియన్లు తమ రవాణా సౌకర్యాల కోసం ఈ ఒంటెల్ని వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ వాతావరణంలో గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోయేవి. కానీ ఒంటెలు అలా కాదు. అలాంటి వాతావరణమే ఒంటెలకు అనుకూలం. అంతేకాదు రెండు, మూడు వారాలు నీళ్లు తాగకపోయినా ఒంటెలు ప్రయాణించగలవు. అందుకే బ్రిటిష్ పాలకులు ఒంటెల్ని తీసుకురావాలని అనుకున్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్ దేశాల నుంచి ఒంటెల్ని తెచ్చారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారు. అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవనవిధానంలో ఒక భాగమైపోయాయి. అనూహ్యంగా పెరిగిపోయిన సంతతి 19వ శతాబ్దంలో రవాణా అవసరాల కోసం మోటార్ వాహనాలపై ఆధారపడ్డాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఆస్ట్రేలియా వాతావరణం ఒంటెలు పెరగడానికి అనుకూలంగా ఉండడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001–08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది. ఒంటెలు పెరిగిపోతూ ఆహారం కోసం, నీళ్ల కోసం జనావాసాలపై పడడం, పంటపొలాల్ని నాశనం చేస్తూ ఉండడంతో ఆస్త్రేలియా ప్రభుత్వం ఒంటెల్ని చంపే కార్యక్రమం చేపట్టింది. 2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి కటకటగా ఉంది. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుం టూ వస్తోంది. పాపం ఆ మూగజీవాలు, అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు వాటికి పెనుశాపమైంది. ► ప్రస్తుతం ఒంటెల సంఖ్య: దాదాపు 3 లక్షలు ► ఆక్రమించిన ప్రాంతం: ఆస్ట్రేలియా భూభాగంలో 37 % ► కలిగిస్తున్న నష్టం: పంట పొలాల ధ్వంసం, సాంస్కృతిక, చారిత్రక కట్టడాల విధ్వంసం, ఒంటెల సంతతి పెరిగిపోతూ ఉండడంతో దెబ్బ తింటున్న జీవ వైవిధ్యం ► దేశానికి కలిగిస్తున్న నష్టం: ఏడాదికి కోటి డాలర్ల నష్టం -
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి /బళ్లారి: తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాల వినియోగం లెక్కలు చెప్పకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అందజేయకుండా ‘నవలి’ జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తోసిపుచ్చాయి. జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిందంటూ కర్ణాటక చెబుతున్న లెక్కలు తప్పని తుంగభద్ర బోర్డు నిర్వహించిన పరిశోధనలోనే వెల్లడైందని, తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా బోర్డు తేల్చిందని ఏపీ పేర్కొంది. టీబీ ఎల్లెల్సీ (దిగువ కాలువ)లో 30 కి.మీ.ల పైపులైన్ నిర్మిస్తే జలచౌర్యం జరగకుండా కర్నూలు జిల్లాకు సమర్థంగా నీటిని తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా పూర్తి వివరాలు అందజేస్తే పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కర్ణాటక పేర్కొంది. తుంగభద్ర జలాశయం జల విస్తరణ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా ఐదు టీఎంసీలను వినియోగిస్తున్నారని, దీన్ని కర్ణాటక కోటాలో లెక్కించాలన్న ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందించింది. ఎత్తిపోతల పథకాల ద్వారా కర్ణాటక వినియోగిస్తున్న జలాలను ఆ రాష్ట్రం ఖాతాలోనే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించాయి. చైర్మన్ డి.రంగారెడ్డి నేతృత్వంలో తుంగభద్ర బోర్డు శనివారం బెంగళూరులోని వికాససౌధలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈఎన్సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్, రాకేష్సింగ్లు ఇందులో పాల్గొన్నారు. నీటి లెక్కలతోపాటు డీపీఆర్ అందచేయాలన్న బోర్డు తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయానికి ఎగువన కొప్పళ జిల్లా ‘నవలి’ వద్ద 31.15 టీఎంసీలతో ఒక జలాశయం, మరో రెండు చెరువులను జలాశయాలుగా మార్చడం ద్వారా మొత్తం 50 టీఎంసీలను నిల్వ చేస్తే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవచ్చునంటూ కర్ణాటక ప్రతిపాదించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాలను కర్ణాటక సర్కార్ భారీగా వినియోగిస్తోందన్నారు. ఆ లెక్కలు చెప్పకుండా, నవలి జలాశయం డీపీఆర్ అందజేయకుండా ఈ ప్రతిపాదనపై చర్చించలేమని తేల్చి చెప్పారు. వచ్చే సమావేశం నాటికి తుంగభద్ర జలాశయానికి ఎగువన వినియోగిస్తున్న నీటి లెక్కలతోపాటు నవలి డీపీఆర్‌ను అందజేయాలని టీబీ బోర్డు కర్ణాటక సర్కార్‌కు సూచించింది. మూడు రాష్ట్రాలు, సీడబ్ల్యూసీ ఆమోదం లేకుండా నవలి జలాశయం నిర్మాణానికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని బోర్డు చైర్మన్ రంగారెడ్డి తేల్చి చెప్పారు. తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కి సమాంతరంగా వరద కాలువను తవ్వితే అటు కర్ణాటకలో బళ్లారి.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలను తరలించవచ్చని, దుర్భిక్ష ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను కర్ణాటక తోసిపుచ్చింది. బోర్డు లెక్క పరిగణనలోకి.. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిపోయిందని కర్ణాటక వాదిస్తోంది. కానీ ఇటీవల బోర్డు చేసిన పరిశోధనలో నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలని తేలింది. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటక జలవనరుల అధికారి రాకేష్‌సింగ్ స్పందిస్తూ బోర్డు లెక్కలపై అధ్యయనం చేశాక తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. తుంగభద్ర ఎల్లెల్సీ ద్వారా కర్నూలు జిల్లాకు సక్రమంగా నీళ్లు రావడం లేదని, మధ్యలో చౌర్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికి 30 కి.మీ.ల మేర పైపులైన్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ బోర్డును కోరింది. దీనిపై కర్ణాటక జలవనరుల శాఖ అధికారి రాకేష్ సింగ్ స్పందిస్తూ పైపులైన్‌కు ఎంత భూమి అవసరం? దీనివల్ల కేటాయించిన మేరకు నీటిని తరలించడం సాధ్యమవుతుందా? అనే వివరాలను ఆంధ్రప్రదేశ్ అందజేస్తే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. -
నీటి కొరత ఉందని ఓ ప్రిన్సిపాల్ దారుణం..!
సాక్షి, మెదక్ జోన్: గురుకులంలో నీటి ఎద్దడి ఉందనే సాకుతో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినుల జుట్టు కత్తిరింపజేసిన ఉదంతం మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణంలోని మినీ గురుకులంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యారి్థనులు ఉన్నారు. వారి వసతి గృహానికి నీటిని సరఫరా చేసే బోరుబావి ఏప్రిల్‌లో ఎండిపోయింది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. మూడ్రోజులకోసారి రూ.600 వెచి్చంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులతల వెంట్రుకలు పెద్దగా ఉండడంతో నీటిఖర్చు అధికమవుతుందని భావించిన ప్రిన్సిపాల్ అరుణారెడ్డి తల్లిదండ్రులకుగానీ, పాఠశాల కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 9న విద్యారి్థనుల జుట్టు కత్తిరింపజేసి వాటిని విక్రయించారు. విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజు కొంతమంది తల్లిదండ్రులు గురుకులం వద్ద ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపాల్ తమ సిబ్బందిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మరి కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ గది నుంచి బయటికి రాలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా నీటిసమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
మాజీ రాష్ట్రపతికి నీళ్లు కరువాయే!
అతను భారతరత్న.. మహోన్నతమైన వ్యక్తి.. నడుస్తున్న రాజకీయ చరిత్ర... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. కానీ.. విశిష్ట వ్యక్తిగా.. రాజకీయ దిగ్గజంగా పేరొందిన ప్రణబ్‌కు ఎలాంటి మర్యాద దక్కిందో తెలుసా..? నీటి సౌకర్యం కూడా కరువైన పరిస్థితులు ఎదురయ్యాయి. బస్తీల్లో ట్యాంకర్ వస్తే.. నీటిని తీసుకెళ్లినట్లుగా.. ఆయన గదికి బకెట్లతో నీటిని సరఫరా చేశారంటే.. అధికారుల నిర్లక్ష్యం ఇట్టే బయటపడింది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాల్సిన పోర్టు అధికారులు హడావుడి చేశారే తప్ప ప్రణబ్‌కు అందించాల్సిన సౌకర్యాల్ని మాత్రం గాలికొదిలేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ శనివారం మధ్యాహ్నం నగరానికి విచ్చేశారు. ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ నిర్వహించగా.. పోర్టు గెస్ట్ హౌస్‌లో బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అధికారులు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తికి బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు.. ముందస్తుగా చెక్ చేసుకోవడం, ట్రయల్ నిర్వహించడం చేయాలి. కానీ.. అవేమీ చూడకుండా పోర్టు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు . ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌లో చుక్కనీరు కూడా రాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రణబ్ ఉన్న గదికి పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని మేల్కొన్న అధికారులు తరువాత పరుగులు తీశారు. అగ్నిమాపక శకటాన్ని ఆశ్రయించిన వైనం.. గెస్ట్ హౌస్‌లో నీటి సరఫరా బంద్ అవ్వడంతో ఏంచేయాలో పాలుపోని అధికారులు కాన్వాయ్‌లో ఉన్న అగ్నిమాపక శకటం నుంచి నీరు కావాలని అధికారులు కోరారు. అగ్నిమాపక శకటాల గొట్టాల ద్వారా గెస్టు హౌస్‌లోని వాటర్ ట్యాంక్‌లోకి నీటిని మళ్లించాలని భావించారు. అయితే ఈ నీటితో స్నానం చేయడం మంచిది కాదని కొంతమంది సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో కింద నుంచి నీటిని బక్కెట్లతో తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు. హడావుడి చేశారే తప్ప.. ఇంత జరిగినా.. అక్కడ ఉన్న పోర్టు అధికారులు ఎవరూ నీటి సమస్యని సీరియస్‌గా తీసుకోలేదు. వసతి సౌకర్యాల బాధ్యతలు చూస్తున్న పోర్టు అధికారి బాపిరాజు నీటి సరఫరా ఎలా పునరుద్ధరించాలన్న విషయాన్ని పక్కనపెట్టి.. వస్తున్న సందర్శకులపై విరుచుకుపడుతూ.. చిందులేశారు. ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పటికీ.. పోర్టు ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోటర్ కాలింది.. జనరేటర్ ఆగిపోయింది... నీటిని గెస్ట్ హౌస్ ట్యాంకుల్లో నింపేందుకు ఉపయోగించే మోటరు కాలిపోయింది. అయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యలేదు. జనరేటర్ ద్వారా చేద్దామని కొందరు సలహా ఇచ్చారు. అయితే ఆ జనరేటర్ కూడా పనిచెయ్యడం లేదని అప్పుడు గుర్తించడంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది. డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం.. ప్రొటోకాల్‌లో భాగంగా గెస్ట్ హౌస్‌కి వచ్చిన పోర్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ ఈ విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య తలెత్తినప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్ హరనాథ్ ఆదేశించారు. ఎస్బీ ఎస్ఐ ఓవరాక్షన్.. పోర్టు గెస్టు హౌస్ బయట,లోపల పోలీస్ ఉన్నతాధికారులంతా హుందాగా విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ ఉన్న సంబంధం లేని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శ్రీనివాస్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. అరుపులు, కేకలతో వీరంగం చేశారు. వాస్తవానికి మాజీ రాష్ట్రపతిని కలిసేందుకు ఎవరెవరు వచ్చారనే వివరాల్ని సేకరించడమే ఆయన విధి. కానీ దాన్ని పక్కనపెట్టి వచ్చిన సందర్శకులపై విరుచుకుపడ్డారు. గెస్టు హౌస్ లోపల ఫొటోగ్రాఫర్ బ్యాగ్ ఎందుకంత బరువుందంటూ సంబంధంలేని ప్రశ్నలతో సందర్శకుల్ని ఇబ్బందులకు గురిచేశారు. -
గొంతెండుతున్న మన్యం
గుక్కెడు మంచి నీటి కోసంగిరిపల్లెలు అల్లాడిపోతున్నాయి. గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా మారడంతో మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి ఊట గెడ్డల నుంచి నీటిని తెచ్చుకోవలసి వస్తోంది. ఆ కలుషితమైన నీటిని తాగడంతో పలువురు వ్యాధుల బారినపడుతున్నారు. విశాఖపట్నం, పాడేరు: మన్యంలో తాగునీటి సమస్య తీవ్ర రూపందాల్చింది. గత పాలకుల నిర్లక్ష్యం గిరిజనుల పాలిట శాపంగా మారింది. రక్షిత మంచినీటి పథకాలు లేని వందలాది గ్రామాల్లో గిరిజనులు నేటికీ ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న గ్రామాల్లో గ్రావిటీ పథకాలను నిర్మించారు. కొండల పై ఉండే నీటి నిల్వలను గుర్తించి, దిగువన ఉన్న గ్రామాల్లో ట్యాంకులు నిర్మించి, పైపులైన్ల ద్వారా ట్యాంకులోకి పంపి, గ్రామస్తులకు నీటి సుదుపాయం కల్పించారు. సుమారు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించి ఈ గ్రావిటీ పథకాలను నిర్మించారు. అయితే వేసవిలో కొండలపై నీటి నిల్వలు ఎండిపోవడంతో ఈ గ్రావిటీ పథకాలకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో కూడా గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా మారాయి. ఈ పథకాలతో పాటు పంపింగ్ స్కీమ్(మోటార్ బోరుబావులు)లను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) ద్వారా మన్యంలో నిర్మిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీల ద్వారా చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలో 800 పైగా గ్రావిటీ పథకాలు, 1200 పైగా పంపింగ్ స్కీములున్నాయి. ఏజెన్సీలో మొత్తం పంచాయతీల పరిధిలో 2028 మంచినీటి పథకాలు ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో పలు పథకాలు మూలకు చేరాయి. పాడైన పైపులు, మోటార్లకు మరమ్మతులు సవ్యంగా జరగడం లేదు. ఏజెన్సీలోని ఒక్కొక్క పంచాయతీ పరిధిలో దాదాపుగా 15 నుంచి 20 గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లోని మంచినీటి పథకాల నిర్వహణ పంచాయతీల ద్వారా సాధ్యం కావడం లేదు. రిజర్వాయర్లు లేకపోయినా వాటర్‌గ్రిడ్ పథకం గత ఏడాది ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖ జిల్లాకు వాటర్‌గ్రిడ్ పథకం మంజూరైంది. జిల్లాలోని మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోని ఏడు మండలాల్లో ఈ పథకం అమలు కోసం సర్వే కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాకు రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే ఇంత వరకు మన్యంలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ వాటర్‌గ్రిడ్ పథకం అమలు కోసం అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు అనంతగిరి ఆరు మండలాలతో పాటు పాడేరు నియోజకవర్గంలోని జి.మాడుగుల మండలంలో సర్వే నిర్వహించారు. ఈ ఏడు గిరిజన మండలాల్లో 482 గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చి రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.68 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా రిజర్వాయర్ల నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మన్యంలో రిజర్వాయర్లు లేనందున ఈ పథకం అమలుకు అవకాశమే లేదు. మన్యంలో ప్రతి గిరిజన కుటుంబానికి రక్షిత మంచినీరు అందించేందుకు చేపట్టవలసిన పథకాలపై సమగ్రంగా సర్వే నిర్వహించాల్సి ఉంది. ఏజెన్సీ 11 మండల కేంద్రాల్లోనే సరైన రక్షిత మంచినీటి పథకాల్లేవు. ఆర్డబ్ల్యూఎస్ గణాంకాల ప్రకారం మన్యంలో ఇప్పటి వరకు 1897 గ్రామాలకు మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. ఏజెన్సీ వ్యాప్తంగా 3760 గ్రామాలుంటే 2055 గ్రామాలకు మంచినీటి పథకాలు(52శాతం) అందుబాటులో ఉండగా మిగిలిన గ్రామాల్లో కుండీలు, బోరుబావులు, నుయ్యిలు వంటి చిన్న చిన్న తాగునీటి వసతులున్నాయి. మన్యంలో దూరదూరంగా ఉండే గ్రామాల్లో ప్రత్యేక రక్షిత మంచినీటి పథకాలతో మండల స్థాయి, పంచాయతీల స్థాయిలో మల్లీ విలేజ్ స్కీమ్స్‌ను నిర్మించి ఆర్డబ్ల్యూఎస్ నిర్వహణ ద్వారా అందుబాటులోకి తెస్తే గిరిజనుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వాటర్‌గ్రిడ్ పథకంతో గిరిజనుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సమగ్ర సర్వే ద్వారా మన్యంలో చేపట్టే మంచినీటి పథకాల నిర్మాణానికి రూపకల్పన చేయవలసి ఉంది. -
వర్షాతిరేకం : టెకీలకు బిగ్ రిలీఫ్
చెన్నై : తీవ్ర నీటి కొరతతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్న చెన్నై నగరానికి చల్లటి కబురు అందింది. భానుడి భగభగలతో అల్లాడిన చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం వరుణుడి రాక జనానికి ఊరట కల్పించింది. వర్షాలతో చెన్నైలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఉక్కపోతల నుంచి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వర్షం దృశ్యాలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, జూన్ 13న తమిళనాడుకు రుతుపవనాలు రావాల్సి ఉన్నా వాయు తుపాన్ దిశ మారడంతో రుతుపవనాల్లో జాప్యం ఏర్పడింది. జూన్ 21 నుంచి 23 మధ్య తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వర్షాలతో భూగర్భ జలాల మట్టం పెరిగే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్ధితులతో పాటు అధిక ఉష్ణోగ్రతలతో చెన్నై సహా తమిళనాడులో తీవ్ర నీటి కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. నీటి లభ్యత అడుగంటడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరాయి. -
వామ్మో నీటి లోటు..543 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : లోటు వర్షపాతం, ఎగువ నుంచి కరువైన ప్రవాహాల కారణంగా గడిచిన ఏడాది నిర్జీవంగా మారిన కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జూన్ నుంచి ఆరంభమైన కొత్త వాటర్ ఇయర్లో నీటి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదైనా నైరుతి కరుణిస్తుందనే గంపెడాశతో ఉన్నాయి. ప్రçస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 543 టీఎంసీల నీటి లోటు ఉండగా, అవి పూర్తి స్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వానలు కురవకపోతే మాత్రం రెండు బేసిన్ల పరిధిలో 26 లక్షల ఎకరాలపై ప్రభావం పడనుంది. నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు కూడా నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ ప్రాజెక్టులకు నీటి రాక కరువైంది. దీని ప్రభా వం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాలపై పడింది. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకు గానూ 372.46 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో 130 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా, ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇందులో గరిష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు 8 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకు గాను 32 టీఎంసీల లభ్యతగా ఉండగా, ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నాయి. జూరాలలోనూ 2.31 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తంగా 12 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేదు. ఇక ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నీటి లోటు ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 223 టీఎంసీల నీరు చేరితే కానీ అవి నిండే పరిస్థితులు లేవు. ఎగువన 180 టీఎంసీల మేర నీరు చేరి తే గానీ దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థాయిలో నీటి రాక రావాలంటే జూలై, ఆగస్టు నెలలో ఎగువన వర్షాలు కురవాలి. లేకుంటే దిగువకు ప్రవాహాలు మొదలయ్యేందుకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే జూరాల, సాగర్ల కింద ఖరీఫ్ పంటల సాగుపై స్పష్టత కొరవడుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయ కట్టు పై ప్రభావం పడే అవకాశం ఉంది. గోదావరి నిర్జీవం.. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూ ర్, కడెం, ఎల్లంపల్లిలలో ప్రస్తుత లభ్యత జలం కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఉండటం, 172 టీఎంసీల మేర నీటి లోటు ఉండటం కలవరపెడుతోంది. ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరథ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలో లభ్యత జలం 30 టీఎంసీలకు మించి లేకపోవడం, మరో 30 టీఎంసీల నీరు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అంతా వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
నగరవాసులపై నీటి పిడుగు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర ప్రజలపై నీటి పిడుగు పడింది. ఇప్పటికే మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఈనెల 15వ తేదీ నుంచి అదనంగా మరోరోజు కలిపి నాలుగు రోజులకు ఒకసారి నీటిని అందించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయనున్నట్లు నగర పాలక సంస్థ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో ఉన్న నీటి పరిమాణాన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తే జూలై చివరి వరకు వస్తాయని నగర పాలక సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తేనే నగర ప్రజల తాగునీటి సమస్య తీరుతోంది. రుతుపవనాల రాక ఆలస్యమై సకాలంలో వర్షాలు కురవకుంటే ఆగస్టు నుంచి నగర ప్రజల గొంతెండటం ఖాయంగా కనిపిస్తోంది. లీక్‌ల నిర్లక్ష్యం.. నగర ప్రజలకు మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్న తరుణంలో పైపులైన్లు లీక్ అయి నీరు వృధాగా పోతున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల పాత పైపులైన్లు ఉండటంతో తరచుగా లీక్ అవుతూ ఉన్నాయి. మరికొన్నిచోట్ల పైపులద్వారా నీరు లీకై కాలువల పాలవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజుల తరబడి లీక్ అయితే వాటిని నియంత్రించకపోవడంతో విలువైన నీరు వృధాగా కాలువల పాలయ్యేది. పైపులైన్ల నుండి నీరు లీక్ అయిపోతున్నప్పటికీ అధికారులు వెంటనే స్పందించకపోవడంతో నీటి సమస్యకు కొంత కారణమైంది. ‘డెడ్’ స్టోరేజీ.. ఒంగోలు నగరంలో 2.70 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వారి తాగునీటి అవసరాల కోసం రోజుకు 100 మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతోంది. అయితే ప్రస్తుతం నగర పాలక సంస్థ మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తోంది. రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నీటి నిల్వ సామర్ధ్యం 5300 మిలియన్ లీటర్లు. ప్రస్తుతం రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో 1964.44 మిలియన్ లీటర్ల నీరు ఉంది. వాటిలో డెడ్ స్టోరేజీ కింద 1000 మిలియన్ లీటర్ల నీరు పోతోంది. అంటే నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో కేవలం 964మిలియన్ లీటర్ల నీరు ఉన్నట్లు. ఈ 964 మిలియన్ లీటర్ల నీటిని నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తే నగర పాలక సంస్థ అంచనా వేస్తున్న విధంగా జులై వరకు రావడం కూడా కష్టమే. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుండగా, 15వ తేదీ నుంచి నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తామని ప్రకటించారు. మున్ముందు ఆ ప్రకటన ఐదు రోజులు, ఆరు రోజులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముందు చూపేది.. ఒంగోలు నగరానికి సీజన్లతో సంబంధం లేకుండా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదేళ్లు వ్యవహరించిన దామచర్ల జనార్ధన్‌రావు ప్రజల తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు ప్రతిరోజూ తాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవు. గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు తాగునీటిని సరఫరా చేసేందుకు పైపులైన్ల నిర్మాణంలో దామచర్ల నిర్లక్ష్యం నగర వాసులకు శాపంగా మారింది. దాంతో ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి సమస్యను కొంతమేర పరిష్కరించాలంటే నాగార్జునసాగర్ నుండి నీటిని సరఫరా చేయడమే. నగర ప్రజల తాగునీటి కోసం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్ వినయ్ంద్కు ముందు చూపు లేకపోవడం కూడా ప్రజలకు తాగునీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకొని మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన అంతే సమయం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక అధికారి పూర్తిగా విఫలమైనారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యలోనే మళ్లింపు.. ఒంగోలు నగర ప్రజల తాగునీటి కోసం నాగార్జునసాగర్ నుంచి విడుదల చేసిన నీటిని మధ్యలోనే దారి మళ్లించడంతో అనుకున్నంత మేర సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు నీరు చేరలేదు. సాగర్ నీటి సరఫరాకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ దారి మళ్లింపును మాత్రం అడ్డుకోలేకపోయాయి. కాలువ ద్వారా నీటి సరఫరా జరుగుతున్న తరుణంలో పలు గ్రామాల్లోని ఆర్‌డబ్లు్యఎస్ ట్యాంకులను నింపుకోవడం జరిగింది. మరికొన్నిచోట్ల పొలాలకు అక్రమంగా నీటిని తరలించుకున్నారు. నీటి చౌర్యం జరుగుతున్నా వాటిని నియంత్రించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో నగర ప్రజలకు నీటి కష్టాలు తెచ్చి పెట్టాయి. ప్రజలు సహకరించాలి... నగరంలో ఈనెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నందున ప్రజలు సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ కంఠమనేని శకుంతల కోరారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇప్పటికే 280 ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంత ప్రజలకు, నగరంలో విలీనమైన గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామని, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నందున ప్రజలు తమకు సహకరించాలన్నారు. – శకుంతల, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ -
కామదేనుపల్లిలో భారీగా చేపలు మృతి
-
బిందె నీరు దొరికితే ఒట్టు!
సాక్షి, దొరవారిసత్రం: వేపవి వచ్చేసింది. అయితే తీర గ్రామాల్లో తాగునీటి సమస్య అలాగే ఉంది. ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు సుమారు 20 ఏళ్ల క్రితం సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామ పరిధిలో నుంచి 18 కి.మీ మేర పైప్లైన్లు వేశారు. రెండు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించి తాగునీటి సదుపాయం కల్పించారు. అయితే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురికావడం, ఆబాక ప్రాంతంలో వేసిన బోర్ల వద్ద విద్యుత్ సమస్యలు ఏర్పడుతుండడంతో ఏడాది పొడవునా ప్రజలు తాగునీరందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వేసవి కాలంలో మాత్రం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అరకొరగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటూ వస్తున్నారు. నిధులు మంజూరైనా.. గతేడాది తీర గ్రామాల్లో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ.1.16 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి వనరులు లేనందున సుమారు ఆరు కి.మీ దూరంలోని సింగనాలత్తూరు గ్రామ పరిధిలోని చెరువులో బావి తవ్వారు. కారికాడు గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించారు. అక్కడే నీటి సంపు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ పనులు ఏడాది నుంచి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా పైపులైన్లు వేసి, వీధుల్లో కుళాయిలు అమర్చాల్సి ఉంది. వేసవి కాలం సమీపించడంతో ప్రస్తుతం ఎక్కడా తాగునీటి వనరులు లేకుండాపోయాయని స్థానికులు వాపోతున్నారు. కారికాడులో మాత్రం పథకం నీరు నూతనంగా నిర్మించిన సంపులోకి వస్తే అక్కడినుంచి పట్టుకుంటున్నారు. వేలికాడు, నాగినేరి గ్రామాల ప్రజలైతే ఊట చెరువుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. హడావుడితో సరి తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకుల హడావుడి తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎప్పటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారో?. -వై.సుబ్రహ్మణ్యం ఊటగుంటలోని నీరే దిక్కు: వేసవి కాలం వస్తే గ్రామ సమీపంలో ఉన్న ఊటగుంట నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సిందే. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునే వారులేరు. మంచినీటి పథకం నీరు కలగానే మిగిలింది. – పి.ఏకాంబరం పదిరోజుల్లో పూర్తవుతాయి నీటి పథకం పనులు పదిరోజుల్లో పూర్తి చేయిస్తాం. నూతనంగా నిర్మాణంలో ఉన్న నీటి పథకం పనులు పూర్తైతే కారికాడు, వేలికాడు, నాగినేరి గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – కె.చంద్రశేఖర్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, దొరవారిసత్రం -
కందకాల వల్ల నాలుగేళ్లుగా నీటి కొరత లేదు!
వైద్యనిపుణులైన డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామపరిధిలో 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది తొమ్మిదేళ్ల తోట. ఎర్రనేల. నీటి సదుపాయం కోసం 12 బోర్లు వేశారు. ఒక్క బోరే సక్సెస్ అయ్యింది. అందులోనూ వేసవి వచ్చిందంటే నీరు బాగా తగ్గిపోతుండేది. తోటను నిశ్చింతగా బతికించుకోవడం కోసం నీటి లభ్యత పెంచుకోవడానికి ఏం చేయొచ్చని ఆలోచిస్తుండగా నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా చేపట్టిన కందకాల ద్వారా ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించారు. వారు సూచించిన విధంగా వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు మించకుండా కందకాలు తవ్వించారు. 5 మీటర్లు వదిలి అదే వరుసలో మరో కందకం.. అలా తోట అంతటా కందకాలు తవ్వించారు. అప్పటి నుంచీ నీటి కొరత సమస్యే లేదని డా. పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. ‘మా ప్రాంతంలో ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడలేదు. చుట్టు పక్కల పొలాల్లో బోర్లకు నీటి సమస్య వచ్చింది. మాకు మాత్రం ఇప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. నాలుగేళ్ల క్రితం తవ్వించిన కందకాల ప్రభావం వల్లనే బోరులో నీటికి కొరత లేకుండా ఉందని స్పష్టంగా అర్థం అవుతున్నది. ఈ నాలుగేళ్లలో ఎంత వర్షం కురిసినప్పుడు కూడా.. మా పొలంలో నుంచి చుక్క నీరు కూడా బయటకు పోకుండా ఈ కందకాల ద్వారా భూమిలోకి ఇంకిపోతున్నాయి. అందువల్లే నీటికి కొరత రాలేదని చెప్పగలను. వచ్చే వేసవిలో కూడా నీటి సమస్య ఉండబోదనే అనుకుంటున్నాం..’ అని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తమ తోటకు మూడు వైపులా గోడ నిర్మించామని, మరో వైపు కందకాలు తవ్వామని.. వర్షపు నీరు బయటకు పోకుండా పూర్తిగా ఇంకుతుంటుందన్నారు. కందకాలు తవ్వుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు. వివరాలకు.. ప్రకాశ్– 97011 46234. -
వాన పట్టుకోండి
నగరాలు, పట్టణాల్లో నానాటికీ జనసాంద్రత పెరుగుతున్నది. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ నీటి కొరత సమస్య ఉధృతమవుతున్నది. వందలాది కిలోమీటర్ల దూరంలోని నదుల్లో నుంచి భారీ ఖర్చుతో నగరాలకు తాగు నీటిని తరలించాల్సి వస్తున్నది. అయినా, నగర ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి భూమిలో నుంచి భారీగానే నీటిని తోడేస్తున్నాం. నగరంలో ప్రతి ఇంటి ఆవరణలో భూమిలోకి ఇంకే వర్షపు నీటి కన్నా.. బోర్ల ద్వారా భూమిలో నుంచి తోడే నీరు చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నది. నగరం కింది భూమిలో నీటి వనరులు నానాటికీ అట్టడుగుకు దిగిపోవడానికి ఇదే మూల కారణం. గడ్డి భూమిలో కురిసే వానలో 95% భూమిలోకి ఇంకుతుంది. 5% మాత్రమే వృథా అవుతుంది. కాంక్రీటు పరచుకున్న నగరంలో కురిసే వర్షంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కురిసిన వానలో 5% భూమిలోకి ఇంకితే గొప్ప. 95% వాననీరు మురుగు కాలువల ద్వారా నగరం వెలుపలకు వృథాగా వెళ్లిపోతుంది. కాబట్టి, చినుకు పడిన చోటే భూమిలోపలికి ఇంకింపజేయడంలోనే నగరాల్లో నీటికొరత సమస్యకు పరిష్కారం దాగి ఉంది. మోస్తరు వర్షం కురిసినప్పుడు ఎక్కువ వాన నీరు భూమిలోకి ఇంకుతుంది. కుండపోత వర్షంలో చాలా తక్కువ శాతమే ఇంకుతుంది. పైగా భూమి కోతకు గురవుతుంది. వాన నీటి సంరక్షణ ప్రభుత్వం పని మాత్రమే కాదు హైదరాబాద్ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో అంత వేగంగా భూమిని కాంక్రీటు కప్పేస్తున్నది. జనసాంద్రత పెరుగుతున్నకొద్దీ ఇంటి స్థలం విలువ పెరుగుతున్నది. విలువ∙పెరుగుతున్నకొద్దీ బహుళ అంతస్థుల ఇళ్ల శాతం పెరుగుతూ వచ్చింది. ఇళ్ల ఆవరణలో గచ్చు చేయని చోటు కుంచించుకుపోతూ వచ్చింది. మట్టి పరచుకున్న విస్తీర్ణం తగ్గిపోతున్న కొద్దీ భూమిలోకి ఇంకే వర్షపు నీటి శాతం తగ్గిపోతూ వచ్చింది. నగరంలో సగటున ఏడాదికి 800 మిల్లీ మీటర్ల లేదా 80 సెంటీ మీటర్ల వర్షం పడుతుంటుంది. ఇందులో 95% వర్షపు నీరు వృథాగా మురుగు కాలువల్లోకి పోతున్నది. నగరం కాలి కింద భూమిలోకి 500 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల లోతుకు వెళ్తే తప్ప బోర్లకు నీరందని దుస్థితి నెలకొంది. వాతావరణ మార్పుల తీవ్రత మూలంగా వర్షం కురిసే రోజులు తగ్గిపోతూ, కుండపోత వర్షాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో నగరాల్లో వాన నీటి సంరక్షణకు బహుముఖ వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం కనిపిస్తున్నదని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్లలో వాన నీటి సంరక్షణ ఇళ్లు, అపార్ట్మెంట్ల ఆవరణలో వాన నీటి సంరక్షణకు ఇటీవల కాలంలో ఇంకుడుగుంతల తవ్వడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గుంత తవ్వి.. గుంతలో నాలుగు వైపులా సిమెంటు చేసి.. వివిధ సైజుల రాళ్లు, ఇసుకను నిండుగా నింపి ఇంకుడుగుంతను నిర్మిస్తున్నారు. అయితే, నిర్మించిన ఇంకుడుగుంతలు ఎన్ని సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇంకుడు గుంతలపైన బురద మట్టి ఒక పొరగా పేరుకుపోయిందంటే.. ఆ తర్వాత నీరు లోపలికి ఇంకలేని పరిస్థితి తలెత్తుతుంది. నగరంలో ఎన్ని ఇంకుడుగుంతలు తవ్వామని లెక్కలు రాసుకుంటున్నారే గాని, ఎన్ని ఇంకుడుగుంతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు? ఎన్నిటిలో సమర్థవంతంగా వాన నీరు ఇంకుతున్నది? అన్న ఆరా తీసే పరిస్థితి లేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. భూగర్భంలో వాన నీటి సంరక్షణ వ్యవస్థను నిర్మించడం ఎన్నో విధాలుగా ఉత్తమ ఫలితాలనిస్తుందని డా. సాయిభాస్కరరెడ్డి సూచిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల చుట్టూ ఖాళీ జాగాలు బాగా తగ్గిపోతున్న నేపథ్యంలో పిల్లలు ఆడుకోవడానికే చోటు దొరకడం లేదు. అటువంటప్పుడు ఇంకుడుగుంత కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం కష్టతరంగా మారుతున్నది. కొందరు నగరవాసులు ఇంకుడుగుంతలపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి ఒక ముఖ్య కారణం ఇది. రోడ్లపై వాన నీటి వరద కోసం ప్రత్యేక పైపులైన్.. తెలంగాణలో మొత్తం వర్షం ఏడాదిలో 20 రోజుల్లోనే కురుస్తున్నది. చాలాసార్లు అకాల వర్షాలు, కుంభవృష్టి కురవడం ఆనవాయితీగా మారుతున్నది. రోడ్డు మీద కురిసే ప్రతి చినుకూ వరదై ఆకస్మిక సమస్య తలెత్తుతున్నది. రోడ్ల మీద కురిసే వర్షం ఇంకడానికి దారిలేదు. వేగంగా బయటకు పోయే దారీ లేదు. ఇళ్ల నుంచి మురుగు నీటిని తరలించే డ్రైనేజీలోకే రోడ్లపై వరద నీటినీ మళ్లిస్తున్నందు వల్ల కుండపోత వర్షాలు కురిసినప్పుడు నగరాల్లో నీటి ముంపు సమస్య తీవ్రమవుతున్నదని హైదరాబాద్ వాసి అయిన స్వతంత్ర శాస్త్రవేత్త, పర్యావరణ నిపుణుడు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి సూచిస్తున్నారు. రోడ్లపై నుంచి వర్షపు నీటిని నగరం బయటకు పంపేందుకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మించడం అర్బన్ ప్లానింగ్‌లో ముఖ్య అంశంగా చేపడితే నగరాల్లో వాన నీటి ముంపు సమస్య తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎత్తయిన రోడ్లే ఆనకట్టలు! భవిష్యత్తు నగరాల భవిష్యత్తు.. పాలకులు, ఆయా నగరవాసులు జల చైతన్యంతో వాన నీటి సంరక్షణ సామర్థ్యం పెంచుకోవడంపైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. దీని పొడవు 158 కిలో మీటర్లు. నగరానికి చుట్టూ ఎత్తయిన కోట మాదిరిగా ఈ రోడ్డు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసుకునే పద్ధతులు అనుసరించడం ద్వారా భవిష్యత్తులో నగరం నీటి సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడుకోవచ్చని డా.సాయిభాస్కర్రెడ్డి సూచిస్తున్నారు. ఇందుకు ఆయన అనేక పద్ధతులను సూచిస్తున్నారు. ఎలెవేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలనే అడ్డుకట్టగా మలచుకుంటే నీటిని నిల్వగట్టి భూమిలోకి ఇంకింప జేయవచ్చన్నది ఆయన సూచన. ఇటువంటివి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పొడవునా కనీసం వంద చోట్ల రోడ్డునే కట్టగా ఉపయోగించుకొని నీటి కొలనులను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న కల్వర్టులను ‘నగరపు ఆనకట్టలు’గా మలచుకునే అవకాశం కూడా ఉంది. సాధారణంగా కల్వర్టు కింది సిమెంటు తూముల్లో నుంచి వాన నీటి వరద నగరం నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అయితే, ఈ కల్వర్టులను వాన నీటిని నిల్వ చేసే ఆనకట్టలుగా మార్చుకోవచ్చు. కల్వర్టు కింది సిమెంటు తూములకు వాల్వులు అమర్చడం ద్వారా నీటిని నిల్వ చేయవచ్చు. నీటి మట్టం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాల్వు ద్వారా నీటిని కొంతమేరకు వదిలివేయవచ్చు. తద్వారా అధిక నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చన్నది డా. సాయిభాస్కర్రెడ్డి సూచన. రాతి కొండలు ఉన్న చోట వాటి చుట్టూ పెద్ద కందకాలు తవ్వి.. మధ్యలో అక్కడక్కడా అడ్డుకట్టలు నిర్మిస్తే ఆ కొండలపై కురిసిన వాన నీరంతా అక్కడే భూమి లోపలికి ఇంకే అవకాశం ఉంటుంది. రెండేళ్లలో భూగర్భం ఖాళీ..! కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా–ఎన్.ఐ.టి.ఐ.) ఆయోగ్ దేశంలో నీటి సంక్షోభం తీవ్రతపై ఇటీవల అధ్యయనం చేసింది. కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌ను తొలిసారి విడుదల చేసింది. ముంచుకొస్తున్న నీటి కొరత సంక్షోభం తీవ్రత ఎంతగా ఉందని ఈ నివేదిక ప్రకటించిందంటే.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 నగరాల కింది భూమిలో నీరు కేవలం రెండేళ్లలో(2020 నాటికి) పూర్తిగా అడుగంటబోతున్నది! దీని అర్థం ఏమిటంటే.. ఈ నగరాల్లో నివాసం ఉంటున్న 10 కోట్ల మంది ప్రజలు వందల కిలోమీటర్ల నుంచి పైపులైన్లతో తరలించే నీటితోనే తాగునీటితోపాటు ఇతర అవసరాలు కూడా తీర్చుకోవాల్సి ఉంటుంది. చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత ఘోరమైన నీటి సంక్షోభం ముంచుకొస్తున్నదని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. శుభ్రమైన తాగునీరు లేక ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే,2050 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 6% నీటి సంక్షోభం వల్ల కోల్పోవలసిన పరిస్థితి దాపురిస్తుందని ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. భూగర్భ జలాలు అంతరించిపోకుండా కాపాడుకోవాలంటే.. నీటి పొదుపును పాటించడంతోపాటు.. మీరు నగరవాసులైనా, పల్లెవాసులైనా.. మీ ఇంట్లో, ఊర్లో, పొలాల్లో కురిసే ప్రతి వాన చినుకునూ ఒడిసి పట్టుకొని.. ఎక్కడికక్కడే భూమి లోపలికి ఇంకింపజేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. కాంక్రీటు అరణ్యాలుగా మారిన హైదరాబాద్ వంటి నగరాల్లో ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా వాన నీటి సంరక్షణకు పాలకులు, ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉద్యమించాలి. – పంతంగి రాంబాబు జియో ఫిల్టర్ ద్వారా బోరు రీచార్జ్ ఇల్లు/అపార్ట్మెంట్ రూఫ్‌టాప్ పైన పడిన వర్షపు నీటిని పీవీసీ పైపులోనే అమర్చిన బయో ఫిల్టర్ ద్వారా సులువుగా శుద్ధి చేసుకోవచ్చు. ఆ నీటిని జాగ్రత్త చేసుకొని ఇంట్లో వాడుకోవడానికి లేదా తాగడానికి వాడుకోవచ్చు. లేదా బోరు రీచార్జ్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. వాల్వును అమర్చుకోవడం ద్వారా అవసరాన్ని బట్టి ఈ రెండు విధాలలో ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. పీవీసీ పైపులో అడుగు పొడవు ఉండే రెండు ఫిల్టర్లను అమర్చుకోవాలి. మొదటిది ఇసుక ఫిల్టర్. రెండోది బయోచార్ లేదా బొగ్గు ఫిల్టర్. ఇసుకకు, బొగ్గుకు ముందు– వెనుక ఒక సన్నని మెష్ ఏర్పాటు చేస్తే చాలు. ఈ రెండు ఫిల్టర్ల ద్వారా ప్రవహించే వర్షపు నీరు మట్టి, మలినాలు లేకుండా శుద్ధి అవుతుంది. స్వల్ప ఖర్చుతోనే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వాన నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మన దేశంలో వాన నీటి సంరక్షణ మొక్కుబడిగానే జరుగుతోంది. ఇంకుడుగుంతలు నిర్మించి వదిలేస్తున్నారు. నీరు బాగానే ఇంకుతున్నదని అనుకుంటున్నారు. కానీ, నిజానికి సన్నమట్టి అంగుళం మందాన పేరుకుందంటే.. ఇక ఏ మాత్రం వాన నీరు ఇంకదు. ఇంకుడుగుంత పై నుంచి బయటకు వెళ్లిపోతుంది. కంకర, ఇసుక నింపేముందే ఇంకుడుగుంతలో హైపవర్ రివర్స్ పంపులు అమర్చాలి. ఆ పంపుల ద్వారా అప్పుడప్పుడూ బలంగా నీటిని ఇంకుడుగుంత అడుగునుంచి పైకి పంప్ చేస్తే.. పైన పేరుకున్న మట్టి పొర చెదిరిపోయి.. ఇంకుడుగుంత సజావుగా పనిచేస్తుంది. మన వాళ్లు ఇంకుడుగుంత వరకే ఆలోచిస్తున్నారు. దాన్ని పూర్తిగా పనిచేయించేలా ఆలోచించడం లేదు. వాన నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యతేనని జనం అనుకుంటున్నారు. కానీ, ఇది ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా గుర్తెరగాలి. ఈ ఎరుకను కలిగించేలా ప్రచారోద్యమం చేపట్టాలి. వాననీటి సంరక్షణ పనులు ఆ ఇల్లు, అపార్ట్మెంట్, రోడ్డు, పార్కు.. ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక స్థితిగతులను బట్టి అనుసరించాల్సి ఉంటుంది. భూగర్భంలో రెండు చాంబర్లు... ఇళ్లు, అపార్ట్మెంట్ల ఆవరణల్లో భూమిని ప్రత్యేకంగా ఇంకుడుగుంతలకు స్థలం కేటాయించాల్సిన అవసరం లేకుండా.. భూగర్భంలో ప్రత్యేక ఛాంబర్ నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టవచ్చు. ఇది పూర్తిగా భూమి లోపలికి సంపు మాదిరిగా నిర్మించి, పైన అవసరాన్ని బట్టి పక్కకు తీసే విధంగా సిమెంటు స్లాబులను అమర్చుతారు. కాబట్టి, స్థలం వృథా కాదు. ఈ ఛాంబర్‌కు చుట్టూ మూడు, నాలుగు వైపులా గోడలకు రెండంగుళాల వ్యాసార్థంలో రంధ్రాలుంటాయి. ఛాంబర్‌ను భూమిలో అమర్చిన తర్వాత.. దాని చుట్టూ అర అడుగు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఆ ఖాళీలో పెద్దసైజు కంకర రాళ్లు అర అడుగు మందాన నింపుతారు. ఛాంబర్లో నుంచి నీరు ఈ రాళ్ల నుంచి మట్టి ద్వారా భూగర్భంలోకి ఇంకుతాయి. భూగర్భంలో ఇలాంటి వాన నీటి సంరక్షణ ఛాంబర్లను రెండు విధాలుగా నిర్మించుకోవచ్చు. వీటిని సిమెంటుతో నిర్మించుకోవచ్చు. లేదా ఫైబర్‌తో తయారు చేసి భూగర్భంలో అమర్చుకోవచ్చు. ఛాంబర్లో రెండు గదులుంటాయి. వర్షపు నీరు గొట్టం ద్వారా ఒక గదిలోకి వస్తాయి. నీటితోపాటు వచ్చి చేరిన దుమ్ము ధూళి ఛాంబర్ అడుగుకు చేరుకుంటుంది. ఆ గది నిండిన తర్వాత పక్క గదిలోకి నీరు చేరుతుంది. ఛాంబర్ చుట్టూ ఉన్న రంధ్రాల ద్వారా నీరు భూమి లోపలికి సులువుగా ఇంకుతుంది. రెండో గదిలోకి చేరిన నీటిని ఇంట్లో వాడకానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ నీటిని మోటారుతో తోడుకొని తాగునీరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తాగునీరుగా వాడుకోవాలనుకుంటే.. రెండో గదిలో బయోచార్ లేదా బొగ్గు, ఇసుక, గ్రావెల్లను పొరలుగా వేసుకోవాలి. ఈ నీటిని మోటారు ద్వారా ఓవర్‌హెడ్ ట్యాంకులోకి తోడుకొని.. ఆర్.ఒ. సిస్టం ద్వారా శుద్ధిచేసుకొని తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. ఇళ్లు.. రోడ్లు.. వాన నీటి సంరక్షణ నగరంలో వాన నీటి సంరక్షణ అనగానే ఇళ్లు, అపార్ట్మెంట్ల ఆవరణల్లో ఏం చేయవచ్చన్న దగ్గరే ఆలోచన, ఆచరణ ఆగిపోతున్నాయి. రోడ్ల మీద కురిసే వర్షాన్ని ఎలా ఒడిసిపట్టాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్ల పక్కన పేవ్మెంట్లపై సిమెంటుతో కాంక్రీటు గచ్చు చేయడం మన వాళ్లకు అలవాటు. సిమెంటు ఇటుకల(పర్క్యులేటెడ్ టైల్స్)ను పరిచినట్లయితే వాటి సందుల్లో నుంచి నీరు కొంతమేరకైనా భూమిలోకి ఇంకుతుంది. ఫుట్ పాత్ మొత్తంలోనూ సిమెంటు ఇటుకలు అమర్చకుండా.. మధ్య మధ్యలో తక్కువ ఎత్తు పెరిగే మొక్కలు, గడ్డిని పెంచాలి. ఇది చూడటానికి ఎంతో అందంగానూ ఉంటుంది. ఎక్కువగా వాన నీటిని భూమి లోపలికి ఇంకింపజేస్తుంది. గడ్డి, మొక్కలున్న చోట కురిసే వాన నీరు 95% భూమి లోపలికి ఇంకుతుంది. రోడ్డు పక్కనే భూమిలోకి నీరు ఇంకితే అక్కడి చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఆహ్లాదాన్ని, ఆక్సిజన్‌ను పంచుతాయి. ఇళ్లు, అపార్ట్మెంట్ల చుట్టూతా ఖాళీ ప్రదేశాలలో, పార్కుల్లో కూడా సిమెంటు చేసెయ్యకుండా ఈ విధంగా పెర్క్యులేటెడ్ టైల్స్‌ను వేసుకుంటే వాన నీటి సంరక్షణ మెరుగ్గా జరుగుతుంది. ఆరేళ్లుగా రూఫ్‌టాప్ వర్షపు నీరే తాగునీరు! మూడింట రెండొంతుల వ్యాధులు పరిశుద్ధమైన తాగునీరు అందకపోవడం వల్లనే సంక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గడమే తాగునీటి సమస్యకు కారణం అని అనిపిస్తుంది. కానీ, నిజానికి అది వాస్తవం కాదు. ఈ సమస్య ఉన్న ఇంట్లోనే పరిష్కారం కూడా ఉందంటున్నారు కరువు ప్రాంతమైన మదనపల్లివాసి ఎం.సి.వి. ప్రసాద్. తమ ఇంటి రూఫ్‌టాప్ పైన కురిసే వర్షాన్నే శాస్త్రీయ పద్ధతిలో ఒడిసిపట్టుకొని, శుద్ధి చేసుకొని ప్రసాద్ కుటుంబం గత ఆరేళ్లుగా తాగుతున్నారు. రాయలసీమలో 400–600 ఎం.ఎం. వర్షం కురుస్తుంది. అంటే ప్రతి ఇంటిపైనా ఏడాదికి చ. మీ.కి కనీసం 50 లీటర్ల వర్షం కురుస్తుంది. ఇతర ప్రాంతాల్లో చ.మీ.కి కనీసం 60–100 లీటర్ల వర్షం కురుస్తుంది. ఈ నీటిని వృథాగా పోనీయకుండా.. భద్రపరుచుకుంటే.. ఏడాదంతా తాగడానికి సరిపోతాయి. ఆరుగురు కుటుంబానికి రోజుకు 20 లీటర్ల తాగునీరు సరిపోతుంది. ఇందిరమ్మ ఇంటిపైన కూడా రాయలసీమలో ఏటా 15 వేల లీటర్ల వాన కురుస్తుందని, అందులో సగం పట్టుకోగలిగినా తాగునీటికి కరువుండదని ప్రసాద్ చెబుతున్నారు. ఇంటిపైన కురిసే వర్షాన్ని సంరక్షించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే.. మొదట్లో కొంత పెట్టుబడి అవసరం. భూగర్భంలో ఇటుకలతో సిమెంటు ట్యాంకు నిర్మించాలి. ఇంటిపైన కురిసిన నీటిని పీవీసీ పైపుల ద్వారా మినరలైజేషన్ ట్యాంకు నుంచి భూగర్భ ట్యాంకులోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. మేడపైన దుమ్ము ధూళి కొట్టుకుపోవడానికి వర్షం నీటిని మొదటి 5 నిమిషాలు బయటకుపోయేలా వాల్వు ఏర్పాటు చేసుకోవాలి.వర్షపు నీటిలో ఖనిజాలు ఉండవు. అందువల్ల ఈ నీటికి సహజ పద్ధతిలో ఖనిజాలు కలిసేలా చేస్తున్నారు. ఇందుకోసం 500–1000 లీటర్లు పట్టే మినరలైజేషన్ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. ఎం.సి.వి. ప్రసాద్ తన ఇంటి వద్ద స్టెయిన్లెస్ స్టీల్(304 ఫుడ్ గ్రేడ్) డ్రమ్ము(మినరలైజేషన్ ట్యాంకు)ను ఏర్పాటు చేసుకున్నారు. మేడ పై నుంచి పైపు నుంచి మినరలైజేషన్ ట్యాంకు ద్వారా భూగర్భంలో నిర్మించిన సిమెంటు ట్యాంకు లోపలికి చేరుకొని నిల్వ ఉంటాయి. మోటారుతో ఏరోజుకారోజు తోడుకొని గత ఆరేళ్లుగా ప్రసాద్ కుటుంబం తాగుతున్నారు. గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే ఈ నీటిని ఎన్నేళ్లు నిల్వచేసినా పాడు కావు, నాచు పట్టదని ప్రసాద్ తెలిపారు. – డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి, స్వతంత్ర శాస్త్రవేత్త, పర్యావరణ నిపుణులు, హైదరాబాద్