రైతుభరోసా నిధులు విడుదల చేయాలి
నేరడిగొండ: ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడారు. ఖరీఫ్ పంట కాలం ముగిసి రబీ సీజన్ ప్రారంభమైనా రైతు భరోసా నిధులు ఇంకా అందలేదన్నారు. గత ప్రభుత్వం రెండు పంటలకు కలిపి విడతల వారీగా ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుబంధు కింద విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయక పోవడంతో రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట రైతులు బిక్కు, జంగు, గోవర్ధన్, లింగన్న, పరమేశ్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment