అపోహలు వద్దు..
● రేషన్‌కార్డుల జారీ, ఆత్మీయ భరోసా నిరంతర ప్రక్రియ ● కలెక్టర్ రాజర్షిషా
బేల: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తామని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని, అనవసరంగా అందోళనకు గురికావద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని డోప్టాల, భవానీగూడ(సి) గ్రామాల్లో బుధవారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన వారు ఉంటే గ్రామసభల్లో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. వీలు పడని వారు ఈ నెల 26 తర్వాత ఎప్పుడైనా మండల కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవ కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా డోప్టాల గ్రామసభలో రైతు భరోసాను ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేలకు పెంచాలని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్‌రావు, ఎంపీడీవో మహేందర్‌కుమార్, ఎంపీవో మహేశ్‌కుమార్, సూపరింటెండెంట్ జమీల్ హైమద్, డిప్యూటీ తహసీల్దార్ సిడాం వామన్‌రావు, ఏఈవో రాజు, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేత
బోథ్: బోథ్ మార్కెట్ కమిటీ పరిధి నేరడిగొండ మండలంలో గల దర్శన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో గల సీసీఐ కేంద్రంలో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు మార్కెట్ కమి టీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి విఠల్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 26వరకు కొనుగోళ్లు ఉండవని పేర్కొన్నారు. 27న యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు విషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment