world number one ranker
-
సినెర్దే షాంఘై మాస్టర్స్ టైటిల్
షాంఘై: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ జానిక్ సినెర్ ఈ ఏడాది టైటిళ్లతో దూసుకెళుతున్నాడు. చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో ఇటాలియన్ స్టార్ ప్లేయర్ వరుస సెట్లలోనే టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు షాకిచ్చాడు. ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 6–3తో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, సెర్బియన్ సూపర్‌స్టార్ జొకొవిచ్‌ను కంగు తినిపించాడు. కేవలం గంటా 37 నిమిషాల్లోనే సినెర్ ఈ టైటిల్ పోరును ముగించడం విశేషం. సినెర్ 8 ఏస్‌లను సంధించి, 22 విన్నర్లు కొట్టాడు. మరోవైపు అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోయిన నొవాక్ 4 ఏస్‌లు, 12 విన్నర్లే కొట్టగలిగాడు. దీంతో కెరీర్లో వందో టైటిల్ సాధించాలన్న సెర్బియన్ ఆశలు ఆవిరయ్యాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఇద్దరే ఆటగాళ్లు అమెరికన్ లెజెండ్ జిమ్మీ కానర్స్ 109, స్విట్జర్లాండ్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెడరర్ 103 టైటిళ్లతో సెంచరీ మార్క్‌ను దాటారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న 23 ఏళ్ల సినెర్ హార్డ్‌కోర్ట్‌లో టాప్–5 ప్లేయర్లపై తన విజయాల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచ టాప్ ఐదు ర్యాంక్ ప్లేయర్లపై 8 సార్లు గెలిచిన సినెర్ కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయాడు. ఐదేళ్ల తర్వాత షాంఘై బరిలోకి దిగిన 37 ఏళ్ల జొకోవిచ్ చివరకు రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో జరిగిన వుహాన్ ఓపెన్‌లో వరుసగా మూడోసారి బెలారస్ స్టార్ అరియాన సబలెంక హ్యాట్రిక్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక 6–3, 7–5, 6–3తో స్థానిక చైనా స్టార్ జెంగ్ కిన్వెన్ను కంగుతినిపించింది. ఈ సీజన్లో బెలారస్ టెన్నిస్ స్టార్కిది నాలుగో టైటిల్. ఆమె గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో ఆ్రస్టేలియన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను కూడా గెలుచుకుంది. -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
'నంబర్ వన్' విజయం.. వెరీ వెరీ స్పెషల్!
లండన్: బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఎవరికైనా గొప్ప విషయమే. అందులోనూ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న తర్వాత గెలిచిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆటగాళ్లకు ప్రత్యేకమే కదా. లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో క్రొయేషియా ప్లేయర్ మారిన్ సిలిక్ పై 6-3, 6-2 తేడాతో విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన గేమ్‌లో రెండు వరుస నెట్లలో ముర్రే పైచేయి సాధించాడు. స్థానిక ఆటగాడు ముర్రేకు మ్యాచ్ ఆసాంతం వీక్షకుల నుంచి మద్దుతు లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ముర్రే మాట్లాడుతూ.. ఈ వాతావరణం తనకెంతో గొప్పగా అనిపించిందన్నాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ గెలుపోటముల రికార్డును ముర్రే 73-9తో మెరుగు పరుచుకున్నాడు. బుధవారం జరగనున్న తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ కీ నిషికోరితో తలపడనున్నాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ముర్రే నెంబర్ ర్యాంకు సాధించగా.. అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య గత వారం ర్యాంకులను వెల్లడించింది. ముర్రే, జొకోవిచ్, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచారు.