● పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలి ● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్
జైపూర్: వేలాల మల్లన్న స్వామి జాతరను మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించాలని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మండలంలోని వేలాల మల్లన్న స్వామి ఆలయాన్ని బుధవారం ఆయన మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్‌సింగ్, డీసీపీ భాస్కర్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు. గోదావరి తీరంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించే ప్రాంతం, పార్కింగ్, గుట్టపైన దొణలో స్వయంభూగా వెలిసిన గట్టుమల్లన్న స్వా మిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లపై అధికా రులతో చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జాతరకు భక్తులు వేల సంఖ్యల్లో హాజరవుతారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. అనంత రం వేలాల గ్రామంలో గ్రామసభను పరిశీలించా రు. అర్హుల జాబితాల్లో పేర్లు రానివారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఆలయ ఈవో రమేశ్, ఎస్సై శ్రీధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment