ఘనంగా వార్షికోత్సవం
బోథ్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగి ఏడాది పూర్తయినందున మండలంలోని కనుగుట్ట, సొనాల గ్రామాల్లో ప్రథమ వార్షికో త్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించా రు. కనుగుట్ట గ్రామంలో రామభక్తులు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తి పాటలు, భజన సంకీర్తనల మధ్య నృత్యం చేశారు. సొనాలలోని రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేరడిగొండ: మండల కేంద్రంలోని మధుర నగ ర్ కాలనీలో హనుమాన్ ఆలయంలో కాలనీవా సులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వి తరణ చేపట్టారు. వార్డుసభ్యులు సాబ్లేసంతోష్ సింగ్, నాయక్ జోధ్ రాజ్, కారోబారి జగదీష్, పూజారి భార్మల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment