West Indies Batsman
-
బ్యాట్స్మన్ సాహసం
-
బ్యాట్స్మన్ సాహసం
ట్రినిడాడ్: వెస్టిండీస్ బ్యాట్స్మన్ లెండిల్ సిమన్స్ సాహసం చేశాడు. ఒక కాలికి మాత్రమే ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు అర్ధసెంచరీ బాది ఔరా అనిపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అతడీ ఫీట్ చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరపున బరిలోకి దిగిన సిమన్స్ సింగిల్ ప్యాడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన సిమన్స్ 60 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. టీ20 మ్యాచుల్లో నెమ్మదిగా(ఎక్కువ బంతుల్లో) సాధించిన అర్ధసెంచరీ ఇదే కావడం మరో విశేషం. బ్యాట్స్మన్ ఒక కాలికి ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేయడం తాను ఎక్కడా చూడలేదని కామెంటేటర్ ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు. టీమిండియాతో కొద్ది నెలల కిత్రం జరిగిన టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో సిమన్స్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. -
'ఇప్పుడే రిటైర్ కాను, మళ్లీ జట్టులోకి వస్తా'
మెల్ బోర్న్: టెస్టు జట్టులో పునరాగమనమే వచ్చే ఏడాది తన లక్ష్యమని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తెలిపాడు. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన తాను 2016లో కచ్చితంగా టెస్టుల్లో ఆడతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడప్పుడే క్రికెట్ నుంచి రిటైర్ కావాలనుకోవడం లేదని 36 ఏళ్ల గేల్ బ్యాట్స్ మన్ స్పష్టం చేశాడు. 2014 జూలైలో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. అతడికి అది 103వ టెస్టు మ్యాచ్. 'వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అందుకే నన్ను టెస్టు టీమ్ కు ఎంపిక చేయలేదు. పూర్తిగా కోలుకునివుంటే తప్పకుండా జట్టులో ఉండేవాడిని. క్రికెట్ నుంచి ఇప్పుడే రిటైర్ కాను' అని గేల్ చెప్పాడు. వెన్ను నొప్పి కారణంగానే టెస్టులో తన పునరాగమనం ఆలస్యమైందని తెలిపాడు. ఇప్పటివరకు తాను ఆడిన టెస్టుల్లో 42.18 సగటుతో 7,214 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది.