గిరిజనులు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలి
కొత్తపట్నం: గిరిజనులు విద్య, వైద్యం, రాజకీయ, సామాజిక రంగాల్లో చైతన్యవంతులు కావాలని నెల్లూరు సీఐడీ సీఐ జి.హజరత్‌బాబు పిలుపునిచ్చారు. మండలంలోని ఈతముక్కల గ్రామంలో మాధవరావు కల్యాణ మండపంలో బుధవారం నెల్లూరు సీఐడీ డిపార్ట్‌మెంట్ రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఐడీ ఎస్సై సీహెచ్ ప్రభాకర్ అధ్యక్షత వహించగా, హజరత్‌బాబు మాట్లాడారు. అనంతరం గిరిజనులకు చట్టాలు, హక్కులు, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ మేడా శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై వి.సుధాకర్‌బాబు, ఎంఈవో తులసీ కుమారి, ఆర్.వరకుమార్, ఏటీడబ్ల్యూవో ఏ.సుబ్బయ్య, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment