వేగవంతం చేయాలి
సోక్‌పిట్లు, క్యాటిల్ షెడ్ల నిర్మాణాలు
● డ్వామా పీడీ జోసఫ్
మద్దిపాడు: మండలంలో మంజూరైన సోక్‌పిట్లు, క్యాటిల్ షెడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ జోసఫ్ సూచించారు. బుధవారం సాయంత్రం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. షెడ్ల నిర్మాణాల విషయంలో మండలం వెనుకబడి ఉందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ లబ్ధిదారులు వేగంగా షెడ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీఓ జ్యోతి, ఏపీడీ వెంకటస్వామి, టెక్నికల్ ఇంజినీర్ కిషోర్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సంతనూతలపాడులో...
సంతనూతలపాడు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డ్వామా పీడీ జోసఫ్ అధ్యక్షతన బుధవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యవసర సమావేశం నిర్వహించారు. పథకంలో మంజూరైన గోకులాల షెడ్లను వెంటనే ప్రారంభించి గ్రౌండింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చే శనివారంలోగా షెడ్ల పనులు మొదలుపెట్టకుంటే వెంటనే రద్దుచేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ పి.వెంకటస్వామి, ఏపీవో కే వాసంతి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment