‘కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు’
ఆదిలాబాద్‌రూరల్: ఎన్నికల హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయలంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు తప్ప మిగతా హామీలేవీ అమలు చేయలేదన్నారు. రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. గ్యాస్ సబ్సిడీ సగం మందికి కూడా అందలేదన్నారు. అలాగే విద్యార్థినులకు స్కూటీ, నిరుద్యోగులకు భృతి, పింఛన్ పెంపు వంటి అనేక హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు నారాయణ, ప్రహ్లాద్, సతీష్, దేవన్న, గోవర్ధన్, రాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment