YSR Congress Party manifesto
-
వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసి చూపించారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని జగన్ ప్రారంభించారు. లబ్ధిదారులైన న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం ప్రారంభోత్సవంలో ఏపీ బార్‌కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, వైస్ ఛైర్మన్ రామజోగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వర్రావు, ఆర్.మాధవి, బార్‌కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, వి.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ లా నేస్తం వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ లా నేస్తం పథకానికి అర్హులు - జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదైన జూనియర్ న్యాయవాదులు - 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు 1970 మంది జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వైఎస్సార్ లా నేస్తం కింద అర్హులైన 1970 మంది జూనియర్ న్యాయవాదులకు నవంబర్ నెలకు చెల్లించాల్సిన స్టైఫండ్ రూ.98.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జూనియర్ న్యాయవాదికి రూ.5 వేల చొప్పున చెల్లించనున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ చెల్లించేందుకు రూ.5.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక అబద్ధాన్ని తీసుకొని ప్రతిపక్ష టీడీపీ సభలో రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ తీరును మరోసారి తప్పుబట్టారు. పార్టీ మ్యానిఫెస్టోను తాము ఖురాన్, బైబిల్, భగవద్గీత తరహాలో పవిత్రంగా భావిస్తున్నామని, ఈ మ్యానిఫెస్టో తమ ప్రభుత్వంలోని ప్రతి మంత్రి దగ్గర, ప్రతి అధికారి దగ్గర ఉందని, చివరకు గ్రామస్థాయిలోని తమ పార్టీ కార్యకర్తల వద్ద కూడా ఈ మ్యానిఫెస్టో అందుబాటులో ఉందని, ఈ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి లైన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ మ్యానిఫెస్టోను నమ్మి.. తమకు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. మ్యానిఫెస్టోలోని ప్రతి లైన్‌ను తాము తు.చ. తప్పకుండా అమలు చేస్తుండటంతో.. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో, ఆక్రోషంతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతి ఏడాది మే మాసంలో రైతులకు 12,500 రూపాయలు ఇస్తూ.. నాలుగు దఫాల్లో రూ. 50వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి మే మాసం పూర్తి కావడంతో.. నష్టాల్లో ఉన్న రబీ రైతులను ఆదుకోవడానికి వచ్చే ఏడాది మే మాసంలో ఇస్తామన్న వైఎస్సార్ రైతు భరోసాను ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలోని ప్రతి అంశానికి మనసా, వాచా, కర్మణా కట్టుబడి ఉండి అమలుచేస్తున్నామని, అయినా, ప్రజలకు మంచి జరగాలనే ఆలోచన, సభలో సజావుగా చర్చ జరగాలనే ఉద్దేశం టీడీపీకి లేదని, ఇకనైనా టీడీపీ సభ్యులు తమ ధోరణిని మార్చుకోవాలని సూచించారు. సభలో ప్రశ్నోత్తరాలను సజావుగా పూర్తిచేయడానికి సహకరించాలని కోరారు. -
మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలనపై మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. న్యాయపరిశీలన–పారదర్శకత చట్టం–2019 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి... ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి గొప్ప నిర్ణయం.. ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్ యార్డుల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సగం కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే దేవాలయాల కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించాలని నిర్ణయించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించడమే కాకుండా ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్ పనుల్లో 50 శాతం ప్రభుత్వ నామినేషన్ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించే 50 శాతం పనుల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు సగం కేటాయించాలనే నిబంధన విధించారు. నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా కీలక అడుగు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ ప్రాజెక్టుల కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. పరిశ్రమల కోసం భూములు కోల్పోయినవారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు దోహదపడనుంది. నిర్వాసితుల జీవనోపాధికి గ్యారంటీ కల్పించడం కూడా ఈ ముసాయిదా బిల్లులో ముఖ్యాంశం. పరిశ్రమల కోసం ‘వైఎస్సార్ నవోదయం’... సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘‘వైఎస్సార్ నవోదయం’’ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలవారీగా 86,000 ఎంఎస్ఎంఈల ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు చెందిన రూ.4 వేల కోట్ల రుణాలను వన్‌టైమ్ రీ స్ట్రక్చర్ చేయాలని నిర్ణయించారు. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించడంతోపాటు ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పిస్తారు. దీన్ని వినియోగించుకునేందుకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుంది. విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణ బిల్లుకు ఆమోదం రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించనున్నారు. తద్వారా విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్లు ఏర్పాటు అవుతాయి. నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై ఇవి దృష్టి సారిస్తాయి. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియామకం 1993 నాటి బీసీ కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. తద్వారా బీసీ వర్గాల స్థితిగతులపై నిరంతరం అధ్యయానికి వీలు కలుగుతుంది. పలు వర్గాలను బీసీల్లో చేర్చాలంటూ వస్తున్న డిమాండ్లు, కేటగిరీల్లో మార్పులపై వస్తున్న వినతులను కమిషన్ పరిశీలిస్తుంది. బీసీలకు మరో బొనాంజా.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా పాదయాత్రలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నట్లైంది. 200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 15,62,684 మంది ఎస్సీలకు రూ.411 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. లోకాయుక్త చట్ట సవరణ 1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్ జస్టిస్‌లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోవడంతో చాలా సందర్భాల్లో లోకాయుక్త ఖాళీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అర్హతలను సడలిస్తూ హైకోర్టు మాజీ జడ్జిని కూడా నియమించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు వ్యవసాయ మార్కెట్ల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేలను నియమించేందుకు వీలుగా 1966 ఏపీ మార్కెట్ చట్టానికి సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. టీటీడీ ఎక్స్అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ను నియమించేందుకు వీలుగా దేవదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
పెళ్లిలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ
మొన్న బాబు జమానాలో వైద్యం ఎండమావి 1995–2004 మధ్య కాలం ఒక చీకటి యుగం. సామాన్యులకు పెద్ద జబ్బు వస్తే ఆస్తుల మ్ముకోవాలి. అదీ చాలదంటే మరణమే శరణ్యం. ప్రభుత్వాసుపత్రుల్లో సతులు లేక, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేద రోగులు పడిన అగచాట్లు మాటల్లో చెప్పలేనివి. నిన్న వైఎస్సార్ హయాంలో వైద్యానికి భరోసా 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సామాన్యులకు కూడా ప్రభుత్వమే ఉచితంగా వైద్యమందించాలి... అది కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో అంటూ ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టారు. దీంతో సామాన్యులు కూడా సగౌరవంగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ఎంత పెద్ద జబ్బుకైనా ఉచితంగా వైద్యం చేయించుకున్నారు. నేడు 2014లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆరోగ్యశ్రీకి కష్టాలొచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో వైద్యం లేదన్నారు. రేషన్ తీసుకోకపోతే కార్డు తొలగించారు. నిధులివ్వకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం నిరాకరించాయి. ప్రమాదంలో గాయపడితే పట్టించుకునే దిక్కులేరు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కావడంతో పేదలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. చాలా జబ్బులకు ఆరోగ్యశ్రీని తేసేశారు. హైదరాబాద్‌లో కనీసం క్యాన్సర్ ట్రీట్మెంట్కు కూడా అవకాశం లేకుండా పోయింది. రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో పేద రోగులు వైద్యం కోసం తమ జేబునుంచి వ్యయం చేసే అవసరమే ఉండదు. ఎలాంటి జబ్బు చేసినా భయపడే అవకాశం లేదు. పేదవారికే కాకుండా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారందరికీ ఉచిత వైద్యం అందించనున్నారు. వీళ్లందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యమందిస్తారు. సాక్షి, అమరావతి : ఉన్నత స్థాయి వైద్యం, శస్త్రచికిత్సల విషయంలో సామాన్యుడికి, సంపన్నుడికి మధ్య సరిహద్దులను చెరిపేసిన వైద్య విప్లవం ఆరోగ్య శ్రీ. రూ.5 లక్షలు చెల్లించి కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన స్థితిమంతులతోపాటే వ్యవసాయ కూలీకీ ఉచితంగా వైద్యమందించిన స్వర్ణయుగమది. స్వాతంత్య్రానంతరం సామాన్యుడికి ప్రభుత్వమే ఉచిత వైద్య బీమా కల్పించిన చరిత్ర. ఈ విప్లవానికీ, స్వర్ణయుగానికీ, భరోసాకూ అన్నిటికీ మూలం ఆరోగ్యశ్రీ. దీని సృష్టికర్త మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేదల వైద్యానికి నేనున్నాంటూ పెద్దన్నలాగా, పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కరు వైఎస్సార్. ప్రమాదకర జబ్బుతో బాధపడుతూ, పైసా చేతిలో లేక కొట్టుమిట్టాడుతున్న కోట్లాది మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వరప్రసాదిని అయింది. వైఎస్ హయాంలో వచ్చిన ఈ అద్భుత పథకాన్ని దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అమలు చేయడమే ఓ విశేషమైతే, సహజంగా ఉచిత పథకాలను వ్యతిరేకించే ప్రపంచ బ్యాంకు బృందం ఆరోగ్య శ్రీని మెచ్చుకోవడం మరో విశేషం. దీన్నిబట్టి పథకం ఎంతలా ప్రజలకు మేలు చేసిందో అంచనా వేయొచ్చు. వైఎస్ మరణానంతరం పథకానికి పేర్లు మార్చి ఉండవచ్చు, నిర్వీర్యం చేసేలా వ్యవహరించి ఉండవచ్చు... అయినా, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని, మహా నేత గొప్పదనాన్ని చెరిపివేయలేకపోయారు. ఎంతో మందికి అదనపు ప్రయోజనం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఆశయంతోనైతే ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారో.. వాటిని మరింత సమర్థంగా అమలు చేస్తామని, రూ.1000 బిల్లు దాటితే పథకం వర్తింపజేస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ పేద రోగుల్లో మళ్లీ ఆశలు రేపుతోంది. చిన్నచిన్నవి నాలుగు టెస్టులు చేయించుకుంటేనే రూ.2 వేలు బిల్లు దాటే ఈ రోజుల్లో ఆ భారంతో లక్షలాది మంది పేదలు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. రూ.వెయ్యి దాటిన బిల్లులను ఆరోగ్యశ్రీలోకి తెస్తే ఏటా 1.40 లక్షల కుటుంబాలు అదనంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. పెద్ద జబ్బులకు ఇతర రాష్ట్రాల్లోని ఏ నగరంలోనైనా వైద్యం చేయించుకోవచ్చునని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా ఎంతోమందికి ఊపిరి పోయనుంది. కిడ్నీ వ్యాధి పీడితులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ.10 వేలు చేస్తానన్న హామీ జీవితంపై వేలాదిమందికి కొత్త ఆశలు రేపుతోంది. వైఎస్సార్ సీపీ పూర్తి మేనిఫెస్టో వైఎస్ జగన్ భరోసా ఇలా.. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నవారు ఏదైనా వ్యాధికి వైద్యం చేయించుకోవాలంటే ముందుగా అది నిర్ధారణ జరగాలి. అయితే, నిర్ధారణ పరీక్షలు ఆరోగ్య శ్రీ కింద చెయ్యడం లేదు. వైఎస్ జగన్ ప్రకటించిన మేరకు... రూ.వెయ్యి దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీ కిందకు చేరిస్తే సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, వివిధ పరీక్షలు ఉచితం కానున్నాయి. దీనివల్ల చిన్న చిన్న మండల కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ చేయించుకోవచ్చు. ఏపీ పరిధిలోనే కాక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలకూ వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో గాని, నర్సింగ్ హోంలలో గాని ఎక్కడైనా సరే... రోగి ఆరోగ్యశ్రీ కింద చేరితే వైద్యానికి నిరాకరించే అవకాశమే లేకుండా, తక్షణమే సౌకర్యవంతంగా సేవలు అందేలా నిబంధనలు తీసుకురానున్నారు. వైద్యం పూర్తయ్యాక రోగి ఎన్ని రోజులు మందులు వాడాల్సి ఉన్నా.. దానికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రోగి,వారి సహాయకుడికి ఛార్జీలు చెల్లిస్తారు. ఫాలోఅప్ వైద్యం... అంటే క్యాన్సర్ బాధితులకు కీమో థెరపీ, రేడియో థెరపీ వంటి చికిత్సలకు ఎన్నిసార్లైనా ఆ వ్యయం ప్రభుత్వమే భరిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల (తలసేమియా, కిడ్నీ, గుండె జబ్బులు, హెచ్ఐవీ)తో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛను ఇస్తారు. రూ.వెయ్యి బిల్లు దాటినవారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తే... ఏటా సుమారు 1.40 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. పేదలు ఏటా వైద్య పరీక్షల కోసం కనీసం రూ.2 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు అంచనా. రూ.వెయ్యి దాటిన వైద్య ఖర్చులను ఆరోగ్య శ్రీలోకి తెస్తే... ఈ డబ్బంతా వారికి మిగులుతుంది. మహా నేత డా.వైఎస్ఆర్ కాలంలో జరిగినట్లే... మూగ, చెవిటి బాలలు అందరికీ ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయిస్తారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. ఈలోగా వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తారు. రోగి కుటుంబ పోషకుడైతే వారు కోలుకునే వరకు ఆర్థిక సాయం చేస్తారు. శస్త్రచికిత్స పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి సమయంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తారు. వారం, నెల, ఆరు నెలలైనా సరే ప్రభుత్వ సాయం నిరాటంకంగా కొనసాగుతుంది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా భారీగా లబ్ధి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి భారీగా లబ్ధి చేకూరనుంది. నెలకు రూ.40 వేల వేతనం తీసుకునేవారు కూడా పెద్ద జబ్బులు చేస్తే రెండు మూడు లక్షలు వ్యయం చేయాల్సిందే. ఇప్పుడు వాళ్లందరూ గుండెల మీద చేతులేసుకుని హాయిగా ఉండొచ్చు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రాష్ట్రంలో కనిష్టంగా 30 లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. వీళ్లందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడంతో సొంతంగా వైద్యానికి ఖర్చు చేయడం మినహా మరో దారి లేదు. ఇలాంటి వారందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు అందజేస్తారు. వీటి ద్వారా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన వారి తరహాలోనే మన రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఉచిత వైద్యం పొందొచ్చు. కుటుంబ పోషకుడితోపాటు కుటుంబ సభ్యులందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. హెల్త్‌కార్డుతో ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనైనా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా వైద్యం చేసి ఇంటికి పంపే వరకూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రిదే. చాలామంది తెల్లరేషన్ కార్డు పరిధిలో లేని వారు అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు పెద్ద జబ్బు చేస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక పోతున్నారు. ఆ వర్గం కూడా ఇప్పుడు ఆనందంగా ఉంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.5 లక్షలు లోపు వార్షికాదాయం ఉన్నా వారికి ఉచితంగా వైద్యమందిస్తానని చెప్పారు. వీళ్లందరికీ యూనివర్సల్ హెల్త్‌కార్డులు ఇచ్చి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని చెప్పారు. దీంతో మధ్యతరగతి వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం పరిధిలోకి సుమారు 30 లక్షల మంది పైనే వస్తారని అంచనా. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వారి లాగే వీళ్లు కూడా హెల్త్ కార్డు చూపించి ఏ రాష్ట్రంలో ఉన్న పెద్దాసు పత్రుల్లోనైనా వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించడంతో వారికి భరోసా ఇచ్చినట్టయింది. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి వాటికి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి.తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో చేర్చిన ఈ పథకంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు కూడా జేబులో నుంచి నయాపైసా వ్యయం చేయకుండా వైద్యం చేయించుకునే అవకాశం వస్తుంది. టీబీ వస్తే ఆరోగ్యశ్రీ లేదా సారూ.. నా వయస్సు 48. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. నాకు మూడేళ్ల కిత్రం క్షయ (టీబీ) వ్యాధి సోకింది. దగ్గు, జ్వరం తగ్గకపోవడంతో వైద్యం కోసం కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలకు వెళ్తే రూ.10 వేలు అడిగారు. ఆరోగ్య శ్రీ కార్డు చూపిస్తే చెల్లదన్నారు. దీంతో నా దగ్గర ఉన్న రూ.6 వేలకు రూ.4 వేలు అప్పు చేసి పరీక్షలు చేయించుకున్నా. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా ఫలితం దక్కలేదు. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నా. ఇప్పటికి రూ.40 వేలైంది. పిల్లల చదువు, కుటుంబ పోషణ,నా వైద్య ఖర్చులతో పరిస్థితి దయనీయంగా ఉంది. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయితే మా కష్టాలు తీరతాయని ఆశిస్తున్నా. –ఎం.మన్సూర్, పెద్దమర్రివీడు,గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా (ఈయన సాక్షితో మాట్లాడిన రెండ్రోజుల తర్వాత... తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు) డయాలసిస్ మాత్రమే అందుతోంది మాది నిరుపేద కుటుంబం. కొబ్బరి కాయలు వలిచే కార్మికుడిని. నాకు ముగ్గురు కొడుకులు, కొంతకాలం క్రితం నా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. నా భార్య కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఆపరేషన్‌కు రూ.4 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్థిక స్తోమతలేదు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో మూడు నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నా. వారానికి మూడుసార్లు కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి వెళ్లాలి. తోడుగా వచ్చే నా భార్యకు ఇద్దరికీ రూ.700 ఖర్చు అవుతోంది. ఇంజక్షన్లు, మందులకు ప్రతిసారి రూ.2 వేలు అవుతోంది. ఆరోగ్య శ్రీ పథకంలో కేవలం డయాలసిస్ మాత్రమే చేస్తున్నారు. మిగతా ఖర్చంతా నేనే భరించాల్సి వస్తుంది. పింఛన్ వస్తున్నా అది సరిపోవడం లేదు. కిడ్నీ బాధితులకు జగన్ నెలకి రూ.10 వేలు పింఛను ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషం. – మంచిగంటి తాతారావు, దేవగుప్తం, అల్లవరం మండలం కిడ్నీవ్యాధి బాధితులకు ఒక భరోసా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న మాకు భరోసా వచ్చింది. నెలకు రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. రూ.10 వేలు ఇస్తానన్న వైఎస్ జగన్ హామీతో మాలాంటివారికి ధైర్యంగా బతకగలమనే నమ్మకం వచ్చింది. ఎవరినీ పైసా అడగకుండా రూ.10 వేల పెన్షన్‌తో మా బతుకు మేం బతకగలం. – బొనియల ఎల్లమ్మ, కిడ్నీ వ్యాధి బాధితురాలు, వజ్రపుకొత్తూరు,శ్రీకాకుళం జిల్లా -
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం మైనార్టీలు
-
శ్రీకాళహస్తి రోడ్ షోలో వైఎస్ విజయమ్మ
-
మీ ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష: విజయమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. అయిదేళ్ల తర్వాత ఆయనకు రైతు సంక్షేమం గుర్తుకు వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు పెద్దన్నయ్య అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంతకాలం ఏం చేశాడన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు దశల్లో మీ తమ్ముడు జగన్ మాఫీ చేస్తాడని హామీ ఇస్తున్నానని విజయమ్మ తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని, ఆయన పాలనను మళ్లీ వైఎస్ జగన్ అందిస్తాడని అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసిన జగన్.. మీ సంక్షేమం చూసుకుంటాడని, ప్రజలు చూపుతున్న ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష అని అన్నారు. అంత పెద్ద ప్రమాదం నుంచి జగన్ బాబు బయట పడ్డాడని, ప్రజల ప్రార్థనలే తన బిడ్డను రక్షించాయని విజయమ్మ పేర్కొన్నారు. మన్నవరం ప్రాజెక్టు ఆరువేల కోట్లతో ఈ ప్రాంతంలో ఏర్పాటు కోసం వైఎస్సార్ కృషి చేశారని, దాన్ని కాపాడుకోలేని చేతకానీ ప్రభుత్వానిదనీ దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వ సహకార రంగంలో ఉన్న చక్కెర, పాల డైరీలు మూయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఏర్పేడు ఇసుక మాఫియా ఘటన దేశాన్నే కుదిపేసిందని, 17 మంది ప్రాణాలు కోల్పోయారని వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు బరి తెగించి ఇసుక దందా చేస్తున్న చర్యలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయం ద్వారా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తారని, ఏ ఫ్యాక్టరీ పెట్టినా స్థానికులకే మొదట ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించడమే కాకుండా, గాజుల మాండ్యం షుగర్ ఫ్యాక్టరీ, విజయ డైరీ తెరిపించుకుందామని విజయమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగన్ అనే నేను హామీ ఇస్తున్నా
మాట తప్పని,మడమ తిప్పని నేతగా ప్రజల మన్ననలు అందుకుంటున్న జననేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో–2019లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. పేదరికాన్ని పారదోలి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటన పరుగులు పెట్టించి నవ శకానికి నాందిపలికేలా.. మేనిఫెస్టోలో వైఎస్ జగన్ తన దార్శనికతను ఆవిష్కరించారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గం సంక్షేమం కోసం కృషి చేసి.. సమసమాజ స్థాపనకు పాటుపడతామన్నారు. ప్రత్యేక హోదా సాధించి.. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తామని ప్రకటించి.. లక్షల మంది యువత ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మొత్తమ్మీద వైఎస్సార్సీపీ మేనిఫెస్టో నిర్మాణాత్మకంగా, ఆచరణ సాధ్యంగా, అన్ని వర్గాల ప్రజల మేలు కోరేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది!! వైఎస్సార్ రైతు భరోసా ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు అందిస్తాం. పంట వేసే సమయానికి అంటే ప్రతి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు.. రైతులకు ఉచితంగా బోర్లు.. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు పంట వేసేముందే పంట ధర ప్రకటన.గిట్టుబాటు ధరకు గ్యారెంటీ. రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు సహకార డెయిరీకి పాలుపోసే పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చేస్తాం, టోల్ టాక్స్ రద్దు చేస్తాం ఆక్వారైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కే ఇస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. ఉజ్జాయింపుగా సంవత్సరానికి రూ.12,500 –లక్ష వరకూ ప్రయోజనం (12,500 + ఉచిత బోర్లు + ఉచిత విద్యుత్ + 0 వడ్డీ సొమ్ము+ ట్రాక్టర్ల రోడ్ ట్యాక్స్) అందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై) ఆరోగ్యశ్రీ వర్తింపు అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యా«ధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల పింఛన్ నెల నెలా ఇస్తాం ఆరోగ్య శ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రాలు(ఫోటోలు) మీ ముందుంచుతాం. రెండేళ్ల తర్వాత ఆ ఆసుపత్రి దశ దిశ మార్చి మారిన ముఖచిత్రాలు మీకు చూపిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పెంచుతాం. ఉజ్జాయింపుగా సంవత్సరానికి రూ.1లక్ష– 10 లక్షలు ప్రయోజనం అమ్మ ఒడి పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి ఏడాదికి రూ.15,000 ఇస్తాం. ఏడాదికి కుటుంబానికి రూ.15,000 లబ్ధి వైఎస్సార్ చేయూత వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం 45 నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. ప్రతి కుటుంబానికి చేకూరే ప్రయోజనం రూ.75,000 పింఛన్ల పెంపు ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం అవ్వా తాతల పింఛన్ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతాం వికలాంగులకు పింఛన్ రూ.3,000 ఇస్తాం ప్రతి కుటుంబానికి ఉజ్జాయింపుగా సంవత్సరానికి ప్రయోజనం రూ. 36,000 - 72,000 ఫీజు రీయింబర్స్మెంట్ పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం పూర్తి ఫీజురీయింబర్స్మెంట్పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20వేలు ప్రతి విద్యార్థికి ఇస్తాం ఉజ్జాయింపుగా రూ.1లక్ష– రూ.1,50,000 ప్రయోజనం (ఫీజు ఎంతైతే అంతా+రూ.20,000) వైఎస్సార్ జలయజ్ఞం దివంగత మహానేత వైఎస్సార్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తాం పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం రక్షిత మంచి నీరు– సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జల కళను తీసుకొస్తాం లక్షలాది రైతు కుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి పేదలందరికీ ఇళ్లు ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్లు కట్టిస్తాం ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇళ్లు కూడా కట్టిస్తాం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లె్లమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీదా పావలా వడ్డీకే రుణం ఇచ్చేట్టుగా బ్యాంక్‌లతో మాట్లాడుతాం ఉజ్జాయింపుగా రూ.2లక్షల–రూ.5 లక్షల ప్రయోజనం యువత–ఉపాధి ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. హోదా సాధించే వరకు దీనిని కొనసాగిస్తూనే ఉంటాం. హోదాను తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా అదే ఊరికి చెందిన 10 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము. దీంతోపాటు ప్రతి గ్రామంలో, వార్డులో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ/యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా, వార్డు వాలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి తమ పరిధిలోని 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటిలో భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్సార్ రైతు భరోసా నుంచి వైఎస్సార్ రైతు చేయూత వరకు అన్ని పథకాలు ఇంటి వద్దకే అందేలా ‘డోర్ డెలివరీ’ చేస్తారు. వీరికి ఇంతకంటే మంచి ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చేవరకు సేవా దృక్పథంతో గ్రామంలో, వార్డులో ఆయా సచివాలయాలతో అనుసంధానమై సేవలు అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, పింఛను, రేషన్ తదితరాలకు సంబంధించిన సమస్యలేవైనా 72 గంటల వ్యవధిలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా, వారికి ఏ రకమైన నైపుణ్యాలు కావాలి? అన్న విషయాల మీద, వారిని కూడా భాగస్వాములను చేస్తూ, ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మన పిల్లలకు ఉచితంగా శిక్షణ (ట్రైనింగ్) ఇప్పిస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో... బస్సులు, కార్లుఅద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరత్రా ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్టులు అన్నీ నిరుద్యోగ యువతకే ఇచ్చేలా చట్టం తెస్తాం. అంతేకాక వారికి తోడుగా ఉండేందుకు, వారు కార్లు కాని, బస్సులు కాని ఇతరత్రా వాహనాలు, పరికరాలు కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. అంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు 50 శాతం రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. ఖాళీగా ఉన్న 2.30 లక్షలు ఉద్యోగాల భర్తీ గ్రామ సచివాలయాల్లో 1.60 లక్షలు ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లు 3.50 లక్షల మంది వైఎస్సార్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెళ్లకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం. అంతేకాక మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును అక్కచెల్లెళ్ల తరఫున (ప్రభుత్వమే) బ్యాంకులకు మేమే కడతాం. ఉజ్జాయింపుగా ఏడాదికి రూ.50 వేలు మద్యపాన నిషేధం మద్యం సంసారాల్లో చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం కౌలు రైతులు భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్లుగా (11 నెలలకు మించకుండా) రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, ప్రయోజనాలు వారికే అందేలా చేస్తాం. అంతేకాక నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా, పంట బీమా దగ్గరనుంచి వడ్డీ లేని రుణాల వరకు, 9 గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా రూ.7 లక్షలు దాకా, ఇలా ప్రతి అంశాన్ని కౌలు రైతులందరికీ వర్తింపజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే రూ.12,500 పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా ఇస్తాం. సుపరిపాలన కుల, వర్గ, మతతత్వాలు లేని సమ సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ ‘‘సమగ్ర రీ సర్వే’’ చేయించి భూయజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలుగజేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం రాజధానిని ఫ్రీ జోన్ గా (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా) గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ‘గ్రామ సచివాలయాలు’ పట్టణాలలో ‘వార్డు సచివాలయాలు’ ఏర్పాటు చేసి గ్రామ, ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకుపోయేలా పనిచేస్తాం. అంతేకాదు లంచాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్‌తో డోర్ డెలివరీ చేయిస్తాం. బీసీ సంక్షేమం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ఏటా రూ.10 వేల కోట్లతో ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వైఎస్సార్సీపీ బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి రూ.15 వేల కోట్ల చొప్పున ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవులు (దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డు కమిటీలు, కార్పొరేషన్లు తదితర) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాక ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్, కాంట్రాక్టు పన్నుల్లో కూడా 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్సార్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మల వివాహానికి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ.35 వేలను పెంచి ‘వైఎస్సార్ పెళ్లి కానుక’గా రూ.50 వేలు ఇస్తాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్ట సభల్లో అవకాశం కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జన గణన చేసి చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కులం సర్టిఫికెట్ దగ్గరనుంచి గ్రూపుల మార్పిడి వరకు, ఎంబీసీల వ్యవహారమైతేనేమీ రోజువారీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటన్నింటినీ పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా, పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ, కేంద్ర పరిధిలోని అంశాలైతే, ఆ కమిషన్ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి తీర్మానం చేసి పంపుతాం. బీసీ కులాలకు చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం. కాపు సంక్షేమం దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు తరహాలో మన రాష్ట్రంలో కాపు సోదరులు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఉన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. అయినా, టీడీపీ తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరిత హామీ ఇచ్చింది. మన పరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ, అంతకుమించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెటేచర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్సార్సీపీ వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటినుంచి చెబుతున్నట్టే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా, సంవత్సరానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.1,340 కోట్లు కేటాయించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు కలిపి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. వాటిని ఖర్చు చేస్తాం. మత్స్యకారులు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో (ఏప్రిల్ 15–జూన్14) ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం. మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్‌పై ఇచ్చే సబ్సిడీని, డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడే చేతికి అందేట్లుగా అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. అగ్రిగోల్డ్ చెప్పినమాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి, తద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగిలినవారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం. పట్టణ గృహ నిర్మాణం టీడీపీ హయాంలో పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 300 అడుగుల ఒక్కో ఇంటిని అడుగుకు రూ.2 వేల చొప్పున పేదవారికి అమ్మారు. ఇందులో రూ.3 లక్షలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని, ఆ అప్పు భారాన్ని 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు చొప్పున తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారాన్ని రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. యాదవులు తిరుమలలో శ్రీవారి గర్భగుడి తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాం. గొర్రెల కాపరులకు... చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేలు బీమాగా అందిస్తాం. ఆటో/ట్యాక్సీ సొంత ఆటో/ట్యాక్సీ నడిపేవారికి ఇన్యూరెన్స్, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం. జీవన బీమా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం ద్వారా రూ.1 లక్ష అందిస్తాం. అగ్ర కులాల సంక్షేమం అన్ని అగ్ర కులాల (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర) వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు. ఈ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్ పిరియడ్‌లో ప్రతి నెల రూ.5 వేలు స్టైఫండ్ ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమ నిధి (వెల్ఫేర్ ఫండ్) కోసం రూ.100 కోట్లు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు ఇస్తాం. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలర్ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. వారికి తోడుగా ఉంటాం. ఆర్య వైశ్యులు ఆర్య వైశ్యలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆర్య వైశ్య సత్రాలను నడిపే హక్కును వారికే ఇస్తాం. కుల వృత్తిదారులు..చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం రోజుకు 2 వేల నుంచి 3 వేల రూపాయిలను రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీకి తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్న కుల వృత్తిదారులు, చిరు వ్యాపారుల (ఫుట్‌పాత్ మీద సామాన్లు అమ్ముకునేవారు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, టిఫిన్లు అమ్ముకునేవారు తదితరులు)కు గుర్తింపు కార్డులిచ్చి, రూ.10 వేలను సున్నా వడ్డీకే ఇస్తాం. ఈ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. విద్యనైపుణ్య శిక్షణ అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాల (ఫొటోలను)ను మీ ముందుంచుతాం. రెండేళ్లలో వాటి దశ, దిశ మార్చి మారిన చిత్రాలను మళ్లీ మీకు చూపిస్తాం. సూళ్లల్లో చదువుల ప్రమాణాలు మారుస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదివేలా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచుతాం. టీచర్ల భర్తీని పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పుతున్న కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్‌గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలు పెంచుతాం. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రయివేటు టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ, తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం ఎస్సీలకు మూడు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. (మాదిగలకు, మాలలకు, రెల్లి తదితర కులాలకు) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, చెల్లెమ్మల వివాహానికి ‘వైఎస్ఆర్ పెళ్లి కానుక’గా రూ.1 లక్ష ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేదా సంవత్సరానికి రూ.6 వేలు నేరుగా చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్శిటీ, మెడికల్‌కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం. పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఎస్సీ కాని, ఎస్టీ కాని ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములకు పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. ఇలా తీసుకునే భూములకు, పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ చేస్తాం. హిందూ ఆలయాలు అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తాం. 6సి దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీవోలో సూచించిన వేతనం కంటే అదనంగా 25 శాతం జీతాలు పెంచుతాం. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు ఇస్తాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం. ముస్లిం మైనారిటీలు మైనారిటీల సబ్ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు. వక్ఫ్ బోర్డ్, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన స్థిర–చర ఆస్తులను రీ సర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ, స్థిర ఆస్తులను డిజిటలైజ్ చేయించి, ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్సార్ కానుకగా రూ.లక్ష ఇస్తాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తాం. ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం. మసీదులో ఇమామ్‌లు, మౌజామ్లకు గౌరవ వేతనం కోసం నెలకు రూ.15 వేలు ఇస్తాం. ముస్లిం మైనారిటీకి చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం. క్రిస్టియన్ మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా రూ.లక్ష ఇస్తాం. పాస్టర్లకు వివాహ రిజిస్ట్రార్ లైసెన్స్ పద్ధతిని సులభం చేస్తాం. పాస్టర్లకు రూ.5 వేలు తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సాయం చేస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇళ్లు కట్టిస్తాం. క్రిస్టియన్ మైనారిటీకి చెందినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తాం. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం. తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలుగా ఇస్తున్న రాయితీలకు తోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్బిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. జర్నలిస్టులు జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇస్తాం. అంతేకాదు సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం సమాన పనికి–సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్ సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాం పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తాం సైనికులు,మాజీ సైనికులు.. చట్టం వారికి కల్పించిన రాయితీలు/హక్కులు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవమిస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి.. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం అంగన్వాడీ , ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు, తెలంగాణ ఇస్తున్న జీతాల కన్నా రూ.1,000 ఎక్కువ ఇచ్చి... వారి పరిస్థితి మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న వి.ఓ.ఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాలు రూ.10,000 పెంచుతాం. వారి సమస్యలు పరిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. -
అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో
-
ప్రజల మనసు గెలిచిన మేనిఫెస్టో
మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని వైఎస్ జగన్ విశ్వసిస్తారు. మేనిఫెస్టో అంటే.. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రకటన కాదన్నది ఆయన విధానం. మేనిఫెస్టో పారదర్శకంగా, సరళంగా, వీలైనంత క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఆయన భావన. మేనిఫెస్టోను ప్రజలకు అందుబాటులో ఉంచి.. వాటి అమలుకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఐదేళ్ల పాలన తర్వాత.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇదిగో అమలు చేశామని చెప్పి.. మళ్లీ ప్రజల ఓట్లు అడుగుతామని స్పష్టంచేశారు. అందుకు తగ్గట్లుగానే అంశాలవారీగా స్పష్టంగా, క్లుప్తంగా ఫొటోలతో సహా రెండు పేజీల్లో వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందుంచారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ విప్లవానికి వైఎస్సార్సీపీ నాంది పలికింది. విశ్వసనీయతకు మారుపేరైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. శీర్షికన ఉగాది పర్వదినాన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో–2019 ప్రకటించారు. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రగతిలో సరికొత్త అధ్యాయం లిఖించే దిశగా ముందడుగు వేశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో ఇదీ.. రానున్న ఐదేళ్లలో ప్రజాసంక్షేమానికి నాదీ భరోసా...రాష్ట్ర ప్రగతికి పూచీ నాది’అంటూ.. వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం ఉదయం విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే తమకు పవిత్ర గ్రంథమని పునరుద్ఘాటిస్తూ.. అందులో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలన తరువాత మేనిఫెస్టో హామీలను నెరవేర్చిన తరువాతే.. మళ్లీ ప్రజల తీర్పు కోరుతామని తేల్చిచెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ పార్టీ ఇంత పారదర్శకంగా, సరళంగా, స్పష్టంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం ఇదే తొలిసారి. సాక్షి, అమరావతి : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా తమ విస్పష్టమైన ప్రణాళికను మేనిఫెస్టో ద్వారా వైఎస్ జగన్ ఆవిష్కరించారు. రాజన్న రాజ్యం–రైతన్న రాజ్యం దిశగా.. ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాతలపై వైఎస్సార్ కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న పథకాలను ప్రకటించారు. రైతులు, కౌలు రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, చేనేతల సంక్షేమానికి నిర్మాణాత్మకమైన హామీలిచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, కాపులు, యాదవులు, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు, నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు, చిరువ్యాపారులతోపాటు క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అగ్రిగోల్డ్ బాధితులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ పెద్దపీట వేసింది. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి కనీసం రూ.1 లక్ష నుంచి రూ.5లక్షల వరకూ.. లబ్ధి చేకూరేలా ఆ పార్టీ ప్రణాళిక రూపొందించింది. ప్రజల నుంచి పుట్టిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుకు ప్రతీకగా వైఎస్ జగన్ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే ఏదో ఏసీ గదుల్లో కూర్చొని రాసింది కాదు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ రూపొందించిన ప్రమాణ పత్రం ఇది. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ కూడా ప్రజల నుంచి తీసుకున్నవే. ఓ రాజకీయ నాయకుడు ప్రజలకు ఓ మాట ఇచ్చాక ఆ మాటకు కట్టుబడి ఉండాలన్నది జగన్ నిబద్దత. మైక్‌పట్టుకుని ఓ విధానాన్ని ప్రకటించాక దాన్ని ఆచరణలో చేసి చూపించాలన్నది తీరాలన్నది ఆయన సిద్ధాంతం. మేనిఫెస్టోలో ప్రకటించాక ఆ హామీని కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నది ఆయన దృక్పథం. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ దశాబ్దకాలంగా ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం సాగించారు. ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యలను ఆయన చాలా దగ్గర నుంచి చూశారు. తద్వారా అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నదానిపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఆ ప్రాతిపదికనే రెండేళ్ల క్రితం విజయవాడలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాల పథకాలను వెల్లడించారు. తన చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దాంతోపాటు పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టనష్టాలు, సమస్యలు విన్నారు. ప్రజల ఆవేదన, రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా అవగతం చేసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించేలా తమ మేనిఫెస్టో ఉండాలని భావించారు. అందుకే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టో కమిటీని రూపొందించారు. వివిధ అంశాలపై శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక, సామాజికరంగాల నిపుణుల సలహాలు,సూచనలు తీసుకున్నారు. అనంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేలా 2019 ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఉన్నాను అంటూ శాస్త్రీయమైన, హేతుబద్ధమైన అన్నింటికీ మించీ మానవీయతతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోను తమ పవిత్ర గ్రంథంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలోని అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిపాలన కొనసాగిస్తానని ఆయన స్పష్టంచేశారు. మేనిఫెస్టోను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ వైఎస్ జగన్ ప్రజలకూ రాష్ట్రానికి భరోసా ఇచ్చారు. సమసమాజ నిర్మాణానికి దిక్సూచి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా మానవీయత, ప్రగతికాముకతో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను రూపొందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల కష్టాలు తీర్చి.. రాష్ట్రాన్ని ప్రగతిబాటలో పరుగులు పెట్టించేందుకు రోడ్‌మ్యాప్‌గా మేనిఫెస్టోను రూపొందించారు. మొత్తం 35 అంశాల కింద తమ ప్రణాళికను ఆవిష్కరించారు. రైతులు–వ్యవసాయనికి పెద్దపీట వేస్తూ 14హామీలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని విస్పష్టమైన హామీతోపాటు జలయజ్ఞం కింద రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ–ఎస్టీ సంక్షేమం కింద 11 అంశాలు..బీసీ సంక్షేమం కింద 8 అంశాలకు సంబంధించి హామీలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ అక్కలకు ఏడాది తరువాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75వేలు ఉచితంగా ఇస్తామన్నారు. అవ్వాతాతల సంక్షేమం కోసం మనవడిగా జగన్ ముందుకొచ్చారు.పింఛన్ అర్హత వయసును 65ఏళ్ల నుంచి 60ఏళ్లకు తగ్గించడంతోపాటు పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతామన్నారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం ఉద్యోగులపట్ల వైఎస్ జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 27శాతం ఐఆర్ ఇస్తామని చెప్పడంతోపాటు ఏకంగా 10హామీలు ఇవ్వడంపట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా సాధించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని వైఎస్సార్సీపీ తమ విజన్‌ను ఆవిష్కరించింది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి హేతుబద్ధమైన పరిష్కార మార్గాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. తక్షణం రూ.1,150 కోట్లు విడుదల చేసి 13లక్షల మందికి మేలు చేస్తామన్నారు. మిగిలినవారి సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని న్యాయవాదులు, ఆటో/ట్యాక్సీ కార్మికులు, టైలర్లు... ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టో సాక్షిగా వెల్లడించింది. కుటుంబాల్లో కలతలుపెడుతూ మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న మద్యం మహమ్మారిని మూడు దశల్లో నిషేధించి.. మద్యం విక్రయాలను స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం విశేషం. -
ఎన్నికల పరీక్షలో చూసిరాతలు
సాక్షి, అమరావతి: 40 ఏళ్ల రాజకీయ అనుభవం, దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి నానా అవస్థలు పడడం చూసి టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయకుండా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూడడం ఆయనలోని అభద్రతా భావాన్ని, ఓటమి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని చూసి టీడీపీ మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు చేయడంపై సొంత పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పైకి బీరాలు పోతూ, ప్రగ ల్భాలు పలుకుతూ పక్క పార్టీ మేని ఫెస్టోలోకి తొంగిచూడడం దౌర్భాగ్యమని టీడీపీ సీనియర్ నాయకులే వాపోతున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని టీడీపీ మేనిఫెస్టో కమిటీ 10 రోజుల క్రితమే దాన్ని తయారు చేసి ఇచ్చినా చంద్రబాబు విడుదల చేయలేదు. జగన్ మోహన్‌రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అందులోని అంశాలను కాపీ కొట్టాలన్న ఉద్దేశం తో పదిరోజులు ఆగారు. ఉగాది రోజున వైఎస్సా ర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించి ముహూర్తం కూడా ప్రకటించడంతో అదేరోజు తాము కూడా మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు అనుకూల మీడియాకు లీకులి చ్చింది. కానీ, కచ్చితమైన సమయం మాత్రం చెప్పలేదు. శనివారం ఉదయం 10.30 గంటలకు జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసే వర కూ తమ మేనిఫెస్టో ఏ సమయంలో విడుదల చేసేదీ చెప్పకుండా కాసేపట్లో.. కాసేపట్లో అం టూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సా ర్సీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత 11 గంటల సమయంలో టీడీపీ మీడియా విభాగం స్పందిం చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్ర బాబు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలి పింది. అప్పటివరకూ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను చంద్రబాబు ఉండ వల్లిలోని తన నివాసంలో కూర్చొని చూస్తూ గడిపారు. అనంతరం ఉగాది వేడుకల్లో పాల్గొని పావు గంటలో మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పి లోపలికి వెళ్లిన ఆయన గంట తర్వాత బయటకు వచ్చారు. అప్పటివరకూ వైఎస్సా ర్సీపీ మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలించి, దాని ప్రకారం తమ మేనిఫెస్టోలో పలు మార్పు లు చేయడం గమనార్హం. విలేకరులకు టీడీపీ మేనిఫెస్టో కాపీని సైతం ఇవ్వలేకపోవడాన్ని బట్టి చూస్తే అందులో మార్పులు చేసినట్లు స్పష్టమైం ది. తమ మేనిఫెస్టోలో కొన్ని మార్పులున్నా యని, కొద్దిసేపట్లో ఇస్తామని టీడీపీ నేతలు చెప్పడం గమనార్హం. టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత కూడా మీడి యా విభా గం బయటకు రానివ్వలేదు. రాత్రి 8 గంటల వరకూ పలు మార్లు రివై జ్డ్ వెర్షన్లను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికప్పుడు కాపీ కొట్టినవి ఇవే.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను చూసి అప్పటికప్పు డు టీడీపీ మేనిఫెస్టోలో మార్పులు చేశారు. య నమల రామకృష్ణుడు రూపొందించిన మేనిఫె స్టోకి, చంద్రబాబు విడుదల చేసిన మేనిఫె స్టోలోని అంశాలకు చాలా తేడాలున్నాయి. రైతు లందరికీ వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామనే అంశాన్ని ఆఖరి నిమిషంలో చేర్చారు. అలాగే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పేద యువతుల పెళ్లి కోసం రూ.లక్ష ఇస్తామని చెప్పగా, చంద్రన్న పెళ్లి కానుకను రూ.లక్షకు పెంచుతున్నట్లు టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు. తొలుత మాది గల గురించి పట్టించుకోని చంద్రబాబు వైఎస్సా ర్‌సీపీని చూసి మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న రూ.4 వేల పరిహారం రూ.10 వేలకు పెంపు, ప్రతి సంవత్సరం ఉద్యోగాల రిక్రూట్మెంట్ క్యాలండర్, పరిశ్రమల్లో లభించే ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే కేటాయింపు, పక్కా ఇళ్ల నిర్మా ణానికి సంబంధించి లబ్ధిదారులు తీసుకున్న బ్యాంకు రుణాల మాఫీ, అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వడం, పౌరులం దరినీ యూనివర్సల్ హెల్త్ కేర్ కిందకు తీసుకురావడం, ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిం చడం, పిల్లలను బడికి పంపే మహిళలకు ‘అమ్మ ఒడి’ వంటి అంశాలన్నీ వైఎస్సార్సీపీ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టినవే. -
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేసిన పులివెందుల ప్రజలు
-
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేసిన కర్నూలు ప్రజలు
-
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై ఆనంద వ్యక్తం చేసిన అనంత వాసులు
-
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేసిన బాహ్మణులు
-
చంద్రబాబు మోసం చేశారిలా...
-
కొత్త అధ్యాయానికి నాంది
-
‘వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఏ ఒక్కరిని వదలలేదు’
సాక్షి, అమరావతి : సమగ్రంగా.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే మేనిఫెస్టో రావడం హర్షదాయకం అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వడం.. ఆయా సామాజిక వర్గాల శాశ్వత అభివృద్ధికి తోడ్పడేలా మేనిఫెస్టో రూపొందడం నిజంగా చాలా మంచి పరిణామమన్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఏ ఒక్కరిని వదల లేదని.. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ముఖ్యంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి సామాన్యులకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఏపీలోని ప్రతి ఒక్కరు జగన్ ఆధ్వర్యంలో సౌకర్యంగా.. సంతోషంగా.. ధైర్యంగా బతకొచ్చు అనే ధీమా కల్పించిందన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న మధ్యతరగతి ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కార్డ్ ఇస్తాననడం పట్ల సామాన్యులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నోటిఫికేషన్లు లేవు.. ఉద్యోగాలు లేవని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తి చేయడమే కాక ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తానని చెప్పడంతో నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చినట్లయిందని తెలిపారు. గ్రామ సచివాలయం తీసుకోస్తాననడం వల్ల మహాత్మ గాంధీ కలలు కన్నా భారతం సాకరమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లాగా వీటిలో లంచాలు మింగడం ఉండబోదని స్పష్టం చేశారు. చేతివృత్తులకు కార్పొరేషన్లు ఉండటం వల్ల గ్రామాలకు జీవ కళ వస్తుందని... పల్లెల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి సొంత ప్రాంతానికి వస్తారని తెలిపారు. మేనిఫెస్టో వైఎస్సార్సీపీ నాయకులకు శిరోధార్యమని.. దీన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం రాజేశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. జగన్ 4 అడుగులు ముందుకు వేశారని తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైఎస్సార్ చేయూత పథకం
-
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల..
-
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం
-
ప్రతి తండాను గూడెంను పంచాయతీగా మారుస్తాం
-
మేనిఫెస్టో హామీలకు జవాబుదారీగా ఉంటా
-
అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు కేటాయిస్తాం