భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్
● మొరాయిస్తున్న సర్వర్ ● బోసిపోతున్న తహసీల్దార్ కార్యాలయాలు
కై లాస్‌నగర్: వ్యవసాయ భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్ సర్వర్ ఇటీవల తరచూ డౌన్ అవుతుంది. జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో స్లాట్ బు కింగ్ చేసుకోవడం నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ వరకు సాంకేతిక సమస్య తలెత్తుతోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీంతో నిత్యం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రైతులతో సందడిగా కనిపించే తహసీల్దార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.
ఇదీ పరిస్థితి..
రాష్ట్‌ల్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకురావాలని యోచిస్తోంది.ఆదిశగా ప్రత్యే క కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ప్రై వేట్ ఏజెన్సీ పరిధిలో కొనసాగిన డేటాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పరిధిలోని ఎన్‌ఐసీకి అప్పగించింది. దీంతో డేటా మార్పిడి ప్రక్రియ జరుగుతుండటంతో ధరణి పోర్టల్‌లో సర్వర్ సమస్య తలెత్తుందని తెలుస్తోంది. ఫలితంగా వ్యవసాయ, వ్యవసాయయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతోంది.
కార్యాలయాలు వెలవెల..
జిల్లాలో 17 గ్రామీణ మండలాలు ఉండగా వాటి పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో భూసంబంధమైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వ్యవసా య, వ్యవసాయేతర భూములరిజిస్ట్రేషన్లతో పాటు సక్సేషన్, పార్టేషన్ వంటి భూ సంబంధమైన రిజి స్ట్రేషన్లన్నీ తహసీల్దార్ కార్యాలయాల ద్వారా జరుగుతాయి. జిల్లాలో నిత్యం 30 రిజిస్ట్రేషన్లు జరగనుండగా ప్రభుత్వానికి రూ.20లక్షల నుంచి 30 లక్ష ల ఆదాయం సమకూరుతుంది. అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సైతం తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయాల్సిన ధరణి ఆపరేటర్ల నుంచి తహసీ ల్దార్ వరకు ఖాళీగా ఉండాల్సి న పరిస్థితి. సకాలంలో స్లాట్ బుకింగ్ జరగక రైతులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధరణి పోర్టల్ భూమాతగా అప్డేట్ జరుగుతుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా రెవెన్యూ అధి కారులు చెబుతున్నారు. మరో 15 రోజులు ఇదే పరి స్థితి ఉండే అవకాశమున్నట్లుగా పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment