కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి బి మోహన్ బుధవారం షెడ్యుల్ ప్రకటించారు. ఈ నెల 31న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 1న ఉదయం 11 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. పోటీ అనివార్యమైతే ఫిబ్రవరి 4న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. పోటీ చేయాలనుకునే వారు రూ.1000 చెల్లించి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment