No Headline
ఈ పక్షిపేరు ఎరుపు అవదావత్ లేదా రెడ్ మునియా పక్షి. ఈ పక్షి ఎస్ట్రీల్డిడే సంతతికి చెందిన పిచ్చుక. ఇది ఉష్ణమండలంలోని ఆసియా ప్రాంతంలో గడ్డి ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. శీతాకాలంలో తమ సంతతిని పెంచుకోవడానికి ఇటీవల కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అడవుల్లో గల నీటి కుంటలో కనిపించింది.
భూమిమీద కొన్ని వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి.
మనుగడ సాగించేందుకు పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాయి. కవ్వాల్ టైగర్‌జోన్‌కు సైతం ఏటా శీతాకాలంలో ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆసియాలోని ఇతర దేశాల నుంచి పక్షులు అతిథులుగా వస్తున్నాయి. ఈ పక్షులు శీతాకాలంలో ఇక్కడే ఉండి తమ సంతతిని పెంచుకుని తిరిగి వాటి ప్రాంతాలకు వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. – జన్నారం
ట్రికోలర్ద్ మోనియా
వైట్ ఐ
బుజర్డ్ పక్షి
ఆసియన్
పీడ్ స్టార్లింగ్
Comments
Please login to add a commentAdd a comment