woman die
-
విద్యుత్ తీగలు కారు మీదపడి..
-
విద్యుత్ తీగలు కారు మీదపడి..
యాచారం(ఇబ్రహీంపట్నం): కారు దగ్ధమైన సంఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే కారులోనే సజీవదహనమైంది. ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద జరిగింది. కృష్ణా జిల్లా విసన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన చిలకాని జితేందర్‌కుమార్, అతని భార్య చంద్రకళ(40), కుమారుడు వృధీన్, చంద్రకళ అమ్మ ఆరేపల్లి పద్మావతి, పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంనకు చెందిన అక్క కలకొండ శ్రీ విద్య, మరో బంధువు కలకొండ సూర్యవిహర్‌లు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కూకట్పల్లి నిజాంపేట్ నుంచి కారులో యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్ఆర్ హజరీస్‌లోని తమ బంధువుల వద్దకు వస్తున్నారు. నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారిపై యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ఓ లారీకి రోడ్డుకు అడ్డంగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి తెగాయి. లారీ వెనకాలే జితేందర్‌కుమార్ నడుపుతున్న కారు వెళ్లడంతో దానిపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన చంద్రకళ సడన్‌గా కారు డోర్ తీసి కాలు కింద పెట్టగానే ఆమెకు మంటలు అంటుకొని అక్కడికక్కడే కాలిపోయింది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులో మాల్‌వైపునకు వెళ్తున్న మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జగన్ ప్రాణాలకు తెగించి తన వద్ద ఉన్న దుస్తులతో కారు డోర్లు తీశాడు. దీంతో జితేందర్‌కుమార్, అతని కొడుకు వృధీన్, అమ్మ పద్మావతి, అక్క శ్రీ విద్య, మరో బంధువు సూర్యవిహర్ ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని నిమిషాల్లో బంధువుల దగ్గరకు వెళ్తుండగా... కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జితేందర్‌కుమార్, వారి కుటుంబ సభ్యులు వేసవి సెలవుల్లో యాచారం మండలం నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్ఆర్ హాచరీస్‌లో ఉద్యోగం చేస్తున్న తమ బంధువు వద్దకు కారులో వెళ్తున్నారు. అప్పటి వరకు చంద్రకళ తమ బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ కొద్ది సేపట్లోనే మీ వద్దకు వస్తున్నామని చెబుతుండగానే విద్యుత్ తీగల రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. రోడ్డు మధ్యలోనే కారు దగ్ధం కావడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చంద్రకళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఆర్ హచరీస్ మేనేజన్ మనోహర్‌రెడ్డి ద్వారా ప్రమాదానికి గురైన కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి డోర్లు తీసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన జగన్‌ను ఏసీపీ అభినందించారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
– కొట్టి చంపేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు రేణిగుంట : మండలంలోని సూరప్పకశం పంచాయతీ అల్లికశంలో మంగళవారం రాత్రి ఒక వివాహిత వరకట్నం వేధింపులతో మృతిచెందింది. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, గాజులమండ్యం ఎస్ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. అల్లికశంకు చెందిన కౌమతి అలియాస్ గుణవతి(21)కి అదే గ్రామానికి చెందిన ఉమాపతి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఆ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగానే వివాహం జరిపించారు. గణపతి ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి పిల్లలు కలుగలేదు. ఈ క్రమంలో పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త గణపతి, అత్తామామలు నిత్యం హింసించేవారు. అలాగే రెండవ పెళ్లికి అంగీకరించాలని తరచూ ఆమెను వేధించేవారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం రాత్రి మృతిచెందింది. అత్తింటి వారే కొట్టి చంపేశారు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేయడంతోపాటు రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన కూతురును భర్త, అత్తామామలు కొట్టి చంపేశారని మృతురాలి తల్లి మునెమ్మ కన్నీరుమున్నీరైంది. మృతురాలి ఎడమ మోచేతిపై కాలిన గాయం, మెడపైన, వివిధ శరీర భాగాల్లో కమిలిన గాయాలు ఉండడంతో మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ సాయినాథ్ మాట్లాడుతూ మృతురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ గోవర్దన్ స్వామి సమక్షంలో పంచనామా చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
డెంటల్ క్లినిక్‌లో మహిళ అనుమానాస్పద మృతి
తిరుపతి: తిరుపతిలోని దొడ్డాపురంలో మాన్య డెంటల్ క్లినిక్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని డెంటల్ క్లినిక్‌లో పనిచేసే సంధ్యగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. డాక్టర్‌ను ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ కేసులో సంధ్య ప్రియుడికి సంబంధముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతనికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రెండు మాసాల్లో పెళ్లి కావాల్సి ఉండగా..
ఆటోను ఢీకొట్టిన ట్రాలీ యువతి మృతి ఐదుగురికి గాయాలు శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఘటన హైదరాబాద్: పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మద్యం మత్తులో ట్రాలీ ఆటో నడుపుతున్న డ్రైవర్ ఢీ కొట్టడంతో యువతి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ యువతికి మరో రెండు మాసాల్లో వివాహం కావాల్సి ఉంది. ఈ ఘటన షాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం మాదన్నపేటకు చెందిన షబ్బీర్బేగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బోరబండలో ఓ శుభకార్యానికి వెళ్లి ఆదివారం అర్ధరాత్రి తిరిగి వస్తున్న సమయంలో అలస్కా హోటల్ వద్ద మద్యం మత్తులో ట్రాలీ ఆటోను నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్ గౌస్ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న అఫ్రీన్‌బేగం మృతి చెందగా, షబ్బీర్, సైదాబేగం, మీర్జా, అబిబుల్లాకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు మాసాల్లో వివాహం ఉందనగా ఆటో ప్రమాదంలో అఫ్రీన్‌బేగం మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగారు. -
దుస్తులు ఆరేసే తీగతో షాక్: మహిళ మృతి
కట్టంగూర్(నల్లగొండ): ఉతికిన దుస్తులను ఆర వేసేందుకు వాడే ఇనుప తీగ ప్రాణం తీసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన గుండాల పద్మ(35) గురువారం సాయంత్రం తన ఇంట్లో ఆరుబయట దండెం తీగపై ఉన్న బట్టలను తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పద్మను రక్షించే ప్రయత్నంలో భర్త నర్సింహ, కూతురు భాగ్యలక్ష్మి గాయాలపాలయ్యారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
పశ్చిమగోదావరి(భీమవరం): వేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఫ్లై ఓవర్ బ్రిడ్జీపై బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన నేతుల రాణి(30) అనే మహిళ స్కూటీపై బ్యూటీ పార్లల్‌కు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో రాణి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.