సినీఫక్కీలో చోరీ.. | - | Sakshi
Sakshi News home page

సినీఫక్కీలో చోరీ..

Published Fri, Jun 28 2024 2:58 AM | Last Updated on Fri, Jun 28 2024 2:29 PM

సినీఫక్కీలో చోరీ

ఆదిలాబాద్‌: మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ బంగారం దుకాణంలో గురువారం సినీఫక్కీలో చోరీ జరిగినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి దుకాణం ఎదుట ఆపారు. అందులోంచి ఒకరు దుకాణంలోకి వెళ్లి మెడలో వేసుకునే బంగారు లాకెట్‌ చూపమని దుకాణం యజమాని వనితను అడిగాడు.

రూ.3వేల విలువగల లాకెట్‌కు రూ.వెయ్యి అడ్వాన్సుగా ఇచ్చాడు. మళ్లీ వచ్చి మిగతా రూ.2వేలు ఇచ్చి లాకెట్‌ తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఇలా యజమానితో మాట్లాడుతునే కౌంటర్‌లో ప్లాస్టిక్‌ ప్యాకెట్‌ కవర్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు చేతి వేళ్ల మధ్యలో పెట్టుకుని బైక్‌పై పరారయ్యారు.

యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగులు శివాజీ చౌక్‌ నుంచి నంబర్‌ప్లేట్‌లేని బైక్‌పై వచ్చి ఆదిలాబాద్‌వైపు వెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement