రెండు మాసాల్లో పెళ్లి కావాల్సి ఉండగా.. | woman dies in road accident | Sakshi
Sakshi News home page

రెండు మాసాల్లో పెళ్లి కావాల్సి ఉండగా..

Published Tue, Apr 26 2016 8:57 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

woman dies in road accident

ఆటోను ఢీకొట్టిన ట్రాలీ
యువతి మృతి
ఐదుగురికి గాయాలు
శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఘటన


హైదరాబాద్: పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మద్యం మత్తులో ట్రాలీ ఆటో నడుపుతున్న డ్రైవర్ ఢీ కొట్టడంతో యువతి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ యువతికి మరో రెండు మాసాల్లో వివాహం కావాల్సి ఉంది. ఈ ఘటన షాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం మాదన్నపేటకు చెందిన షబ్బీర్‌బేగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బోరబండలో ఓ శుభకార్యానికి వెళ్లి ఆదివారం అర్ధరాత్రి తిరిగి వస్తున్న సమయంలో అలస్కా హోటల్ వద్ద మద్యం మత్తులో ట్రాలీ ఆటోను నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్ గౌస్ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న అఫ్రీన్‌బేగం మృతి చెందగా, షబ్బీర్, సైదాబేగం, మీర్జా, అబిబుల్లాకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు మాసాల్లో వివాహం ఉందనగా ఆటో ప్రమాదంలో అఫ్రీన్‌బేగం మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement