women literacy
-
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్‌కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా ఆర్థిక అక్షరాస్యులు
దేశంలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడేలా, అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా మొట్టమొదటి స్టార్టప్ వచ్చింది. ఈ స్టార్టప్‌ను ప్రారంభించినది ఓ మహిళ. పేరు నిస్సారీ మహేష్. చెన్నైవాసి. బ్యాంకింగ్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న నిస్సారీ పదినెలల్లో పాతికవేల మందిని ఒకేచోట చేర్చింది. ఆన్లైన్లో మహిళల కోసం నిసారీ ప్రస్తుతం ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ఎవ్రీ మనీ టాక్స్ నిస్సారీకి రెండు సంస్థలు ఉన్నాయి. ‘హబ్ వర్డస్ మీడియా కంటెంట్ సర్వీస్’ ఒకటి. ఇది ఆన్లైన్ బ్రాండింగ్ సంస్థ. రెండవది ‘ఎవ్రీ మనీ టాక్స్’. ఇది మహిళ ల కోసం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్. ఇది వారి ఆర్థిక పరిస్థితులను సరిగ్గా ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది. నిసారీ మాట్లాడుతూ ‘చిన్న పెట్టుబడులు, ఆరోగ్య బీమా, పొదుపు ఖాతాలు, మైక్రో క్రెడిట్ రుణాలు వంటి ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తుల గురించి తెలియని చాలా మంది మహిళలు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి వాటి గురించి మహిళలకు తెలియజేయడం చాలా ముఖ్యం’ అంటారు నిస్సారీ. ఇది ఒక డిజిటల్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్. ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ ఇది మహిళలకు ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికీ సహాయపడుతుంది. ఈ సంస్థ మొదటి 10 నెలల్లో 25 వేల మంది మహిళలను ఈ వేదిక మీదకు చేర్చింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా నిస్సారీ బృందం మహిళలకు ఆర్థిక ప్రణాళికలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో మహిళల కోసం నిసారీ ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ‘మహిళలు తమ కెరీర్, వ్యాపారం, ఆర్థిక ప్రణాళికలతో సాధికారత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంతోషంగా ఉంది. ఫైనాన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడం ద్వారా మహిళలల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది’ అని చెబుతుంది నిస్సారీ. -
మహిళలకు సరస్వతీ కటాక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటికీ మహిళల అక్షరాస్యతలో వెనుకబడిన మండలాలు 470కి పైగా ఉన్నాయి.. వాటిల్లోని 9,505 గ్రామాల్లో 5,70,000 మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులే. అక్షరాస్యత కోసం గతంలో వయోజన విద్య, మూడేళ్లుగా సాక్షర భారత్ వంటి కార్యక్రమం అమలు చేస్తున్నా.. ఇంకా మహిళలు అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు.అందుకే 15 నుంచి 55 ఏళ్లలోపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం పట్ల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. 9,505 గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వయోజన విద్యా కేంద్రాలు కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నవంబర్ 15 నుంచి ఆరు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. వీటిల్లో చదువుకున్న మిహ ళల్లో ఆసక్తి కలిగిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీతో అనుసంధానం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదీ ప్రత్యేక కార్యక్రమం... ఒక్కొక్క గ్రామంలో రెండు కేంద్రాల వరకు ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారు. ఒక్కో కేంద్రంలో 30 మందిని చేర్పించాలి. రోజుకు 2 గంటలు నిర్వహించే కేంద్రంలో 30 మందిలో కనీసం 25 మందిని పూర్తి స్థాయిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇన్స్ట్రక్టర్దే. ఆరు నెలల తరువాత వారికి జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ(ఎన్ఐఓఎస్) పరీక్ష నిర్వహించి అక్షరాస్యులుగా సర్టిఫికెట్లు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కుటుంబ బాధ్యతల్లో పడి చదువుకు దూరమైన మహిళలు ఐదేళ్లలోనే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేలా చూస్తామని పూనం మాల కొండయ్య వివరించారు. నిరక్షరాస్యుల్లో అధిక శాతం మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీలే అయినందున వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమంలో చదువుకున్న తర్వాత ఆసక్తి ఉంటే, మొదటి ఏడాది ఓపెన్ స్కూల్లో 3, 5 తరగతులు ఒకే ఏడాదిలో చదుకోవచ్చు. తరువాత ఏడాది 8వ తరగతి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ మరుసటి సంవత్సరంలో పదవ తరగతి చదువుకొని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రెండేళ్లలో ఇంటర్మీడియెట్ చదువుకునేలా అవకాశం కల్పిస్తున్నారు.