గ్రీవెన్స్‌కు స్పందన అంతంతే
● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం వెలవెలబోయింది. దసరా ముగిసినా పండుగ ఎఫెక్ట్ కనిపించింది. కలెక్టర్ రాజర్షి షా సెలవులో ఉండగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాగా, పలు శాఖల జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. ప్రతీ వారం జిల్లా ఉన్నతాధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ పలువురు లెక్కచేయనట్లు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందిని పంపించి మమ అనిపించారనే విమర్శలున్నాయి. కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment