World Bank report
-
మంత్రి, మాజీ ఐఏఎస్, ప్రపంచ బ్యాంకులకూ బుద్ధీ జ్ఞానం లేవా బాబూ?
‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు. కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు. ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది. అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు. అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు. దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారత్‌కు మరో 75 ఏళ్లు..
న్యూఢిల్లీ: భారత్‌సహా 100కు పైగా దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా అవతరించడంలో తీవ్ర అవరోధాలను ఎదుర్కొంటున్నాయని ప్రపంచబ్యాంక్ నివేదిక ఒకటి పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో పావుశాతానికి చేరుకోవడానికి భారత్‌కు దాదాపు మరో 75 ఏళ్లు పట్టవచ్చని కూడా నివేదిక విశ్లేషించింది. చైనా విషయంలో 10 సంవత్సరాలు, ఇండోనేషియా విషయంలో 70 సంవత్సరాలు పడుతుందని కూడా నివేదిక పేర్కొంది. ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ అనే శీర్షికన వెలువరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. → అమెరికా తలసరి ఆదాయం (నామినల్) ప్రస్తుతం దాదాపు 80,000 డాలర్లు ఉంటే, భారత్ విషయంలో ఈ విలువ దాదాపు 2,500 డాలర్లు. → 2023 చివరి నాటికి 1,136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య తలసరి కలిగిన 108 ప్రధాన దేశాలను పరిశీలిస్తే 600 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరు 75 శాతం. ఈ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. → మున్ముందు ఆయా దేశాలు గతం కంటే కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న రుణాలు, తీవ్రమైన భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ఘర్షణలు అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడంలో పెరుగుతున్న కష్టాల వంటివి ఇక్కడ ముఖ్యమైనవి. → ఇంకా అనేక మధ్య–ఆదాయ దేశాలు ఇప్పటికీ గత దశాబ్ద కాల అనుభవాలతో పురోగతికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా పెట్టుబడిని విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం మొదటి గేర్‌లో కారును నడపడం, దానిని వేగంగా వెళ్లేలా చేయడానికి ప్రయతి్నంచడం వంటిది. – ఇదే పరిస్థితి కొనసాగితే, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ శతాబ్దం మధ్య నాటికి తగిన సంపన్న సమాజాలను సృష్టించే రేసును కోల్పోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇండెరి్మట్ గిల్ అన్నారు. → అధిక అధిక ఆదాయ స్థితికి చేరుకోవడానికి దేశాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా క్రమక్రమంగా మరింత అధునాతన విధానాలను అవలంబించవలసి ఉంటుంది. → 1990 నుండి కేవలం 34 మధ్య–ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే అధిక–ఆదాయ స్థితికి మారాయి. వాటిలో దాదాపు 10 దేశాలు యూరోపియన్ యూనియన్ ఏకీకరణ నేపథ్యంలోనో లేక ముందే ఆయా దేశాల్లో కనుగొన్న చమురు క్షేత్రాల నుంచి ప్రయోజనం పొందడం కారణంగానో అధిక ఆదాయ దేశాలుగా మారగలిగాయి.ఎకానమీలో భారత్ ఐదవ స్థానం అయినా... 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో దేశం చాలా వెనుకబడి ఉంది. అభివృద్ధి చెందిన దేశమంటే...ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,500 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
నీటి కొరతతో.. ఎకానమీకి కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌లో నీటి కొరత ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆదాయంలో క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీయవచ్చనివిశ్లేషించింది. ఆయా ప్రభావాలు సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం చూపుతుందని సూచించింది. బొగ్గు విద్యుత్ జనరేటర్లు, ఉక్కు తయారీ వంటి నీటిని అధికంగా వినియోగించే రంగాల ప్రయోజనాలకు సైతం నీటి కొరత విఘాతం కలిగిస్తుందని హెచ్చరించింది. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా నీటి ఒత్తిడి తీవ్రమవుతోందని కూడా పేర్కొంది. వాతావరణ మార్పులు కరువు, తీవ్ర వేడి, వరదలు వంటి తీవ్రమైన సంఘటనలకు కారణమవుతాయని వివరించింది. భారత్ ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై మూడీస్ రేటింగ్స్ వెలువరించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. 👉ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు జూన్ 2024లో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇది నీటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక భారీ వర్షాల నుండి నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనికాదు. 👉 2023లో ఉత్తర భారతదేశంలోని వరదలు, గుజరాత్‌లోని బిపార్జోయ్ తుఫాను కారణంగా 1.2–1.8 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన విషయం ఇక్కడ గమనార్హం.👉 రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా తగ్గుతోంది. 1950–2020 సమయంలో హిందూ మహాసముద్రం దశాబ్దానికి 1.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కింది. ఇది 2020–2100 మధ్యకాలంలో 1.7–3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలపడం గమనార్హం. 👉 వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తరచూ సంభవించే అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షపాతం 2023లో 1971–2020 సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది. అకాల వర్షాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో 70 శాతానికి పైగా వర్షపాతం ప్రతి సంవత్సరం జూన్–సెపె్టంబరులో కేంద్రీకృతమై ఉంటోంది. 2023 ఆగస్టులో దేశంలో భారీగా వర్షపాతం నమోదుకావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 👉 గతంలో సంభవించి న వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుదల వల్ల ఆహార సబ్సిడీల భారం నెలకొంది. ఇది దేశంలో ద్రవ్యలోటు పరిస్థితులకూ దారితీసింది. ఆహార సబ్సిడీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.3 శాతంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. బడ్జెట్లోని భారీ కేటాయింపుల్లో ఈ విభాగం ఒకటి. 👉భారత ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి కృషి చేస్తోంది. అదే సమయంలో నీటి భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అటు దేశానికి సంబంధించి సావరిన్ రేటింగ్ మెరుగుపరచుకోడానికి, కంపెనీలకు సంబంధించి దీర్ఘకా లికంగా నీటి నిర్వహణ ప్రతికూలత రేటింగ్లను తగ్గించుకోవడానికి దోహదపడతాయి. 👉భారతదేశంలో ఫైనాన్స్ మార్కెట్ చిన్నది. కానీ వే గంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు నిధుల సేకరణ విషయంలో ఇది కీలకమైన అంశం. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాలు నీటి నిర్వహణలో పెట్టుబడి కోసం నిధులను సమీకరించడానికి దేశ ఫైనాన్స్ మార్కెట్‌ను ఉపయోగించాయి. 👉పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం, భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 26 శాతం. ఇప్పటికి జీ–20 వర్థమాన దేశాల (ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 32 శాతం) కన్నా ఇది తక్కువ. మున్ముందు పరిశ్రమల రంగం మరింత విస్తరించే వీలుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 36 శాతం. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం, జీ–20 వర్థమాన దేశాల్లో ఇది 76 శాతం వరకూ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు –నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుంది. 👉ఫిబ్రవరి 2023 నాటి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకురావడానికి భార త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బహుళజాతి బ్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్) మద్దతు ఇచ్చింది. 1.2 బిలియన్ డాలర్ల మొత్తం ఫైనా న్సింగ్తో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందారు.జలవనరుల శాఖ డేటాజలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్ల నుండి 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చు. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ స్థాయి నీటి ఒత్తిడిని సూచిస్తుంది. 1,000 క్యూబిక్ మీటర్లకు పడిపోతే అది నీటి కొరతకు కొలమానం.నివేదిక నేపథ్యం ఇదీ..ఇటీవల బెంగళూరు, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర నీటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు నిరసనలు, రాజకీయ సంఘర్షణకు దారితీస్తోంది. ఈ అంశంపై జూన్ 21న నిరాహార దీక్ష ప్రారంభించిన ఢిల్లీ జల వనరుల మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మూడీస్ తాజా నివేదిక వెలువరించింది. -
నిలకడగా భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: అధిక బేస్‌తో పోలిస్తే కాస్త నెమ్మదించినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా భారత్ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్ల పాటు నిలకడగా 6.7 శాతం వృద్ధి నమోదు చేయగలదని తెలిపింది. పెట్టుబడుల వృద్ధి కాస్త నెమ్మదించినా గతంలో అంచనా వేసిన దానికన్నా పటిష్టంగానే ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది.2023–24లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. మరోవైపు, 2024లో ప్రపంచ వృద్ధి రేటు 2.6 శాతంగా ఉండొచ్చని, 2025–26లో స్వల్పంగా 2.6 శాతం స్థాయికి చేరవచ్చని నివేదిక తెలిపింది. కోవిడ్–19కి ముందు దశాబ్దంలో నమోదైన 3.1 శాతం సగటుతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతంలో వృద్ధి 2023లో నమోదైన 6.6 శాతంతో పోలిస్తే ఈ ఏడాది కొంత తగ్గి 6.2 శాతంగా ఉండొచ్చని అంచనా. ఇటీవలి కాలంలో సాధించిన అధిక వృద్ధి రేటు బేస్‌తో పోలిస్తే భారత్ వృద్ధి కొంత నెమ్మదించే అవకాశాలు ఇందుకు కారణమని నివేదిక వివరించింది. -
గణాంకాలు చెప్పే నిజాలు!
సరైన ప్రాతిపదికలు ఎంచుకుని, శాస్త్రీయ విధానంలో నమూనాలు రూపొందించుకుని వాటి ఆధారంగా సర్వే చేయాలేగానీ గణాంకాలెప్పుడూ అబద్ధం చెప్పవు. అలాగే అవి అన్నిసార్లూ పాలకులను రంజింపజేయలేవు. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు కూడా తప్పకపోవచ్చు. వెల్లడైన అంశాల్లోని వాస్తవాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించగలిగితే స్థితి గతులు మెరుగుపడతాయి. మనను చిన్నబుచ్చటానికే, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఇలాంటి గణాంకాలు అందిస్తున్నారని కొట్టిపారేస్తే అందువల్ల ప్రయోజనం ఉండదు. తాజాగా 2023కి సంబంధించిన అంచనాలతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక వెలువరించిన గణాంకాలు మనకు ఏక కాలంలో అటు సంతోషాన్నీ, ఇటు నిరాశనూ కూడా కలిగిస్తుండగా... ప్రపంచ బ్యాంకు నివేదిక ఓ విధంగా భయపెడుతోంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం సంపన్న రాజ్యాలకు అంతక్రితం కన్నా 2021, 2022 సంవత్సరాల్లో వలసలు బాగా పెరిగాయి. ఇందుకు ఉక్రెయిన్ యుద్ధం చాలావరకూ దోహదపడి వుండొచ్చు. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు యూరోప్ దేశాలకు వలసపోయారు. అలాగే 2020లో ప్రతి దేశమూ సరిహద్దులు మూసి వేయటంతో వలసలు దాదాపుగా నిలిచిపోయాయి గనుక దాంతో పోలిస్తే వలసలు పెరిగి వుండొచ్చు. అయితే స్థూలంగా చూస్తే వలసలు పెరిగాయి. అదే సమయంలో ఆ వలసల్లో మహిళల శాతం కూడా పెరిగింది. నిరుడు మన దేశంనుంచే వలసలు అధికంగా వున్నాయని నివేదిక సారాంశం. ఉన్నత విద్యకోసం వెళ్లేవారిని మినహాయించి కేవలం ఉపాధి కోసం వెళ్తున్నవారినే లెక్కేస్తే భారత్ నుంచి ఈసారి ఎక్కువమంది ఉద్యోగార్థులు వెళ్లారని ఆ నివేదిక వివరిస్తోంది. ఓఈసీడీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం వుంది. ఈ దేశాలకు 2021–22 మధ్య పదిలక్షల మంది వివిధ దేశాల నుంచి వలస రాగా అందులో 4.07 లక్షల మంది మన పౌరులు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారిలో భారత్ రెండో స్థానంలో వుంది. మన దేశం నుంచి ఈ కేటగిరీలో 4.24 లక్షలమంది వుండగా, చైనా 8.85 లక్షలతో అగ్రభాగాన వుంది. అటు ఉపాధి కోసమైనా, ఇటు విద్యార్జన కోసమైనా అత్యధికులు ఎంచుకుంటున్నది అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా దేశాలేనని నివేదిక వెల్లడిస్తోంది. ఈ వలసల గణాంకాలు గమనిస్తే అంతర్జాతీయంగా వుండే తీవ్ర పోటీని తట్టుకుని మన దేశం నుంచి ఎక్కువమంది ఉపాధి అవకాశాలను గెల్చు కుంటున్నారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాలకు పంపే నగదు నిరుడు బాగా పెరిగింది. ఆ ఏడాది 11,100 కోట్ల డాలర్లు భారత్‌కు విదేశాల నుంచి వచ్చిందని అంచనా. ఇది దేశ జీడీపీలో 3.3 శాతం. అంతేకాదు... ప్రపంచ దేశాలన్నిటిలో చాలా అధికం. ఈ నగదులో 36 శాతం అమెరికా, బ్రిటన్, సింగపూర్ల నుంచి వచ్చిందేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే భారత్‌కూ, అభివృద్ధి చెందిన దేశాలకూ సంబంధ బాంధవ్యాలు ఎంత పెరిగాయో తెలుస్తున్నది. అటు విద్యారంగాన్ని గమనిస్తే ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నదని అర్థమవుతుంది. ఈ విషయంలో లింగ వివక్ష కూడా తగ్గిందని ఓఈసీడీ నివేదిక వివరిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారు అంతక్రితంతో పోలిస్తే రెట్టింపు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉపాధి కోసమైనా, విద్య కోసమైనా వెళ్లేవారు పెర గటం మనవాళ్ల సత్తాను చాటుతోంది. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. అయితే ఇదే సమయంలో మన దేశంలో అటువంటి నిపుణులకు తగిన అవకాశాలు లేవన్న చేదు వాస్తవం వెల్లడవుతోంది. తగిన ఉపాధి, మంచి వేతనాలు లభించినప్పుడు వాటిని వదులు కుని ఎవరూ అయినవారికి దూరంగా పరాయి దేశాలకు వలస వెళ్లాలనుకోరు. వెళ్తున్నారంటే అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోతున్నామని, మెరుగైన వేతనాలు ఇవ్వలేకపోతున్నా మని అర్థం. ఆ నైపుణ్యాలను మన దేశాభివృద్ధికి వినియోగించలేకపోతున్నామని, తగిన శ్రద్ధ పెట్ట డంలేదని గుర్తించాలి. ఈ సందర్భంలో ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను కూడా ప్రస్తావించుకోవాలి. నిరుడు మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగిత అధికంగా వున్నదని ఆ నివేదిక తెలిపింది. మన దేశ యువతలో నిరుద్యోగిత 23.22 శాతం వుంటే, పాకిస్తాన్ (11.3 శాతం),బంగ్లాదేశ్ (12.9 శాతం), ఆఖరికి భూటాన్ (14.4 శాతం)లతో మనకంటే దూరంగా వున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. విదేశాలకెళ్లేవారు పెరగటం గర్వపడాల్సిన విషయమేననటంలో సందేహం లేదు. ఉన్నత విద్యా రంగంలో చూస్తే మన దేశంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నత శ్రేణి విద్యాసంస్థలున్నాయి. అవి కూడా వివిధ అంశాల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. బోధనారంగ నిపుణులు కూడా అంతే. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు లభించి తగిన వేతనాలు లభిస్తే ఇక్కడే ఉంటారు. అందువల్ల మన పిల్లల స్థితిగతులు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ఇక్కడివారిని ఆకర్షించి భారీ మొత్తంలో వేతనాలిస్తుంటే మన సంస్థలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఉపాధి విషయంలోనూ అంతే. తయారీ రంగ పరిశ్రమలను పెంచగలిగితే, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు మరింత మెరుగ్గా చేయూతనందించగలిగితే వలస పోయేవారి మేధస్సు పూర్తిగా ఇక్కడే వినియోగపడుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమై జీవనప్రమాణాలు పెరగటానికి దోహదపడుతుంది. -
ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : 19వ శతాబ్దం ప్రారంభంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా ఆ తరువాత ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది నివసిస్తుండగా సగం జనాభా 1975 తర్వాతే పెరిగింది. 50 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ సంతానోత్పత్తి రేటులో ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ దశకు చేరుకోగా 2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశం నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది. జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది. ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’లో భారత్.. 1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా 2020 చివరి నాటికి 2.3కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభాలో పెరుగుదల, తగ్గుదల నమోదు ఉండదు. ముందు తరం స్థానంలో తర్వాత తరం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లేదా ‘రీప్లేస్మెంట్ రేట్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడానికి కారణాలు ♦ గర్భ నిరోధ అవకాశాలు పెరగడం ♦ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ♦ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం దక్షిణ కొరియాలో అత్యల్పం ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతోంది. నైజర్ 6.9 సంతానోత్పత్తి రేటుతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే నైజీరియాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ (14వ స్థానం) మినహా సంతానోత్పత్తిలో టాప్ 30 దేశాలన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2100 నాటికి ఆఫ్రికా 250 కోట్ల మందిని ప్రపంచ జనాభాకు జోడిస్తుందని అంచనా. మిగతా ఖండాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఉండదు. ఇక అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ సంతానోత్పత్తి రేటు 0.84 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికాలో సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే దిగువన ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు 1970 నుంచి తక్కువ సంతానోత్పత్తి రేటుతో కొనసాగుతున్నాయి. తగ్గినా తిప్పలే.. సంతానోత్పత్తి రేటు క్షీణించడం వల్ల అనేక దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఈ విజయగాథలు గత చరిత్రే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారీ జనాభాతో ఇబ్బందులున్నప్పటికీ సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్నప్పుడు భిన్న సమస్యలు తలెత్తుతాయి. పని చేసేవారు, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి నిష్పత్తిలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. వృద్ధుల వైద్య ఖర్చులు పెరగడంతో పాటు సంపాదించి పన్నులు చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీర్ఘ కాలంలో.. ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహించి తాత్కాలికంగా జనాభా తగ్గుదల, మానవ వనరుల కొరతను ఎదుర్కొన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది. పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
భానుడి ఉగ్రరూపం: భవిష్యత్తులో సమ్మర్లో చుక్కలే..!
తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది. ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్ -
2020లో పేదరికంలోకి 7 కోట్ల మంది.. భారత్‌లోనే 5.6 కోట్లు
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి జారుకున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోయారు. అందులో 79 శాతం (5.6 కోట్లు) ఒక్క భారత్‌లోనే ఉండటం గమనార్హం. ‘పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. కరోనా వైరస్ ప్రపంచ పేదరికంపై కోలుకోలేని దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వైరల్ ప్రభావంతో ప్రపంచ పేదరికం రేటు 2019లో 8.4గా ఉండగా అది 2020లో 9.3కి చేరినట్లు నివేదించింది. నివేదిక ప్రకారం.. 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7.1 కోట్ల మంది కడు పేదరికంలోకి వెళ్లారు. దీంతో మొత్తం పేదరికుల సంఖ్య 70 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ పేదరికం పెరుగుదలకు ప్రధానంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలే కారణమని తెలిపింది. 7 కోట్ల మందిలో భారత్ నుంచి 5.6 కోట్ల మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆర్థికంగానూ భారత్ తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్రపంచంలోనే జనాభాలో తొలిస్థానంలో ఉన్న చైనా మాత్రం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
దుష్టచతుష్టయానికి షాక్ తగిలేలా వరల్ట్ బ్యాంక్ రిపోర్ట్
-
అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్డౌన్ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజుకోవడంతో చాలా రాష్ట్రాల ఆదాయాలు పెరగడంతో పాటు మూలధన వ్యయం మెరుగుపడిందని తెలిపింది. ఆదాయాలు క్షీణించినప్పటికీ ఆహార సబ్సిడీలు, పెన్షన్లు లాంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టడంతో వ్యయం పెరిగి అన్ని రాష్ట్రాల రుణాలు 24 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు అత్యధిక అప్పుల్లో ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ రాష్ట్రాల అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019, 2020, 2021 ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, క్యాపిటల్ వ్యయం, బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. పుంజుకున్న ఆదాయాలు.. ఆంధ్రప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాలన్నింటిలో 2019 ఆగస్టుతో పోల్చితే 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో క్యాపిటల్ వ్యయం పెరిగిందని, ఏపీలో 2019 ఆగస్టుతో పోల్చి చూస్తే 2020 ఆగస్టులో క్యాపిటల్ వ్యయం బాగా పెరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2019 ఆగస్టుతో పోల్చితే 2021 ఆగస్టులో బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాబడులు మెరుగుపడ్డాయని, బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం కూడా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే యత్నాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► దేశంలో అత్యధికంగా పంజాబ్ అప్పుల్లో ఉంది. జీఎస్డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి. ► రాజస్థాన్‌కు జీఎస్డీపీలో 39.5 శాతం మేర అప్పులుండగా హిమాచల్‌ప్రదేశ్‌కు 39.7 శాతం, బిహార్‌కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి. ► సొంత రాబడుల్లో పంజాబ్ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ► బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది. చత్తీస్గడ్ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది. కేంద్రం అప్పులే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ అప్పులు 2020–21లో ఏకంగా జీడీపీలో 61 శాతానికి చేరుకోవడం గమనార్హం. 2013– 14లో కేంద్రం అప్పులు రూ.56,69,128.48 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది. బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్ గ్లోబల్ డైరెక్టర్ జైమె సావెద్రా వివరించారు. నిజాలను చూపుతున్న గణాంకాలు బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది. బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది. చాలా దేశాల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది. -
1870 తరువాత ఇదే అత్యంత దారుణమైన మాంద్యం
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ సోమవారం తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగాఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. తద్వారా ఇది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ సోమవారం విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ తెలిపారు. మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు. 60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్పాస్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. ఈ మాంద్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. 1870 నుండి14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది (భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రతికూలం) -
భారత ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళన
వాషింగ్టన్ : భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్దిని నమోదు చేస్తుందని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వృద్ధి రేటు మైనస్ 3.2 శాతానికి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం (నిన్న) నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడికి వివిధ దశల్లో విధించిన లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం కోలుకోలేని దెబ్బతీసిందని పేర్కొంది. అయితే 2021లో వృద్ధిరేటు తిరిగి పుంజుకుంటుదని పేర్కొంది. ఆర్థికవ్యవస్థపై వాస్తవ ప్రభావం 9 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసింది. మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యల మూలంగా వినియోగం భారీగా క్షీణించిందనీ, సేవల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అలాగే ఈ అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడులను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించింది. భారత వృద్ధిరేటు ప్రభావం ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు కొంత వరకు ఊరట నిస్తాయని, ద్రవ్య విధానాల కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. మూడీస్, ఫిచ్, ఎస్ అండ్ పీ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 4 నుంచి 5 శాతం ప్రతికూల వృద్ధి అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. చదవండి : పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ -
కరోనా కాటు: దారిద్య్రంలోకి 10 కోట్ల మంది
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన పట్టణ పరిస్థితులపై అవగాహన కలిగిన నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల కడు పేద ప్రజలు, నిత్య దరిద్రులు ప్రధానంగా దెబ్బతింటారని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డైరెక్టర్ సమేహ్ వాహ్‌బా తెలిపారు. వీరింత ఉపాధి కోల్పోవడం వల్లనే రోడ్డున పడతారని ఆయన హెచ్చరించారు. ఎక్కడైతే కామన్ మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారో, ఎక్కడైతే భౌతిక దూరం పాటించడం అసాధ్యమో ఆ ప్రాంతాలను శాటిలైట్ సహాయంతో మ్యాపింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్‌లోని ముంబై నగరంతోపాటు కైరో, కిన్షాసా నగరాలను మ్యాపింగ్ చేసినట్లు ఆయన చెప్పారు. (వరల్డ్ వార్ హీరో శత జయంతి) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మందికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆహారం, ఆర్థిక సహాయం అందడం లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త శీలా పటేల్ తెలియజేశారు. మురికి వాడల్లో నివసించే నిరాశ్రుయుడివైనా లేదా ఫుట్‌పాత్‌లపై పడుకునే వ్యక్తయినా వలస కార్మికుడివి అయితే చాలు ఎలాంటి రేషన్ లేదా ఆర్థిక సహాయం అందడం లేదని భారత మానవ హక్కుల సంఘానికి చెందిన శీలా పటేల్ ఆరోపించారు. పలు ప్రాంతాల్లో మురికి వాడల్లోని స్వరాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకే అక్కడి స్థానిక ప్రభుత్వాలు సతమతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వియత్నాం యుద్ధాన్ని మించి.. -
వలస జీవుల దైన్యం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా లాక్డౌన్ 4 కోట్ల మంది వలస జీవుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. కాయకష్టం చేసుకుని బతికే వారిని రోడ్డున పడేసింది. వలస కూలీల జీవితాల్లో లాక్డౌన్ అంతులేని ఆవేదనకు కారణమైందని ప్రపంచబ్యాంకు తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. లాక్‌డౌన్‌తో కొన్ని రోజుల వ్యవధిలోనే 50 వేల నుంచి 60 వేల మంది వలస కూలీలు పట్టణ కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశం లో అంతర్గత వలసల రేటు అంతర్జాతీయ వలసల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. అంతర్గత వలసదారులకు ఆరోగ్య సేవలు, ఆర్థిక సాయం అందించడం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితిని, సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. గతేడాది పెరిగిన అంతర్జాతీయ వలసలు: కరోనా వైరస్ సంక్షోభం దక్షిణాసియాలో అంతర్జాతీయ, అంతర్గ త వలసలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు అనుమతి కోరే వారి సం ఖ్య పెరుగుతోంది. ఇలా గతేడాది అ నుమతి కోరిన వారు 36 శాతం పెరిగి, 3.68 లక్షలకు చేరుకుంది. అలాగే పాకిస్తాన్లో వలసదారుల సంఖ్య 2019లో 63శాతం పెరిగి, 6.25 లక్షలకు చేరుకుందని ప్రపంచబ్యాంకు తెలిపింది. కరోనా మహమ్మారితో ఈ ఏడాది అంతర్జాతీయ వలసలు తగ్గుతాయని అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుతం ఆయా దేశా ల్లో ఉన్నవారు అంతర్జాతీయ విమాన సర్వీ సులు నిలిచి పోవడంతో స్వదేశానికి రాలేకపోతున్నారు. ఉపాధి కష్టమే..: ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు, ఇతర ఉద్యోగులు ఆయా దేశాల్లో కరోనాతో ఏర్పడిన ఆర్థి క సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది. మన దేశం నుంచి వెళ్లిన కార్మికులు కరోనా కారణంగా ఆయా దేశాల్లోని శిబిరాల్లోనూ, వసతి గృహాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి అంటువ్యాధులను వ్యాపింపజేసే అవకాశముంది. రవాణా సేవలను నిలిపేయడం వల్ల వారంతా ఆయా దేశాల్లోని శిబిరాల్లో చిక్కుకుపోయారు. కొన్ని దేశాలు వలస కార్మికులకు వీసాల పొడిగింపునిచ్చాయి. ప్ర పంచవ్యాప్తంగా వైద్య నిపుణుల కొరత, వైద్య రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై నిర్లక్ష్యం వల్ల ఈ మహమ్మారి వి జృంభించడానికి కారణమైందని ప్రపంచబ్యాంకు పేర్కొం ది. విదేశాల నుంచి వలస వచ్చిన కార్మికులను భారతదేశం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలను ప్రస్తావించింది. -
'చెత్త' రికార్డు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ హబ్‌గా, హైక్లాస్ సిటీగా ప్రసిద్ధికెక్కిన మన భాగ్యనగరం ఓ ‘చెత్త’రికార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న మన హైదరాబాదీలకు చెత్త విషయంలో చిత్తశుద్ధి తక్కువేనని ఈ రికార్డు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో చెత్తను ఉత్పత్తి చేస్తున్న నాలుగో నగరంగా మన హైదరాబాద్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి యేటా 16.4 లక్షల మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆ నివేదికలో తేలింది. మన హైదరాబాద్ కన్నా ముందంజలో ఉన్న ఢిల్లీ (30.6 లక్షల ఎంటీ), బృహన్ముంబై (24.9 లక్షల ఎంటీ), చెన్నై (18.3 లక్షల ఎంటీ)లు మరింత చెత్త నగరాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఈ చెత్తలో ఆహార, హరిత వ్యర్థాలు 57 శాతం ఉండగా, కాగితాలు 10 శాతం, ప్లాస్టిక్ 8 శాతం, గాజు వ్యర్థాలు 4 శాతం, లోహాలు 3 శాతం, రబ్బరు, తోలు వ్యర్థాలు 2 శాతం, 15 శాతం ఇతర వ్యర్థాలున్నాయి. అమెరికాలో 263.7 లక్షల మెట్రిక్ టన్నులు.. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న దేశమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం చెత్తలో పదో వంతు భారత్‌లోనే పడేస్తున్నారని తెలి పింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కన్నా భారత్‌లోనే ఎక్కువ చెత్త వస్తోందని, 2016 లెక్కల ప్రకారం చైనాలో ఏటా 220.4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పడేస్తుంటే భారత్‌లో అది 277.1 లక్షల మెట్రిక్ టన్నులని తేల్చింది. మన తర్వాత అమెరికాలో ఏటా 263.7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడి ప్రజలు పడేస్తున్నారు. సగటున ఒక మనిషి పడేస్తున్న చెత్త విషయానికి వస్తే బెర్ముడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రోజుకు 4.5 కిలోల వ్యర్థాలను పడేస్తున్నాడు. ఆ తర్వాత అమెరికాలో 2.24 కిలోలు, రష్యాలో 1.13 కిలోలు, జపాన్‌లో 0.94 కిలోల చెత్త డస్ట్బిన్ల పాలవుతోంది. ఇవన్నీ ప్రపంచ సగటు 0.74 కిలోల కన్నా ఎక్కువ చెత్తను విసర్జిస్తున్న దేశాలుగా ప్రపంచ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఇండోనేసియాలో ప్రతి పౌరుడు సగటున రోజుకు 0.68 కేజీలు, భారత్‌లో రోజుకు 0.57 కిలోలు, చైనా, పాకిస్తాన్లలో 0.43 కిలోలు, బంగ్లాదేశ్‌లో 0.28 కిలోల చెత్త వదిలేస్తున్నారు. 30 ఏళ్లలో ఎంత? 2030, 2050 నాటికి ఘన వ్యర్థాల ఉత్పత్తి ఎంత ఉంటుందనే అంచనా ప్రపంచబ్యాంకు వేసింది. మనం ఇక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వదులుతున్న వ్యర్థాలకు రెండింతల చెత్త మరో 30 ఏళ్ల తర్వాత బయటపడేస్తామని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. -
ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ భారత్ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని వ్యాఖ్యానించింది. 2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2018–19లో 6.8 శాతం, 2017–18లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైన విషయం గమనార్హం. ‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. -
వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ 7.5శాతం నుంచి 6శాతానికి తగ్గించింది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొనుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్రమక్రమంగా పుంజుకొని వృద్ధి రేటు 6.9శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ గతంలో అంచనా వేసిన విషయం విదితమే. కానీ, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వృద్ధి రేటును బ్యాంక్ తగ్గించిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఆశాజనకంగా లేదని తెలిపింది. ఇటీవల కాలంలో ప్రకటించిన పారిశ్రామిక రాయితీలతో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుంటుందో వేచిచూడాలని పేర్కొంది. గత వారం రేటింగ్ ఏజెన్సీ ప్రకటించిన మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాను 6.2 శాతం నుండి 5.8 శాతానికి తగ్గించింది. అయితే క్షీణించిన వృద్ధి రేటు కారణంగా ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఇబ్బందులను ఎదుర్కోనుందని నివేదిక తెలిపింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం రూ 1.5 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోనుందని తెలిపింది. ప్రభుత్వం ఆర్థక వ్యవస్థ పుంజుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా క్షీణించిన వృద్ధి రేటు ఆందోళన కలిగించే అంశమని నివేదిక స్పష్టం చేసింది. -
భారత్‌తో బంధానికి తహతహ
భారత్ ఒక బిగ్ మార్కెట్. 2018 నాటికి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతవరకు ఆరో స్థానంలో వున్న ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ యేడాది భారత్ ఐదో స్థానానికి చేరుకోగలదని లండన్‌కు చెందిన ఐహెచ్ఎస్ మార్కిట్ లిమిటెడ్ (గ్లోబర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) అంచనా వేస్తోంది. భారత్ 2019–23 మధ్య కాలంలో ఏడాదికి సగటున ఇంచుమించు 7% వృద్ధిరేటు నమోదు చేయగలదని, రానున్న రెండు దశాబ్దాల్లో ఏడాదికి సగటున 75 లక్షల మంది ఆర్థిక కార్యకలాపాల్లోకి ప్రవేశించే అవకాశముందని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5% వృద్ధిరేటు సాధించగలదని ప్రపం చ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించని ప్రభుత్వాలపై వేలెత్తి చూపుతున్నాయి. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారాలని డెమోక్రాట్లు కోరుతున్నారు. బ్రెగ్జిట్‌ను దృష్టిలో వుంచుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేయాలంటోంది యూకే పార్లమెంటరీ నివేదిక. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం భారత్‌తో సంప్రదింపులు జరపడానికి బదులు వివిధ అంశాలకు సంబంధించి ఆ దేశంపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తీసుకువస్తోందనే అభిప్రాయం బలం పుంజుకుంటోందని అంటున్నారు అమెరికా దిగువసభ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు ఇలియట్ ఇంజల్. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకేల్ పాంపియోకు సోమవారం ఆయన లేఖ రాశారు. భారత్ సహా ఆసియాలో పాంపియో జరుపుతున్న పర్యటన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) రద్దు చేయడాన్ని, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదంటూ మన దేశంపై ఆంక్షలు విధించడాన్ని ఈ లేఖ ప్రధానంగా ప్రస్తావించింది. పాంపియో తన భారత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇలియట్ సూచించారు. భారత్ విషయంలో పాలకుల మాటలకు – చేతలకు మధ్య పొంతన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం పట్ల అమెరికా అవలంభిస్తోన్న అస్థిర వైఖరి – దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట ప్రపంచ పోటీలో అంతకంతకూ వృద్ధి చెందుతున్న భారతదేశంతో పోల్చుకుంటే బ్రిటన్ వెనకబడిందని, పెరుగుతున్న భారత్ పలుకుబడికి సరితూగగలిగేలా తన వ్యూహం సరిచేసుకోవడంలో విఫలమయ్యిందని తాజాగా వెలువడిన బ్రిటిష్ పార్లమెంటరీ పరిశీలన నివేదిక పేర్కొంది. ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ : రీఅవేకనింగ్ యూకే – ఇండియా టైస్’ శీర్షికన వెలువడిన ఈ నివేదికను ‘యూకె – ఇండియా వీక్ 2019’ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారతీయ యాత్రికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమైన వీసా, వలస విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక వివరించింది. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా బ్రిటన్ తగిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది. భారత్‌తో తన సంబంధాలను సరిచేసుకునేందుకు ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలను బ్రిటన్ తీసుకోవాలని, ప్రత్యేకించి చదువు – ఉద్యోగం – సందర్శన కోసం భారతీయులు సులభంగా బ్రిటన్ వచ్చేందుకు వీలు కల్పించాలని నివేదిక పేర్కొంది. వీసాల విషయంలో ప్రజాస్వామ్య రహిత చైనా కంటే కఠిన నిబంధనలను బ్రిటన్ అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
వచ్చే మూడేళ్లూ 7.5 శాతమే
వాషింగ్టన్: భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో 2019–20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. ఇదే రేటును తదుపరి మూడేళ్లూ కొనసాగించవచ్చని తెలియజేసింది. పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. పొరుగు దేశం చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని పేర్కొంది. దీంతో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపును కొనసాగించనుంది. 2021 నాటికి భారత వృద్ధి రేటు చైనా 6 శాతం కంటే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మానిటరీ పాలసీ అనుకూలం... ‘‘ఆర్బీఐ లక్ష్యానికి దిగువనే ద్రవ్యోల్బణం ఉండడంతో మరింత సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ మధ్య... ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు అన్నవి రుణాల వృద్ధి బలపడడం వల్ల ప్రయోజనం పొందుతాయి’’ అని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో వివరించింది. పట్టణ ప్రాంత వినియోగానికి రుణాల్లో వృద్ధి పుంజుకోవడం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంత వినియోగానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం ఆటంకంగా విశ్లేషించింది. తయారీ రంగంలో అంతటా బలమైన వృద్ధి ఉన్నట్టు తెలిపింది. సేవల రంగం చల్లబడడానికి ప్రధానంగా వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ రంగాల కార్యకలాపాలు నిదానించడమేనని పేర్కొంది. జీఎస్టీ ఇంకా పూర్తి స్థాయిలో సర్దుకోవాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. -
‘మనోళ్లు రూ 55,000 కోట్లు పంపారు’
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది విదేశాల్లో భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా 79 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 55 వేల కోట్లు పైగా స్వదేశానికి పంపారని ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్ తర్వాత 67 బిలియన్ డాలర్లతో చైనా, 36 బిలియన్ డాలర్లతో మెక్సికో టాప్ 3 స్ధానాల్లో నిలవగా, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్‌లు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. స్వదేశాలకు డబ్బు పంపడంలో భారత్ అగ్రస్ధానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన వలసలు, అభివృద్ధి నివేదిక తెలిపింది. 2016లో భారత్ స్వదేశంలో తమ వారికి చేరవేసిన మొత్తం 62.7 బిలియన్ డాలర్లు కాగా, 2017లో వాటి మొత్తం 65.3 బిలియన్ డాలర్లకు పెరగ్గా 2018లో రెమిటెన్స్‌లు 79 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2018లో భారత్‌కు తరలిన విదేశీ కరెన్సీ 14 శాతం పెరిగిందని, కేరళలో పోటెత్తిన వరదల వల్ల అక్కడి నుంచి వలస వచ్చిన వారు తమ కుటుంబాలకు పెద్దమొత్తంలో సొమ్ము పంపడంతో రెమిటెన్స్‌లు పెరిగాయని ఈ నివేదిక అంచనా వేసింది. -
పెట్టుబడులు, వినియోగమే భారత్‌కు దన్ను!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని, ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు ఆర్థిక సంస్థలతో అంచనాలతో పోల్చితే, ప్రపంచబ్యాంక్ ప్రస్తుత వృద్ధి అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. త్వరలో జరగనున్న ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పింగ్ సమావేశాల నేపథ్యంలో విడుదలైన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018–2019లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా. ఇది మరింత మెరుగుపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ► 2018–19 మొదటి మూడు త్రైమాసిక గణాంకాలను (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే, వృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాతిపదికన ఉంది. సేవల రంగం కొంత తగ్గినా, పారిశ్రామిక వృద్ధిరేటు మాత్రం 7.9 శాతంగా ఉంది. ► వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే. ► డిమాండ్ కోణంలో చూస్తే, దేశీయ వినియోగం వృద్ధి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి ధోరణి కూడా బాగుంది. మూడవ త్రైమాసికంలో చూస్తే, పలు రంగాల్లో సమతౌల్యమైన డిమాండ్, వృద్ధి పరిస్థితులు కనిపించాయి. ► గడిచిన ఆర్థిక సంవత్సరం (2018–19) ద్రవ్యోల్బణం పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్ అకౌంట్ లోటును 1.9%కి (2019–20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4%కి దాటకపోవచ్చు. -
జై మోదీ, ఆలివ్ హెల్త్కేర్లపై ప్రపంచ బ్యాంక్ వేటు
వాషింగ్టన్ : పలు భారతీయ కంపెనీలు, పౌరులపై ప్రపంచ బ్యాంక్ వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌లను ఆయా కంపెనీలు చేపట్టకుండా నిషేధం విధించింది. అవినీతి, మోసాలకు పాల్పడుతున్నందుకు గాను, మొత్తం 78 భారతీయ కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. . ఇకపై ఈ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రపంచ బ్యాంకు తన వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. భారత్‌కు చెందిన ఆలివ్ హెల్త్‌కేర్, జై మోదీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయి. ఆలివ్ హెల్త్‌పై 10 ఏళ్ల ఆరు నెలలు నిషేధం విధించగా.. జై మోదీని ఏడేళ్ల ఆరు నెలలు డిబార్ చేసింది.. అదేవిధంగా భారత్‌కు చెందిన ఏంజెలిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై కూడా నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఈ కంపెనీ ఇథియోపియా, నేపాల్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో పాల్గొంటుంది. ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ అర్జెంటీనా, బంగ్లాదేశ్ దేశాల ప్రాజెక్ట్‌లో ఉంది. ఇక భారత్‌లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై రెండేళ్లు, ఆర్కేడీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. వీటితో పాటు తత్వే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మాక్లోడ్స్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌పై ఏడాది కంటే తక్కువ కాలం నిషేధం విధించింది. ఈ 78 కంపెనీలతో పాటు మరో ఐదు కంపెనీలపై కూడా ఆంక్షలతో కూడిన నిబంధనలు విధించింది. ప్రపంచ బ్యాంక్ ఫండ్ చేసే ప్రాజెక్ట్‌ల్లో ఈ కంపెనీలు అవినీతి, మోసం, కుట్రలు, అవరోధాలకు పాల్పడుతున్నాయని తన నివేదికలో వెల్లడించింది. -
యూఏఈ నుంచి కేరళకు భారీగా రెమిటెన్స్‌లు
న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం యూఏఈ రూ.700 కోట్ల విరాళం ప్రకటించిందని.. దాన్ని కేంద్రం తిరస్కరించిందని.. కానీ అసలు యూఏఈ విరాళమే ప్రకటించలేదని... ఇలా వార్తలు మీద వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వరదల సమయంలో వచ్చిన ఈ విరాళం పక్కన పెడితే, కేరళకు యూఏఈ నుంచి భారీ ఎత్తునే సంపద వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రెమిటెన్స్‌ల రూపంలో. కేరళకు, యూఏఈకు చాలా ఏళ్ల నుంచే అవినాభావం సంబంధం ఉంది. కేరళ నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా యూఏఈలోనే స్థిరపడ్డారు. అక్కడ సేవా రంగంలో కేరళ వారిదే ఆధిపత్యం. కేరళ మైగ్రేషన్ సర్వే రిపోర్టు ప్రకారం 36 లక్షల మందికి పైగా కేరళవాసులు యూఏఈలో నివసిస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో మాత్రమే కాక, అటు ఖతర్‌లోనూ కేరళవాసులు నివసిస్తున్నారు. యూఏఈలో 41.5శాతం, ఖతర్‌లో 8.5 శాతం కేరళవాసులే. దీంతో విదేశాల నుంచి కేరళకు భారీ ఎత్తునే రెమిటెన్స్‌లు వస్తున్నాయి. కేరళకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు రెమిటెన్స్‌లు ఎంతో కీలకం. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్పై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన రిపోర్టులో, 2017లో ఇన్వర్డ్ రెమిటెన్సస్(దేశానికి వస్తున్న చెల్లింపుల్లో)లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉందని వెల్లడైంది. 2017లో దాదాపు 69 బిలియన్ డాలర్లు అంటే రూ.4,82,827 కోట్ల రెమిటెన్స్‌లో భారత్‌కు వచ్చాయి. ఇవే భారత జీడీపీలో 3 శాతంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కూడా కేరళకే వచ్చాయని బిజినెస్ టుడే నివేదించింది. కేరళకు మొత్తం రెమిటెన్స్‌లో 40 శాతం రాగ, ఆ తర్వాత పంజాబ్‌కు 12.7 శాతం, తమిళనాడుకు 12.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 5.4 శాతం రెమిటెన్స్‌లు వచ్చినట్టు తెలిసింది. రీసెర్చ్ పేపర్ ప్రకారం, కేరళకు వచ్చే రెమిటెన్స్‌లు ఆ రాష్ట్ర జీడీపీలో 36 శాతం ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం కేరళకు వచ్చే రెమిటెన్స్‌ల విలువ సుమారు రూ.90వేల కోట్లని తెలిసింది. ఇవన్నీ గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. కేరళ నుంచి వలసపోయి యూఏఈలో నివసించే బ్లూకాలర్ వర్కర్లు, ప్రొఫిషినల్స్ నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక, విదేశాల్లో నివసించే కేరళవాసులు ఎక్కువగా ఇక్కడ బంగారం, భూమిపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రవాస మలయాళీల డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్లకు పైమాటేనని తెలిసింది. రెమిటెన్స్ రూపంలో కేరళ పొందే మొత్తంలో 20 శాతం, బ్యాంక్ అకౌంట్లలోకి డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో వస్తున్నాయని ఆర్బీఐ సర్వే రిపోర్టు కూడా వెల్లడించింది. దేశంలో అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా ఉన్న కేరళకు, అధిక ఆదాయం యూఏఈ, గల్ఫ్ దేశాల నుంచే వచ్చే రెమిటెన్స్‌ల రూపంలోనే వస్తుందని పలు రిపోర్టులు వెల్లడించాయి. అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి ఉన్నప్పటికీ, కేరళ తలసరి ఆదాయం సుమారు 60 శాతం అధికంగా ఉంటుంది. ఇదంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆదాయం మహిమనే అని చెప్పుకోవాలి. -
ఫ్రాన్స్‌ను దాటేసి భారత్ దూసుకుపోయింది!
పారిస్ : ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్, ఫ్రాన్స్‌ను దాటేసింది. ఫ్రాన్స్‌ను అధిగమించి ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. దీంతో ఫ్రాన్స్ ఏడో స్థానానికి పరిమితమైంది. 2017 ప్రపంచం బ్యాంక్ అప్డేటెడ్ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది ముగింపు నాటికి దేశీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.597 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ గణాంకాల్లో తెలిసింది. ఇక ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. పలు త్రైమాసికాల పాటు ఎన్నో ఒడిదుడుకులకు లోనైన దేశీయ ఆర్థిక వ్యవస్థ 2017 జూలై నుంచి పుంజుకుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత్ సుమారు 1.34 బిలియన్ జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా పేరొందిందని, ఫ్రాన్స్‌లో జనాభా శాతం చాలా తక్కువగా 67 మిలియన్లే ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు షాకిస్తూ ప్రభుత్వం తీసుకున్న డీమానిటైజేషన్, 2016 జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ అనంతరం, తయారీ, వినియోగదారుల ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతో కీలక పాత్ర పోషించాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దశాబ్దం వ్యవధిలోనే భారత జీడీపీ రెండింతలు అయిందని తెలిపింది. ఈ ఏడాది కూడా భారత్ 7.4 శాతం వృద్ధిని, 2019లో 7.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ అంచనావేస్తోంది. పన్ను సవరణలు, గృహ వ్యయాలు వృద్ధికి బూస్ట్ ఇస్తున్నాయని తెలిపింది. గతేడాది చివరి వరకు జీడీపీ పరంగా బ్రిటన్, ఫ్రాన్స్‌లను రెండింటినీ భారత్ అధిగమించేసిందని లండన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ కన్సల్టెన్సీ వెల్లడించింది. 2032 వరకు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో అమెరికా టాప్‌లో ఉండగా.. చైనా, జపాన్, జర్మనీలు దాని తర్వాత స్థానంలో ఉన్నాయి.