పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో సైడ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధి కారులకు సూచించారు. అనంతరం కాలనీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కౌన్సిలర్ రఘుపతి, రా జన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment